
సాక్షి, తిరుపతి: జనసేన కిరణ్ రాయల్ బాధితురాలు లక్ష్మికి బెయిల్ మంజూరైంది. లక్ష్మికి జైపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కిరణ్ రాయల్ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ గత కొద్దిరోజులుగా న్యాయ పోరాటం చేస్తోన్న బాధితురాలు లక్ష్మిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
సోమవారం మీడియా సమావేశం పెట్టిన లక్ష్మి.. కిరణ్ రాయల్ ఆగడాల్ని ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. అయితే, ప్రెస్‌మీట్ జరుగుతున్న సమయంలో రంగ ప్రవేశం చేసిన రాజస్థాన్ పోలీసులు.. చెక్‌బౌన్స్ కేసంటూ లక్ష్మిని అరెస్ట్ చేశారు. కిరణ్ రాయల్ రూ.1.20 కోట్ల నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని ఇవ్వకపోగా.. తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసి ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.
ఆస్పత్రి నుంచి నివాసానికి చేరుకున్న వెంటనే కిరణ్‌రాయల్ జనసేన శ్రేణుల ద్వారా బెదిరింపులకు దిగడంతో లక్ష్మి రెండు రోజుల క్రితం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ప్రెస్‌మీట్ ముగిసిన వెంటనే.. జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: తన వెనుక పవన్ ఉన్నాడని కిరణ్ రాయల్ బెదిరించేవాడు
లక్ష్మి తనపై సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడాన్ని జీర్ణించుకోలేని కిరణ్‌రాయల్ ఇంతకుముందే మీడియా సమావేశంలో లక్ష్మిపై ఆరోపణలు చేస్తూ.. రెండురోజుల్లో జైపూర్ పోలీసులు ఆమెను అరెస్టు చేయబోతున్నారని చెప్పారు. అదే జరగడంతో.. ఆ విషయాన్ని ఆయన ముందే ఎలా చెప్పగలిగారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనను బిట్‌కాయిన్ కేసులో ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. ఒంటరి మహిళను అన్యాయంగా వేధిస్తున్నారు. ఇది న్యాయమేనా? అని కన్నీరు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment