bilingual film
-
తెలుగువాడినే కానీ మొదట్లో కన్నడలో సినిమాలు చేశా
రవిశంకర్, ఇర్ఫాన్, జెడీ ఆకాష్, సెహర్ అప్సర్, సుమితా బజాజ్ ప్రధాన పాత్రల్లో హెచ్ఎం శ్రీనందన్ దర్శకత్వంలో రూపొందిన ద్విభాషా(తెలుగు, కన్నడ) చిత్రం ‘లై లవర్స్’. కన్నడంలో ‘బీగ’ టైటిల్ ఖరారు చేశారు. రమేష్ రెడ్డి, చెక్కల నాగేశ్వర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు ఏఎస్ రవికుమార్, టీజర్‌ను దర్శకులు సునీల్‌కుమార్ రెడ్డి, వీరభద్రం విడుదల చేశారు. హెచ్.ఎం శ్రీనందన్ మాట్లా డుతూ– ‘‘నేను తెలుగువాణ్ణే అయినా తొలుత కన్నడలో సినిమాలు చేశాను. కొత్త ఫార్మాట్లో, డిఫరెంట్‌గా ఈ సినిమా చేశా. నా గత చిత్రాలను చూసిన నిర్మాతలు కథ వినకుండానే ‘లై లవర్స్’ నిర్మించారు’’ అన్నారు. ‘‘సైంటిఫిక్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది’’ అన్నారు నిర్మాతలు. దర్శకుడు సాగర్ పాల్గొన్నారు. -
అథ్లెట్‌గా ఆది పినిశెట్టి
హీరో ఇమేజ్‌కు ఫిక్స్ అయిపోకుండా సౌత్‌లో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో దూసుకుపోతున్న యువ నటుడు ఆది పినిశెట్టి. తాజాగా ఈ విలక్షణ నటుడు ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంతకం చేశాడు. ఈ చిత్రంతో పృథ్వి ఆదిత్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్పోర్ట్స్ జోనర్ చిత్రంలో ఆది పినిశెట్టి నటించడం ఇదే తొలిసారి. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు పృథ్వి ఆదిత్య మాట్లాడుతూ ‘నేను ఈ కథను రాసుకుంటున్నంత సేపూ నా మనసులో ఆదిగారే మెదిలారు. ఆయనకు కథ వినిపించాక, ఆయన సరే చేస్తాను అని చెప్పగానే నాకు చాలా రిలీఫ్‌గా అనిపించింది. ఆయనతో పనిచేయడానికి ఉత్సాహంగా ఉంది. తప్పకుండా మంచి చిత్రాన్ని అందిస్తాను. అథ్లెటిక్స్‌కు సంబంధించిన కథ ఇది. తను కన్న కలను సాకారం చేసుకోవడానికి కథానాయకుడు చేసిన ప్రయత్నం ఏంటనేది ఆసక్తికరంగా ఉంటుంది. అథ్లెటిక్స్ పట్ల అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేస్తున్నాం’ అని అన్నారు. ఈ సినిమాను బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఐబీ కార్తికేయన్ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. పీఎంఎం ఫిల్మ్స్, జి.మనోజ్, జి. శ్రీహర్ష (కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్) సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తెలుగుతో పాటు ఇతర భాషల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్, బాలీవుడ్ లోనూ త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరో తమిళ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శ్రీ కార్తీక్ ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటు యోగిబాబులు నటించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలుడనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. -
ఎంత కష్టం వచ్చిందో
ఒక్క సినిమా. కష్టమేమో రెండు సినిమాలంత అట. ఒక భాషలో చేసిన వెంటనే ఇంకో భాషలో యాక్ట్ చేయాలి. దానికోసం రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవాలి. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ఇదే చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదంటే ‘సాహో’. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ ఇందులో కథానాయిక. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాతలు. ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ కోసం రెండు సినిమాల కష్టం పడాల్సిందే అంటున్నారు శ్రద్ధా. ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘సాహో అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. పెద్ద సెట్స్, లొకేషన్స్ చేంజ్‌లు ఉన్నాయి. అలాగే ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రం కావడంతో ప్రతీ సీన్ రెండు సార్లు యాక్ట్ చేయాలి. ఒకసారి తెలుగులో యాక్ట్ చేస్తాం. అది బాగా వస్తే మళ్లీ అదే సీన్‌ని హిందీలో చేయాలి. అలా కాకపోతే మరోలా. ఈ సినిమా కోసం నా లైన్స్ నేనే గుర్తు పెట్టుకుంటున్నా. కొత్త భాషలో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. చాలా టైమ్ కూడా పడుతుంది. పేరుకి ఒక్క సినిమా అయినా కష్టం రెండు సినిమాలది. అయినా ఎంత కష్టపడ్డా రిజల్ట్ ఆ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తుంది’’ అని పేర్కొన్నారు. నీల్ నితిన్ ముఖేశ్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, ఎవెలిన్ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది. -
మాకు మంచి జరగాలి
... అని మనసారా కోరుకుంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. సర్లే కానీ మాకు అని అంటున్నారు మరి మిగతా వారెవరో అంటే... ప్రస్తుతానికి తమిళ నటుడు శివకార్తీకేయన్, ఏఆర్ రెహ్మాన్ అండ్ టీమ్ అన్నమాట. ‘ఇండ్రు నేట్రు నాళై’ ఫేమ్ ఆర్. రవికుమార్ దర్శకత్వంలో శివకార్తీకేయన్ హీరోగా 24ఎమ్ స్టూడియోస్ పతాకంపై రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమంలో రకుల్ పాల్గొనలేకపోయారు. ‘‘మిస్సయ్యాను.. మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ’’అని ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అన్నట్లు.. ఈ మిస్ ఎందుకు మిస్ అయ్యారంటే... కాస్త ఆరోగ్యం సరిగా లేదట. అందుకోసమే ఇంట్లో ఉంటూ హెల్దీ ఫుడ్ తీసుకుంటూ రికవరీ అవుతున్నారని సమాచారమ్. అలాగే ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానున్న సూర్య ‘ఎన్జీకే’ చిత్రంలో రకుల్ ఒక కథానాయిక. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘దేవ్’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తున్నారు ఆమె. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ సినిమాలో కూడా రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
ప్రభుదేవాతో పోటీపడి మరీ డ్యాన్సులు
సాక్షి, సినిమా : ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా వయసు పెరుగుతున్న డాన్సుల్లో ఏ మాత్రం తగ్గటం లేదు. తాజాగా ఆయన నటించిన లక్ష్మీ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆయన వేసిన బ్రేకింగ్ స్టెప్పులు ఆకట్టుకోగా.. డాన్సింగ్ సెన్సేషన్ కిడ్ దిత్యా భాండే ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డాన్స్ నేపథ్యంగానే సాగుతుందని స్పష్టమౌతోంది. బాలీవుడ్ హిట్ సిరీస్ ఏబీసీడీ తరహాలో సాగే కథనంలా కనిపిస్తున్నప్పటికీ.. చిన్నపిల్లల పోటీ అనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారి దిత్యా భాండే పోటీ పడి మరీ ప్రభుదేవాతో డాన్సులేసింది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఏకకాలంలో ఇది తెరకెక్కగా.. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసేసుకుంది. సమ్మర్ కానుకగా లక్ష్మీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
ఖాకీగా విజయ్ ఆంటోని
సాక్షి, చెన్నై : బిచ్చగాడుగా అలరించిన విజయ్ ఆంటోని ద్విభాష చిత్రం రోషగాడులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఈ మూవీ తిమిరుపుదిచవన్గా తెరకెక్కనుంది. నంబియార్ ఫేమ్ గణేష దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ మూవీకి విజయ్ ఆంటోనీ స్వయంగా స్వరాలు సమకూర్చనున్నాడు. చిత్ర మేకర్లు ఇటీవలే మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అయితే హీరోయిన్ సహా ప్రధాన తారాగణం వివరాలను ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు. కృతుంగా ఉదయనిధి డైరెక్షన్లో తెరకెక్కిన కాశీ మూవీ షూటింగ్‌ను ఇటీవలే ముగించుకున్న విజయ్ ఆంటోని రోషగాడు సెట్లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. కాశీ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన ఆడిపాడారు. -
రానాతో జతకట్టనున్న రెజీనా
యువ నటుడు రానాతో జత కట్టేందుకు నటి రెజీనా రెడీ అవుతోందన్నది తాజా సమాచారం. టాలీవుడ్ టాలెస్ట్ నటుడు రానా. ఈయన ఒక్క తెలుగు చిత్రసీమకే పరిమితం కాకుండా హిందీ, తమిళం అంటూ బహుభాషా నటుడిగా రాణిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన ఘాజీ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలో తెరకెక్కి మంచి విజయాన్ని సాధించింది. కాగా రానా తమిళంలో ఆరంభం చిత్రంతోనే పరిచయం అయ్యారు. ఆ తరువాత బెంగళూర్ నాట్కల్, బాహుబలి చిత్రాలతో మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం బాహుబలి–2తో పాటు ఒక తెలుగు చిత్రంలోనూ నటిస్తున్నారు. కాగా తాజాగా మరో ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు కళగు అనే వైవిధ్య భరిత కథాంశంతో విజయవంతమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరి కలయికలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మడైతిరంద అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది స్వాతంత్య్రానికి ముందు జరిగే చారిత్రక కథాంశంతో రూపొందనుందట. చిత్ర కథ నచ్చడంతో రానా ఇందులో నటించడానికి అంగీరించారు. ఈ విషయాన్ని ఇటీవల రానానే స్వయంగా చెన్నైలో ఘాజీ చిత్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కాగా ఈ పిరియడ్ కథా చిత్రంలో రానాకు జంటగా నటి రెజీనా నటించనున్నారని సమాచారం. ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం ఈ నెల 10న తెరపైకి రానుందన్నది గమనార్హం.