చెన్నై : ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ప్రకటించారు. ఈ మేరకు గురువారం ట్విటర్‌లో స్పందించిన చరణ్..వరుసగా నాలుగో రోజు తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని తెలిపారు. దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని పేర్కొన్నారు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. (మరింత మెరుగ్గా బాలు ఆరోగ్యం)
ఇదిలా ఉండగా ఎస్పీ బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు స్వల్పంగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా చెబుతున్నాయి. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment