మూడు ముక్కల్లో.. | Lyricist Rakendu Mouli turns hero | Sakshi
Sakshi News home page

మూడు ముక్కల్లో..

Published Wed, Oct 29 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

మూడు ముక్కల్లో..

మూడు ముక్కల్లో..

 ‘మిథునం’ చిత్రంలో ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం, లక్ష్మిల అభినయం దాంపత్య జీవితానికి అద్దం పట్టింది. మళ్లీ ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే..’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ నిర్మాత. మధుమిత దర్శకురాలు. రచయిత వెన్నెలకంటి రెండో తనయుడు రాకేందుమౌళి హీరోగా పరిచయమవుతు న్నారు. అదితి హీరోయిన్. పాటలు మినహా పూర్తయిన ఈ చిత్రం గురించి చరణ్ చెబుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. తమిళంలో నిర్మాతగా నాకిది 8వ చిత్రం. తెలుగులో ఇదే తొలి సినిమా. కథ, కథనాలు ఆసక్తిగా, వినోదాత్మకంగా ఉంటాయి. తమిళంలో మంచి డెరైక్టర్‌గా పేరు సంపాదించిన మధుమిత ఈ చిత్రాన్ని సమర్థంగా తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కెమెరా: శ్రీనివాస్, సంగీతం: కార్తికేయమూర్తి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement