lakshmi
-
కర్ణాటక మంత్రి లక్ష్మికి తప్పిన ప్రమాదం
బెంగళూరు: కర్ణాటక మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్ ఘోర ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మంగళవారం బెళగావి వద్ద ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టంకొద్దీ గాయాలతోనే ఆమె బయటపడ్డారు.మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్(Lakshmi Hebbalkar) ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ ఓ చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో మంత్రితో పాటు ఆమె సోదరుడు, ఎమ్మెల్సీ చెన్నరాజ్ హత్తిహోళి కూడా ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరిద్దరికీ స్వల్ప గాయాలవగా.. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 5గం. సమయంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖం, వెన్నెముకకు, ఎమ్మెల్సీ చెన్నరాజ్(Chennaraj) తలకు గాయాలైనట్లు చెప్పారు. ప్రస్తుతం వీరికి చికిత్స అందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని మృణాల్ వెల్లడించారు. ఓ వీధి శునకాన్ని తప్పించబోతుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్లు మంత్రి కుమారుడు మృణాల్ హెబ్బాళ్కర్ చెబుతున్నారు. లక్ష్మి హెబ్బాళ్కర్ 2023, 2018 ఎన్నికల్లో బెళగావి రూరల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. -
వాహ్... ఉస్తాద్‌లు
ఇటీవల ఢిల్లీలో కేంద్ర సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న తెలుగు మహిళలు.ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్... ప్రఖ్యాత సంగీత విద్వాంసులు. నాదం ఆయన షెహనాయ్లో ప్రణవనాదంగా భాసిల్లింది. ఆయన ఉఛ్వాస నిశ్వాసలు నాదంతోనే... నాదస్వరంతోనే. ఆ నాదం స్మృతిగా మిగలరాదు... శ్రుతిగా కొనసాగాలి. కళాసాధనకు అంకితమైన కళాకారులే ఆయన వారసులు. బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న మన మహిళలు వీళ్లు.సరిగమల సాగరంలో నేనో బిందువునిఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి షెహనాయ్ వాద్యం అంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికి వందల సార్లు కాదు వేలసార్లు విని ఉంటాను. రాత్రి నిద్రపోయే ముందు కూడా బిస్మిల్లా ఖాన్ సంగీత కార్యక్రమం వింటూ నిద్రపోతాను. మహా సముద్రం అంతటి సంగీతప్రపంచంలో ఆయన ఒక సముద్రం అయితే నేను ఒక నీటిబిందువుని. ఇలాంటి గొప్పవారు నాలాంటి ఎందరో సింగర్స్‌కు స్ఫూర్తినిస్తుంటారు. సంగీతమే శ్వాసగా జీవించిన బిస్మిల్లా ఖార్ పేరు మీద పురస్కారం అందుకోవడం అంటే సంతోషశిఖరాన్ని అధిరోహించినట్లే భావిస్తున్నాను. నాకు ఈ ఏడాది ఎన్నో మధురానుభూతులనిచ్చింది. కన్నడ పాటకు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్‌గా సైమా అవార్డు, కర్నాటక ‘విశ్వమన్య’ పురస్కారం, తెలుగులో బలగం సినిమా పాటకు ఐఫా అవార్డు అందుకున్నాను. ఇంకా గొప్ప సంతృప్తి ఏమిటంటే... నేపథ్యగాయని పద్మభూషణ్ ఉషాఉతుప్, పద్మభూషణ్ సుధా రఘునాధన్ వంటి మహోన్నత గాయనీమణులతో కలిసి వేదిక పంచుకోవడం. బాలికల సంరక్షణ కోసం స్వచ్ఛందంగా నిర్వహించిన సంగీతకార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన అనుభూతి చాలా గొప్పది. ఇప్పుడు ఈ జాతీయ స్థాయి పురస్కారం అందుకోవడం ఊహించనిది. ఈ ఏడాది నాకు ప్రత్యేకం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. – సత్యవతి ముదావత్ (మంగ్లీ), సినీ నేపథ్య గాయనిలక్ష్యం మారిందిచిత్తూరులో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన రెడ్డి లక్ష్మి ఐఏఎస్ లక్ష్యంతో గ్రాడ్యుయేషన్‌కి ఢిల్లీకి వెళ్లారు. ఆమె మీద కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల ప్రభావం కూడా ఎక్కువే. డిగ్రీ చదువుతూ కూచిపూడి నాట్యంలో శిక్షణ మొదలుపెట్టారు. ఆ ఆసక్తి ఆమెను ఏకంగా ఢిల్లీలో డాన్స్ ఆకాడమీ స్థాపించేవరకు తీసుకెళ్లింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన వారికి ఇలాంటి పురస్కారాలు భుజం తట్టి ఇచ్చే ప్రోత్సాహం వంటివన్నారు లక్ష్మి. పన్నెండేళ్లుగా ఢిల్లీలో ‘నృత్యవాహిని – అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ను నిర్వహిస్తున్నారామె. ఢిల్లీ వంటి నగరంలో నాట్యప్రదర్శన పట్ల ఆసక్తితో సుశిక్షితులై సాధన చేసినప్పటికీ చాలా మందికి ప్రదర్శనకు సరైన అవకాశం దొరకదు. అలాంటి వారికి నాట్య ప్రదర్శనకు అనువైన ఈవెంట్స్ ద్వారా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు లక్ష్మి. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు తీసుకోవడం వల్ల ఆమె సేవ ఎల్లలు దాటింది. ఆన్లైన్లో వివిధ దేశాల నుంచి విదేశీయులతోపాటు ఎన్నారైలు కూడా ఆమె దగ్గర నాట్యంలో మెళకువలు నేర్చుకున్నారు. ఢిల్లీలో రెగ్యులర్‌గా నిర్వహించే క్లాసుల్లో తెలుగు వాళ్లతోపాటు వివిధ భాషల వాళ్లున్నారు. బిస్మిల్లా ఖాన్ యువపురస్కారం అందుకున్న సందర్భంగా ఆమె తన గురువు గారి మార్గదర్శనాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈ రోజు ఈ పురస్కారం అందుకున్నానంటే మా గురువుగారు పద్మశ్రీ గురు జయరామారావుగారి సూచనను పాటించడం వల్లనే. ఆయన పిఠాపురంలో పుట్టారు. కూచిపూడికి వెళ్లి నాట్యం నేర్చుకున్నారు. కాకతాళీయంగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలో డాన్స్ అకాడమీ అవసరం చాలా ఉంది. మన కళారీతులను విశ్వవ్యాప్తం చేయడానికి నీ వంతు ప్రయత్నం చెయ్యి... అని నాకొక డైరెక్షన్ ఇచ్చారు. వారి సహకారంతోనే ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్లో డాన్స్ టీచర్‌గా ఉద్యోగం చేశాను. ఎనిమిదేళ్లపాటు ఢిల్లీలోని ఓ ఎమ్ఎన్సీలో ఉద్యోగం చేసినప్పటికీ నాట్యం కోసం పని చేస్తున్నప్పుడు కలిగిన సంతోషం ఉండేది కాదు. నాట్యంలో నా కళాతృష్ణను తీర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకున్నాను. ఆ తర్వాత భరతనాట్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఇప్పుడు కూచిపూడి నాట్యంలో పీజీ చేస్తున్నాను. ఇతర నాట్యరీతుల్లోనూ ప్రవేశాన్ని సాధించాను. నాట్యంలో పీహెచ్డీ చేయడం నా ప్రస్తుత లక్ష్యం’’ అన్నారు రెడ్డి లక్ష్మి.నా పాట నాకు నచ్చాలి!‘‘ఇది నా తొలి జాతీయ పురస్కారం. తప్పకుండా నా జీవితంలో మధురమైన ఘట్టమే. చెన్నైలో నా గానం విన్న ప్రముఖులు గోల్డెన్ వాయిస్ అని ప్రశంసించినప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషం కలిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకోవడం కూడా...’’ అన్నారు కర్ణాటక సంగీతకారిణి శ్వేతాప్రసాద్. ‘‘మా ఇల్లు ఒక సంగీతం విశ్వవిద్యాలయం వంటిది. నానమ్మ గాయని, తాతయ్య (రక్తకన్నీరు నాగభూషణం) రంగస్థల ప్రదర్శనల్లో నానమ్మ పాల్గొనేది. అమ్మ వీణలో సిద్ధహస్తురాలు. మరో తాతయ్య (అమ్మ వాళ్ల నాన్న) మోహన్‌రావు. ఆయన హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభ స్థాపించడం, నిర్వహించడంలో కీలకంగా పనిచేశారు. అలాంటి ఇంట్లో పుట్టడం ఒక వరం. మూడేళ్ల వయసు నుంచి సరిగమలు కూడా నాతోపాటు పెరిగాయి. శోభానాయుడు, అలేఖ్య పుంజల వంటి ప్రముఖ నాట్యకారుల కార్యక్రమాలకు గానమిచ్చాను. నాకు సంగీతమే జీవితం. మరొకటి తెలియదు. నా భర్త నట్టువాంగం కళాకారులు. మేమిద్దరం ముప్పైకి పైగా దేశాల్లో ప్రదర్శనలిచ్చాం. మా తాతగారిలాగే ఎప్పటికప్పుడు నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఉండడమే నా విజయరహస్యం. రక్తకన్నీరు స్ఫూర్తితో... నాగభూషణం తాతయ్య రక్తకన్నీరు నాటకాన్ని ఎనిమిది వేల సార్లు ప్రదర్శించారు. ప్రతి ప్రదర్శన దేనికది భిన్నంగా ఉండేలా చూసుకునేవారు. నిన్నటి కంటే నేడు మరికొంత భిన్నంగా, రేపు మరింత వైవిధ్యంగా ఉండేలా చూసేవారు. అలాగే ఒక ప్రదర్శనకంటే మరో ప్రదర్శన ఇంకా మెరుగ్గా ఉండేటట్లు నాకు నేను మెరుగులు దిద్దుకుంటాను. గాయకులు కానీ చిత్రకారులు కానీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య దగ్గరే ఆగిపోకూడదు. సాధన ద్వారా తనవంతుగా మరికొన్ని మెళకువలను అద్దగలగాలి. మన నైపుణ్యం మీద మనకు నమ్మకం ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఫలితం సంతోషకరంగా ఉంటుంది. నా మట్టుకు నేను ‘నన్ను నేను మెప్పించుకోవాలి’ అనే కొలమానం పెట్టుకుని పాడుతాను. నా పాట నాకే నచ్చకపోతే మరొకరికి ఎలా నచ్చుతుంది? అనేదే నా ప్రశ్న. నా లక్ష్యం భవనాలు, కోట్ల రూపాయలు సంపాదించడం కాదు. సంగీతం నా ప్యాషన్. శుద్ధ సంగీతాన్ని పాడుతాను. సంగీతంతోనే జీవిస్తాను’’ అంటూ సంగీతం పట్ల తన ఇష్టాన్ని వ్యక్తం చేశారు శ్వేతాప్రసాద్.– వాకా మంజులా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిది -
ప్రతి నిమిషం.. సినిమా ధ్యాసే..
చిత్ర పరిశ్రమలో దర్శకత్వ విభాగంలో సక్సెస్ కావాలంటే, అందులోనూ ఓ మహిళ ఆ స్థాయిలో అవ్వాలంటే సామర్థ్యంతో పాటు సృజనాత్మకత తప్పనిసరి. సమకాలీన అంశాలను అర్థవంతంగా తెరకెక్కిస్తేనే ప్రేక్షకాదరణ పొందుతుంది. అలాంటిది హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఎంతో అంకితభావం, చిత్తశుద్ధితో పాటు ధైర్యసాహసాలు కావాలి. ఒకటి కాదు రెండు కాదు వందలాది అంతర్జాతీయ అవార్డ్‌లతో ఔరా అనిపిస్తోంది మన తెలుగమ్మాయి లక్ష్మీ నిమిషా గుమ్మడి. తాజాగా ఆమె ప్రొడక్షన్ డిజైనర్‌గా రూపొందించిన ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ ఫీచర్ ఫిల్మ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. ఇది చాలదూ.. హాలీవుడ్లో లక్ష్మీ సత్తా ఏంటో చెప్పేందుకు!? హైదరాబాద్‌లోని సంఘమిత్ర స్కూల్, ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో +12 వరకూ చదివిన లక్ష్మీ.. ఆ తర్వాత కర్నాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కాలిఫోరి్నయాలోని అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ (ఏఎఫ్ఐ)లో ‘ప్రొడక్షన్ డిజైన్’లో ఎంఎస్ పూర్తి చేసింది. సమకాలీన డిజైన్స్‌తో సాంస్కృతిక అంశాలను మిళితం చేసే సామర్థ్యం ఈమె సొంతం. తెర వెనక పాత్రల గురించి తెలిసి.. చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు క్యారెక్టర్స్‌లో లీనమై అతిగా భావోద్వేగానికి లోనయ్యేదానినని తరుచూ స్నేహితులు ఆమెను ఆటపట్టించేవారు. చిన్నతనం నుంచే తనపై సినిమాల ప్రభావం ఉండటంతో నటి కావాలని అనుకునేది. ఆ వయసులో తెరవెనక దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు, నిర్మాతల పాత్ర గురించి ఆలోచించే స్థాయిలేదు కానీ, పెద్దయ్యాక సినిమా మేకింగ్ గురించి తెలిసిన తర్వాత ఆమె ఆసక్తి నటన నుంచి ప్రొడక్షన్ వైపు మళ్లింది.ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ ‘తహనన్’.. అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ‘తహనాన్’ అనే ఫీచర్ ఫిల్మ్ లక్ష్మీ రూపొందించిందే. దీనికి లాస్ ఏంజిల్స్‌లోని కల్వర్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉత్తమ చలనచిత్ర అవార్డ్ వరించింది. అమెరికాలో మ్యూజిక్ వీడియోలు, వాణిజ్య ప్రకటనలు కూడా ఈమె రూపొందిస్తోంది. టేలర్ స్విఫ్ట్సŠ, ఫోర్ట్‌నైట్, రెడ్ క్రిస్మస్, రోబోట్, ఎలిఫెంట్ ఇన్ ది డార్క్, స్టక్ వంటి ఎన్నో మ్యూజిక్ వీడియోలకు లక్ష్మీ పనిచేసింది. అలాగే ఎల్రక్టానిక్ ఉపకరణాల సంస్థ డీఈఎక్స్ వంటి పలు బహుళ జాతి కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు రూపొందించింది.తెలుగు చిత్రం రిలీజ్.. ఈజిప్ట్, ఫ్రాన్స్, పోర్చుగల్, జర్మనీ, ఇస్తాంబుల్, యూకే వంటి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 15 అంతర్జాతీయ అవార్డ్లు లక్ష్మీ సొంతం. తాజాగా ‘డాస్ బ్రోస్ ఫోర్స్’ చిత్రం వచ్చే ఏడాది మేలో జరగనున్న ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోటీలో నిలిచింది. అర్జున్ ది స్టూడెంట్, మీన్ గోల్స్, ది హల్కైన్ డేస్, బాడీ చెక్ వంటి ఎన్నో ఫీచర్, షార్ట్ ఫిల్మŠస్ను రూపొందించింది. ఇండియాతో పాటు కెనడా, గ్రీస్, టర్కీ, అమెరికా, ఫ్రాన్స్, యూకే వంటి దేశాల్లోని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డ్‌లను దక్కించుకుంది. రవికుమార్ వాసు దర్శకత్వంలో శివకుమార్ రామచంద్ర వరపు కథానాయకుడిగా తెరకెక్కిన తెలుగు చలనచిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
మట్టి ప్రమిదలు,నువ్వుల నూనె : ఆరోగ్య లక్ష్మి, ఐశ్వర్యలక్ష్మికి ఆహ్వానం!
వినాయక చవితి సందర్భంగా మట్టివిగ్రహాలతొ విఘ్ననాయకుడ్ని కొలిచి తరించాం. ఇపుడు దీపాల పండుగ దీపావళి సంబరాలకు సమయం సమీపిస్తోంది. దీపావళి రోజున పెట్టిన దీపాల పరంపర, కార్తీకమాసం అంతా కొనసాగుతుంది. దీపావళి పండుగలో దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది.దీపావళి రోజున మట్టి ప్రమిదలనే వాడదాం. తద్వారా దైవశక్తులను ఆకర్షించడం మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడిన వారమూ అవుతాం. ‘‘దీప” అంటే దీపము. ‘ఆవళి’ అంటే వరుస. అలా దీపావళి అంటే.. దీపాల వరుస అని అర్థం. దీపం అంటే జ్ఞానం, ఐశ్వర్యం. చీకటి నుంచి వెలుగులోకి, ఐశ్వర్యంలోకి పయనించడమే దీపాల పండుగ ఆంతర్యం.మట్టి ప్రమిద. నువ్వుల నూనె, లేదా ఆవు నెయ్యి ఈ కలయిక ఎంతో మంగళకరం. నువ్వుల నూనెతో కూడిన మట్టి ప్రమిదల దీపపు కాంతి, ఆరోగ్యానికి కంటికి ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలపు చలిగాలు మధ్య మన శరీరానికి ఏంతో మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభించి, పూర్వ జన్మ పాపపుణ్యాలు తొలగి పోతాయి. మట్టి ప్రమిదల్లో దీపం పెట్టడం అంటే అటు ఆరోగ్య లక్ష్మీని ఇటు ఐశ్వర్యలక్ష్మీని ఆహ్వానించి, వారి అనుగ్రహాన్ని పొందడన్నమాట.దీపారాధన చేసే సమయంలో ”దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర! దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదేవి నమోస్తుతే!!” అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల మట్టి ప్రమిదలు, దీపాలు అందుబాటులో ఉన్నాయి. మట్టి దీపాలను వాడటం ద్వారా వృత్తి కళాకారులకు ప్రోత్సాహమిచ్చినవారమవుతాం. అలాగే కస్టమర్ల ఆసక్తికి అనుగుణంగా, ఆకట్టుకునే డిజైన్లతో ట్రెండీ లుక్‌తో అలరిస్తున్నాయి మట్టి దీపాలు. పాత ప్రమిదలను కూడా శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. -
దేశంలోని ప్రముఖ మహాలక్ష్మి ఆలయాలు
దీపావళి నాడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజున భక్తులు మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ మహాలక్ష్మీదేవి ఆలయాలున్నాయి. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గోల్డెన్ టెంపుల్ (తమిళనాడు)తమిళనాడులోని వెల్లూరు జిల్లాలోని మహాలక్ష్మి ఆలయాన్ని దక్షిణ భారతదేశంలోని ‘గోల్డెన్ టెంపుల్’ అని పిలుస్తారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పేరొందింది. 100 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయం చెన్నైకి 145 కిలోమీటర్ల దూరంలో పాలార్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దీపావళి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయంలో అమ్మవారి దర్శనానికి తరలివస్తుంటారు.మహాలక్ష్మి ఆలయం (ముంబై)ఈ ఆలయం మహారాష్ట్రలోని ముంబైలో గల బి. దేశాయ్ మార్గ్‌లో ఉంది. ముంబై మహాలక్ష్మి దేవాలయంగా ఈ ఆలయం పేరొందింది. బ్రిటీష్ కాలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఛత్రపతి శివాజీకి కలలో లక్ష్మీదేవి కనిపించి, ఈ ఆలయాన్ని నిర్మింపజేసిందని చెబుతారు. ఈ మహాలక్ష్మి ఆలయ గర్భగుడిలో మహాలక్ష్మి, మహాకాళి మహాసరస్వతి విగ్రహాలు కనిపిస్తాయి.మహాలక్ష్మి ఆలయం (కొల్హాపూర్)మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో గల మహాలక్ష్మి ఆలయానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఈ ఆలయాన్ని ఏడవ శతాబ్దంలో చాళుక్య పాలకుడు కర్ణదేవుడు నిర్మించాడు. షిల్హర్ యాదవ్ దీనిని తొమ్మదవ శతాబ్దంలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆలయ ప్రధాన గర్భగుడిలో నాలుగు అడుగుల ఎత్తయిన మహాలక్ష్మి దేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఇది దాదాపు 40 కిలోల బరువు ఉంటుంది. ఈ లక్ష్మీదేవి విగ్రహం సుమారు 7 వేల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతారు.లక్ష్మీనారాయణ దేవాలయం (ఢిల్లీ)ఢిల్లీలోని ప్రధాన దేవాలయాలలో లక్ష్మీనారాయణ దేవాలయం ఒకటి. ఈ ఆలయాన్ని 1622లో వీర్‌సింగ్ దేవ్ నిర్మించాడు. 1793లో పృథ్వీ సింగ్ ఆలయాన్ని పునరుద్ధరించాడు. అనంతరం బిర్లా కుటుంబం ఈ ఆలయాన్ని 1938లో విస్తరించి, పునరుద్ధరించింది. అందుకే ఈ ఆలయాన్ని బిర్లా టెంపుల్ అని పిలుస్తారు.మహాలక్ష్మి ఆలయం (ఇండోర్)మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల మహాలక్ష్మి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఇండోర్ నడిబొడ్డున ఉన్న రాజ్వాడలో నిర్మించారు. ఈ ఆలయాన్ని 1832లో మల్హర్రావు (II) నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. అయితే 1933లో అగ్నిప్రమాదం కారణంగా ఆలయం ధ్వంసమైంది. 1942లో ఈ ఆలయాన్ని తిరిగి పునరుద్ధరించారు. దేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు తరలివస్తుంటారు.అష్టలక్ష్మి దేవాలయం (చెన్నై)తమిళానడులోని చెన్నైలోని ఇలియట్ బీచ్ సమీపంలో అష్టలక్ష్మి ఆలయం ఉంది. ఈ ఆలయం నాలుగు అంతస్తులలో నిర్మితమయ్యింది. లక్ష్మీదేవి ఎనిమిది రూపాల విగ్రహాలను ఈ ఆలయంలో సందర్శించవచ్చు. ఆలయంలోని రెండవ అంతస్తులో లక్ష్మీ దేవి, విష్ణువు విగ్రహాలు ప్రతిష్ఠితమయ్యాయి.ఇది కూడా చదవండి: దీపావళికి ముందే గ్యాస్ ఛాంబర్లా రాజధాని -
జల రథ సారథులు
మన హైదరాబాద్‌లో మెట్రో రైల్ ఉంది. కొచ్చిలో కొత్తగా మెట్రో ఫెర్రీ మొదలైంది. కొచ్చిలో ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం ‘మెట్రో వాటర్ ఫెర్రీ’ వ్యవస్థను దక్షిణాసియాలోనే మొదటిసారిగా మొదలెట్టింది. 100 మంది పాసింజర్లను మోసుకెళ్లే ఫెర్రీలను నడిపేందుకు ముగ్గురు మహిళా పైలట్లు సెలెక్ట్ అయ్యారు. దేశంలోనే వీరు ప్రథములు. జల రవాణాలో ఇది మహిళా శకం.మొన్నటి సాయంత్రం కొచ్చిలోని హైకోర్టు నుంచి ఫోర్ట్ కొచ్చికి ఫెర్రీ బయలు దేరింది. బ్యాక్‌వాటర్స్‌లో రాత్రి పార్టీలకు కొన్ని హౌస్ బోట్లు బయలుదేరాయి. బెస్త పడవలు వెనుకకు మరలుతున్నాయి. వాటి మధ్య హుందాగా మృదువుగా కదిలింది నీలి రంగు ఫెర్రి. తండ్రి చేయి పట్టుకుని ఫెర్రీ ఎక్కిన ఒక పదేళ్ల అమ్మాయి ఫెర్రీ పైలెట్‌కు సహాయంగా నిలబడి ఉన్న మహిళా పైలెట్‌ను చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత తండ్రితో అంది ‘నాన్నా... నేను కూడా ఇలా అవుతా’. తండ్రి చిరునవ్వు నవ్వి ఆ మహిళా పైలెట్‌తో ‘ఇలా మా అమ్మాయి కావాలంటే ఏం చదవాలమ్మా’ అని అడిగాడు. ఆ ప్రశ్న ప్రస్తుతం కొచ్చిలో ఫెర్రీలలో ప్రయాణిస్తున్న చాలామంది తల్లిదండ్రులతో. అంతగా స్ఫూర్తినిస్తున్నారు కొత్తగా నియమితులైన ముగ్గురు మహిళా పైలట్లు.అరుణిమ, లక్ష్మి, స్నేహఈ ముగ్గురు యువ సారథులు ‘కొచ్చి వాటర్ మెట్రో లిమిటెడ్’లో ట్రెయినీలుగా నియమితులయ్యారు. ఫెర్రీలలో అసిస్టెంట్లుగా సేవలు అందిస్తున్న వీరు సంవత్సరం తర్వాత పూర్తిస్థాయి పైలట్లుగా విధులు నిర్వర్తిస్తారు. జనరల్ పర్పస్ రేటింగ్ (జిపిఆర్) కన్వర్షన్ కోర్సు పూర్తి చేసిన వారికే ఈ ఉద్యోగం దొరుకుతుంది. కేరళలో ఈ కోర్సు లభ్యమవుతోంది. కొల్ల్లంకు చెందిన అరుణిమ, తిరువనంతపురంకు చెందిన లక్ష్మి, అలెప్పికి చెందిన స్నేహ వివిధ ఇంజినీరింగ్ డిప్లమాలు చేశాక ఫెర్రీ పైలెట్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపారు. అయితే జేపీఎస్ కోర్సు పూర్తి చేశాకనే వారికి ట్రెయినీలుగా అవకాశం వస్తుంది. ఆ కోర్సును కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడంతో ట్రెయినీ పైలట్లు నియమితులయ్యారు.75 ఫెర్రీలు 33 వేల పాసింజర్లుకొచ్చి చుట్టూ లంక గ్రామాలు ఉన్నాయి. కొచ్చిలో కూడా ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడానికి మైట్రో రైలు ఉన్నా ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. దీంతో ఫ్రభుత్వం దాదాపు లక్షా పదమూడు వేల కోట్ల ఖర్చుతో వాటర్ మెట్రో సర్వీసును మొదలెట్టింది. ఇందులో భాగంగా 75 హైబ్రీడ్ ఫెర్రీలు అందుబాటులోకి రానున్నాయి. వీటి రాకపోకల కోసం 38 జెట్టీలు నిర్మించారు, 15 రూట్లు ఖరారు చేశారు. దీంతో 33 వేల మంది పాసింజర్లకు మేలు జరుగుతుంది. టికెట్ 20 రూపాయల నుంచి 40 రూపాయలు ఉంటుంది. 100 మంది పాసింజర్లున్న ఫెర్రీ గరిష్టంగా 23 కిలోమీటర్లు గంటలో ప్రయాణిస్తుంది.పురుష ప్రపంచంలో మహిళా సారథులుకేరళలో టూరిజం కోసం ఉపయోగించే హౌస్బోట్లు, ఇతర ఫెర్రీలలోగాని పురుషులే డ్రైవర్లుగా ఉంటారు. మెట్రో ఫెర్రీలలో కూడా పురుష పైలట్లే ఉన్నారు. కాని స్త్రీలు ఈ ఉపాధిలో తప్పక ఉండాలని ప్రభుత్వం ఈ ప్రయత్నం చేసింది. ‘మేము విధులు నిర్వర్తిస్తుంటే అందరూ మా యూనిఫామ్‌లు చూసి మెచ్చుకోలుగా మాట్లాడుతున్నారు’ అంటుంది అరుణిమ. ‘ఉద్యోగంలోకి బెరుగ్గా అడుగుపెట్టాను. కాని మెట్రో ఉద్యోగులు నా బెరుకును కొద్ది రోజుల్లోనే పోగొట్టారు. మేము కలిసి పని చేసే ఒక వాతావరణం ఇక్కడ ఉంది’ అంది లక్ష్మి. ‘ఫెర్రీ పైలట్ అంటే ఫెర్రీని నడపడమే కాదు... క్రౌడ్‌ను కూడా మేనేజ్ చేయాలి. ఫెర్రీ కదులుతుంటే కొంతమంది అంచుల్లో నిలబడతారు. వారిని హెచ్చరించాలి’ అంటుంది స్నేహ. ‘మొదటిసారి మేము ఫెర్రీ లోపలికి వచ్చి చూస్తే ఇదో షిప్పేమో అనిపించేంత ఆధునికంగా ఉంది. అన్ని సాంకేతిక రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో వైఫై కనెక్టివిటీ ఉంటుంది. సీటింగ్ ఏరియా అంతా ఏసి ఉంటుంది’ అని తెలిపింది అరుణిమ.విమానాలు, మెట్రో రైళ్లు, మైట్రో ఫెర్రీలు.... దూసుకుపోతున్న మహిళలకు అభినందనలు. -
చంద్రబాబు సర్కార్‌పై న్యాయ పోరాటం చేస్తా: గజ్జల లక్ష్మి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఉన్మాదం పరాకాష్టకు చేరింది. ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవి నుంచి గజ్జల లక్ష్మీని తొలగిస్తూ సర్కార్ అత్యవసర మెమో జారీ చేసింది. పదవీకాలం గత నెలతో ముగిసిందంటూ మెమో ఇచ్చింది. 2026 మార్చి 15 వరకు పదవీకాలం ఉన్నా ఆమె పదవిని అర్ధాంతరంగా తొలగిస్తూ కూటమి ప్రభుత్వం మోమో జారీ చేసింది. కూటమి ప్రభుత్వం తీరుపై గజ్జల లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించడంపై న్యాయ పోరాటం చేస్తానని గజ్జల లక్ష్మీ తెలిపారు.మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేదు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ వలంటీర్లు ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ‘లడ్డూ’ వెనుక బాబు మతలబు ఇదేనా?.. ఏదో తేడా కొడుతోంది -
‘భాషా’..! ఒక్క ప్రశ్న కాదు.. వందైనా ఓకే!
కేవలం 250 మంది మాట్లాడే భాష పేరు చెప్పగలరా? దాని నిర్మాణం ఏమిటి? ఎలా మాట్లాడుతారు, ఎలా రాస్తారో చెప్పగలరా? కొన్ని గంటల్లోనే ఆ భాషను అనువదించగలరా? ‘కష్టం’ అనేవాళ్లే ఎక్కువ. కాని కొందరు ఇష్టంగా ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్నారు. మన దేశం తరఫున ఈ పోటీలో పాల్గొన్న లక్ష్మీ, అనిమికా దత్తాలు పతకాలు గెలుచుకున్నారు...ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు, భాషాశాస్త్ర నిపుణులను ఒకచోట చేర్చే అంతర్జాతీయ పోటీ. 2003లో ఇది మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల వ్యాకరణం, నిర్మాణం, సంస్కృతి, చరిత్రను విశ్లేషించడానికి, పజిల్స్‌ను సాల్వ్ చేయడం ద్వారా భాష సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ పోటీ అవకాశం కల్పిస్తుంది. సృజనాత్మకత, ఊహాశక్తిని మెరుగుపరచడానికి ఈ పోటీ ఉపకరిస్తుంది. భవిష్యత్తు భాషాశాస్త్ర నిపుణులను తయారుచేస్తుంది.‘భాష లేదా భాషాశాస్త్రంపై లోతైన పరిజ్ఞానం అవసరం లేదు. అత్యంత సవాలుతో కూడిన సమస్యలకు కూడా తార్కిక సామర్థ్యంతో, ఓపికతో పరిష్కారం కనుక్కోవచ్చు’ అంటుంది ఐవోఎల్. పోటీలో పాల్గొన్న వారికి ఇన్‌ఫుట్స్ ఇస్తారు. వాటి ఆధారంగా పజిల్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది.ఈ సంవత్సరం ‘ఐవోఎల్’కు బ్రెజిల్ ఆతిథ్యం ఇచ్చింది. ఈ పోటీలో 38 దేశాల నుంచి 51 టీమ్‌లు పాల్గొన్నాయి. బ్రెజిల్ రాజధాని బ్రజిలియాలో జరిగిన 2024 ఇంటర్నేషనల్ లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్(ఐవోఎల్)లో మన దేశానికి చెందిన అనిమికా దత్తా ధర్, శ్రీలక్ష్మీ వెంకట్రామన్, ఫరాజ్ సిద్దిఖీ, అనన్య అగర్వాల్‌లు అద్బుత ప్రతిభాసామర్థ్యాలను ప్రదర్శించారు.‘ఐవోఎల్ వెబ్సైట్లో గత ఒలింపియాడ్‌లో వచ్చిన ్రపాబ్లమ్స్ను సాల్వ్ చేస్తూ ్రపాక్టీస్ చేశాను’ అంటుంది పద్నాలుగు సంవత్సరాల శ్రీలక్ష్మీ. బెంగళూరులోని జైగోపాల్ రాష్ట్రీయ విద్యాకేంద్రలో చదువుతున్న శ్రీలక్ష్మీ ఐఐటీ కాన్పూర్ విద్యార్థి ఫరాజ్ సిద్దిఖీతో కలిసి కాంస్య పతకం సాధించింది. పదిహేడు సంవత్సరాల అనిమికా దత్తా ఈ ఒలింపియాడ్‌లో రజత పతకం గెలుచుకుంది. అనిమిక చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టిట్యూట్ విద్యార్ధి. తృటిలో పతకం చేజార్చుకున్న అనన్య పతకం సొంతం చేసుకోకపోయినా బోలెడు ప్రశంసలు అందుకుంది.ఈ ఒలింపియాడ్‌లో పాల్గొన్న మన బృందానికి మైండ్–బ్లోయింగ్ వర్డ్ పజిల్స్ సవాలు విసిరాయి. ఇచ్చిన వ్యవధి ఆరు గంటలు. కొరియాక్(రష్యా), హడ్జా(టాంజానియా), కొమ్టో(పపువా న్యూ గినియా), దావ్ (బ్రెజిల్), యానువ్యవా(ఆస్ట్రేలియా)లాంటి మారుమూల భాషలకు సంబంధించిన పజిల్స్ ఇచ్చారు. ‘భాష నుంచి చారిత్రక సందర్భాలను నిర్వచించవచ్చు’ అంటున్న అనిమిక పపువా న్యూ గినియాకు చెందిన ఎన్డు భాషతో పాటు చారిత్రక విషయాల గురించి కూడా మాట్లాడగలదు. భాషాశాస్త్రం లోతుపాతుల గురించి పెద్దగా తెలియని అనిమిక ఆ శాస్తంపై ఆసక్తి పెంచుకోవడానికి పజిల్స్ కారణం.‘లింగ్విస్టిక్స్ ఒలింపియాడ్‌లో పాల్గొనడం వల్ల కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యం పెరుగుతుంది’ అంటుంది శ్రీలక్ష్మి. ‘నా సాంస్కృతిక నేపథ్యమే నాకు స్ఫూర్తి’ అంటుంది అనన్య అగర్వాల్. ‘ఐవోఎల్’ బ్రెయిన్టీజర్ ఫీచర్లు సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఆ సంస్కృతి తెలియకపోతే పజిల్స్ పరిష్కరించడం కష్టం. ఉదాహరణకు ఈ సంవత్సరం ఫ్యామిలీ ట్రీ ఇచ్చారు. ఫరెమ్ ప్రజల గురించి తెలియకపోతే ఆ సమస్య పరిష్కరించలేము. ఫరెమ్ అనేవాళ్లు కొమ్జో భాష మాట్లాడే ప్రజలు. వివాహనికి సంబంధించిన వీరి ఆచారవ్యవహారాలు ఆసక్తిగా ఉంటాయి. ‘ఒకటి కంటే ఎక్కువ భాషల్లో ప్రవేశం అనేది సూక్ష్మస్థాయిలో విశ్లేషణకు, సృజనాత్మకంగా ఆలోచించడానికి ఉపకరిస్తుంది’ అనే విషయాన్ని ‘ఐవోఎల్’ పోటీలు చెప్పకనే చెబుతున్నాయి. బహు భాషలపై ఆసక్తి పెంచుకోవడానికి ప్రేరణను ఇస్తున్నాయి.మరింత సులువుగా...ఒక భాషకు సంబంధించిన వాక్యనిర్మాణం, వ్యాకరణం, ధ్వనులు... మొదలైన వాటిపై భాషాశాస్త్రం పనిచేస్తుంది. భాషాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తి ఊపందుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రధాన కారణం. జీపీటి–4, క్లాడ్, జెమినిలాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం) ఇందుకు ఉదాహరణ. మనిషి ఇచ్చే ఇన్పుట్స్, కమాండ్స్‌కు మెషిన్ అర్థం చేసుకోవడానికి మధ్య అంతరాన్ని పూడ్చడానికి నేచురల్ లాంగ్వేజ్ ్రపాసెసింగ్ సిస్టమ్స్ (ఎన్ఎల్పీ) అవసరం. ఎక్కువ సంఖ్యలో భాషాశాస్త్రవేత్తలు ‘ఎన్ఎల్పీ’ రిసెర్చ్‌లో భాగం అయితే సహజత్వ ప్రక్రియ మరింత సులువు అవుతుంది.ఇవి చదవండి: ఉన్నది ఒకటే.. 'జిమ్'దగీ..! -
‘ఆమె ముందు చేతులు కట్టుకోవాలి.. చైర్లో కూర్చోకూడదు’
ఆమె ఎమ్మెల్యే కాదు.. కనీసం సర్పంచ్ కూడా కాదు. కానీ, ఆమె ముందు ఎంత పెద్ద అధికారి అయినా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఏ అధికారైనా తన కుర్చీ ఆమెకి ఇచ్చేసి.. మీ దయ అంటూ ఆమె ఎదురుగా సదరు అధికారి నిల్చోవాల్సిందే లేదంటే కూర్చోవాల్సిందే. దీంతో, ఈ వ్యవహారం పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు? అనుకుంటున్నారా..ఇక్కడ.. కుర్చీలో కూర్చొని దర్జాగా ఆదేశాలు జారీ చేస్తున్న ఈమె గొట్టిపాటి లక్ష్మీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మీ ఓడిపోయారు. అయితే, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయానా అన్న కూతురు. అందుకే కాబోలు మా బాబాయి మంత్రి అనుకున్నారేమో .. దర్శి నియోజకవర్గంలో టీడీపీ ఇంఛార్జీగా ఉన్న ఆమె నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నారు. తానే ఎమ్మెల్యే అన్నట్టుగా అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారు.దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏకంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ చైర్లోనే ఆమె కూర్చుంటే ఆయన మాత్రం వినయంగా గొట్టిపాటి లక్ష్మీ ఎదురుగా ప్లాస్టిక్ చైర్లో కూర్చొని వినయం ప్రదర్శించాడు. ఎమ్మెల్యే లెవెల్లో అధికారులుపై పెత్తనం చేశారు. ప్రజల బాగుకోసం ఆసుపత్రిని సందర్శిస్తే తప్పులేదు. కానీ, ఏకంగా సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఆయనను అవమానించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆమె ప్రవర్తన తీరును చూసి ఆసుపత్రి సిబ్బంది కూడా విస్తుపోయారు. మరోవైపు.. కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి దర్శిలో గొట్టిపాటి లక్ష్మీ, ఆమె బంధు వర్గం చేస్తున్న ఓవరాక్షన్‌పై నియోజకవర్గంలోని ప్రజలు మండిపడుతున్నారు. -
తెల్లారితే గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం
విడపనకల్లు : తెల్లారితే నూతన గృహ ప్రవేశం.. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పాత మిద్దె కూలి భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం హావళిగి ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కోనప్పగారి మారెప్ప(42), లక్ష్మి(38) దంపతులు. వీరికి అంజి, హేమంత్ అనే ఇద్దరు కుమారులు, కుమార్తె మానస(మూగ) ఉన్నారు. మారెప్ప పెద్దలు దాదాపు 60 ఏళ్ల క్రితం మట్టితో కట్టించిన ఇంట్లోనే ఉండేవారు. అయితే.. భార్యాభర్త కాయాకష్టం చేసుకుని సంపాదించిన డబ్బుతో ఇటీవల నూతన గృహాన్ని నిరి్మంచుకున్నారు. ఆదివారం గృహ ప్రవేశం పెట్టుకున్నారు. కాగా, శనివారం రాత్రి భారీ గాలులతో కూడిన చిన్నపాటి వర్షం కురిసింది. రోజూ మాదిరిగానే మారెప్ప, లక్ష్మి దంపతులు కుమార్తెతో కలసి పాత మట్టి మిద్దెలో పడుకున్నారు. వీరితో పాటు లక్ష్మి తమ్ముడు రాము కూడా అదే ఇంట్లో నిద్రించాడు. ఇద్దరు కుమారులు మాత్రం ఇంటి ఆరుబయట మంచంపై పడుకున్నారు. వర్షానికి తడిసిన కారణంగా మట్టి మిద్దె ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. పెద్ద శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఉలిక్కి పడి లేచారు. మారెప్ప ఇల్లు కూలిపోయిందని గమనించి అరుపులు, కేకలు వేయడంతో కాలనీవాసులంతా వచ్చి మట్టి కింద పూడుకునిపోయిన వారిని వెలికి తీశారు. అప్పటికే మారెప్ప, భార్య లక్ష్మి ప్రాణాలు విడిచారు. కుమార్తె మానసకు చేయి విరిగింది. రాముకు చేతులు, వేళ్లు విరగడంతో పాటు తలకు బలమైన గాయమైంది. గాయపడిన వారిని 108లో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ఘటనపై ఎస్ఐ ఖాజా హుస్సేన్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు ఉరవకొండ ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి కోరారు. -
టీడీపీ దర్శి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు
దర్శి: ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శి మండలంలో జరిగిన పలు ఘటనల్లో 6 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ సుమన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు..బొట్లపాలెంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ గ్రామంలో పోలింగ్ ఆపాలని నిబంధనలకు విరుద్ధంగా ధర్నాకు దిగిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు ధర్నా చేసిన వారి వివరాలు తెలుసుకుని కేసులు నమోదు చేయనున్నారు. దర్శిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఎంఈవో కార్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం పగులకొట్టిన టీడీపీ నేత వీసీ రెడ్డి పై కేసు నమోదైంది. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకోగా కళ్లు తిరుగుతున్నాయని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు కళ్లుగప్పి వీసీ రెడ్డి పరారయ్యాడు. పోలీసుల వైఫల్యంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వీసీ రెడ్డి కోసం పోలీసులు వెతుకుతున్నారు. పట్టణంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద పోలింగ్ బూత్ వద్ద అల్లర్లు సృష్టించి పోలీసులపై రాళ్లు రువ్విన కేసులో దారం సుబ్బారావు పై కేసు నమోదు చేశారు. రాళ్లు రువ్విన వారి వీడియోలు పరిశీలించి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ చెప్పారు. బొట్లపాలెంలో జరిగిన గొడవల్లో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదులపై 2 కేసులు నమోదు చేసి ఇరువర్గాలపై కలిపి 22 మంది పై కేసులు నమోదు చేశారు. దేవవరంలో వైఎస్సార్సీపీకి చెందిన కిష్టిపాటి నాగిరెడ్డిని శేషంవారిపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు దేవవరం వచ్చి తల పగులగొట్టిన కేసులో సానె గురువయ్య, సానె వీరాంజనేయులు, ఎ.నరసింహారావు, ఎస్.శ్రీను, అచ్చయ్య, ముత్యాల నరశింహంపై కేసు నమోదు చేశారు. -
మంచి మాట: నోరు మంచిదైతే...
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అంటారు పెద్దలు. నోరు చేసే పనులు రెండు ఉన్నా, ఎక్కువగా మాట్లాడటం అనే అర్థంలోనే ప్రయోగిస్తూ ఉంటారు. మంచిది అంటే బాగా అందంగా ఉంది అని కాదు అర్థం. మాట మంచిదై ఉండాలి అని అర్థం. అప్పుడు ఊరు అంటే చుట్టుపక్కలవారు కూడా ఆ వ్యక్తితో మంచిగా ఉంటారు. ఆత్మీయంగా ప్రవర్తిస్తారు. అవసరానికి ఆదుకుంటారు.మంచి మాటలే ఎందుకు?ఒక మాట ఉచ్చరించటానికి కొన్ని ధ్వనులు చేయవలసి ఉంటుంది. ధ్వని తరంగాల రూపంలో ఉంటుంది. ధ్వని తరంగాలకి వాతావరణాన్ని, తద్వారా మనస్సుని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. మంచి మాటలని ఉచ్ఛరించేప్పుడు వెలువడే ధ్వని తరంగాలు సానుకూల ప్రకంపనలని కలిగించి, వాతావరణాన్ని అనుకూలంగా ఉండేట్టు చేస్తాయి. అందుకే బాధలో ఉన్న వారికి ఓదార్పు మాటలు పలకగానే కాస్త ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది.ఏ భాషలో అయినా అన్నిమాటలూ మంచివే! మంచివి కానివి కూడా ఉంటాయా? సందర్భాన్ని బట్టి, మాట్లాడిన తీరుని బట్టి, ముఖకవళికలని బట్టి మాట మంచిదా? కాదా? అని నిర్ణయించబడుతుంది. నిజానికి అన్ని సందర్భాలూ అందరికీ అనుకూలంగా ఉండవు. సద్దుకుపోవటానికి కూడా కుదరదు. కోపం పెల్లుబుకుతూ ఉంటుంది. తనకు ఆ విషయం నచ్చలేదు అని నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా చెప్పవచ్చు. కానీ, ఆ చెప్పటంలో కోపాన్ని వ్యక్తపరచే అసభ్యపదాలు వాడకూడదు. తప్పు చేసిన వ్యక్తి గురించి పెద్దగా పదిమందికి తెలియదు. కానీ, నోరు చేసుకున్న వ్యక్తి వాడిన పదజాలం ప్రచారమై మనిషి పైన చులకన భావాన్ని కలిగిస్తుంది. కనుక చెప్పే విషయం ఎట్లాంటిదైనా భాషను స్వరాన్ని కొద్దిగా అదుపులో ఉంచుకోగలిగితే తనను, ఎదుటివారిని జయించినట్టే! ‘‘మీరు చేసిన పని ఏ మాత్రం సరైనది కాదు. మీ వంటి తెలివైన వారు ఇట్లా చేయవచ్చా?’’ అని చెప్పిన దానికి ‘‘నువ్వు చేసిన పని ఛండాలంగా ఉంది. బుద్ధి ఉన్నవాడు ఇట్లా చేస్తాడా?’’ అన్నదానికి ఎంత తేడా ఉంది! దీనిని మనం కోర్టులో చేసే వాదనల్లోగమనించవచ్చు. ప్రతిపక్ష న్యాయవాది పరమమూర్ఖుడు అని తెలిసినా ‘‘మై లెర్న్డ్ ఫ్రండ్’’ అని మాత్రమే సంబోధిస్తారు. కొంతమంది మంచి విషయం చెప్పినా ఏదో తిట్టినట్టో, కొట్టినట్టో ఉంటుంది. ప్రేమగా మాట్లాడినా విసుక్కున్నట్టే ఉంటుంది. ఎంత గట్టిగా మాట్లాడినా మనసు మంచిదైతే, ఉద్దేశం సవ్యమైనదయితే, చెడ్డమాట కాకపోతే తోటివారికి సహాయం చేసే స్వభావం కూడా ఉంటే మంచివారుగానే పరిగణించబడతారు వారిని గురించి తెలిసినవారి చేత.‘‘గొంతు పెద్దది గాని మనసు వెన్న’’ అంటారు. కొంతమంది ఊతపదంగా అసభ్యపదాలు వాడేస్తూ ఉంటారు. వినటానికి ఇబ్బందిగా ఉంటుంది. వాతావరణాన్ని ప్రతికూలంగా చేస్తాయి. మరికొంత మంది నోటి నుండి పొరపాటున కూడా ఒక్క మంచిమాట రాదు. ఎంతసేపు ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటారు.. మనస్సులో దురుద్దేశం ఉండవచ్చు ఉండక పోవచ్చు. అదీ చికాకే. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు, వెళ్ళిన తరువాత కూడా ఏదో అశాంతిగా అనిపిస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళి, ఆ వ్యాధి ఎంత భయంకరమైనదో, ఎంతమందిని పొట్టన పెట్టుకున్నదో ఏకరవు పెట్టి ఆ ఇంటివారందరి మనస్సులలో దిగులు నింపుతారు. మరికొందరు ఆ వ్యాధి నుండి బయట పడిన వారి వివరాలు చెప్పి మనస్సులలో ఆశలని చిగురింప చేస్తారు. విషయమేదైనా మంచిగా, వింటున్నవారికి సంతోషం కలిగేట్టు మాట్లాడితే వచ్చే నష్టమేముంటుంది? ముఖ్య గమనిక: అది అసత్యం కాకూడదు. – డా. ఎన్. అనంతలక్ష్మి -
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
Book Fair: వెలుగులు విరజిమ్మనీ
-
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
ఆమె మాటలకు షాకయ్యా.. అంతా ఆ రోజు రాత్రే: నటి మాజీ భర్త షాకింగ్ కామెంట్స్
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటి లక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు హీరోయిన్గా దక్షిణాది సినిమాల్లో మెప్పించింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆమె హీరోయిన్గా నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ తనదైన నటనతో మెప్పించారు. అయితే ఆమె నటనతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె మాజీ భర్త, తమిళ నటుడు మోహన్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. లక్ష్మి, మోహన్ శర్మ జంటగా చాలా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వీరి పరిచయం ప్రేమగా మారి.. 1975లో వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన ఐదేళ్లకే భేదాభిప్రాయాలు రావడంతో 1980లోనే విడిపోయారు. తాజా ఇంటర్వ్యూలో లక్ష్మి తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్లి చేసుకుంటే జీవితాంతం కుక్కలా నీ వెంటే ఉంటానని తనతో చెప్పిందని మోహన్ శర్మ వెల్లడించారు. మోహన్ శర్మ మాట్లాడుతూ.. 'ఓసారి నేను, లక్ష్మి షాప్‌కు వెళ్లాం. అక్కడ ఒక సెంట్ కొనాలని చెప్పా. అప్పట్లో దాని ధర రూ.500. జీవితంలోకి ఆహ్వానిస్తే.. నీ కుక్కలా ఉంటానని లక్ష్మి నన్ను అడిగింది. ఆ మాటలకు నేను షాకయ్యా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. తొలిసారి ఓ అమ్మాయి తన ప్రేమను వ్యక్తం చేసింది. ఆ సమయంలో లక్ష్మి మాటలను సీరియస్‌గా తీసుకున్నా. ఆ తర్వాత కాల్ చేసి తన రూమ్‌కు రమ్మని పిలిచింది. నేను వెంటనే హోటల్‌కు వెళ్లా. మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది. ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి పెడుతున్నానని.. పెళ్లి గురించి ఆలోచనే లేదని చెప్పా. కానీ.. పెళ్లి చేసుకోవాలని లక్ష్మి అడిగాక నేను ఆమె నుదుటన కుంకుమ పెట్టా. తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చా. ఆ రాత్రే మేం భార్యభర్తలం అయ్యాం. ఆ తర్వాత మేం చెన్నైకి వచ్చి లాయర్ ద్వారా మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం' అని చెప్పారు. పెళ్లి తర్వాత మాకు కలిసే అవకాశం చాలా తక్కువగా ఉండేదని మోహన్ శర్మ తెలిపారు. అయితే లక్ష్మి చాలా తప్పులు చేశారని.. వాటన్నింటి గురించి తాను ఇప్పుడు చెప్పలేనని అన్నారు. ఆమె తన జీవితంలోకి మరో వ్యక్తిని రానిచ్చారని ఆరోపించారు. కూతురు ఐశ్వర్య, లక్ష్మి మధ్య తరచూ గొడవలు కూడా అయ్యేవని ఆయన వెల్లడించారు. కాగా.. 1980లో మోహన్‌తో విడాకులు తీసుకున్న లక్ష్మి.. ఆ తర్వాత దర్శకుడు శివచంద్రన్ను పెళ్లి చేసుకున్నారు. -
బౌద్ధ శిల్పకళ కాలచక్ర మహా మండలంగా విగ్రహ పీఠం
-
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేత
మాడుగుల రూరల్: ఇటీవల విజయనగరం జిల్లా కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు గురువారం అందజేశారు. ప్రమాదంలో అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలు గ్రామానికి చెందిన ముర్రు లక్ష్మి (52) ఆదివారం రాత్రి రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పరామర్శించి రూ.10 లక్షల చెక్కును అందజేశారు. -
నీ కోసం కథలు రాసి
‘ఇంటి మూలన వంట గది’ ‘అడవిలో హరిణి’ ‘సంధ్య వెలుతురు’... సి.ఎస్.లక్ష్మి అనే చిత్తూరు సుబ్రహ్మణ్యం లక్ష్మి కథల సంపుటాల పేర్లు ఇవి. ‘అంబై’ కలం పేరుతో తమిళంలో స్త్రీల పారంపరిక బంధనాలను ప్రశ్నించే కథలు రాస్తున్న సి.ఎస్.లక్ష్మికి ప్రతిష్టాత్మక ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అవార్డు’ ఈ సంవత్సరానికి ప్రకటించారు. ‘స్పారో’ అనే సంస్థను స్థాపించి మహిళా సాహిత్యకారుల చరిత్రను నిక్షిప్తం చేస్తున్న లక్ష్మి పరిచయం... ఆలోచనలు... ‘నన్ను మహిళా రచయిత అని ప్రత్యేకంగా పిలవొద్దు. పురుషులు ఏం రాసినా వారిని పురుష రచయిత అంటున్నారా? మమ్మల్ని మాత్రం మహిళా రచయితలు అనడం ఎందుకు? మమ్మల్ని కూడా రచయితలు అనే పిలవండి’ అంటారు సి.ఎస్.లక్ష్మి. ‘అంబై’ కలం పేరుతో తమిళ పాఠకులకు సుదీర్ఘకాలంగా అభిమాన రచయిత్రిగా ఉన్న సి.ఎస్.లక్ష్మి ఒకటీ రెండు నవలలు రాసినా ఎక్కువగా అంకితమైంది కథలకే. అదీ స్త్రీల కథలకి. తమిళంలో స్త్రీవాద దృక్పథంతో రాసి ఒక కదలిక తేగలిగిన రచయితల్లో సి.ఎస్.లక్ష్మి ప్రముఖులు. సుదీర్ఘ కాలంగా తాను ఆశించిన స్త్రీ వికాసం కోసం కలాన్ని అంకితం చేయడం వల్లే ఆమెకు ‘టాటా లిటరేచర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ 2023 సంవత్సరానికి ప్రకటించారు. టాటా సన్స్ ప్రతినిధి హరీష్ భట్ ఈ విషయాన్ని తెలియచేస్తూ ‘స్త్రీలు తాము మోయక తప్పని మూసలను లక్ష్మి తన కథల ద్వారా బద్దలు కొడుతూనే వచ్చారు’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గతంలో అందుకున్న వారిలో వి.ఎస్.నైపాల్, మహాశ్వేతా దేవి, రస్కిన్ బాండ్, గిరిష్ కర్నాడ్ తదితరులు ఉన్నారు. ఊరు కోయంబత్తూరు కోయంబత్తూరులో జన్మించిన అంబై ఢిల్లీలోని జె.ఎన్.యు నుంచి పిహెచ్.డి పట్టా పొందారు. తమిళనాడులో అధ్యాపకురాలిగా పని చేస్తూ కథలు రాశారు. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ విష్ణు మాథూర్‌ని వివాహం చేసుకుని తర్వాతి కాలంలో ముంబైలో స్థిరపడ్డారు. 18 ఏళ్ల వయసులో తొలిసారి పిల్లల కోసం ‘నందిమలై చరలిలె’ (నందిమల కొండల్లో) అనే డిటెక్టివ్ నవలతో ఆమె రచనా జీవితం మొదలైనా 1967లో రాసిన ‘సిరగుగల్ మురియుమ్’(రెక్కలు విరిగిపోతాయి) అనే కథతో సిసలైన బాట పట్టారు. స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీవాద దృక్పథం గురించి తమిళంలో తొలిసారి గొంతు విప్పిన రచయిత్రి ఆమేనని విమర్శకులు అంటారు. సంప్రదాయం, ఆచారాలు మహిళల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అణచివేస్తున్నాయో ఆమె తన కథల్లో వివరించే ప్రయత్నం చేశారు. తప్పక చదవాల్సిన తమిళ కథల్లో అంబై రాసిన ‘వీట్టిన్ మూలై ఒరు సమేలరై’, ‘అమ్మా ఒరు కొలై సెయ్దల్’, ‘కరుప్పు కుదిరై చతుక్కుమ్’ కథలు ఉంటాయని రచయిత జయమోహన్ పేర్కొన్నారు. 2021లో అంబైకు సాహిత్య అకాడెమీ పురస్కారం దక్కింది. కలం పేరు వెనుక కథ తన కలం పేరు ‘అంబై’గా మార్చుకోవడానికి వెనకున్న కథను గతంలో వెల్లడించారామె. శుక్రవారం పుట్టే ఆడపిల్లలకు ‘లక్ష్మి’ అనే పేరు పెడతారని, తనకూ అదే పేరు పెడితే ఆ పేరుతోనే కథలు రాయాలపించలేదని చెప్పారు. తమిళ సీనియర్ రచయిత దేవన్ రాసిన ‘పార్వతిన్ సంగల్పం (పార్వతి సంకల్పం)’ నవలలో భర్త చేత అణచివేతకు గురైన ఓ భార్య తన పేరును అంబైగా మార్చుకొని రాయడం మొదలు పెడుతుందని, అదే తనకు స్ఫూర్తినిచ్చి కలం పేరును అంబైగా మార్చుకున్నానని తెలిపారు. సాహితీ కార్యకర్త సి.ఎస్.లక్ష్మి కేవలం రాయడమే కాదు చాలా సాహితీ కార్యక్రమాలు చేస్తారు. తమిళంలో మహిళా సాహిత్యం గురించి ఆమె చేసిన పరిశోధన ముఖ్యమైనది. 1994లో చెన్నైలో స్థాపించిన రోజ ముత్తయ్య రీసెర్చ్ లైబ్రరీ ఏర్పాటు వెనుక అంబై కీలకంగా నిలిచారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రైవేటు లైబ్రరీల్లో ఇదీ ఒకటి కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు లక్షల పుస్తకాల దాకా ఉన్నాయి. అలాగే 1988లో SPARROW (Sound and Picture Archives for Research on Women) అనే ఎన్జీవో ప్రారంభించారు. మహిళా రచయితలు, మహిళా కళాకారుల రచనలు, ప్రతిభ, వారి కృషిని డాక్యుమెంట్ చేయడం, నిక్షిప్తం చేయడం ఆ సంస్థ లక్ష్యం. ప్రస్తుతం ఆమె ఆ సంస్థకు అధ్యక్షురాలిగా ఉన్నారు. తన సంస్థ తరఫున అనేక పుస్తకాలు ప్రచురించారు. -
కువైట్ బాధితురాలికి విముక్తి
కడప కార్పొరేషన్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పళంగికి చెందిన గరికపాటి లక్ష్మికి కువైట్‌లో సేఠ్ వేధింపుల నుంచి విముక్తి లభించింది. ఏపీఎన్ఆర్టీఎస్ సాయంతో ఆమె సురక్షితంగా ఇండియాకు చేరింది. గరికపాటి లక్ష్మి 8 నెలల కిందట జీవనోపాధి కోసం కువైట్ వెళ్లింది. కువైటీ ఇంట్లో పెట్టే బాధలు భరించలేక భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అయితే అక్కడ ఎవరిని కలవాలో, ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో ఉన్న సమయంలో ఏపీఎన్ఆర్టీస్ సామాజిక కార్యకర్త రెడ్డెయ్య రెడ్డి ఆమెతో మాట్లాడి అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులను తెలుసుకున్నారు. కువైట్ ఇమ్మిగ్రేషన్, ఎంబసీ పనులు పూర్తయ్యేందుకు నెల సమయం పట్టింది. 30 రోజుల పాటు ఏపీఎన్ఆర్టీఎస్ రీజనల్ కో ఆర్డినేటర్ భోజన, వసతి సౌకర్యాలు కల్పించడమేగాక విమాన టికెట్, దారి ఖర్చుల కింద రూ.13 వేలు సాయం చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున 4.05 గంటలకు కువైట్ నుంచి బయలుదేరిన ఆమె మధ్యాహ్నం 2.35 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ సీఎంవైఎస్ జగన్ సారథ్యంలో గల్ఫ్‌లోని ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తున్న ఏపీఎన్ఆర్టీఎస్ వారికి రుణపడి ఉంటానని చెప్పారు. -
'ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం'..! రెండ్రోజులుగా.. బిక్కు బిక్కుమంటూ..
కరీంనగర్: ‘ఇక్కడ ఉండు.. ఇప్పుడే వస్తాం’ అని చెప్పి ఓ మహిళను వదిలేసి వెళ్లిన సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఐబీ రోడ్డులో చోటు చేసుకుంది. సదరు మహిళ రెండు రోజులుగా దిక్కుమొక్కు లేక చలిలో..వానలో వాటర్ ట్యాంక్ కింద ఉండి తనవాళ్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె దీనస్థితి అందరినీ కలచివేసింది. వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం కొందరు ఆటోలో వచ్చి ఐబీ రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర అనారోగ్యంతో ఉన్న మహిళ(45)ను వదిలేసి వెళ్లారు. అదే ఏరియాలో ఉండే మైనార్టీ యూత్ యువకులు అబుబకర్, షోయబ్ రెండు రోజులుగా వాటర్ ట్యాంక్ కింద ఉన్న మహిళను గుర్తించి ప్రశ్నించగా తనను రెండు రోజుల క్రితం తమవాళ్లు ఆటోలో తెచ్చి ఇక్కడ వదిలేశారని చెప్పింది. దీంతో ఆమె అనారోగ్య పరిస్థితిని గుర్తించిన యువకులు.. వెంటనే వార్డు కౌన్సిలర్ పేర్ల సత్యంకు సమాచారం ఇచ్చారు. స్పందించిన వార్డు కౌన్సిలర్ సత్యం.. సోమవారం రాత్రి అక్కడికి వచ్చి అనారోగ్యంతో పడిఉన్న మహిళ వివరాలు తెలుసుకున్నారు. తన పేరు మిర్యాల లక్ష్మి అని, తనది నిజామాబాద్ జిల్లా అని, తమవాళ్లు తనను ఇక్కడ వదిలేసి వెళ్లారని అస్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. కాగా ఆమె చేయిపై విజయ అని పచ్చబొట్టు ఉందని కౌన్సిలర్ పేర్ల సత్యం చెప్పారు. అనారోగ్యంతో ఉన్నసదరు మహిళను యూత్ ప్రతినిధులు అబుబకర్, షోయబ్‌తో కలిసి కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆ తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ సరైన సమాధానాలు చెప్పకపోగా ఆమె కాలుకు తీవ్రమైన గాయంతో పుండు ఉన్నట్లుగా గుర్తించిన వైద్యులు.. ఆమెకు ప్రాథమిక చికిత్స చేయించి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
పలుకుబడి కోసం.. పక్కా ప్లాన్ తో.. మర్డర్!
మహబూబ్‌నగర్: తనకు ఎదురు తిరగడమేగాక కులంలో తక్కువ చేసే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తిని కర్రతో చితకబాది అంతమొందించిన నిందితుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రమేశ్‌బాబు వెల్లడించారు. బాదేపల్లి పాతబజార్‌కు చెందిన మీనుగ బాలయ్య(30) నిందితుడు మీనుగ బాలస్వామి వరుసకు సోదరులు. అయితే బాలయ్య కొంతకాలంగా కోళ్లను దొంగిలించి అమ్ముకుని మద్యం తాగేవాడు. దీంతో కోళ్ల యజమానులు మీనుగ బాలస్వామికి ఫిర్యాదు చేయడంతో పలుమార్లు తమ్ముడిని మందలించాడు. అయినా దొంగతనం మానకపోవడంతోపాటు తన కోళ్లను సైతం దొంగిలించాడు. తన కోళ్లను ఎందుకు దొంగిలించావని, కోళ్ల దొంగతనం ఆపాలని హెచ్చరించగా ఎదురుతిరిగాడు. తనకు బాహాటంగా ఎదురుతిరగడంతో కులంలో పెద్దరికంగా వ్యవహరిస్తున్న తన పలుకుబడికి విలువ లేకుండా పోతుందని, బాలస్వామి బాలయ్యను అంతమొందిస్తే కులంలో తనకు అందరూ భయపడతారని భావించాడు. ఈ నెల 14న రాత్రి తన గుడిసె వద్దకు వచ్చిన బాలయ్యతో గొడవపడి కర్రతో తీవ్రంగా చితకబాదాడు. గాయపడిన బాలయ్య తన ఇంటికి వెళ్లి మరుసటిరోజు మృతిచెందాడు. బాలయ్యను తాను కొట్టిన విషయం ఎవరికీ చెప్పవద్దని అతని భార్య మీనుగ నాగలక్ష్మిని సైతం బెదిరించాడు. దీంతో నాగలక్ష్మి పోలీసులకు తన భర్త అనారోగ్యంతో మృతిచెందాడని తెలిపింది. అయితే డాక్టర్లు పోస్టుమార్టం సమయంలో తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడగా.. బాలయ్య భార్యతో ఫిర్యాదు తీసుకుని హత్య కేసుగా నమోదు చేశారు. తనపై హత్య కేసు నమోదైన విషయం తెలుసుకున్న నిందితుడు బాలస్వామి గురువారం మధ్యవర్తి ద్వారా నేరం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోయాడు. కాగా నిందితుడు గతంలో నాగసాల వద్ద జరిగిన జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన కర్రను స్వాధీనపర్చుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు చంద్రమోహన్, నాగరాజు పాల్గొన్నారు. -
గొడవపడి అన్నాచెల్లి తీవ్ర నిర్ణయం..! చివరికి తల్లి!
మహబూబ్‌నగర్: అన్నాచెల్లి బలవన్మరణంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని పళ్ల ఏరియాలోని కోటవీధికి చెందిన చేనేత కుటుంబం అన్నాచెల్లెలు మహేష్ (35), లక్ష్మి (32) తల్లి రాములమ్మ కొన్నేళ్లుగా మానసిక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఆదివారం రాత్రి అన్నాచెల్లి గొడవపడ్డారు. దీంతో అన్న మహేష్ మనస్తాపంతో చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన చెల్లి చీరను కత్తిరించగా, అప్పటికే ఆయన మృతి చెందాడు. చెల్లి సైతం మానసిక స్థితి బాగులేకపోవడంతో ఉరేసుకుంది. తల్లి రాములమ్మకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఇంట్లో ఏమి అయ్యిందో తెలియని పరిస్థితి. తెల్లారేసరికి కొడుకు, కుతురుని పిలిచినా పలకకపోవడంతో రోధించింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడడంతో వారు మృతి చెందినట్లు గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాంలాల్‌తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాలను జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఏఎస్ఐ ఆరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చందాలు పోగుచేసి అంత్యక్రియలు.. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ లేకపోవడంతో సింగిల్ విండో డైరెక్టర్ మల్లేష్, నాయకులు కెంచె శ్రీనివాస్, గోపాల్‌యాదవ్, ఆ ప్రాంత యువకులు ముందుకు వచ్చి చందాలను పోగుచేశారు. పోలీసు అధికారులు సైతం వారికి తొచిన ఆర్థిక సాయం చేశారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించి యువకులు మానవత్వం చాటుకున్నారు. రాములమ్మను జిల్లా ఆస్పత్రికి తరలింపు.. కొడుకు, కుమార్తె మృతి చెందడంతో తల్లి రాములమ్మ అనాథగా మారింది. పళ్ల ఏరియా యువకులు ఆమెను ఆటోలో వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యపరిస్థితి బాగలేకపోవడంతో సిబ్బంది నిరాకరింది. దీంతో ఆమెను జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారాన్ని డీడబ్ల్యూఓ వేణుగోపాల్‌కు ఇవ్వగా ఆయన స్పందించి సఖి కేంద్రం నుంచి సిబ్బందిని పంపించారు. వృద్దురాలి ఆరోగ్యం బాగైన తర్వాత వృద్ధాశ్రమనికి తరలిస్తామని తెలిపారు. -
పేదలపై దాడులు చేయడమే ఫ్రెండ్లీ పోలీసా: షర్మిల
హస్తినాపురం: తెలంగాణలో అణగారిన వర్గాలు, పేదలపై పోలీసులు పాశవికంగా దాడులకు పాల్పడటమే ఫ్రెండ్లీ పోలీసా.. అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మి ల మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం హస్తినాపురంలోని శ్యాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు లక్ష్మిని ఆమె పరా మర్శించారు. అనంతరం షర్మిల మాట్లాడు తూ గిరిజన మహిళ అని చూడకుండా లక్ష్మి ని పాశవికంగా చిత్రహింసలకు గురిచేసిన ఎల్బీనగర్ పోలీసులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెలలో తన కూతురు పెళ్లి ఉందని కార్డు చూపించినా వినకుండా ఎస్ఐ రవికుమార్ చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన లక్ష్మి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం, 120 గజాల ఇంటిస్థలం కేటాయిస్తామని మంత్రిగాని, ఎమ్మెల్యేగాని వచ్చి హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు షర్మి ల గంటసేపు ధర్నా చేశారు. అనంతరం నాగార్జునసాగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఏసీపీ ఆదేశాలతో షర్మి లను మ హిళా కానిస్టేబుళ్లు అదుపులోకి తీసుకున్నారు.