ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు | Ditya Bhande Mesmerize Dance Moments in Lakshmi Teaser | Sakshi
Sakshi News home page

Published Fri, Feb 23 2018 2:29 PM | Last Updated on Fri, Feb 23 2018 2:29 PM

Ditya Bhande Mesmerize Dance Moments in Lakshmi Teaser - Sakshi

లక్ష్మీ టీజర్‌లోని ఓ దృశ్యం

సాక్షి, సినిమా : ఇండియన్‌ మైకేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా వయసు పెరుగుతున్న డాన్సుల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఆయన నటించిన లక్ష్మీ మూవీ టీజర్‌ రిలీజ్‌ అయ్యింది. ఇందులో ఆయన వేసిన బ్రేకింగ్‌ స్టెప్పులు ఆకట్టుకోగా.. డాన్సింగ్‌ సెన్సేషన్‌ కిడ్‌ దిత్యా భాండే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 

ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డాన్స్‌ నేపథ్యంగానే సాగుతుందని స్పష్టమౌతోంది. బాలీవుడ్‌ హిట్‌ సిరీస్‌ ఏబీసీడీ తరహాలో సాగే కథనంలా కనిపిస్తున్నప్పటికీ.. చిన్నపిల్లల పోటీ అనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారి దిత్యా భాండే పోటీ పడి మరీ ప్రభుదేవాతో డాన్సులేసింది. 

సామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఏకకాలంలో ఇది తెరకెక్కగా.. ఇటీవలె షూటింగ్‌ పూర్తి చేసేసుకుంది. సమ్మర్‌ కానుకగా లక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement