SP Charan
-
లిప్‌లాక్ సీన్స్ వద్దని మా నాన్న చెప్పారు: హీరోయిన్
ఇన్స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల సోషల్ మీడియాలో తన యూజర్స్‌కు బాగా టచ్‌లో ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు, వీడియోలతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది. అమెరికన్ యాసెంట్లో తెలుగు మాట్లాడుతున్న ఈ బ్యూటీ వీడియోలకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా నెట్టింట ఆమె పేరు బాగానే వైరల్ అయింది. తాజాగా ఈ బ్యూటీ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. పతంగ్ అనే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెడుతుంది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పెట్టిన కండీషన్స్ గురించి ఆమె పంచుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రీతి పగడాలకు ఒక ప్రశ్న ఎదురైంది. అవకాశం వస్తే ఇంటిమేట్ సీన్లతో పాటు లిప్‌లాక్ వంటి వాటికి ఓకే చెప్తావా అని అడిగితే.. అందుకు ఆమె నో అంటూనే ఇలా చెప్పింది. ' సినిమాల్లోకి అడుగుపెడుతున్నప్పుడు మా నాన్నగారు ఒక కండీషన్ పెట్టారు. లిప్‌లాక్ సీన్లు వద్దన్నారు. నేను అడిగిన ప్రతిదానికి వారు అంగీకరించారు. అలాంటప్పుడు నాన్నగారు పెట్టిన ఆ ఒక్క కండీషన్‌ను దాటకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే ఇంటిమేట్ సీన్లు చేస్తారా అని ఆఫర్లు వచ్చాయి కానీ నేను ఒప్పుకోలేదు. ఒకవేళ పరిమితిమేరకు ఇంటిమేట్ సీన్లు ఉంటే చేస్తాను. గ్లామర్‌గా కనిపిండంలో ఎలాంటి కండీషన్లు లేవు. ఎందుకంటే ఈరోజుల్లో ఎటూ షార్ట్‌గా ఉన్న డ్రస్‌లను ఉపయోగించడం సాధారణం.' అని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది. ప్రీతి పగడాల తాజాగా నటించిన చిత్రం పతంగ్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రణీత్ ప్రత్తిపాటి పతంగ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా ఉన్నారు. ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Preethi 💜 (@preethipagadala) -
ఎస్పీ చరణ్‌తో వివాదం.. స్పందించిన టాలీవుడ్ డైరెక్టర్!
గతంలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపారు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని.. నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ వివాదంపై డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. 'మాకు.. ఎస్పీ చరణ్ సార్‌కు మధ్య కొంచెం కమ్యూనికేషన్ సమస్య వచ్చింది. ఏదేమైనా మాకు ఏదైనా కొత్తగా చేయాలని ఉంటుంది. అంతే కాకుండా మన సినీ దిగ్గజాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతకు మించి ఏం లేదు. ఎవరినీ డిస్ రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం మాకు లేదు. మేం చేసే చిన్న సినిమాలు మీరు కూడా చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్లతో కలిసి కమర్షియల్ సినిమాలు చేయడం లేదు. అలా చేయాలనే కోరిక కూడా లేదు. కానీ మా వరకు ఏదో ఒకటి చేయాలనే పట్టుదలతో ఉన్నాం. ఏఐ వచ్చినా కూడా దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవాళ, రేపు మన జాబ్ ప్రమాదంలో ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒక ప్రయోగం చేయాల్సిందే. మేం చేసినా.. చేయకపోయినా మార్పు అయితే జరుగుతది. మా మధ్య కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిండొచ్చు. కానీ ఇప్పుడంతా ఓకే. ఆ సమస్య ముగిసిపోయింది' అని అన్నారు. అసలేం జరిగిందంటే.. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. -
రివర్స్ కొట్టిన ఏఐ టెక్నాలజీ పాట.. కోటి రూపాయలు డిమాండ్!
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో వివాదం నడుస్తూనే ఉంటంది. తాజాగా అలాంటిదే ఒకటి తెరపైకి వచ్చింది. ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్.. తరుణ్ భాస్కర్ తీసిన 'కీడా కోలా' చిత్రబృందంపై ఫైర్ అయ్యారు. తమ అనుమతి లేకుండా ఎలా ఆ పని చేస్తారని అన్నాడు. మొన్న లీగల్ నోటీసులు పంపించాడు. ఇప్పుడు ఏకంగా నష్టపరిహారం విషయమై అల్టిమేటమ్ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) ఏం జరిగింది? గత కొన్నాళ్లుగా ఏఐ టెక్నాలజీ ట్రెండింగ్‌లో ఉంది. దీని ద్వారా చనిపోయిన పలువురు సింగర్స్ గాత్రాన్ని మళ్లీ రీక్రియేట్ చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా వరకు ఇది పర్వాలేదు గానీ తరుణ్ భాస్కర్ మాత్రం తన 'కీడా కోలా' సినిమా కోసం ఎస్పీ బాలు గొంతుని ఉపయోగించాడు. తమ కుటుంబ అనుమతి లేకుండా నాన్న గాత్రాన్ని ఎలా ఉపయోగిస్తారని బాలు తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లీగల్ నోటీసులు కూడా పంపించాడు. రూ.కోటి డిమాండ్ ఈ వివాదంపై ఇప్పుడు ఎస్పీ చరణ్ తరఫు లాయర్ స్పందించాడు. అనుమతి లేకుండా ఎస్పీ బాలు వాయిస్‌ని సినిమాలో ఉపయోగించినందుకుగానూ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.కోటి నష్టపరిహారం, రాయల్టీలో షేర్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తరుణ్ భాస్కర్ స్పందించాల్సి ఉంది. అయితే ఈ గొడవ ఇప్పుడు క్లియర్ అయిపోతుందా? లేదంటే కోర్టు వరకు వెళ్తుందా? అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
ఎస్పీ బాలు గొంతు రీక్రియేట్.. మండిపడ్డ ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ 'కీడా కోలా' చిత్రయూనిట్‌కు నోటీసులు పంపాడు. తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో రీక్రియేట్ చేసినందుకుగానూ సంగీత దర్శకుడు వివేక్ సాగర్‌తో పాటు సినిమా యూనిట్‌కు జనవరి 18న నోటీసులు పంపినట్లు తెలిపాడు. ఆయన గొంతును అనైతికంగా, చట్టవిరుద్ధంగా ఉపయోగించినందుకు క్షమాపణలు చెప్పాలని, నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. కాగా తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన కీడాకోలా మూవీ గతేడాది రిలీజైంది. ఇందులో ఓ సన్నివేశంలో స్వాతిలో ముత్యమంత అనే పాట బ్యాగ్రౌండ్లో వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏఐ సాయంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గొంతును రీక్రియేట్ చేశారు. దీనిపై ఎస్పీ చరణ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆయన మాట్లాడుతూ.. 'నాన్న చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం. కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించింది. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు' అని ఎస్పీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చదవండి: ఇంటర్వ్యూ చేసింది.. ప్రేమలో పడింది.. త్వరలోనే ఏడడుగులు వేయనున్న హీరోయిన్ -
హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అంజలి 'ఫాల్' వెబ్‌సిరీస్
తమిళసినిమా: నటి అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఫాల్. ఎస్పీబీ చరణ్, నటి సోనియాఅగర్వాల్, సంతోష్ ప్రతాప్, నమిత కృష్ణమూర్తి, పూర్ణిమా భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ వెబ్ సీరీస్‌ను డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్మించింది. దీని ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు సిద్ధార్థ్ రామస్వామి దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ వెబ్ సిరీస్ శుక్రవారం నుంచి డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం రాత్రి చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో డిస్నీ హాట్‌స్టార్ సంస్థ నిర్వాహకులు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నటి అంజలి మాట్లాడుతూ తాను ఇందులో దివ్య అనే పాత్రలో నటించానని చెప్పారు. ఇది రొటీన్ పాత్రలకు భిన్నంగా, కాస్త చాలెంజింగ్‌గా ఉంటుందన్నారు. థ్రిల్లర్ కథా చిత్రాలను ఇష్టపడే వారికి ఇది కచ్చితంగా నచ్చుతుందన్నారు. ఇందులో నటించిన నటినటీలందరికీ ప్రాముఖ్యత ఉంటుందన్నారు. పూరి్ణమా భాగ్యరాజ్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. ఆమె మంచి కథలను చెప్పేవారని, తన లవ్‌స్టోరీ కూడా దాచుకోకుండా చెప్పారన్నారు. డిస్నీ హాట్‌స్టార్ సంస్థలో తాను నటించిన రెండవ వెబ్ సిరీస్ ఇది అని చెప్పారు. చాలా కంఫర్టబుల్‌గా చూసుకునే సంస్థ ఇది అని తెలిపారు. దర్శకుడు సిద్ధార్థ రామస్వామి గురించి చెప్పాలంటే ఆయన చాలా కూల్ పర్సన్ అని పేర్కొన్నారు. తనే చాయాగ్రాహకుడు కావడంతో సన్నివేశాల చిత్రీకరణలో చాలా పర్ఫెక్ట్గా ఉండేవారన్నారు. టెక్నికల్‌గా కూడా తమకు నటించడం చాలా ఈజీ అయ్యిందన్నారు. వన్ మోర్ టేక్ అన్నదే చేసేవారు కాదని చెప్పారు. ఆయన దర్శకత్వంలో పనిచేయడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. -
సింగర్‌గా ఎందుకు అవకాశాలు రాలేదో తెలియదు: ఎస్పీ చరణ్
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లపైనే అవుతోంది. దాదాపు వెయ్యి పాటలకు పైగా పాడాను. ఇంతకాలం ఒకేలా పాడాను. అయితే కొందరు నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) వాయిస్‌లా నా వాయిస్ ఉందన్నారు. నాకు వచ్చే పాటలను నా శక్తి మేరకు బాగా పాడాలని ప్రయత్నం చేస్తాను’’ అన్నారు గాయకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత ఎస్పీ చరణ్. దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ జంటగా సుమంత్, రష్మికా మందన్నా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఓ సీత..’, ‘ఇంతందం..’ పాటలను ఎస్పీ చరణ్ పాడారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ చెప్పిన విశేషాలు.... ► హీరో దుల్కర్ సల్మాన్‌కు నేను పాడటం ఇదే తొలిసారి. ‘సీతా రామం’ చిత్రంలో ‘ఓ సీత’, ‘ఇంతందం..’ పాటలను పాడటం చాలా సంతోషంగా ఉంది. చిరకాలం నిలిచిపోయే పాటలివి. ‘ఓ సీత..’ పాటకు అనంత శ్రీరామ్, ‘ఇంతందం..’ పాటకు కేకే (కృష్ణకాంత్) మంచి సాహిత్యం అందించారు. మెలోడిపై మంచి పట్టు ఉన్న సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ►ఒకప్పుడు తెలుగులో ఎక్కువగా పాటలు పాడిన నేను ఆ తర్వాత ఇదే స్పీడ్‌ను ఎందుకు కొనసాగించలేకపోయానన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న నాకు. సంగీత దర్శకులు మణిశర్మ, కీరవాణి, ఆర్పీ పట్నాయక్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా అందరి సినిమాల్లో నేను పాడిన పాటలు విజయాలు సాధించాయి... జనాదరణ పొందాయి. అయితే ఆ తర్వాత ఓ సింగర్‌గా నాకు ఎందుకు అవకాశాలు కుదర్లేదో అయి తే తెలియదు. నిర్మాణ రంగంలో బిజీగా ఉండటం వల్ల నేను పాట పాడలేననే మాట ఎప్పుడూ చెప్పలేదు. రికార్డింగ్‌కు ఫోన్ కాల్ వచ్చిన ప్రతిసారీ నేను అందుబాటులోనే ఉన్నాను. ► సంగీతంలో వచ్చిన మార్పులను గురించి మాట్లాడేంత పెద్ద వ్యక్తిని కాను నేను. పాట పట్ల నా అప్రోచ్ అయితే మారలేదు. కొత్త సంగీత దర్శకులు కూడా మంచి పరిజ్ఞానంతో ఉన్నారు. దర్శక–నిర్మాతలు కూడా కొత్త సంగీత దర్శకులు, సింగర్స్‌ను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఇక నాన్నగారు చేసిన టీవీ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్న సింగర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు. భవిష్యత్‌లో ప్రతిభ గల సింగర్స్ మరింతమంది వస్తారని ఆశిస్తున్నాను. ► తమిళంలో ఓ సినిమాకి ప్రొడక్షన్ చేస్తున్నాను. సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టే ఆలోచన నాకు ఇప్పట్లో లేదు. -
7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్
గాన గాంధర్వుడు, దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో ఎంతోమందిని అలరించారు. తెలుగుతో పాటు ఎన్నో భారతీయ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారు. ఈ క్రమంలో ఎవ్వరూ ఊహించని రీతిలో 2020లో ఆయన కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఎస్పీ చరణ్ కూడా మంచి గాయకుడనే విషయం తెలిసిందే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు చరణ్. చదవండి: ‘మీకు ఉన్నా.. తనకు ఇష్టం లేదు’.. ఆ వార్తలపై రష్మిక స్పందన దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చరణ్ స్వరం తన తండ్రి బాలును గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు. ఇదిలా ఉంటే చరణ్‌కు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఓ హీరోయిన్‌తో చరణ్ మరోసారి ఏడడుగులు వెయ్యబోతున్నాడంటూ ఒక్కసారిగా తమిళ మీడియాల్లో వార్తలు గుప్పుమన్నాయి. ఈ రూమర్లకు అతడు పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టే ఆజ్యం పోసింది. ఇటీవల చరణ్ 7/G బృందావన కాలనీ హీరోయిన్‌తో సోనియా అగర్వాల్‌తో క్లోజ్‌గా దిగిన ఫొటోను షేర్ చేశాడు. అంతేకాదు దీనికి ‘ఏదో కొత్తగా జరగబోతుంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాసేపట్లోనే ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో సోనియాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించడమే కాదు వీరిద్దరి పెళ్లంటూ ప్రచారం కూడా మొదలెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో చరణ్ మరో పోస్ట్ పెట్టి ఇండియన్ వెబ్‌సిరీస్, ఫిలింప్రొడక్షన్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ జత చేశాడు. అయితే ఈ ఫొటోతో రూమర్లకు చెక్ పెట్టాలనుకున్న చరణ్ నెటిజన్ల నుంచి మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. రెండో పోస్ట్‌లో చరణ్, సోనియాలతో పాటు నటి అంజలి మరో నటుడు కూడా ఉన్నాడు. చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం అయితే ‘ముందుగా ఈ ఫొటో ఎందుకు పెట్టలేదని, సోనియాతో ఉన్న ఫొటోనే జూమ్ చేసి ప్రత్యేకం ఎందుకు పోస్ట్ చేశారు’ అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా గత కొద్ది రోజులుగా సోనియా అగర్వాల్ రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చరణ్ ఆమెతో దిగిన ఫొటోను పోస్ట్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సైతం సోనియా పెళ్లి చేసుకొబోయేది ఎస్పీబీ చరణా? అని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఎస్పీ చరణ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) -
మరణాంతరం ‘గాన గంధర్వుడి’కి పద్మ విభూషణ్, అవార్డు తీసుకున్న ఎస్పీ చరణ్
దివంగత గాయకుడు, గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం రాష్టపతి భవన్లో ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలుకు ఈ అవార్డు దక్కగా.. ఆయన తనయుడు ఎస్పీ చరణ్ అవార్డు అందుకున్నారు. చదవండి: Padma Awards 2021: పద్మ అవార్డుల ప్రదానోత్సవం కాగా 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉండగా... 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డును ప్రకటించారు. స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషణ్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్‌కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్‌కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌కు అవార్డులను ప్రకటించారు. Delhi: Playback singer SP Balasubrahmanyam awarded the Padma Vibhushan award posthumously. His son receives the award. #PadmaAwards2021 pic.twitter.com/HlSQGYmpxv — ANI (@ANI) November 9, 2021 -
ఏడాదిలోగా ఎస్పీబీ స్మారక మందిరం: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని శనివారం ఆయన కుటుంబ సభ్యులు నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీబీ సమాధికి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఎస్పీబీ స్మారక మందిరం నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. ఎస్పీబీ పేరిట ప్రత్యేకంగా మ్యూజియమ్ థియేటర్‌ను కూడా నిర్మించాలని భావిస్తున్నాం. ఇందు కోసం ప్రభుత్వ సాయాన్ని కూడా కోరతాం’’ అన్నారు. -
నాన్నకి అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
‘సాక్షి’ ఎక్స్‌లెన్స్ అవార్డుల్లో భాగంగా సాక్షి మీడియా గ్రూప్, దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు 2020 ఇచ్చి సత్కరించింది. దీని గురించి ఆయన తనయుడు గాయకుడు ఎస్పీ చరణ్ సాక్షితో మాట్లాడారు. ఆయన మాటాల్లోనే.. ‘సాక్షి యాజమాన్యం నాన్నగారి (దివంగత ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కి లెజెండరీ లైఫ్‌టైమ్ అవార్డు ఇచ్చారు. ఇందుకు పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. దురదృష్టవశాత్తు మా కుటుంబసభ్యులు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాం. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. కానీ మా మనసంతా అక్కడే ఉంది. మా తరఫున ఈ అవార్డును స్వీకరిస్తున్న ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మగారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరోసారి మా కుటుంబసభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవార్డు వేడుకకు హాజరు కాలేకపోయినందుకు క్షమాపణలు వేడుకుంటున్నాన’ని తెలిపాడు. -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు: ఎస్పీ చరణ్
సాక్షి, అమరావతి: నెల్లూరులోని మ్యూజిక్, డ్యాన్స్ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ హర్షం వ్యక్తం చేశారు. తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఏపీ ప్రభుత్వానికి ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. కాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలకు గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరును చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ట్వీట్ చేశారు. Great full to the #APgov and @ysjagan garu for this honor. https://t.co/qUvHsOP4ZM — S. P. Charan (@charanproducer) November 27, 2020 మైసూరు వర్సిటీలో ఎస్పీ బాలు అధ్యయన పీఠం మైసూరు: ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం పేరుతో మైసూరు విశ్వ విద్యాలయంలో అధ్యయన పీఠాన్ని ఏర్పాటు చేయనున్నారు. గురువారం వర్సిటీలో వీసీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సిండికేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్పీ బాలు జీవిత సాధనలను, పాటలను భవిష్యత్ తరాలవారికి అందించేలా ఈ పీఠం నెలకొల్పుతున్నామని వీసీ తెలిపారు. ఇందుకోసం రూ.5 లక్షలను కేటాయిస్తామన్నారు -
బాలు నుంచి ఎంతో నేర్చుకున్నా!
ఎస్పీ బాలసుబ్రమణ్యం నుంచి ఎంతో నేర్చుకున్నానని గాయని చిత్ర పేర్కొన్నారు. ఎస్పీబీ గత నెల 25న మృతిచెందిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం సినీ పరిశ్రమ ఎస్పీ బాలసుబ్రమణ్యం సంతాప సభను నిర్వహించింది. నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి నటులు విజయ్‌సేతుపతి, ప్రసన్న, వివేక్, జయరామ్, పార్థిబన్, దర్శకుడు శీనూస్వామి, గాయని చిత్ర, గాయకుడు మనో పాల్గొని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తమ అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఆయన సాధించిన కీర్తి కెరటాలను శ్లాఘించారు. గాయని చిత్ర మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని చిత్ర పేర్కొన్నారు. ఈ సంతాప సభకు రాలేకపోయిన దర్శకుడు భారతీరాజా ఎస్పీబీతో తన అనుబంధాన్ని పంచుకుంటూ ఒక వీడియా పంపించారు. అదేవిధంగా ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంను ఒకసారి కూడా ప్రత్యక్షంగా కలుసుకోలేకపోవడం తన దురదృష్టమని నటుడు విజయ్‌సేతుపతి వాపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్, గాయని శైలజ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వారిని సినీ ప్రముఖులు పరామర్శించారు. ఈ సందర్భంగా తన తండ్రికి సంతాప సభ నిర్వహించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులకు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. (సీఎం జగన్‌కు కృతజ్ఞతలు) -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి ప్రతినిధి, చెన్నై/సాక్షి, అమరావతి: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను భారతరత్న అవార్డు ఇవ్వాలని లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎస్పీ చరణ్ అన్నారు. భారతరత్న అవార్డుకు ప్రతిపాదించినట్లు ఏపీ సీఎం కార్యాలయం నుంచి ఉత్తరం అందగానే ఎంతో సంతోషించానని ‘సాక్షి’తో చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఎంజీఎం హెల్త్‌కేర్ అస్పత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తానని అన్నారు. వదంతులు నమ్మెద్దు బాలసుబ్రహ్మణ్యం వైద్యసేవలకు అయిన ఖర్చు గురించి సామాజిక మాధ్యమాల్లో అవాస్తవాలు ప్రచారం అవుతున్నాయని ఎస్పీ చరణ్ అన్నారు. అటువంటి వాటిని నమ్మెద్దని విజ్ఞప్తి చేశారు. బిల్లు చెల్లించిన తర్వాతే తన తండ్రి భౌతిక కాయాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టినట్లు, తాము ఉపరాష్ట్రపతికి ఫోన్ చేయడంతో వివాదం సద్దుమణిగినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ప్రతి వారం తాను కొంత మొత్తాన్ని చెల్లిస్తూ వచ్చానని తెలిపారు. చివరి రోజున ఇంకా ఎంత బ్యాలెన్స్ చెల్లించాల్సి ఉందని ఆస్పత్రి నిర్వాహకులను అడిగితే వారు ఏం చెల్లించవద్దు..ముందు జరగాల్సిన కార్యక్రమాలు చూడండని చెప్పారన్నారు. వైద్య ఖర్చుల్లో కొంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయినట్లు చరణ్ చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం తాను ప్రభుత్వాన్ని సాయం కోరిన విషయం వాస్తవమేనని, ఎటువంటి సాయం చేయడానికైనా సిద్ధమని ప్రకటించడమే అందుకు కారణమన్నారు. ఈ విషయమై ఆరోగ్య శాఖ కార్యదర్శిని సంప్రదించగా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి చెబుతానన్నారని తెలిపారు. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: కమల్ గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడంపై సినీ నటుడు కమల్ హాసన్ స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోసం మీరు చేసిన వినతి గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు దేశమంతటా ఉన్న బాలు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు.’ అంటూ కమల్ హాసన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
ఎస్పీ బాలు ఆస్పత్రి బిల్లుపై వదంతులు
సాక్షి, చెన్నై : సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రంగా ఖండించారు. కట్టుకథలు అల్లి, అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎస్పీ చరణ్ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు. (ఎస్పీ బాలుకు భారతరత్న ఇవ్వండి: సీఎం జగన్) మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్ ప్రెసిడెంట్ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు. (ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్) -
ఆసుపత్రి బిల్లులు త్వరలోనే వెల్లడిస్తాం
-
వాటిపై త్వరలోనే క్లారిటీ ఇస్తాము: ఎస్పీ చరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గత శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది బాలుకు సరిగా వైద్యం అందించలేదని, అంతేకాకుండా మొత్తం బిల్లు చెల్లిస్తే తప్ప మృతదేహాన్ని అప్పగించమని ఆయన కుటుంబాన్ని వేధించినట్లు కొన్ని వార్తలు ప్రచారమవుతున్నాయి. వాటిని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ ఖండించారు. సోషల్ మీడియాలో అయిదు నిమిషాల నిడివిగల ఒక వీడియోను విడుదల చేశారు. ఇందులో బాలసుబ్రహ్మణ్యం వైద్యానికి సంబంధించిన బిల్లులను త్వరలోనే వెల్లడిస్తానని, దాంతో అందరికి ఈ వదంతులపై ఒక అవగాహన వస్తుందని అన్నారు. ఆస్పత్రి సిబ్బంది వైఫల్యం ఏం లేదని చరణ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై చరణ్ మాట్లాడుతూ, ‘అసలు ఇలాంటి విషయాన్ని ఎవరు సృష్టిస్తారో అర్థం కావట్లేదు. అలాంటి మాటలు ఎంతమందిని బాధపెడతాయో వాళ్లకు తెలియడం లేదు. ఇలాంటి ప్రచారం చేస్తోంది కచ్ఛితంగా బాలసుబ్రహ్మణ్యం అభిమానులు కాదు. ఎందుకంటే నాన్న ఎప్పటికీ ఇలా చేయరు. ఆయన అభిమానులు కూడా ఇలా చేయరు. ఆయన ప్రతి ఒక్కరిని క్షమిస్తారు. అలాగే ఇలా ప్రచారం చేసే వాళ్లని నేను కూడా క్షమిస్తున్నాను’ అని తెలిపారు. ఇక బాలసుబ్రహ్మణ్యం మరణించే సమయానికి ఆసుపత్రికి 1.85కోట్ల రూపాయిలు చెల్లించాల్సి ఉందని, మొత్తం బిల్లు 3 కోట్ల పైనే అయ్యిందని ప్రచారం జరుగుతోంది. బ్యాలెన్స్ డబ్బులు చెల్లిస్తే కాని మృతదేహాన్ని అప్పగించమని ఆసుపత్రి సిబ్బంది బాలు కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టిందని ఫేక్‌న్యూస్ వైరల్ అవుతోంది. ఇక ఈ విషయంలో బాలు కుటుంబ సభ్యులు తమిళనాడు ప్రభుత్వ జోక్యాన్ని కోరగా పళనిస్వామి ప్రభుత్వం స్పందించలేదని, తరువాత జాతీయ స్థాయిలో సంప్రదించగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో ఆసుపత్రి సిబ్బంది బాలు మృతదేహాన్ని అప్పగించిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను ఎస్పీ చరణ్ ఖండించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి బిల్లుల వివరాలను వెల్లడిస్తానని సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో చరణ్ పేర్కొన్నారు. -
ఎస్పీ బాలు స్మారకమందిరం అక్కడే: చరణ్
సాక్షి, చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో స్మారకమందిరం త్వరలో నిర్మిస్తామని కుమారుడు చరణ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఎస్పీబీ శుక్రవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ లాంఛనాలతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు శనివారం తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం క్రాస్‌రోడ్డు వద్ద వున్న వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలను నిర్వహించారు. (బాలన్నా...పాట పాడవా: అర్జున్) ఎస్పీబీని ఖననం చేసిన ప్రాంతంలో ఆదివారం కుటుంబసభ్యులు సంప్రదాయ ఆచారాలను పూర్తి చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చరణ్, తామరపాక్కంలోని వ్యవసాయక్షేత్రంలో ఎస్పీబీ స్మారక మందిరం నిర్మించనున్నట్టు వివరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారంలోపు మీడియాకు వివరిస్తామన్నారు. తండ్రికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వానికి, కలెక్టర్ మహేశ్వరి, పోలీసులు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్మారక మందిరం నిర్మాణానికి ముందే ఎస్పీబీ అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని ప్రజలు సందర్శించడానికి పోలీసులతో చర్చించిన తరువాత అనుమతిస్తామని వివరించారు. (గాయక నాయకా స్వరాభివందనం) -
వ్యవసాయ క్షేత్రంలో బాలు స్మారక మందిరం
సాక్షి, చెన్నై/కొత్తపేట: తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన వ్యవసాయక్షేత్రంలో స్మారక మందిరం నిర్మిస్తామని ఎస్పీ చరణ్ వెల్లడించారు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని చెన్నై సమీపంలోని తామరైపాక్కంలో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో శనివారం ఖననం చేసిన విషయం తెలిసిందే. సమాధి వద్ద ఆదివారం సంప్రదాయ కార్యక్రమం ముగిసిన తర్వాత చరణ్ మీడియాతో మాట్లాడారు. గూగుల్‌లో సెర్చ్ చేసినా స్పష్టంగా కనబడే రీతిలో స్మారక మందిరం నిర్మిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు వారం రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా తన తండ్రిపై ప్రజానీకం చూపిన అభిమానం మరువలేనిదన్నారు. ఎస్పీబీ ప్రజలందరి ఆస్తి అని వ్యాఖ్యానించారు. ప్రజలు వారి కుటుంబంలో ఒకరిని కోల్పోయినంతగా ఉద్వేగానికి లోనయ్యారన్నారని చెప్పారు. కాగా, బాలుకు నివాళులర్పించేందుకు అభిమానులు ఆదివారం వ్యవసాయక్షేత్రానికి తరలి వచ్చారు. ‘భారతరత్న’కు ప్రయత్నిస్తాం బాలుకు భారతరత్న తప్పనిసరిగా వస్తుందని ఆ అవార్డు ఎంపిక కమిటీలో సభ్యుడిగా ఉన్న, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారతరత్నకు ఎస్పీబీ అర్హుడు అని, అవార్డు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. కాగా, ఎస్పీబీ ముందుగానే తన విగ్రహం రూపకల్పనకు శిల్పి రాజ్‌కుమార్‌ను సంప్రదించడం, ఆయన రూపొందించిన విగ్రహం ఫొటో విస్తృతంగా ప్రచారం అవుతోంది. బాలు కోరికపైనే విగ్రహం బాలు విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న రాజ్‌కుమార్ జీవించి ఉండగానే తనను విగ్రహంలో చూసుకోవాలని బాలు అనుకున్నారని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ తెలిపారు. ఆ వివరాలు ఆయన ‘సాక్షి’కి వెల్లడించారు. ‘నెల్లూరులోని తన తండ్రి పాత విగ్రహం స్థానంలో నేను తయారు చేసిన విగ్రహాన్ని బాలు నెలకొల్పారు. ఆ విగ్రహం నమూనా పరిశీలన కోసం 2018 నవంబర్ 19న నా శిల్పశాలకు వచ్చారు. ఆ సందర్భంలో బాలుతో వచ్చిన వారు విగ్రహం చేయించుకోమని ఆయన్ని పట్టుబట్టారు. దీనికి ఆయన అంగీకరించి ఫొటోలు ఇచ్చారు. వాటి ఆధారంగా నమూనా విగ్రహం తయారు చేశాను. తదనంతరం ఆయన తల్లి విగ్రహం కూడా తయారు చేయమని నాకు చెప్పారు. ఆ విగ్రహం తయారీపై గతేడాది ఆగస్టులో ఫోన్లో వాకబు చేశారు’ అని రాజ్‌కుమార్ తెలిపారు. -
దయచేసి దుష్ప్రచారం చేయొద్దు: ఎస్పీ చరణ్
సాక్షి, చెన్నై: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆస్పత్రి బిల్లులకు సంబంధించి చైన్నైలోని ఎంజీఎం ఆస్పత్రికి, బాలు ఫ్యామిలీకి మధ్య వివాదం నడిచిందనే వార్తల నేపథ్యంలో ఎస్పీ చరణ్ స్పందించారు. కొంత మంది కావాలని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆస్పత్రిలో నాన్నగారి ట్రీట్మెంట్కు సంబంధించి ఎలాంటి వివాదం లేదని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్పత్రి మెరుగైన వైద్యం అందించిందని వెల్లడించారు. దయచేసి ఇలాంటి ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు అనారోగ్యం బారినపడి మరణించిన సంగతి తెలిసిందే. 50 రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నపట్పికీ ఆరోగ్యం తిరగబెట్టడంతో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. చెన్నై సమీపంలోని తామరైపాక్కం ఫాంహౌజ్‌లో శనివారం ఉదయం అంతిమ సంస్కారాలు జరిగాయి. తమిళనాడు సర్కార్ ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు నిర్వహించింది. (చదవండి: పాట కోసం రథమే వేసుకొచ్చావ్!) -
బాలన్నా...పాట పాడవా: అర్జున్
గాన దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివదేహానికి అభిమానలోకం, ఆప్తులు, ప్రముఖుల కన్నీటి సంద్రం నడుమ శనివారం అంత్యక్రియలు జరిగాయి. తిరువళ్లూరు సమీపంలోని తామరపాక్కంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో గానగంధర్వుడిని ఖననం చేశారు. తమ అభిమాన గాయకుడి కడచూపు కోసం అభిమానలోకం, ప్రముఖులు తరలిరావడంతో ఉద్వేగ భరిత వాతావరణంలో పరిసరాలు మునిగాయి. సాక్షి, తిరువళ్లూరు: చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఎస్పీబి శుక్రవారం అందర్నీ వీడి అనంతలోకాలకు పయనమయ్యారు. ఈ సమాచారం యావత్ సంగీత ప్రపంచాన్ని, అభిమానలోకాన్ని కన్నీటి సాగరంలో ముంచింది. ఆస్పత్రి నుంచి చెన్నై నుంగంబాక్కంలోని నివాసంలో ఆయన పారి్థవదేహాన్ని ఉంచారు. అనంతరం అక్కడి నుంచి రాత్రి 8.45 గంటలకు తిరువళ్లూరు జిల్లా తామరపాక్కం వద్ద వున్న ఎస్పీబీ గార్డెన్‌కు పార్థివదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి 10.30 గంటల వరకు అభిమానులు, ఆప్తులు, ప్రముఖుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచారు. గాన గంధర్వుడి కడచూపుకోసం అభిమానులు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ పరిసరాలు శోక సంద్రంలో మునిగాయి. ఎస్పీబీ అంతిమయాత్ర తరలివచ్చిన ప్రముఖులు.. ఎస్పీబీని కడసారి చూసుకునేందుకు భారీగా అభిమానులు ప్రముఖులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్‌యాదవ్, తమిళనాడు ప్రభుత్వం తరఫున తమిళాభివృద్ధి, పురావస్తుశాఖా మంత్రి పాండ్యరాజన్, కలెక్టర్ మహేశ్వరి రవికుమార్, డీఐజీ చాముండేశ్వరీ, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, పీబీకే రాష్ట్ర అధ్యక్షుడు జగన్మూర్తి, జెడ్పీ మాజీ చైర్మన్ రవిచంద్రన్‌తో పాటు పలువురు నేతలు తరలివచ్చి నివాళులర్పించారు. (గాయక నాయకా స్వరాభివందనం) అలాగే, ప్రముఖ నటుడు విజయ్, అర్జున్, దర్శకుడు భారతీరాజా, అమీర్, రçహ్మాన్, సింగర్ మనో, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్, హాస్యనటుడు మైల్స్వామి బుల్లితెర నటుడు కృష్ణన్, బోండామురుగన్, భారతీ, శ్రీరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఎస్పీబీతో 9వ తరగతి వరకు చదువుకున్న నగరి జెడ్పీ పాఠశాలకు చెందిన 50 మంది పూర్వపు విద్యార్థులు తరలి వచ్చి చిన్ననాటి మిత్రుడిని కడసారి చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే, విజయ్ హఠాత్తుగా అక్కడ రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఎస్పీబి భౌతికకాయానికి నివాళులర్పించిన విజయ్, ఆయన కుమారుడు చరణ్‌తో మట్లాడి అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.. ప్రముఖులు అభిమానుల సందర్శనను 10.45 గంటలకు నిలిపి వేశారు. తర్వాత సమీప బంధువులు, కుటుంబీకుల్ని అనుమతించారు. ఎస్పీబీ తనయుడు చరణ్ సంప్రదాయబద్ధంగా ప్రక్రియల్ని ముగించారు. గంటపాటు ఈ కార్యక్రమం సాగింది. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో పారి్థవదేహనికి అంత్యక్రియల ఏర్పాట్లు జరిగాయి. ఎస్పీ అరవిందన్ నేతృత్వంలో సాయుధదళ పోలీసులు ఎస్పీబీ భౌతికకాయాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈసమయంలో జోహార్ ఎస్పీబీ నినాదం మార్మోగింది. ఆయన పాటలను పాడుతూ ఊరేగింపు సాగింది. చివరకు పోలీసులు మూడు రౌండ్లతో 72 తూటాలను గాల్లో పేల్చి అంత్యక్రియల ప్రక్రియను ముగించారు. ఆయన పారి్థవదేహాన్ని అశ్రునయనాల నడుమ ఖననం చేశారు. కాగా, ఎస్పీబీ ఇంట్లో ఉన్న శివలింగంకు నిత్యం పూజలు చేసే వేద పండితుడు సుసర్ల సుబ్రమణ్య శాస్త్రి నేతృత్వంలోని ఐదుగురు పండితుల బృందం అంత్యక్రియల లాంఛనాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రముఖుల ఉద్వేగం.. బాలన్నా...పాట పాడవా:కడ చూపుకోసం వచ్చిన సినీ నటుడు అర్జున్ ఎస్పీబీ పార్థివదేహాన్ని చూసి బోరున విలపించారు. బాలన్న.. తన చిత్రాల్లో ఎన్నో దేశభక్తి పాటలను పాడి విజయా న్ని అందించావని, ఇప్పుడు లేచి ఓ పాట పాడవా అంటూ అర్జున్ ఉద్వేగానికి లోనయ్యారు. భారతరత్న ఇవ్వాలి: ఎస్పీబీకి సినీ ప్రపంచానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన చరిత్రను చాటే రీతిలో కేంద్రం భారతరత్నతో గౌరవించాలని దర్శకుడు భారతీ రాజా విజ్ఞప్తి చేశారు. ఎస్పీబీకి నివాళులర్పించే క్రమంలో భారతీ రాజా, గాయకుడు మనో తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆడుకుందాం...లేచి రండి సార్: మిమ్మల్ని కలిసినప్పుడల్లా కాసేపు సరదాగా ఆడుకుందామా అని అడిగే తమరు దేవుడు ఆడిన ఆటలో అలసి శాశ్వత విశ్రాంతిలో ఉన్నారని, ఇప్పుడు లేచి రండి సార్..కాసేపు ఆడుకుందాం అని హాస్య నటుడు మైల్స్వామి విలపించారు. ఎంతో కష్టపడ్డారు: జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని విజయాల్ని ఎస్పీబీ సొంతం చేసుకున్నారని నటి శ్రీరెడ్డి అన్నారు. సాధారణంగా తాను ఇలాంటి కార్యక్రమాలకు హాజరు కానని, అయితే, ఎస్పీబీ ప్రత్యేకమైన లెజెండ్ అని, ఆయనపై ఉన్న అభిమానం, గౌరవం ఇక్కడకు తనను రప్పించిందని శ్రీరెడ్డి నివాళులర్పించారు. క్లాస్ టూ మాస్: క్లాస్ పాటల నుంచి మాస్ పాటల వరకు అన్నింటికి న్యాయం చేసిన ఘనత ఎస్పీబీది అని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు. తాను సమకూర్చిన మొదటి సంగీతానికి పాటపాడాలని అభిమానిగా కోరితే, ఆ కోరికను మన్నించిన మహావ్యక్తి ఇకలేరన్నది నమ్మలేకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. -
గాయక నాయకా స్వరాభివందనం
సాక్షి ప్రతినిధి, చెన్నై : కోట్లాది మంది అభిమానులకు కన్నీటిని మిగిల్చి.. కానరాని లోకాలకు గాన గంధర్వుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. పాటలతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ స్వరమాంత్రికుడిని భూమాత తన గర్భంలో దాచుకుంది. అభిమానుల అశ్రునయనాలు, కుటుంబీకుల కన్నీటి ధారల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం పూర్తయ్యాయి. అనారోగ్యంతో శుక్రవారం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన తర్వాత ఎస్పీ బాలు పార్థివదేహాన్ని కమదార్‌నగర్‌లోని ఆయన స్వగృహానికి తరలించారు. అక్కడ కొంతసేపు ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరైపాక్కంలో ఉన్న బాలు సొంత వ్యవసాయ క్షేత్రానికి ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి తరలించారు. ఆ వాహనాన్ని వేలాది మంది అనుసరించారు. దారిపొడవునా అభిమాన సందోహం ఆయనకు తుది వీడ్కోలు పలికారు. పలు చోట్ల వాహనాన్ని నిలిపివేసి పూలవర్షం కురిపించారు. దీంతో గంటలో వ్యవసాయ క్షేత్రానికి రావాల్సిన వాహనం మూడు గంటలు ఆలస్యంగా శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో చేరుకుంది. అప్పటికే వేలాది మంది జనం వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. (మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!) కన్నీటి పర్యంతమైన కుటుంబం వ్యవసాయ క్షేత్రంలో బాలు భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు శనివారం తెల్లవారుజాము 5 గంటల నుంచి అనుమతించారు. ఉదయం 7 గంటలకు అంతిమసంస్కారాలు ప్రారంభించారు. బాలు సతీమణి సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి, సోదరీమణులు, ఇతర బంధువులు పార్థివదేహానికి ప్రదక్షిణలు చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రి అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో కుమారుడు చరణ్ పూర్తి చేశారు. ఎస్పీ బాలుతో కలిసి చదువుకున్న వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ మహేశ్వరి నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. 24 మంది పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్చి నివాళులు అర్పించారు. బాలు భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరవుతున్న భార్య సావిత్రి, కుమారుడు ఎస్పీ చరణ్, కుమార్తె పల్లవి ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం బాలసుబ్రహ్మణ్యానికి వీలు చిక్కినప్పుడల్లా తన వ్యవసాయక్షేత్రానికి వచ్చేవారు. ఈ ఫాం హౌస్‌లోని ప్రశాంత వాతావరణంలో కాలక్షేపం చేసేవారు. సుమారు 15 ఎకరాల్లోని ఈ వ్యవసాయక్షేత్రంలో పచ్చని చెట్లు, తోటల మధ్య గడిపేందుకు ఆయన ఇష్టపడేవారు. అంతేగాక ఈ వ్యవసాయక్షేత్రం చుట్టుపక్కల నివసించే ప్రజలకు ఎన్నో సహాయాలు చేసేవారు. బాలు మరణవార్త వినగానే అంతిమసంస్కారాలు ఎక్కడ చేయాలనే ఆలోచన వచ్చినపుడు.. ఆయన సన్నిహితులు ఈ వ్యవసాయక్షేత్రాన్ని సూచించారు. దీనికి కుటుంబీకులు కూడా అంగీకరించారు. ఎస్పీ చరణ్‌ను ఓదారుస్తున్న హీరో విజయ్ ఏపీ నుంచి మంత్రి అనిల్.. ఎస్పీబీ ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తూ సంగీత దర్శకుడు ఇళయరాజా శనివారం రాత్రి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయ సన్నిధిలో మోక్ష దీపం వెలిగించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బాలుకు నివాళులు అర్పించారు. అంతిమసంస్కారాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. తమిళనాడు మంత్రి ఎం పాండియరాజన్, ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్, నటుడు అర్జున్, రెహమాన్, దర్శకుడు భారతీరాజా, గాయకుడు మనో, సంగీత దర్శకులు దేవీశ్రీప్రసాద్ బాలుకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎస్పీ చరణ్‌తో మాట్లాడుతున్న ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయంలో ఖననం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబం బ్రాహ్మణ శివలింగదారుల సంప్రదాయానికి చెందిన వారు కావడంతో ఆయన పార్థివదేహాన్ని ఆ సంప్రదాయం ప్రకారం ఖననం చేశారు. లింగదారుల వంశీకుల్లో స్త్రీ, పురుషులు విధిగా శివలింగాన్ని ధరించి ఉంటారు. ఎస్పీ బాలు ఇంటిలో శివలింగాలకు వేదపండితులు నిత్యం అభిషేకం చేస్తారు. లింగదారుల సంప్రదాయంలో వారు మరణిస్తే భౌతికకాయాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. అయితే బాలు పార్థివదేహం శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల కూర్చోపెట్టడానికి వీలుకాక పడుకోబెట్టిన స్థితిలోనే ఖననం చేశారు. -
నాన్న ఆహారం తీసుకుంటున్నారు: ఎస్పీ చరణ్
చెన్నై: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ' ఆరోగ్యం నిలకడగగా ఉంది. నాన్న ఇప్పుడిప్పుడే ఆహారం తీసుకుంటున్నారు. అయితే ఇంకా వెంటిలేటర్ మీదే ఉన్నారు. ఊపిరితిత్తులు, శ్వాస వ్యవస్థ, శక్తి మరింత మెరుగుపడాల్సిన ఉంది. మిగలిన వ్యవస్థలన్నీ సాధారణంగా ఉన్నాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్ లేదు. రోజూ 10 నుంచి 15 నిమిషాలు ఫిజియోథెరపీ చేస్తున్నారు. (ఎస్పీ బాలు కోసం మేమంతా: సెలబ్రిటీలు) ఆస్పత్రి సిబ్బంది సహాయంతో రోజూ 15-20 నిమిషాలు లేచి కూర్చుంటున్నారు. శుక్రవారం నుంచి ఆహారం తీసుకుంటుండటంతో ఆయన మరింత వేగంగా కోలుకునే అవకాశం ఉంది. ఈ సందర్భంగా నా తండ్రికి, కుటుంబ సభ్యులకు ఎంతో సహకరించిన ఎంజీఎం హెల్త్‌కేర్‌లోని వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను' అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ రావడంతో ఆగస్టు 5నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. (నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది) -
ఎస్పీ బాలు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు
సాక్షి, చెన్నై: తన తండ్రి మరింత వేగంగా కోలుకుంటున్నారని, ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ‘నేను ఈనెల 10న మీడియాతో మాట్లాడాను. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. వైద్యులు కూర్చోబెట్టగా 15–20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కూడా నయం అవుతోంది. ఆరోగ్యంలో మరింత పురోగతి కనపడుతోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. -
నాన్న ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: ఎస్పీ చరణ్
చెన్నై : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం రోజురోజుకు మరింత మెరుగవుతుందని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో స్పందించిన ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మరింత నిలకడగా ఉందన్నారు. ‘నాన్న ఊపిరితిత్తులు మెరుగుపడుతున్నట్లు ఎక్క్‌రేలో కనిపిస్తుందన్నారు. ఫిజియోథెరపీలో చురుకుగా పాల్గొంటున్నాడు. 20 నిమిషాల పాటు కూర్చోగలుగుతున్నాడు. త్వరలోనే ద్రవ పదార్థాలు అందించవచ్చని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు. (బాలుకి కరోనా నెగిటివ్.. కాబాలుకి కరోనా నెగిటివ్.. కానీ) ఇప్పటి వరకు తమకు తోడుగా, అండగా ఉన్నవారందరికీ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కష్ట సమయాల్లో తమ కుటుంబ పట్ల మీరు చూపించిన ప్రేమ, అనురాగాలకు ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరూ ఎస్పీ బాలు ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరారు. కాగా ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా వ్యాధి సోకడంతో ఆగస్టు 5వ తేదీన చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్‌గా తేలిన ఎస్పీ బాలు అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా నెగిటివ్ అని తేలడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చికిత్సకు స్పందిస్తున్న ఎస్పీ బాలు) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Sep 14, 2020 at 5:24am PDT -
బాలుకి కరోనా నెగిటివ్.. కానీ
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శుభవార్త.. ఆయనకు కరోనా వైరస్ నెగిటివ్ వచ్చినట్లు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సోమవారం తెలిపారు. కాకపోతే ఆయన ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నారన్నారు. ఈ మేరకు చరణ్ ఒక వీడియో షేర్ చేశారు. ‘నాన్న గారికి కరోనా నెగిటివ్‌గా వచ్చింది. కాకపోతే ఆయన ఊపిరితితత్తుల ఇన్ఫెక్షన్ నయం కావడానికి మరి కొద్ది కాలం పడుతుంది. త్వరలోనే ఆయనకు వెంటిలేటర్ తీసేయాలని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం నాన్నగారు స్పృహలోనే ఉన్నారు. స్పందిస్తున్నారు. తన ఐప్యాడ్‌లో ఆయన టెన్నిస్, క్రికెట్ మ్యాచ్‌లను చూస్తున్నారు’ అని తెలిపారు చరణ్. అంతేకాక ప్రస్తుతం ఎలాంటి సెడెషన్ ఇవ్వటం లేదని తెలిపిన ఎస్పీ చరణ్ ఫిజియో థెరపి మాత్రం కొనసాగిస్తున్నారని వెల్లడించారు. (చదవండి: రెజ్లర్ దీపక్ పూనియా డిశ్చార్జ్ ) View this post on Instagram A post shared by S. P. Charan/Producer/Director (@spbcharan) on Sep 7, 2020 at 4:08am PDT ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.