S. P. Balasubrahmanyam
-
పాటల ప్రపంచంలో రారాజు బాలసుబ్రహ్మణ్యం తృతీయ వర్ధంతి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. పాటల పల్లకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. అమరగాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బాలు లేని పాటల ప్రపంచంలో ఎంతోమంది యువ గాయకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు. ఆయన స్పూర్తితో దశదిశలా సంగీత పరిమళాలను విరజిమ్ముతున్నారు. అర్ధ శతాబ్దకాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేశారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతలూగించిన ఈ 'గాన చంద్రుడు' మనల్ని విడిచిపెట్టి నేటికి మూడేళ్లు. 2020 సెప్టెంబర్ 25న ఆయన కరోనా మహమ్మారి వల్ల మనకు దూరం అయ్యారు. నేడు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా సాక్షి నుంచి ప్రత్యేక కథనం. తండ్రే తొలి గురువు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే ఆయనకు తొలి గురువు అయ్యారు. ప్రాథమిక విద్యను చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసిన బాలు హైస్కూల్ విద్యను మాత్రం శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పట్లో మన బాలు చదువు, ఆటల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. అనంతపురంలో ఇంజనీరింగు సీటు వచ్చినా.. శ్రీకాళహస్తిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అలా ఇంజినీరింగ్ కోర్సు చదువుతుండగానే బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహమ్మద్ బిన్ తుగ్లక్' అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద మెరిశారు. పలు వేదికలపై కూడా ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. బాలు తొలిపాట ఈ సినిమాలోనే 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు బాలు. 'ఏమి ఈ వింత మోహం' అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్‌లతో కలిసి పాడారు. అలా 1967 జూన్ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్‌తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు 'కోదండపాణి ఆడియో ల్యాబ్స్' అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూను ఒకసారి వింటే యథాతథంగా పాడగలిగే టాలెంట్ బాలుకి సొంతం. ప్రపంచంలోనే అరుదయిన రికార్డు సృష్టించిన మన బాలు 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. డబ్బింగ్ చెప్పడంలోనూ బాలుకు సాటిలేరు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు మారారు. అందులో కమల్ హాసన్‌కు చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్‌కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. పసివాడిప్రాణం చిత్రంలో రఘు వరన్కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం. నటుడిగా చివరి చిత్రం ఇదే 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్’లో మెరిశారు. ఎప్పటికీ చెరగని రికార్డులతో పాటు మధుర స్మృతులు ► భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు. ► ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్న బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు ఉన్నాయి. ► ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న బాలు ఖాతాలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ► 29 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ► 2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ► అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ‘గాంధీ’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన కింగ్ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్ చెప్పారు. ► 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40 వేలకు పైగా పాటలతో మెప్పించిన బాలు ► లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు. ► ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది (1966)లో 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ' ► 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి గాను తన మొదటి రెమ్యురేషన్ రూ.300 ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కావడం విశేషం. ► 'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' అంటూ గుక్కతిప్పుకోకుండా రాధికకు ప్రేమ కవిత్వం వినిపిస్తూ కనిపించే బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేరు ఆయన అభిమానులు. ► ప్రేమికుడులో ప్రభుదేవాతో పోటీపడి స్టైలిష్ స్టెప్లు వేశారు బాలసుబ్రహ్మణ్యం. ''అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే'' అనే పాటలో కనిపించిన బాలు అందులో కొడుకు పాత్రలో ఉన్న ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేశారు. సాక్షి- వెబ్ డెస్క్ ప్రత్యేకం -
సంగీతమే నా ప్రయారిటీ.. లెజెండరీ ఎస్పీ బాలు అడుగుజాడల్లో
యువ గాయని జాహ్నవి... టీవీ చూస్తూ పాట నేర్చుకుంది. టీవీలో పాడుతూ పెరిగి పెద్దదైంది. టీవీ తెర మీద మురిపించిన పాట... ఇప్పుడు సినిమా తెర వెనుక వినిపిస్తోంది. ఎస్పీ బాలు నేర్పించిన మెళకువలే పాదముద్రలు. ఇంట్లో టీవీ ఉంటే పిల్లలు మాటలు త్వరగా నేర్చుకుంటారు. ఆ ఇంటి వాతావరణంలో నేర్పని మాటలు కూడా పిల్లల నాలుక మీద అవలీలగా దొర్లిపోతుంటాయి. ఈ అమ్మాయి టీవీ చూస్తూ మాటలతోపాటు పాటలు కూడా నేర్చుకుంది. ఆటల్లో ఆటగా సీరియల్ టైటిల్ సాంగ్స్ పాడేది. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ సంగీతం దేవుడిచ్చిన వరంలా ఒంటపట్టింది. పాటల పట్ల పాపాయికి ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను సంగీతం టీచర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎవరూ పెద్దగా ప్రయాస పడింది లేదు. త్వరగానే గ్రహిస్తోందని సంగీతం టీచరు కామాక్షిగారు నోటిమాటతోనే ప్రశంసాపూర్వకమైన సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్వరసుధ అనే మ్యూజిక్ అకాడమీలో చేరి సంగీత సాధన చేసింది. ఇదంతా జాహ్నవి వరంగల్‌లోనే. టెన్త్‌క్లాస్ తర్వాత ఇంటర్ కి జాహ్నవి హైదరాబాద్‌కు మారింది. ఆమె సంగీత ప్రపంచం మరింత విస్తృతమైంది. శ్రీనిధి, రామాచారి వంటి ప్రముఖ గురువుల దగ్గర సంగీతం నేర్చుకునే అవకాశం వచ్చింది. టీవీ రియాలిటీ షోల తో మొదలైన ఆమె సరిగమల ప్రయాణం ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంతో కలిసి పాడే అవకాశాన్నిచ్చింది. ఎస్పీబీ దగ్గర పాడడానికి ముందు జాహ్నవి పాటకు, ఆ తర్వాత జాహ్నవి పాటకు మధ్య స్పష్టమైన తేడా వచ్చిందని చెబుతోందీ యువగాయని. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.. ‘‘రియాలిటీ షోలో నేను పద్యాన్ని పాడుతున్నాను. ఫైనల్ రౌండ్‌కు వెళ్లాలంటే ఆ రౌండ్ దాటాలి. అప్పుడు పద్యం పాడడంలో అనుసరించాల్సిన మెళకువ చెప్పారాయన’’ అంటూ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తనకు తొలిసారిగా నేర్పించిన సంగీతపాఠాన్ని గుర్తు చేసుకున్నది జాహ్నవి. ‘‘బాలు సర్‌తో 30కి పైగా ఎపిసోడ్లు చేశాను. పాట పాడేటప్పుడు ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో ఆయన నొటేషన్ రాసుకోవడం చూసి తెలుసుకున్నాను. వేలాది పాటలు పాడిన అనుభవం ఉన్నప్పటికీ ప్రతి పాటనూ అదే ప్రారంభం అన్నంత శ్రద్ధగా ప్రిపేరవుతారు. ఒక అక్షరం పైన ‘నవ్వు’ అని రాసుకున్నారు. అలా రాసుకోవడం చూసిన తర్వాత ఆయన ఆ పాట పాడడాన్ని కూడా నిశితంగా గమనించాను. కచ్చితంగా ఆ అక్షరం రాగానే గొంతులో నవ్వును పలికించారు. ఆయన టీమ్‌లో కోరస్ పాడడం అనేది చిన్న అవకాశం కాదు. నేర్చుకునే వాళ్లకు నేర్చుకున్నంత జ్ఞానం అబ్బుతుంది. స్వరాలను పలకడంలో పాటించాల్సిన నిబంధనలను, పాట అవసరాన్ని బట్టి గొంతులో పలకాల్సిన రసాలను చెప్పేవారు. మొదట కుతూహలం కొద్దీ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. అలా ఆయన చెప్పినవి కొన్ని, చూసి నేర్చుకున్నవి కొన్ని. ఒక్కొక్కటి నేర్చుకుంటున్న కొద్దీ... ఆశ్చర్యంగా నా పాటలో మార్పు నాకే స్పష్టంగా తెలియసాగింది. గాయనిగా గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యానికి స్ఫూర్తి ఎస్పీబీ సారే. పాటల పాఠాలు బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. కానీ సంగీతమే నా తొలి ప్రయారిటీ. గాయనిగా అన్ని రకాల పాటలూ పాడగలననే గుర్తింపు తెచ్చుకోవాలి. మ్యూజిక్‌లో సర్టిఫికేట్ కోర్సు చేశాను. ఇప్పుడు డిప్లమో కోర్సు చేస్తున్నాను. క్లాసికల్, మెలోడీ, జానపదం, ఫాస్ట్‌బీట్... అన్నింటినీ పాడగలిగినప్పుడే సమగ్రత వస్తుంది. ఇక గాయనిగా నాకు సంతోషాన్నిచ్చిన సందర్భాలంటే... పాడుతా తీయగా సీజన్ 16లో రన్నర్ అప్‌గా నిలవడం. అదే ప్రోగ్రామ్‌లో విన్నర్ మా చెల్లి అక్షయసాయి. అలాగే ఎస్వీబీసీలో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం వచ్చింది. అది కూడా అత్యంత సంతోషం కలిగించింది. ఎన్టీఆర్ బయోపిక్, అఖండ, బీమ్లానాయక్, రాధేశ్యామ్ సినిమాల్లో గొప్ప సంగీత దర్శకుల ఆధ్వర్యంలో పాడాను. స్టేజ్ ప్రోగ్రామ్‌లలో పాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ ఎక్కువ కార్యక్రమాలు చేయలేకపోతున్నాను. బాలు గారి జయంతి సందర్భంగా నాలుగవ తేదీ ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవీంద్రభారతిలో సంస్మరణ కార్యక్రమం జరుగుతోంది. సినీ మ్యూజిక్ యూనియన్ నిర్వహించే ఈ కార్యక్రమంలో వందమంది గాయనీగాయకులు, సంగీతకారులు పాల్గొంటున్నారు. అందులో పాట పాడడం నాకు మరువలేని జ్ఞాపకం అవుతుంది. ఆయన పాదముద్రల్లో నడిచి వచ్చిన గాయనిని. అది ఆ మహోన్నత గురువుకి నేను అందించే స్వర నివాళి’’ అని చెబుతున్నప్పుడు జాహ్నవి గొంతులో బాలుగారి పట్ల గౌరవపూర్వకమైన అభిమానం తొణికిసలాడింది. – వాకా మంజులారెడ్డి -
లతాజీ పక్కన ఆ ఫీట్ ఒక్క బాలు వల్లే సాధ్యమైంది
‘మేరీ ఆవాజ్ హీ పెహచాన్ హై..’(గాత్రమే నా గుర్తింపు) లతా మంగేష్కర్ ఓ గొప్ప గాయని. ఆ గొప్పను ఆమె అస్సలు ఒప్పుకోరు. కానీ, ఆమె ఒక పర్ఫెక్షనిస్ట్. ఈ విషయం మాత్రం ఆమె కూడా ఒప్పుకుని తీరతారు. ఎందుకంటే.. ఒక పాట బాగా రావడానికి ఆమె ఎన్నిసార్లైనా సాధన చేస్తారట. వయసులో ఉన్నప్పుడు పాత తరం ఆర్టిస్టుల గొంతుకు తగ్గట్లే కాదు.. 60వ వడిలో మాధురి, కాజోల్ లాంటి యంగ్ ఆర్టిస్టులకూ ఆమె గాత్రం సూటయ్యేలా సాధన చేసేవారామే. రంగ్ దే బసంతిలో ‘లుకా చుప్పి’ పాట కోసం.. నాలుగు రోజులు సాధన చేశారంటే ఆమె డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి పర్ఫెక్షనిస్ట్ నుంచి మెప్పు పొందడం అంటే.. మాటలా? దిలీప్ కుమార్ ఒకసారి ఆమె పాడే విధానం మీద కామెంట్ చేశారు. దీంతో కొత్తల్లో ఆమె ఉర్దూ టీచర్‌ను పెట్టుకొని మరీ హిందీ పాటలు పాడింది. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా.. తనకు తానే హిందీ నేర్చుకుని తర్వాతెప్పుడో ఆమెతో గొంతు కలిపాడు. ఇద్దరూ ఉచ్ఛారణ విషయంలో తిరుగులేని నిబద్ధులు. మొండివాళ్లే. దక్షిణాది గాయకుల్లో ఎంతో మంది ఆమె పక్కన పాడినా.. సక్సెస్‌తోపాటు ఆమెతో ‘వాహ్.. శెభాష్’ అనిపించుకున్న ఏకైక సింగర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఒక్కడే. లతా, బాలూల మధ్య ఒక పోలిక ఉంది. లతా భాషలో మరాఠీ స్వభావం ఉందని సంగీత దర్శకుడు నౌషాద్ ప్రోత్సహాంతో ఆమె ఉర్దూ నేర్చుకున్నారు. అలాగే తమిళం బాగా నేర్చుకుంటేనే పాడే అవకాశం ఇస్తానని బాలూను సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ ఆదేశించారు. ఇద్దరూ ఆ భాషలను నేర్చుకున్నారు. పాటలో ఉచ్ఛారణకు పట్టం కట్టారు. ఒకరు గానగాంధర్వుడు.. మరొకరు గాన కోకిల.. వీళ్ల కాంబినేషన్ సూపర్‌హిట్. దేశమంతా పాడుకునే పాటలను వారు కలిసి పాడారు. లతా మంగేష్కర్ పక్కన గోల్డెన్ పిరియడ్‌లో రఫీ, కిశోర్, హేమంత్, తలత్, మన్నా డే వంటి ఉద్దండులు ఆలపించారు. కానీ, బాలు పక్కన పాడేప్పుడు మాత్రం ఆమె ఫుల్ ఎనర్జీ, జోష్‌తో పాడడం గమనించొచ్చు. తెలుగులో హిట్ అయిన ‘మరో చరిత్ర’ను దర్శకుడు కె.బాలచందర్ హిందీలో ‘ఏక్ దూజే కే లియే’ (1981)గా రీమేక్ చేయాలనుకున్నప్పుడు సంగీత దర్శకులుగా పీక్‌లో ఉన్న లక్ష్మీకాంత్–ప్యారేలాల్‌లను తీసుకున్నారు. లతా పక్కన బాలూ చేత పాడించాలని బాలచందర్ కోరారు. దీనికి లతా మంగేష్కర్ అభ్యంతరం చెప్పలేదు కానీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కొంత నసిగారట. ‘బాలూ పాడితే దక్షిణాది శ్లాంగ్ వచ్చినా పర్వాలేదు. పాడించండి. ఎందుకంటే నా హీరో తమిళుడు కదా సినిమాలో’ అన్నారు బాలచందర్. ఇక లక్ష్మీకాంత్ ప్యారేలాల్‌లకు తప్పలేదు. ఎప్పుడైతే బాలు పాట విన్నారో.. ‘ఒక గాయకుడు పాటను ఎలా నేర్చుకోవాలో తెలియాలంటే బాలూ చూసి నేర్చుకోండి’ అని ముంబైలో అందరికీ చెప్పడం మొదలెట్టారు లక్ష్మీకాంత్ ప్యారేలాల్. గతంలో బాలూ తన గొంతుకు సర్జరీ చేయించుకుంటున్నప్పుడు.. అది గాత్రానికే ప్రమాదం అని తెలిసి లతాజీ చాలా కంగారు పడటం, ‘వద్దు నాన్నా..’ అంటూ ఆమె వారించడం గురించి స్వయంగా బాలూనే పలు సందర్భాల్లో చెప్పడం చూశాం. అంతేకాదు.. హైదరాబాద్‌లో ఘంటసాల విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా బాలూ ఆహ్వానం మీద లతా హైదరాబాద్ వచ్చారు. ‘ఏక్ దూజే కే లియే’లో లతా–బాలూ పాడిన పాటలు దేశాన్ని ఊపేశాయి. ‘తేరే మేరే బీచ్ మే’ పాట డ్యూయెట్గా, బాలూ వెర్షన్‌గా వినపడని చోటు లేదు. ‘హమ్ బనే తుమ్ బనే’, ‘హమ్ తుమ్ దోనో జబ్ మిల్ జాయేంగే’... ఈ పాటలన్నీ పెద్ద హిట్. ఈ సినిమాకు బాలూకి నేషనల్ అవార్డ్ వచ్చింది. ఆ తర్వాత రమేష్ సిప్పీ తీసిన ‘సాగర్’ (1985) కోసం లతాతో బాలూ ‘ఒమారియా ఒమారియా’ పాడి హిట్ కొట్టారు. కాని అన్నింటి కంటే పెద్ద హిట్ ‘మైనే ప్యార్ కియా’ (1989)తో వచ్చింది. సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీల ఈ తొలి సినిమాలో సల్మాన్‌కు బాలూ, భాగ్యశ్రీకి లతా గొంతునిచ్చారు. రామ్‌లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోని ప్రతి పాట పెద్ద హిట్‌గా నిలిచింది. యూత్ మెచ్చిన పాటలు.. కాలేజీ కుర్రకారు వీటి కోసం ఫిదా అయిపోయారు. ‘దిల్ దీవానా’, ‘ఆజా షామ్ హోనే ఆయీ’, ‘కబూతర్ జాజాజా’ లక్షలాది కేసెట్లు అమ్ముడుపోయాయి. ‘ఆయనతో పాడిన పాటల్లో నాకు ఆజా షామ్ హోనే ఆయీ ఇష్టం’ అని లతా అన్నారు. ఆ తర్వాత వచ్చిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ (1994) కోసం లతా, బాలూ పోటీలు పడి పాడారు. లతాతో కలిసి బాలూ పాడిన ‘దీదీ తేరా దేవర్ దివానా’ పాట షామియానాలు, పెళ్లి మంటపాల్లో ఇష్టపాటగా మారింది. అందులోని ‘మౌసమ్ కా జాదు హై మిత్వా’, ‘జూతే దో పైసే లో’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’... ఇవన్నీ ఆ సినిమాను భారతదేశ అతి పెద్ద హిట్‌గా నిలిపాయి. ‘హమ్ ఆప్ కే హై కౌన్’ రికార్డింగ్ సమయంలో వీళ్ల అల్లరి మామూలుగా ఉండేది కాదట. హమ్ ఆప్ కే హై కౌన్ అని లతా నోటి నుంచి రాగానే.. తర్వాతి లైన్ పాడకుండా ‘మై ఆప్ కా బేటా హూ’ అని బాలు అల్లరి చేసేవాడట. ఆమె పాడటం ఆపేసి– ‘‘చూడండి.. బాలూ నన్ను పాడనివ్వడం లేదు’’ అని ముద్దుగా కోప్పడేవారట. ఆ చనువుతోతో ఏమో ఆమె.. ఆ ముద్దుల కొడుకుని బాలాజీ అని పిలుచుకునేవారు. ఆ మధ్య లతా చనిపోయారనే పుకార్లు వచ్చినప్పుడు.. వాటిని ఖండిస్తూ బాలూ స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఆశించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన మరణవార్తను ముందుగా లతా వినాల్సి వచ్చింది. ‘ఆయన ప్రతి పాటలో ఏదో ఒక మెరుపు హఠాత్తుగా తెచ్చేవాడు. ఆయనతో రికార్డింగ్ అంటే ఈసారి పాటలో ఏం చేస్తాడా అనే కుతూహలం ఉంటుంది. ఒక విరుపో, నవ్వో, గమకమో. ఆయనతో నేను ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో లైవ్ కన్సర్ట్లలో పాల్గొన్నాను. స్టేజ్ మీద ఒక ఎనర్జీని తెచ్చేవాడు. ఆయన చనిపోయారనే వార్త పుకారని అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఈ పుకారు నిజమని తేలింది’.. బాలూ మరణవార్త విని లతాజీ స్పందన. ఆమె తెలుగులో మొదట ‘నిదురపోరా తమ్ముడా’ (సంతానం) పాడినా.. అందులో రెండవ చరణం ఘంటసాల అందుకున్నా అవి విడి విడి రికార్డింగులే తప్ప కలిసి పాడిన పాట కాదు. దక్షిణాది నుంచి ఏసుదాస్‌తో లతా కొన్ని పాటలు పాడినా అవి ప్రత్యేక గుర్తింపు పొందలేదు. కానీ బాలూ అదృష్టం వేరు. తెలుగులో ‘ఆఖరి పోరాటం’ కోసం లతా ‘తెల్లచీరకు తకథిమి’ పాట పాడినప్పుడు బాలూయే ఆమెకు భాష నేర్పించారు. తమిళంలో కూడా వీరు కమలహాసన్ ‘సత్య’ (1988) సినిమాకు ‘వలయోసై’ అనే హిట్ డ్యూయెట్ పాడారు. ఇవన్నీ ఇప్పుడు వీళ్ల అభిమానులకు మిగిలిన మధుర జ్ఞాపకాలు. – సాక్షి ఫ్యామిలీ, వెబ్ డెస్క్ -
కన్నీళ్లు ఆగిపోయాయి..నన్నేమి కదిలించడం లేదు: సింగర్ సునీత
Singer Sunitha Latest Interview About Sp Balu And Her Personal Life: టాలీవుడ్ సింగర్ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న సునీతకు టాలీవుడ్లో ఏ సింగర్‌కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవలె రామ్ వీరపనేని అనే వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సునీత అటు పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో దూసుకుపోతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. పెళ్లి తర్వాత మ్యారెజ్ లైఫ్ ఎలా ఉంది అని అడగ్గా.. పెళ్లి తర్వాత నేను ఎలా ఉన్నాను అన్నది మా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. నా జీవితం నాకు నచ్చినట్లుగా గౌరవంగా బతకాలనుకున్నాను. అలాగే బతుకుతున్నాను. నా జీవితంపై క్లారిటీ ఉంది. ఇక ఇద్దరం ఇంచుమించు ఒకే రంగంలో ఉన్నాం. భార్యగా తనకు ఎప్పుడైనా సాయం కావాలంటే చేస్తా. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తా అని పేర్కొంది. ఇక ఈ ఏడాది జరిగిన విషాదాలపై స్పందిస్తూ..2021లో ఎంతోమందిని పోగొట్టుకున్నాను. ముఖ్యంగా బాలు గారిని పోగొట్టుకున్నా. ఆ విషాదం తర్వాత కన్నీళ్లు రావడం ఆగిపోయాయి. ఏదైనా జరిగినా మహా అయితే బ్లాంక్ అయినట్లు అనిపిస్తుంది కానీ అంతలా నన్నేమీ కదిలించడం లేదు. ఆయన లేని లోటు తీర్చలేనిది అంటూ ఎమోషనల్ అయ్యారు. -
గాన గంధర్వుడు బాలు మ్యూజికల్ మ్యాజిక్: వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తుది శ్వాస విడిచి సంవత్సరం ముగిసినా ఆ అమర గాయకుడిని మర్చి పోవడం అభిమానులకు వశం కావడం లేదు. అమృతగానంతో ఓలలాడించిన బాలుని తలచుకుని ఇప్పటికీ కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన జ్ఞాపకాలను పదే పదే నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో బాలుకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. రావోయి చందమామ అంటూ మధుర గాత్రంలొ అయిదు రకాల గొంతులతో ఆయన చేసిన మ్యాజిక్‌ను మరోసారి ఎంజాయ్ చేస్తున్నారు. బాలు జ్ఞాపకాలుఅనే ట్విటర్ ఖాతా ఈ వీడియోను షేర్ చేసింది. When Balu garu gave us a glimpse of his mimicry talent with the classic "Raavoyi Chandamama", in 5 different voices...#SPBLivesOn ❤🙏#SPBalasubrahmanyam pic.twitter.com/L6NZVRk8Uh — బాలు జ్ఞాపకాలు (@balu_jnapakalu) September 28, 2021 -
ఏడాదిలోగా ఎస్పీబీ స్మారక మందిరం: ఎస్పీ చరణ్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని శనివారం ఆయన కుటుంబ సభ్యులు నిరాడంబరంగా నిర్వహించారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో గల వ్యవసాయ క్షేత్రంలో ఎస్పీబీ సమాధికి ఆయన కుమారుడు ఎస్పీ చరణ్, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘నాన్న లేరంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేరు. ఎస్పీబీ స్మారక మందిరం నిర్మాణ పనులను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. ఎస్పీబీ పేరిట ప్రత్యేకంగా మ్యూజియమ్ థియేటర్‌ను కూడా నిర్మించాలని భావిస్తున్నాం. ఇందు కోసం ప్రభుత్వ సాయాన్ని కూడా కోరతాం’’ అన్నారు. -
ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు: వైఎస్ జగన్
గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వదిలి అప్పుడే ఏడాది కావస్తోంది. తన స్వర మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని ఉర్రూతలూగించిన ఆ గొంతు మూగబోయిందనే విషయాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టంగానే ఉంది. ఎస్పీ బాలు వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనకు నివాళులు అర్పించారు. 'మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉంటారు' అంటూ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా గతేడాది సెప్టెంబర్ 25న ఎస్పీ బాలు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. మధుర గాయకులు, స్వరకర్త ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి. తన గాత్రంతో తెలుగు వారినే కాదు ఎన్నో భాషల్లో అశేష సంగీతాభిమానులను సంపాదించుకున్న ఎస్పీబీ అందరి హృదయాల్లో చిరంజీవిగా వుంటారు. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 25, 2021 -
ఆ నమ్మకంతోనే బతికేస్తున్నా..సింగర్ సునీత ఎమోషనల్ పోస్ట్
Singer Sunitha Emotional: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని వీడి దాదాపు ఏడాది కావస్తోంది. సింగర్‌గా, నటుడిగా, మూజిక్ డైరెక్టర్‌గా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న ఆయన గతేడాది 2020 సెప్టెంబర్25న కన్నుమూసిన సంగతి తెలిసిందే. భౌతికంగా ఆయన దూరమైనా సంగీత సరిగమల్లో చిరంజీవిలా ఎప్పటికీ నిలిచిపోతారు బాలు. ఆయన దూరమై ఏడాది కావస్తుండటంతో సింగర్ సునీత ఎస్పీబీని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. చదవండి : హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు 'మావయ్యా .. ఒక్కసారి గతంలోకి నడవాలనుంది. నీ పాట వినాలనుంది. నువ్ పాడుతుంటే మళ్ళీ మళ్ళీ చెమర్చిన కళ్ళతో చప్పట్లు కొట్టాలనుంది. ఇప్పుడు ఏంచెయ్యాలో తెలీని సందిగ్ధంలో నా గొంతు మూగబోతోంది.సంవత్సరం కావొస్తోందంటే నమ్మటం కష్టంగా వుంది. ఎప్పటికీ నువ్వే నా గురువు, ప్రేరణ, ధైర్యం,బలం,నమ్మకం. ఎక్కడున్నా మమ్మల్నందర్నీ అంతే ఆప్యాయతతో చుస్కుంటున్నావన్న నమ్మకముంది. ఆ నమ్మకంతోనే నేను కూడా ..బతికేస్తున్నా'.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. కాగా ఎస్పీబీతో కలిసి సునీత పలు స్టేజ్ షోలలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) చదవండి : 'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా' -
సంస్కృతికి విరుద్ధంగా స్త్రీ వస్త్రధారణ
చిత్తూరు, తిరుపతి అన్నమయ్య సర్కిల్: నేటి ఆధునిక సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, విలువలు దిగజారుతున్నాయని గాన గంధర్వుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హరికథకులు అవధానులతో సమానమని కొనియాడారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జానపదానికి చోటు కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఇదే రీతిలో హరికథకులకు సైతం పద్మ అవార్డులు ఇవ్వాలన్నారు. ప్రచార సాధనాలు లేని రోజుల్లో ప్రజా సమస్యలనే కథా వస్తువుగా మార్చుకొని ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఘనత హరికథకులకు దక్కుతుందన్నారు. అలాంటి కళను ఆదరించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నేటి సమాజంలో స్త్రీ అశ్లీలత, అసహ్యమైన వస్త్రధారణతో కనిపించడం మన సంస్కృతా అని ప్రశ్నించారు. గత చిత్రాల్లో సావిత్రిలాంటి నటీమణులు కట్టుబొట్టు తీరును ప్రజలు ఆదరించి అభిమానించ లేదా అని పేర్కొన్నారు. అలాంటి సంస్కృతి నేడు మంటగలిచిందని వాపోయారు. భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయన్నారు. తెలుగు భాషపై తెలుగు వారిలోనే మక్కువ తగ్గిందని వాపోయారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచ దేశాల్లోని భాష పట్ల గర్వం, అభిలాష, మక్కువ తక్కువగా ఉండేది తెలుగు వారిలోనేనని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలకు దర్పణం పట్టే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాజకీయంలో నేడు స్వార్థ రాజకీయాలు చోటు చేసుకోవడం మన దౌర్భాగ్యమన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారడం సమంజసమా అని ప్రశ్నించారు. గెలిపించిన ప్రజల ఇష్టానికి విరుద్ధంగా తమ స్వార్థం కోసం పార్టీలు మారడం విచాకరమన్నారు. హత్యలు, మానభంగాలు చేసిన వ్యక్తులు నేడు మంత్రులు, రాజనీతిజ్ఞులుగా వెలుగొందుతుండడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతిలోని ఎంఎస్.సుబ్బలక్ష్మి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. తాను తిరుపతిలో జన్మించి ఉంటే ప్రతి రోజూ విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేసేవాడినని తెలిపారు. తన తండ్రి హరికథా పండితారాద్యులు సాంబమూర్తి సంస్మరణార్థం ఏర్పాటు చేసే హరికథా వైభవోత్సవాలకు ప్రతి ఏటా రూ.లక్ష ఇస్తానని ప్రకటించారు. ఎస్పీ బాలు దంపతులతో పాటు కుమారుడు చరణ్ హరికథా గానామృతాన్ని విన్నారు. అనంతరం కుప్పం వాస్తవ్యులు హరికథా కళాకారులు కె.కేశవమూర్తి భాగవతార్, సీతారామయ్య భాగవతార్, మృదంగం విద్వాన్ అనేకల్ క్రిష్ణప్పకు బంగారు పతకాలు, హరికథా విద్వన్మణి బిరుదులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ విశ్వనాథం, మహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య, కందారపు మురళి, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భాగవతార్, కార్యదర్శి గంగులప్ప, పెద్ద సంఖ్యలో కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు. -
ఫస్ట్‌లుక్ 28th August 2018
-
గాయకుడ్ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకుని ఆశీర్వదించడానికే వచ్చానని ప్రముఖ సినీ నేపథ్యగాయిని గానకోకిల జానకి పేర్కొన్నారు. నగరంలోని పురమందిరం ఓపెన్ థియేటర్లో సోమవారం రాత్రి విజేత ఆర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన పాటల రారాజ బాలు పుట్టిన రోజు పండగ ఆద్యంతం జ్ఞాపకాల పరంపరగా సాగింది. సినీ రచయిత వెన్నలకంటి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన జానకి మాట్లాడుతూ తనకు సత్కారం చేస్తానంటే, ఈ వేడుకకు రాలేదని, కేవలం పుట్టిన బాలుడు బాలసుబ్రహ్యణ్యాన్ని ఆశీర్వదించడానికే వచ్చానన్నారు. బాలులో ఉన్న టాలెంట్, కలిసొచ్చిన అదృష్టం, తెలివితేటలు, మాటలతో కట్టిపడేసే నైజం అన్నింటినీ మించి గ్రాస్పింగ్వల్లే ఇంతపెద్ద గాయకుడయ్యాడరన్నారు. తన అభివృద్ధికి జానకమ్మే కారణం అని పలుమార్లు బాలు చెబుతుంటాడని, అయితే నెల్లూరు, గూడూరులో జరిగిన పాటల పోటీల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో తానిచ్చిన ప్రోత్సాహపు మాటలకు తదాస్థు దేవతల ఆశీర్వాదం వల్ల బాలు పెద్ద గాయకుడై ఉంటారన్నారు. గాయనిగా తన ప్రస్థానం సినిమా నేపథ్య ప్రపంచంలో బాలు, జానకి పాటలు, సంఘటనలను ఆమె వివరించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గాయకుడిని కావాలని తాను ఎప్పడు అనుకోలేదన్నారు. తనకేమి తెలియదో తనకు బాగా తెలుసనీ, ఇంజినీరు కావాలని అనుకున్న లక్ష్యం జానకమ్మ మాటలతో మారిపోయి శృతిపాండిత్యంతో ప్రయత్నించానన్నారు. ఆ తరువాత ప్రస్థానం అందరికీ తెలిసిందేనన్నారు. జానకమ్మ మహా గాయనిఅని మిగిలిన వాళ్లు పాడలేని పాటలు పాడగల దమ్మున్న గాయని అన్నారు. సంగీతానికి అంతులేదనీ, ఎంతవరకు నేర్చుకున్నాం.. ఎంతవరకు సాధన చేశామనే దానిపైనే కళాకారుల స్థాయి ఆధారపడి ఉంటుందన్నారు. స్వచ్ఛభారత్‌ను ఎవరికి వారు అనుసరించాలని పలు సూచనలు చేశారు. సంగీత, సాహిత్య విశ్లేషకులు వి.ఎ.కె.రంగారావు జానకి, బాలు పాటలు, నెల్లూరుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. సినీ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ సంగీతం భగవంతుని భాష అని నెల్లూరు నుంచి గంగోత్రి ప్రవాహంలా సాగిన బాలు ప్రస్థానం, జానకమ్మల పాటలను విశ్లేషించారు. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు విద్యాసాగర్ మాట్లాడుతూ సంగీతం పట్ల బాలుకున్న అంకితభావం, పెద్దలను గౌరవించాలనే బాలు తత్వం భావితరాలు అలవర్చుకోవాలన్నారు. ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ మాట్లాడుతూ సంగీత, సాహిత్యంలో బాలు, జానకమ్మలాంటి గొప్పవారితో వేదికను పంచుకోవడం అదృష్టమన్నారు. లాయర్ పత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్‌రెడ్డి, మురళీకృష్ణ 70ఎంఎం అధినేత హజరత్‌బాబు, వెంకటగిరి రాజా సాయిజ్ఞయాచేంద్ర, ఎస్పీ శైలజ, ఎస్పీ చరణ్, బాలు కుటుంబసభ్యులు, స్నేహితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సత్కారం కాదు.. నమస్కారం తాను పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాల్లో ఉన్నవారిని సన్మానించడం ఆనవాయితీ అని అయితే జానకమ్మ అందుకు అంగీకరించకపోవడంతో కేవలం తన ఆశీర్వచనం తీసుకుని తనకు నమస్కరించడం కోసమే ఆమెను ఆహ్వానించామని బాలు పదేపదే స్పష్టంచేశారు. తల్లి శకుంతలమ్మ, కుటుంబసభ్యుల మధ్య బాలు జానకమ్మ వద్ద ఆశీర్వచనం తీసుకున్నారు. ఆమెకు మురళీకృష్ణ విగ్రహాన్ని బహుమతిగా అందజేశారు. జానకమ్మ వద్దని చెప్పిన రూ.లక్ష నగదును స్పర్శ ఆస్పత్రిలో ఆడియో థియేటర్ ఏర్పాటుకు అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆకట్టుకున్న నృత్యం నూజివీడు ఐఐఐటీ కళాశాల యోగా విభాగ నిర్వాహకులు సత్యశ్రీధర్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిర్వహించిన (ప్ర)యోగాత్మక నృత్యరూప ప్రదర్శన పలువుర్ని ఆలోచింపజేసింది. -
గానస్పర్శ
-
బాలూ ఇజం
-
చిత్రసీమ తలలో నాలుక
అక్షర తూణీరం బాలు గొంతుతో నటిస్తున్నాడని కొందరు ఆక్షేపించారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. ఇండియన్ సినిమా శత వసంతాలు పూర్తి చేసుకున్న శుభ తరుణంలో గానగంధర్వుని విశిష్ట పురస్కారంతో సన్మానించ నున్నారు. సినిమా శతాబ్ది చరిత్రలో అర్ధ శతాబ్దిని ఇప్పటిదాకా ఎస్పీ బాలు సుబ్రహ్మణ్యం తన స్వరంతో శ్వాసించారు. ఆనక శాసించారు. గడచిన యాభై ఏళ్లలో వచ్చిన అనేక భారతీయ సినిమా రీళ్లను పరిశీలిస్తే, వాటి సౌండ్‌ట్రాక్స్‌లో బాలు వినిపి స్తారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ.. మరి కొన్ని భాషలలో నలభై వేల పాటలు పాడారు. గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. పద్మభూషణుడైనారు. ప్రముఖ సంగీత దర్శకులు కోదండపాణి దీవెనలతో చిత్రసీమలో బాలు అడుగు పెట్టారు. అప్పటినుంచీ అడుగులు వేస్తూనే ఉన్నారు. ప్రజాకోటి ఆయన అడుగులకు మడుగులొత్తుతూనే ఉంది. తొలినాళ్లలో అంటే అర్ధ శతాబ్దికి పూర్వం ఆయన పాడిన ఏమి ఈ వింత మోహం, ఓహోహో బంగారు పిచ్చుకా, మేడంటే మేడా కాదు లాంటి ఎన్నో పాటలు నేటికీ కొత్త చిగుళ్లుగానే అలరిస్తున్నాయి. ‘‘రావ మ్మా మహాలక్ష్మీ రావమ్మా’’ పాటలో ఆర్ద్రత తొణికిసలాడుతుంది. మొదట్నించీ పాట సాహిత్య సౌరభాన్ని తన పలుకు బడితో మరింతగా గుబాళింపచేయడం బాలు అలవరచుకున్నారు. తేనెలో కల కండ పలుకులు కలసి ప్రవహిస్తున్నట్టుంటుంది ఆ స్వరం. కలకండ పలుకులు ఉచ్ఛా రణలో సుస్పష్టత కోసం నిలిచాయి. మకరందం మాధుర్యాన్నిచ్చింది. ఆ తరం కవుల నుంచి ఈనాటి కవులదాకా తమ గీతాన్ని బాలు పాడాలని అభిలషిస్తారు. తమ సాహి త్యానికి న్యాయం జరుగుతుందని అలా ఆశ పడతారు. దర్శకునిగా బాపు రెండో చిత్రం బంగారు పిచిక. అందులో బాలుని కథానాయకుడుగా, ఓ ప్రసిద్ధ యువ రచయిత్రిని హీరో యిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇతరేతర కార ణాలవల్ల ఆ కథ అలా నడవలేదు. బాలు మంచి రూపు అని చెప్పడానికి ఈ పాత నిజం చెప్పాను. బాలు జీనియస్. లలితలలితమైన కంఠస్వరంతో సునామీని సృష్టించాడు. చాలా మంది ఆనాటి గాయకుల్ని తోసిరాజన్నాడు. గళంలో వైవిధ్యాన్ని చూపాడు. కొందరు గొంతుతో నటిస్తున్నాడని ఆక్షేపించారు. నాలాంటి సగటు శ్రోతలు పర్వాలేదన్నారు. మిమిక్రీ చేస్తున్నాడు చూసుకోండని కొందరు పండితులు ప్రజల్ని హెచ్చరించారు. ‘‘అలాగా... భలే బాగుంది’’ అంటూ మెచ్చుకున్నది ప్రజ. అర్జున ధనుష్ఠంకారం, అక్షయ తూణీరంలోని అమ్ముల్లా తరగని పాటలు బాలుకి పేరు తెచ్చిపెట్టాయి. పద్మశ్రీ తుర్ల పాటి దశకంఠునిగా అభివర్ణించి, శ్లాఘించారు. ‘‘హీరోలకి, కమెడియన్లకి, కానివారికి, అయిన వారికి ఇలాగ సినిమాలో అందరికీ ఈయనే పాడేస్తున్నాడు బాబోయ్!’’ అంటూ ఒకాయన గావుకేక పెడితే, హీరోయిన్లని వదిలేశాడు సంతోషించమని మరొకాయన శాంతపరిచాడు. బాలు పాడిన గొప్ప పాటల్ని ఏకాక్షరంతో గుర్తు చేసుకోవడం కూడా సాధ్యం కాదు. ఏకవీర పాటల్ని మరచిపోలేం. ప్రతి రాత్రి వసంత రాత్రి పాట బాలు, ఘంటసాలల యుగళగీతం. వారిద్దరినీ కలిపి ఆస్వాదించడం ఓ గొప్ప అనుభవం. బాల సుబ్రహ్మణ్యం గాయకుడు, నిర్మాత, గాత్రదాత, నటుడు, సంగీత దర్శకుడు, స్నేహశీలి, సరసుడు ఇంకా అన్నీను. స్నేహానికి పోయి ఎడంవైపున, సొంతానికి పోయి కుడివేపున చేవ్రాళ్లు చేసి, ఆనక పాటలు పాడుకుంటూ అప్పులు తీర్చే భాగ్యశాలి బాలు. మిగిలినవన్నీ ఒక ఎత్తు, పాడుతా తీయగాతో ఆయన నడుపుతున్న పాటశాల ఒక ఎత్తు. మిథునంలో అప్పదాసు పాత్ర ధరించి నాకు ఖండాంతర ఖ్యాతి తెచ్చిపెట్టారు. ఇంకా ఎన్నో చెప్పాలి. ఆయన తగని మొహమాటస్తుడు, తగిన మర్యాదస్తుడు. ‘‘బాలు మగపిల్లాడుగా పుట్టాడు కాబట్టి సరిపోయింది. ఆ మోహ రూపుకి ఆడపిల్లగా పుడితే... పాపం చాలా ఇబ్బందయేదని’’ బాపు తరచూ ఆనందించేవారు. శతమానం భవతి. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
తమిళంలో శంకరాభరణం
తమిళసినిమా: భారతీయ అద్భుత సినీ కళా ఖండాల్లో శంకరాభరణం ఒకటని ఘంటాపథంగా చెప్పేయవచ్చు. ఇంకా చెప్పాలంటే కర్ణాటక్ సంగీతాన్ని అతి సామాన్యుడి వద్దకు చేసిన చిత్రాల్లో మొదటి వరసలో ఉండే చిత్రం ఇది. అలాంటి అద్భుత దృశ్య కావ్యానికి దర్శకుడు కె.విశ్వనాథ్, నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్ సృష్టికర్తలు. సంగీతంతో సామాజిక అంశాలను ముడిపెట్టి ఆచారాలన్నవి ఆచరణలో పెడితే చాలు మనుష్యులందరూ ఒక్కటే అంటూ జాతి, మతం లాంటి అంటరానితనానికి పాతరేసిన గొప్ప సందేశాత్మక సంగీత భరిత చిత్రం శంకరాభరణం. ఈ చిత్రంతోనే గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యంలో ఉన్న నిజమైన గాయకుడు లోకానికి పరిచయం అయ్యారంటే అతిశయోక్తి కాదేమో. 1980లో తెరపైకి వచ్చి చరిత్ర సృష్టించిన శంకరాభరణం దివంగత నటుడు సోమయాజులకు నటి మంజుభార్గవి, రాజాలక్ష్మికి ఇంటి పేరుగా మారిందంటే ఈ చిత్ర చరిత్ర ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చంద్రమోహన్, అల్లురామలింగయ్య లాంటి ప్రతిభావంతుల నటన శంకరాభరణంకు అదనపు అలంకారం. అప్పట్లో జాతీయ రాష్ట్ర నంది అవార్డులతో పాటు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి విశేష కీర్తిని సంపాదించి పెట్టిన ఈ తెలుగు చిత్రం తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోను విడుదలైన ఘన విజయాన్ని సాధించింది. ఇదంతా ఎందుకు గుర్తు చేయాల్సి వచ్చిందంటే శంకరాభరణం 35 ఏళ్ల తరువాత తమిళ మాటలతో మరోసారి తమిళనాట శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి గాయకుడు ఎస్పి బాలసుబ్రమణ్యం, తెలుగులో పాడిన పాటల్ని తమిళంలోనూ ఆలపించడం విశేషం. ఈ తరం కూడా చూడాల్సిన గొప్ప చిత్రం శంకరాభరణం. -
'మూడు ముక్కల్లో చెప్పాలంటే' మూవీ స్టిల్స్
-
మూడు ముక్కల్లో..
‘మిథునం’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం, లక్ష్మిల అభినయం దాంపత్య జీవితానికి అద్దం పట్టింది. మళ్లీ ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నిర్మాత. మధుమిత దర్శకురాలు. రచయిత వెన్నెలకంటి రెండో తనయుడు రాకేందుమౌళి హీరోగా పరిచయమవుతు న్నారు. అదితి హీరోయిన్. పాటలు మినహా పూర్తయిన ఈ చిత్రం గురించి చరణ్ చెబుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తమిళంలో నిర్మాతగా నాకిది 8వ చిత్రం. తెలుగులో ఇదే తొలి సినిమా. కథ, కథనాలు ఆసక్తిగా, వినోదాత్మకంగా ఉంటాయి. తమిళంలో మంచి డెరైక్టర్‌గా పేరు సంపాదించిన మధుమిత ఈ చిత్రాన్ని సమర్థంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: శ్రీనివాస్, సంగీతం: కార్తికేయమూర్తి. -
దుబాయ్ లో 'గామా' మ్యూజికల్ అవార్డ్స్
-
గీత స్మరణం
పల్లవి : నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు (2) అది మీరే మీరే వూస్టారు వూ దేవుడు మీరే వూస్టారు (2) ॥ చరణం : 1 దారే దొరకని చీకటిలో... తానే వెలుగై నడిచాడు జాతే నా వెలుగన్నాడు జాతిపిత... వున జాతిపిత దిక్కులు తెలియుని సవుయుంలో తానే దిక్కుగ నిలిచాడు... శాంతిని నేతగ నిలిపాడు శాంతిదూత వున శాంతిదూత ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిగాడు ఆ శాంతిదూత నెహ్రూజీ మీలో వెలిశాడు ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు వూ దేవుడు మీరే వూస్టారు (2) ॥ చరణం : 2 జరిగే జీవిత సవురంలో... జారే నైతిక విలువల్లో నీతిని నేతగ నిలపాలి నవయుువత యుువనేత చుక్కలు వూడే గుండెల్లో ... నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగ నిలపాలి నవయుువత యుువనేత ఈ యుువత తాత గాంధీజీ మీలో మిగిలారు మీ నవతకు నేతాజీ మీలో రగిలారు అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు దేశానికి మీరే సారథులు ॥ చిత్రం : విశ్వరూపం (1981), రచన : దాసరి నారాయుణరావు సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు, బృందం