
'బిచ్చగాడు' మూవీతో తెలుగులో బోలెడంత పాపులారిటీ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. స్వతహాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇతడు.. నటుడు, నిర్మాత, పాటల రచయిత, ఎడిటర్, సంగీత దర్శకుడిగా ఆకట్టుకుంటున్నాడు. ఇతడి 25వ మూవీ టీజర్ రిలీజ్ చేయగా అది ఆసక్తికరంగా ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)
'అరువి', 'వాళ్' లాంటి వైవిధ్యమైన సినిమాలు తీసిన అరుణ్ ప్రభు.. విజయ్ ఆంటోనితో తీస్తున్న మూవీకి తెలుగులో 'భద్రకాళి' అనే టైటిల్ పెట్టారు. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. కథని పెద్దగా బయటపెట్టలేదు గానీ విజువల్స్ చూస్తుంటే మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
ఇది రాజకీయ నేపథ్య కథతో తీసిన సినిమా అని తెలుస్తోంది. ఏదో రూ.197 కోట్ల స్కామ్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది. విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. గ్యాంగ్ స్టర్, మోసగాడు, ఫ్యామిలీ మ్యాన్, గవర్నమెంట్ ఆఫీసర్, ఖైదీగా.. ఇలా రకరకాల కోణాల్లో చూపించారు. వేసవి కానుకగా ఇది థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత)
Comments
Please login to add a commentAdd a comment