
సాక్షి, చెన్నై : బిచ్చగాడుగా అలరించిన విజయ్ ఆంటోని ద్విభాష చిత్రం రోషగాడులో పోలీస్‌గా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఈ మూవీ తిమిరుపుదిచవన్‌గా తెరకెక్కనుంది. నంబియార్ ఫేమ్ గణేష దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ మూవీకి విజయ్ ఆంటోనీ స్వయంగా స్వరాలు సమకూర్చనున్నాడు. చిత్ర మేకర్లు ఇటీవలే మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అయితే హీరోయిన్ సహా ప్రధాన తారాగణం వివరాలను ఇంకా చిత్ర బృందం ప్రకటించలేదు.
కృతుంగా ఉదయనిధి డైరెక్షన్‌లో తెరకెక్కిన కాశీ మూవీ షూటింగ్‌ను ఇటీవలే ముగించుకున్న విజయ్ ఆంటోని రోషగాడు సెట్‌లో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నాడు. కాశీ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీలో విజయ్ ఆంటోని సరసన అంజలి, సునయన ఆడిపాడారు.
Comments
Please login to add a commentAdd a comment