Bhadrakali
-
స్ట్రీట్‌లో స్టెప్పులు.. నిరసన నిప్పులు
స్త్రీ అమ్మ... అన్యాయం జరిగితే ఆదిపరాశక్తి.స్త్రీ భూదేవి... సహనం కోల్పోతే అపరకాళి.ఈ జగత్తును తల్లిలా ఆదరించే ప్రతి స్త్రీ ఈ జగత్తులో తానొక భాగం అనుకుంటుంది. తనకు గౌరవప్రదమైన ఉనికి కోరుకుంటుంది. కానీ, మనుషులు ఘోరంగా వ్యవహరించి ఆమె విశ్వాసాన్ని ధ్వంసం చేస్తుంటారు. ఆమె సహనాన్ని పరీక్షిస్తుంటారు. కోల్‌కతాలో డాక్టర్‌పై జరిగిన ఘోరకలి ఈ దేశంలో ప్రతి స్త్రీని భద్రకాళిని చేసింది. ఆ సమయంలో ఎగసిన నిరసనల్లో కోల్‌కతా వీధుల్లో ఉగ్రతాండవం చేసింది మోక్షా సేన్ గుప్తా. ‘సాక్షి’తో ఆమె మాట్లాడింది.‘‘సమాజంలోని చీడపురుగులకు చికిత్స చేయాలి. లేకపోతే వైద్యులనే కబళించేస్తాయి. చికిత్స ఎంత తీవ్రంగా ఉంటే సమాజానికి అంత మేలు’’ అంటున్నారు మోక్షా సేన్ గుప్తా. కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా మోక్షా సేన్ గుప్తా స్ట్రీట్ డ్యాన్స్‌తో పాటు ఇంకా పలు ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ‘అలనాటి రామచంద్రుడు’తో తెలుగు తెరపై కనిపించిన ఆమె త్వరలో విడుదల కానున్న ‘రామం రాఘవం’లోనూ నటించారు. బెంగాలీ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేస్తున్నారు. ఇక ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోక్షా సేన్ గుప్తా చెప్పిన విషయాలు.→ వీధుల్లో కళా ప్రదర్శన మా సంస్కృతివీధుల్లో కళా ప్రదర్శన అనేది చాలా సంవత్సరాల నుండి వస్తున్న మా బెంగాల్ సంస్కృతి. వర్జీనియా ఉద్యమం ప్రారంభమైనప్పుడు విభజనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో బెంగాల్ కూడా రాజధానిగా ఉండేది. మన పూర్వీకులు వీధి కళ, వీధి నాటకం, వీధి నృత్యం, వీధి పాటల ద్వారా వీధి ప్రదర్శనలు చేసేవారు. దర్శకుడు సత్యజిత్ రే ఏదైనా సమస్య అంటే బెంగాలీలు అందరూ ఎలా ఒక్కటవుతారో కూడా తన సినిమాల్లో చూపించారు. మన స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో బెంగాలీ స్వాతంత్య్ర సమరయోధులు వీధుల్లోకి వచ్చి, నిరసనలు చేశారు. నా రాష్ట్రం, నా కుటుంబం నేర్పిన, పెంపకం నుంచి నాకు సామాజిక బాధ్యత వచ్చింది. పూరీ్వకులు చేసిన నిరసనలే నాకు స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే కోల్‌కతా వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా వీధుల్లో కళా ప్రదర్శనలు చేశాను. → సత్యం కోసం... కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం స్వాతంత్య్ర సమయంలో తన కవితలు, పాటల ద్వారా బెంగాల్లో పునరుజ్జీవనం తేవడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి. ఆయన్ను నేతాజీ సుభాష్ చంద్రబో‹స్, స్వామి వివేకానంద వంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇక నేను వైద్యురాలి హత్యాచారానికి నిరసనగా కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం పాటను స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను రామకృష్ణ పరమహంస ఆరాధకురాలిని. ఆ విధంగా మంచి కోసం నిలబడటం అనేది నా రక్తంలోనే ఉంది. ఏ కళాకారుడైనా... అది వీధి కళాకారుడైనా ‘సత్యమేవ జయతే’ అంటూ నిజం వైపు నిలబడే ధైర్యం ఆ ఆరి్టస్ట్కి ఉండాలి. నేను డ్యాన్స్ చేసిన పాట అర్థం కూడా దాదాపు ఇలానే ఉంటుంది. ‘ఒకవేళ నువ్వు చెరసాలలో ఉన్నట్లయితే నిజం కోసం గొంతు ఇవ్వడానికి ఆ చెరసాలను బద్దలు కొట్టి బయటకు రావాలి. సత్యం కోసం స్వరం వినిపించాలి’ అన్నట్లుగా ఆ పాట ఉంటుంది. → వ్యవస్థకి వ్యతిరేకంగా.. మృత్తిక అనే స్వచ్ఛంద సేవా సంస్థ, ఇంకా మరికొన్ని అలాంటి సంస్థలు అణగారిన స్త్రీలు, పిల్లల సంక్షేమం కోసం పని చేస్తుంటాయి. వారితో మేం కలిసి పని చేస్తాం. అభయ సంఘటన విషయంలో వ్యవస్థకి వ్యతిరేకంగా పోరాడే వైద్యులతో మేం నిలబడ్డాం. నేను మాత్రమే కాదు... ఎందరో కళాకారులు మాతో వీధుల్లోకి వచ్చారు. అభయ కుటుంబానికి, వైద్యుల కోసం, న్యాయం కోసం మేం అంతా ఉన్నామని చూపించడానికి నాట్యాన్ని ఎన్నుకున్నాం. మేం చేస్తున్న నిరసన కార్యక్రమాలు చాలామందిని ప్రభావితం చేస్తున్నాయని నమ్ముతున్నాను. → డ్యాన్స్ కాదు... నిరసన నేను చేసినది డ్యాన్స్ అని నాకనిపించలేదు. ఎందుకంటే సరైన కొరియోగ్రఫీ లేదు. నిజానికి నేను వేరొక నిరసన ప్రదర్శన నుండి నేరుగా అక్కడికి వెళ్లాను. ఓ 20, 25 కిలోమీటర్ల నిరసన కార్యక్రమం అది. ఆ నిరసన పూర్తయ్యాక అక్కడికి వెళ్లాను. ఒక బలమైన విషయాన్ని నృత్యరూపంలో చె΄్పాలనుకున్నప్పుడు సరైన వేదిక అక్కర్లేదు... కెమెరా, యాక్షన్, లైట్లు అవసరంలేదు. ఓ ఆరి్టస్ట్ సత్యం కోసం ఎక్కడ నిలబ డితే అదే పెద్ద వేదిక అవుతుంది. ఆ వేదిక సత్యం, న్యాయం కోసం మాత్రమే నిలబడే వేదిక అయితే చాలు... ముందస్తు ప్రిపరేషన్ లేకుండా చేసేయొచ్చు. → ఐక్యత కోసమే... పశి్చమ బెంగాల్ ప్రభుత్వాన్ని స్థానిక పార్టీ సమరి్థస్తోంది. అంటే... కొందరు రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లు, స్థానికులు. నా డ్యాన్స్ గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడారు. ఇది నిరసనా లేక మీరు రెచ్చగొడుతున్నారా? అన్నారు. అయితే ఇప్పుడు కామన్ మేన్ కూడా తన గొంతు విప్పడానికి సిద్ధమయ్యాడు. సో... ఎక్కడో చోట మొదలయ్యే నిరసనలు సాధారణ వ్యక్తులను ప్రభావితం చేసేందుకూ ఉపయోగపడతాయి. కొన్నేళ్లుగా బెంగాలీల మధ్య ఉన్న ఐక్యత కాస్త సన్నగిల్లింది. అభయ రూపంలో మళ్లీ ఆ ఐక్యతను తిరిగి తేగలిగాం. → తలో చేయీ వేద్దాం రాష్ట్ర ప్రభుత్వం 21 మంది లాయర్లను నియమించింది. వారికి వ్యతిరేకంగా డాక్టర్లు, అభయ కుటుంబం పోరాడుతోంది. ఎందరో పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వారిని ఎదిరించి పోరాడాలంటే ఆర్థిక బలం అవసరం. వెస్ట్ బెంగాల్ డాక్టర్స్ నిధిని సమకూర్చా లని అనుకుంటున్నారు. నా వంతుగా నేనూ ఫండ్ రైజ్ చేస్తున్నాను. 100 రూపాయలు కూడా మాకు ఎక్కువే. 50 మంది 100 రూపాయలు ఇస్తే... అదే పెద్ద మొత్తం అవుతుంది. అలా తలో చెయ్యీ వేసి, ముందుకొస్తే ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే వీలుంటుంది. అభయ కేసుని ఓ ఉదాహరణగా నిలపగలిగితే ఇలాంటి వెయ్యి సమస్యలను అధిగమించగలం. ‘మేం భారతీయులమని చెప్పుకోవడానికి గర్వపడుతు న్నాం’ అని ప్రపంచానికి చెప్పగలుగుతాం.→ అవసరమైతే మళ్లీ డ్యాన్స్ మలయాళంలో నేను చేసిన ‘చిత్ని’ ఈ 27న రిలీజైంది. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాగే తెలుగులో నా ఫస్ట్ మూవీ ‘అలనాటి రామచంద్రుడు’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని చూడనివాళ్లు ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. ఇలా నా సినిమా విషయా లను ఫోకస్ చేస్తూనే డిజిటల్‌గా బాధితుల పక్షాన వీలైనంతగా ప్రచారం చేస్తున్నాను. అవసరమైతే మళ్లీ ‘స్ట్రీట్ డ్యాన్స్’ చేస్తా. ఆ ప్రదర్శనతో ఐదు రూపాయలు లాంటి చిన్న మొత్తం వచ్చినా అది ‘అభయ క్లినిక్’కి, అది ఏర్పాటు చేసిన డాక్టర్లకు వెళుతుంది. ఎందుకంటే ఈ క్లినిక్ నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి ఉపయోగపడాలన్నది మా ఆశయం. అందుకే సాయం చేయాలనుకునేవారు ఈ ఫోను నంబరు +91 6291485209 లేదా ఠీb్జunజీౌటఛీౌఛ్టిౌటటజటౌn్టఃజఝ్చజీ .ఛిౌఝ ని సంప్రదించాలని కోరుకుంటున్నాను’’ అని మోక్ష విజ్ఞప్తి చేశారు. పార్టీలకు తటస్థంగా ఉంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తలేం. అయితే ప్రశ్నలు వేస్తే మీరు ప్రతిపక్ష పార్టీ కేడర్ అని అర్థం... ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనల ప్రభావం నేనో కొత్త కల కనేలా చేశాయి. ‘మావన హక్కు’ల గురించి క్షుణ్ణంగా చదవాలన్నదే ఆ కల.అభయ అనేది అంతర్గతంగా, బాహ్యంగా నన్ను మార్చేసింది. ఇక ఇప్పుడు నేను దేని గురించీ పట్టించుకోను. ఎంత దూరం అయినా ఏ మార్గంలో అయినా వెళ్లగలను. ఇది ‘మోక్ష 2.ఓ’ వెర్షన్. ఈ మారిన మోక్ష డాక్లర్లకు సపోరి్టవ్గా ఉంది... న్యాయం పక్షాన ఉంటుంది. – డి.జి. భవాని -
సలుపుతున్న గాయం
సాక్షి, వరంగల్ రూరల్: చెవులు చిల్లులు పడేలా శబ్ధం, ఆకాశాన్ని అంటేలా కమ్ముకున్న పొగలు, మూడు కిలోమీటర్ల వరకు కంపించిన ఇళ్లు, వంగిపోయిన స్టీలు కడ్డీలు, కూలిపోయిన గోడలు, తునాతునకలైన షాబాదు రాళ్లు, వందల మీటర్ల దూరం వరకు ఎగిరిపడి ఛిధ్రమైన కార్మికుల శరీర భాగాలు... ఇవీ వరంగల్‌లోని శ్రీ భద్రకాళీ ఫైర్వర్క్స్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు కనిపించిన ఆనవాళ్లు. సరిగ్గా ఏడాది క్రితం అంటే 4 జూలై 2018న ఉదయం 11 గంటల సమయంలో జరిగిన బాంబుల పేలుళ్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిబంధనలు తుంగలో తొక్కి అధికారుల కళ్లు నిర్వహిస్తున్న ఫైర్వర్క్స్లో ప్రమాదం జరిగిన పది మంది మృతి చెందగా.. మరో మరో ఐదుగురికి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి రాష్ట్రప్రభుత్వం నుంచి తప్ప యజమాని నుంచి ఎలాంటి సాయం అందకపోగా.. గాయపడిన వారు జీవచ్ఛవాల్లా కాలం వెళ్లదీస్తున్నారు. సజీవ దహనం వరంగల్‌కు చెందిన కుమార్(బాంబుల కుమార్) కాశిబుగ్గ సమీపంలో కోటిలింగాల వద్ద భద్రకాళి ఫైర్వర్క్స్ పేరుతో టపాసుల తయారీ పరిశ్రమ ఏర్పాటుచేశారు. అక్కడ సరైన రక్షణ ఏర్పాట్లు లేక.. నిబంధనలు పాటించని కారణంగా జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో మరో ఐదురుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగి ఏడాది అవుతున్నా బాధిత కుటుంబాలు ఇంకా దానిని మరిచిపోలేదు. ఎవరిని కదిలించినా కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, ఆ రోజు బాంబుల తయారీ కోసం 14 మంది కూలీలు వచ్చారు. ప్రమాదంలో కాశిబుగ్గ తిలక్ రోడ్‌కు చెందిన గాజుల హరికృష్ణ(38), సుందరయ్య నగర్ ఓంసాయి కాలనీకి చెందిన కోమటి శ్రావణి(33), బేతి శ్రీవాణి(25), ఏనుమాముల మార్కెట్ రోడ్ బాలాజీనగర్‌కు చెందిన రంగు వినోద్(24), కాశిబుగ్గకు చెందిన వల్దాసు అశోక్‌కుమార్(30), కాశిబుగ్గ సాయిబాబా గుడి సమీపానికి చెందిన బాలిని రఘుపతి(40) మృతి చెందారు. వీరితో పాటు కీర్తి నగర్ కాలనీకి చెందిన కందకట్ల శ్రీదేవి(34), సుందరయ్య నగర్‌కు చెందిన బాస్కుల రేణుక(39), కొత్తవాడకు చెందిన వడ్నాల మల్లికార్జున్ (35), కరీమాబాద్‌కు చెందిన వంగరి రాకేష్(22) మృత్యువాతపడ్డారు. కాగా, ఇద్దరి శరీరాలు గుర్తుపట్టలేకుండా చిధ్రం కావడంతో డీఎన్ఏ టెస్ట్ తర్వాత మల్లికార్జున్, రాకేష్ మృతుదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అందించారు. ఇంకా బాలాజీనగర్‌కు చెందిన కొండపల్లి సురేష్, గొర్రెకుంటలకు చెందిన బందెల సారంగపాణి, కాశిబుగ్గకు పరికెరాల మోహన్, హన్మకొండకు చెందిన బాతింగ్ రవి, కోటిలింగాలగుడి సమీపంలోని సైలేంద్ర శివ గాయపడ్డారు. ఫైర్ వర్క్స్ చుట్టుప్రక్కల సమారు 300 మీటర్ల దురం వరకు ఉన్న గృహాల పైకప్పు రేకులు పగిపోయాయి. కొందరు మరమ్మత్తులు చేసుకుని ఉంటున్నారు. మరికొందరు ఆ గృహాలను వదిలేశారు. తప్పించుకునే ప్రయత్నం ఎంప్లాయిస్ కంపర్‌జేషన్ యాక్ట్ 1932 ప్రకారం ఒక కంపెనీలో పని చేస్తున్న వారికి ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి 10 మంది మరణించడంతో కార్మిక శాఖ ఈ కేసును సుమోటగా స్వీకరించింది. దీంతో 2018 జూలై 20న జైలులో ఉన్న భద్రకాళి ఫైర్ వర్క్స్ యజమాని బాంబుల కుమార్‌కు నోటీసులు పంపించారు. అయినా స్పందన రాకపోవడంతో ఒక్కొక్కరికి రూ.6 నుంచి రూ.9లక్షల వరకు చొప్పున రూ.68లక్షలు చెల్లించాలని ఆర్డర్ జారీ చేశారు. ఈ నగదును 30 రోజుల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించగా.. 2016లోనే పరిశ్రమను తన బావమరిది రఘుపతికి అప్పగించానని కుమార్ సమాధానం ఇచ్చారు. కాగా, రఘుపతి కూడా ఈ ఘటనలో కన్నుమూసిన నేపథ్యంలో తప్పించుకునేందుకు ఇలా చెప్పాడని భావించిన కార్మిక శాఖ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. అయితే, కార్మిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తు హైకోర్టును ఆశ్రయించడంతో యజమాని నుంచి నష్టపరిహారం ఇంకా అందలేదు. కానిస్టేబుల్ అవుదామనుకున్నాడు పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కొండపల్లి సురేష్. కానిస్టేబుల్ కావాలనుకున్నాడు... బాంబుల పేలుళ్ల ఘటన బెడ్‌కే పరిమితం చేసింది. బాలాజీనగర్‌కు చెందిన ఈయన బాంబుల కుమార్ దగ్గర పని చేస్తున్నాడు. పేపర్ షార్ట్‌లు తయారు చేస్తుండగా పేలుళ్లు సంభవించాయి. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎడుమ కాలుపై బాంబు పడటంతో తెగిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సురేష్ ను 108 ద్వారా ఎంజీఎం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యం ఖర్చులు ప్రభుత్వమే చెల్లించింది. అయినా ఇంట్లో బంగారం అమ్మాల్సి వచ్చింది. ఇక సెప్టెంబర్ 20వ తేదీన నిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంట్లోనే బెడ్‌కే పరిమితం అయ్యారు. తండ్రి జంపయ్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పనికి వెళ్లడం సైతం బంద్ చేశారు. తల్లితండ్రుల వయస్సు భారంతో ఇంట్లోనే ఉంటున్నారు. సురేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని తల్లితండ్రులు కోరుతున్నారు. నిర్లక్ష్యంతోనే ప్రమాదం ఫైర్ వర్క్స్‌లో కనీస నిబంధనలు పాటించని కారణంగా ప్రమాదం జరిగిందని వివిధ శాఖల వారు తెల్చారు. ఈ మేరకు నివేదికలు కూడా ఇచ్చారు. బాంబుల తయారికి ఉపయోగించే ముడి పదార్థం ఒకే దగ్గర ఎక్కువ మొత్తంలో నిల్వ పెట్టడం వలనే ఈ పెనుప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నన్ను ఒంటరిని చేసి పోయింది బాంబుల తయారీ కంపెనీలో పనికి నా భార్య రేణుక రోజులాగే వెళ్లింది. బాంబుల పేలుళ్ల ఘటనలో చనిపోయింది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. నాకు ఇద్దరు కుమార్తెలు. ఒకరి పెళ్లి ఇటీవలే చేశాను. నాకు వయస్సు మీద పడటంతో ఇంట్లోనే ఉంటున్నాను. కేసీఆర్ ప్రకటించిన రూ.5లక్షలు మాత్రమే వచ్చాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిని కఠినంగా శిక్షించాలి. – బాస్కుల కొమురయ్య, సుందరయ్యనగర్ ఇబ్బంది పడుతున్నాం బాంబుల పెలుళ్లలలో నా భార్య శ్రావణి, చెల్లె శ్రీవాణి ఇద్దరు చనిపోయారు. నాకు ముగ్గురు ఆడ పిల్లలు, చెల్లెకు ఇద్దరు ఆడ పిల్లలు న్నారు. పిల్లలకు తల్లులు లేని అనాథులగా మారారు. పిల్లలల బాగోగులు చూసుకునేందుకు పనికి కూడా సరిగా వెళ్లడం లేదు. పిల్లలు స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నాను. పిల్లలను గురుకులల్లో జాయిన్ చేయిస్తామని చెప్పిన అధికారులు ప్రస్తుతం పట్టించుకోవడంలేదు. నా పిల్లలకు తల్లి లేకుండా చేసిన యజమానిని శిక్షించి మమ్ముల్ని ఆదుకోవాలి. – కోమటి రాజు, కోటిలింగాల గుడి దగ్గర -
భారీ గ్రాఫిక్స్ భద్రకాళి
సీనియర్ నటి సీత ముఖ్య పాత్రలో బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మించిన చిత్రం ‘భద్రకాళి’. కె.ఎం.ఆనంద్ దర్శకుడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత రాంబాబు మాట్లాడుతూ–‘‘అమ్మవారిగా సీత అద్భుతంగా నటించారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఓ భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించాం. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య వచ్చే 25 నిమిషాల గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఆదీష్ ఉత్రిన్ సాంగ్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. జూన్ ఆఖర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
అమ్మవారు.. భక్తుడు.. ఓ దుష్టశక్తి
సీనియర్ నటి సీత అమ్మవారి పాత్రలో నటించిన చిత్రం ‘భద్రకాళి’. ఆర్. పిక్చర్స్ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాణంలో కేఎమ్. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. ఆనంద్ మాట్లాడుతూ– ‘‘అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో ఒక భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ హైలైట్‌గా ఉంటాయి. దర్శకుడిగా నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రాంబాబుగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఆనంద్ బాగా తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటి సీత తనదైన శైలిలో నటిస్తున్నారు. ఆదీష్ ఉత్రియన్ ఈ చిత్రానికి ఐదు సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చారు. విజయ్ తిరుమాలం కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ అవుతుంది. సెకండ్ షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీటవుతుంది. త్వరలో ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. సంధ్య, మనీష్, ఢిల్లీ గణేశన్, చలపతిరావు, రఘుబాబు, తాగుబోతు రమేష్, ‘చిత్రం’ శీను తదితరులు నటిస్తున్నారు. -
నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ రాక
భద్రకాళికి కిరీటం సమర్పించనున్న సీఎం ఏర్పాట్లు పరిశీలించిన డిప్యూటీ సీఎం కడియం వరంగల్ : సీఎం కేసీఆర్ ఆదివారం జిల్లాకు రానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి జిల్లాకు వచ్చి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే కొత్త జిల్లాల ఏర్పాటులో బిజీగా ఉన్న మఖ్యమంత్రి శనివారం రాలేకపోయారు. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున బంగారు కిరీటం సమర్పిం చేందుకు వెళ్తున్నందున ముందురోజు వెళ్లకుండా అమ్మవారికి ధరింపజేసే రోజున వెళ్లాలని పండితులు సూచించిన మేరకు కార్యక్రమంలో మార్పు జరిగినట్లు సమాచారం. ఈమేరకు సీఎం కేసీఆర్ దంపతులు ఆదివారం ఉదయం 9.30 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ మై దానంలో ఉదయం 10.15గంటలకు దిగుతా రు. అక్కడ నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుంటారు. అనంతరం 10.40గంటలకు భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి బంగారు కిరీట ధారణ చేస్తారు. మధ్యాహ్నం 12గంటల వరకు భద్రకాళి ఆలయంలో ఉంటారు. అక్కడి నుంచి మళ్లీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని భోజనం చేస్తారు. మధ్యాహ్నం 2గంటలకు కెప్టెన్ ఇంటి నుంచి బయలుదేరి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి 2.10గంటలకు హెలికాప్టర్లో బయలుదేరుతారు. -
భద్రకాళికి 11.7 కిలోల బంగారు కిరీటం
నేడు సీఎం కేసీఆర్ రాక రేపు మొక్కు చెల్లింపు సాక్షిప్రతినిధి, వరంగల్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శనివారం వరంగల్‌కు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భద్రకాళి అమ్మవారికి ఆదివారం మొక్కు చెల్లించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాౖటెన సందర్భంగా భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం ఇచ్చి మొక్కు తీర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో మొక్కు చెల్లించుకుంటున్నారు. భద్రకాళి అమ్మవారి కోసం రాష్ట్ర ప్రభుత్వం 11.70 కిలోల బంగారు కిరీటాన్ని తయారు చేయించింది. దీనికి రూ. 3.70 కోట్లు ఖర్చు చేశారు. జీఆర్టీ జువెల్లర్స్ ఈ కిరీటాన్ని తయారు చేసింది. బంగారు కిరీ టం మొక్కును చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా శనివారం సాయంత్రం వరంగల్‌కు వస్తున్నారు. హన్మకొండలోని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బస చేస్తారు. ఆదివారం ఉదయం భద్రకాళి ఆలయానికి వెళ్లి కిరీటం మొక్కును చెల్లిస్తారు. భద్రకాళి అమ్మవారికి సమర్పించే బం గారు కిరీటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ ఏర్పాట్లను సమీక్షించారు. శుక్రవారం రాత్రి భద్రకాళి ఆలయానికి వెళ్లి పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు కూడా సమీక్షించారు. -
అన్నపూర్ణాదేవిగా భద్రకాళి అమ్మవారు
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఉదయం నాలుగు గంటలకు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు చేశారు. అనంతరం అమ్మవారి స్నపనమూర్తిని అన్నపూర్ణగా అలంకరించి బ్రహ్మచారిణి క్రమంలో పూజలు జరిపి మకర వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్యార్చకులు చెప్పెల నాగరాజుశర్మ , పార్నంది నర్సింహామూర్తి, పాలకుర్తి నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు అమ్మవారి స్నపనమూర్తికి దేవజా క్రమంలో పూజలు నిర్వహించి చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహా నీరాజన మంత్రపుష్పము నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం వేళలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఇదిలా ఉండగా, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కేంద్ర సమాచారశాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినా«థ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ, ఆశోక్, చింత శ్యాంసుందర్ పాల్గొన్నారు. కాగా, సోమవారం చంద్ర ఘంటాక్రమంలో పూజలు నిర్వహించి అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
భద్రకాళి చెరువు మరమ్మతుకు అదనపు నిధులు మంజూరు
వరంగల్: భద్రకాళి చెరువు మరమ్మతు పనులకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్ కాకతీయ ఫేజ్- 2లో చెరువు మరమ్మతులకు రూ405.10 లక్షలు కేటాయించింది. కాగా అదనంగా పనుల కోసం ఇంజినీర్లు ప్రతిపాదించడంతో రూ.57.70 లక్షలను కేటాయించింది. దీంతో ఈచెరువుకు ఇప్పటిదాకా మొత్తం రూ.4.62 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే చేపట్టిన పనుల్లో ఎలాంటి పూడికతీతలు చేపట్టలేదు. ఈ అదనపు నిధులతో ఏయే పనులు చేపడతారనేది వేచి చూడాలి. -
భద్రకాళి అమ్మ వారిని దర్శించుకున్న సీఎండీ
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయాన్ని జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు దంపతులు ఆదివారం సందర్శించారు. ఈ సం దర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతించి పూజ లు చేయించారు. అనంతరం మహాదాశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సీజీఎం వి.తిరుపతిరెడ్డి, డీఈ బి.సామ్యానాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
భద్రకాళి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీ భద్రకాళి ఆలయంలో మూడు రోజులుగా జరుగుతున్న పవిత్రోత్సవాలు శ్రావణపౌర్ణమి సందర్భంగా గురువారం అమ్మవారిని అఖండ పవిత్రాలతో అలంకరించి పవిత్రోత్సవం సంపూర్తి చేశారు. ప్రధానార్చకుడు భద్రకాళి శేషు అధ్వర్యంలో ముఖ్యార్చకులు పార్నంది నర్సింహామూర్తి, చెప్పెల నాగరాజుశర్మ, టక్కరసు సత్యం ఉదయం నుంచి పవిత్రోత్సవ కృతువు మహాకుంభాభిషేకం జరిపారు. పావీరవికన్యా మంత్రపఠనం చేస్తూ మహాపూర్ణాహుతి నిర్వహించి హోమసంపాతాజ్యాన్ని వివిధ రంగుల ఊలు దారాలతో రూపొందించిన దండలకు లేపనం చేశారు. అనంతరం నూలు దండలను అమ్మవారి ధృవమూర్తి, ఇచ్ఛామూర్తులకు అలంకరించారు. ఊలు దారాలతో శోభాయమానంగా కొలువైన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ ఆలయంలో అర్చకులు, భక్తులు, అధికారుల వల్ల తెలిసీతెలియక జరిగే అపరాధాలు తొలగించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. దేవాలయ సూపరిటెండెంట్ అద్దంకి విజయ్, చింత శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. -
నిండని భద్రకాళి జలాశయం
వర్షకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ నగరంలోని పలు జలాశయాలు ఇంకా పూర్తిగా నిండలేదు. ఇటీవల కుండపోతగా వర్షాలు కురిసినప్పటికీ వరంగల్ భద్రకాళి చెరువులో నీటిమట్టం పెరగలేదు. దీంతో పరిసర ప్రాంతాలకు చెం దిన ప్రజలు నీటికోసం ఆందోళనకు గురవుతున్నారు. వరుణదేవుడు మరోసారి కరుణించి భారీ వర్షాలు కురిపించి భద్ర కాళి చెరువును నింపాలని వారు వేడుకుంటున్నారు. -
సర్వ మంగళాదేవిగా అమ్మవారి దర్శనం
భద్రకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉదయం అమ్మవారిని మాత్రా క్రమంలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజు శర్మ, పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం తదితరులు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం అమ్మవారి ధృవమూర్తిని టమాట, నిమ్మకాయలు, ఆకుకూరల దండలతో, పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. భద్రకాళి మాత ఇచ్ఛామూర్తిని మాత్రాక్రమంలోనూ, సర్వమంగళా మాతగా అలంకరించారు. చతుః స్థానార్చన పూజలు, నీరాజన మంత్ర పుష్పములు, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. నేడు(సోమవారం) ముద్రా, జ్వాలామాలినీ క్రమాలలో అమ్మవారు పూజలు అందుకోనున్నారు. రేపు(మంగళవారం) శాకంబరీ అలంకరణ సందర్భంగా భక్తులకు ఇబ్బంది కలుగకుండా దేవాలయంలో క్యూలైన్లను ఏర్పాటు చేశారు. -
దాచిన పత్తే..ఉసురు తీసింది
గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తిని అమ్ముకోలేక ఇంట్లో దాచుకుంటే.. అది ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లంతా బయటకు వెళ్లగా.. ఆ చిన్నారులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. అయితే వారు ఆడుకుంటూ పత్తి కూటు పరదాను తాకారో.. లేక బరువుతోనే అది కూలిందో గానీ.. ఆ పత్తి కూటు ఆ చిన్నారులపై పడింది. వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దలు ఇళ్లు చేరేసరికి ఆ చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కేసముద్రం, న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో బోసినవ్వులు మాయమయ్యూయి. అప్పటిదాక తాతయ్యా అంటూ ఆటలాడిన ఆ ముగ్గురి పిల్లలు అనంతలోకాలను చేరారు. ధర రాకపోవడంతో దాచిపెట్టిన పత్తే వారి ప్రాణం తీసింది. ఇంట్లో ఉన్న పత్తి కూటు అమాంతం మీదపడగా ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోరుకొండపల్లి గ్రామాని కి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వారిలో వీరన్నకు కురవి మండలం కాంపెల్లికి చెందిన భవానితో వివాహం కాగా వారికి కుమారుడు విక్కీ(3) ఉన్నాడు. పది రోజుల క్రితమే మళ్లీ కుమారుడు జన్మించాడు. సుజాతకు కూడా కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన మేనమామ చిట్టాల వీరన్నతో వివాహమైంది. వారికి కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా సుజాత, చిట్టాల వీరన్న దంపతులు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. అయితే శివరాత్రి పర్వదినంతోపాటు తన అన్న వీరన్నకు కుమారుడు పుట్టాడని తెలియడంతో సుజాత సూరత్ నుంచి కాంపల్లికి వచ్చింది. శివరాత్రి రోజు కురవిలో జాగారం ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న అన్న కుమారుడిని చూసింది. అనంతరం ఆదివారం కోరుకొండపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. కాగా బేతు వెంకటయ్య అన్న కొమురయ్య కోడలు ఉమ పురుగుల మందు తాగి మానుకోట ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఆమెను చూసేందు కు సోమవారం వెంకటయ్య భార్య యాదమ్మ, కుమారుడు వీరన్న, కూతురు సుజాత వెళ్లారు. ఇంటి దగ్గర పిల్లలు జాగ్రత్త అని వెంకటయ్యకు చెప్పి వెళ్లారు. మనవళ్లను, మనవరాలిని దగ్గరకు తీసుకుని అప్పటిదాక ఆడించిన వెంకటయ్య వారికి అన్నం తినిపించాడు. విక్కీ నిద్రకు రావడంతో పడుకోబెట్టాడు. మేము టీవీ చూస్తాం తాతయ్య.. బయటకు పోములే అని తలుపు పెట్టుకున్నారు. వారు టీవీ చూస్తున్నారులే అనుకుని వెంకటయ్య బయటకు వెళ్లి వచ్చాడు. పిల్లలను ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీకి ఉన్న జాలిని కోసి చూడడంతో పత్తి కూటు కుప్పకూలి కనిపించింది. దీంతో లబోదిబోమంటూ గట్టిగా కేకలు పెడుతూ తలుపులను ఎంత నెట్టినా రాలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. పత్తి మొత్తం ఆ ముగ్గురు పిల్లలను కప్పేసి ఉంది. పత్తిని తోడి తీయడంతో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వారిని చూసిన వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు కన్నీరుమున్నీరవుతూ వారిని బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీరన్న, సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వచ్చి పిల్లల శవాలపై పడి బోరునవిలపిస్తూ సొమ్మసిల్లారు. కొడుకు పుట్టిన సంబురంలోనే... వీరన్న, భవాని దంపతులకు రెండో కుమారుడు పది రోజుల క్రితమే పుట్టాడు. దీంతో విక్కీ తల్లితోనే కాంపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అయితే సూరత్ నుంచి తన చెల్లెలి పిల్లలు రావడంతో వీరన్న విక్కీని కోరుకొండపల్లికి తీసుకొచ్చాడు. రెండో సారి కుమారుడు పుట్టాడనే సంబురా న్ని కుటుంబ సభ్యులతో పూర్తిగా పంచుకోకముందే మూడేళ్ల విక్కీ మాయమయ్యూడు. నీ తమ్మున్ని చూద్దువు లేరా కొడుకా అంటూ వీరన్న తన కొడుకు శవంపైపడి బోరున విలపించడాన్ని చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
గీత స్మరణం
పల్లవి : ఆమె: చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ చరణం : 1 అతడు: నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ ఆ: నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ అ: పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ ఏడేడు జన్మలకూ నాతోడు నీవమ్మా ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా ఆ: అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవూ నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌనూ అ: గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే చరణం : 2 ఆ: స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో అ: దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే ఆ: అందాల కన్నులకూ కాటుకను దిద్దేనూ చెడుచూపు పడకుండా అదరు చుక్కపెట్టేనూ చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా అ: నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఆ: ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ అ: జోలపాట పాడేనూ ఆ: లాలిపాట పాడేనూ ఆ: జోలాలి... అ: జోలాలి... (2) ఇద్దరూ: జోజోజో... చిత్రం : భద్రకాళి (1977) రచన : దాశరథి సంగీతం : ఇళయరాజా గానం : జేసుదాస్, పి.సుశీల - నిర్వహణ: నాగేశ్