అమ్మవారు.. భక్తుడు.. ఓ దుష్టశక్తి | Bhadrakali completes first schedule | Sakshi
Sakshi News home page

అమ్మవారు.. భక్తుడు.. ఓ దుష్టశక్తి

Published Sat, Mar 31 2018 12:28 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Bhadrakali completes first schedule - Sakshi

సీత

సీనియర్‌ నటి సీత అమ్మవారి పాత్రలో నటించిన చిత్రం ‘భద్రకాళి’. ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాణంలో కేఎమ్‌. ఆనంద్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీటైంది. ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో ఒక భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్‌ హైలైట్‌గా ఉంటాయి. దర్శకుడిగా నాకు చాన్స్‌ ఇచ్చిన నిర్మాత రాంబాబుగారికి ధన్యవాదాలు’’ అన్నారు.

‘‘ఆనంద్‌ బాగా తెరకెక్కిస్తున్నారు. సీనియర్‌ నటి సీత తనదైన శైలిలో నటిస్తున్నారు. ఆదీష్‌ ఉత్రియన్‌ ఈ చిత్రానికి ఐదు సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. విజయ్‌ తిరుమాలం కెమెరా వర్క్‌ సినిమాకు ప్లస్‌ అవుతుంది. సెకండ్‌ షెడ్యూల్‌తో షూటింగ్‌ కంప్లీటవుతుంది. త్వరలో ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. సంధ్య, మనీష్, ఢిల్లీ గణేశన్, చలపతిరావు, రఘుబాబు, తాగుబోతు రమేష్, ‘చిత్రం’ శీను తదితరులు నటిస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement