ఏడాదిలోగా ఎస్పీబీ స్మారక మందిరం: ఎస్పీ చరణ్‌ | SP Balasubrahmanyam Forever: Sp Charan Emotional About Spb | Sakshi
Sakshi News home page

SPB: 'ఇప్పటికీ నమ్మలేకపోతున్నా..నాన్న లేని లోటు తీర్చలేనిది'

Published Sun, Sep 26 2021 8:31 AM | Last Updated on Sun, Sep 26 2021 8:51 AM

SP Balasubrahmanyam Forever: Sp Charan Emotional About Spb - Sakshi

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని శనివారం ఆయన కుటుంబ సభ్యులు నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీబీ సమాధికి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ చరణ్‌ మీడియాతో మాట్లాడుతూ– ‘‘నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఎస్పీబీ స్మారక మందిరం నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. ఎస్పీబీ పేరిట ప్రత్యేకంగా మ్యూజియమ్‌ థియేటర్‌ను కూడా నిర్మించాలని భావిస్తున్నాం. ఇందు కోసం ప్రభుత్వ సాయాన్ని కూడా కోరతాం’’ అన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement