SEETHA
-
ముగ్గురు పల్లెటూరి పిల్లగాళ్ల కథే తురుమ్ ఖాన్ సినిమా
నిమ్మల శ్రీరామ్, దేవరాజ్ పాలమూర్, అవినాష్ చౌదరి హీరోలుగా, పులి సీత, విజయ, శ్రీయాంక హీరోయిన్లుగా నటించిన పల్లెటూరి రివెంజ్ కామెడీ డ్రామా ఫిల్మ్ ‘తురుమ్ ఖాన్లు’. శివకల్యాణ్ దర్శకత్వంలో ఆసిఫ్ జానీ నిర్మించిన చిత్రం ఇది. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శివకల్యాణ్ మాట్లాడుతూ– ‘‘ఈ ఆధునిక యుగంలో బ్రహ్మ, విష్ణు, ఈశ్వర్ అనే ముగ్గురు యువకులు ఒకే ఊరిలో పుట్టి, పెరిగి సరదాగా ఒకరినొకరు ఎలా ఆటపట్టించుకుంటారు? ఒకర్ని ఒకరు ఎలా ఏడిపించుకుంటారు? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘తురుమ్ ఖాన్లు’ చిత్రం చిన్న సినిమాగా విడుదలైనా రిలీజ్ తర్వాత పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు నిర్మాత ఆసిఫ్. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, అఖిలేష్ గోగు, సహనిర్మాత: కె. కల్యాణ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దేవరాజ్ పాలమూర్. -
ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే!.. నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా?
ప్రేమ వివాహం చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన దర్శక నటుడు పార్తీపన్, నటి సీత మనస్పర్థల కారణంగా 11 ఏళ్ల క్రితం విడిపోయిన విషయం తెలిసిందే. తాజాగా తాము విడిపోవడానికి సీతనే కారణమని పార్తీపన్, ఆయన చెప్పినదంతా అబద్ధమని సీత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పాండ్యరాజన్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయిన ఆన్‌పావం చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయిగా ముద్ర వేసుకున్న ఈమె ఆ తరువాత వరుసగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం తదితర భాషల్లో అవకాశాలు దక్కించుకుని హీరోయిన్గా మంచి స్థాయికి చేరుకున్నారు. దర్శకుడు భాగ్యరాజ్ శిష్యుడు పార్తీపన్ తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా పరిచయమైన పుదియపాదై చిత్రంలో సీత నాయకిగా నటించారు. ఆ చిత్రంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడచింది. దీంతో 1990లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా 2001లో విడిపోయారు. ఆ తరువాత సీత 43 ఏళ్ల వయసులో బుల్లితెర నటుడు సతీష్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే కొద్ది కాలంలోనే వీరిద్దరూ విడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో సీత మొదటి భర్త పార్తీపన్ ఆమె గురించి ఒక కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము విడిపోవడానికి కారణం సీత అత్యాసే కారణమని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సీత స్పందించారు. తాను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నటిని అని, ఒక చిత్రంలో నటి సుహాసిని చెప్పినట్లు నా భర్త నాకే సొంతం అని ఆశించడం తప్పా అని ప్రశ్నించారు. పార్తీపన్ చెప్పినవన్నీ అసత్యాలే అన్నారు. -
నటి సీత 55 ఏళ్ల వయసులోనూ ఎంత అందంగా ఉందో..
తమిళసినిమా: మనసుకు వయసుతో పని లేదంటారు. అయితే ఆలోచనలు, అలవాట్లపై ప్రభావం చూపుతాయి. నటి సీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1985లో పాండిరాజ్ దర్శకుడిగా, కథానాయకుడిగా పరిచయం అయ్యారు. అదే చిత్రం ద్వారా కథానాయికగా పరిచయం అయిన నటి సీత. తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్న లక్కీ హీరోయిన్. ఆ తరువాత ప్రముఖ నటులతో జతకట్టి పాపులర్ అయ్యారు. తెలుగు తదితర భాషల్లోనూ నటించారు. కాగా 1990లో నటుడు పార్తీపన్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన పుదియపాదై చిత్రంలో ఆయనకు జంటగా సీత నటించారు. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. దీంతో నటనకు దూరమయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2001లో విడాకులు తీసుకున్నారు. నటిగా రీ ఎంట్రీ ఇచ్చారు. అక్క, అమ్మ, పాత్రల్లో నటిస్తున్నారు. బుల్లితెర, తెలుగులోన నటిస్తున్న సీత 2010లో సురేష్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలువ లేదు. నటనను కొనసాగిస్తున్న సీత వయసు జస్ట్ 55. తాజాగా ఆమె స్పెషల్ ఫొటో షట్ చేసుకుని ఆ ఫొటోలను సావజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ ఫొటోలను చూస్తే కొత్తవారు అనుకుంటున్నారు. ఇలా సీతను చూస్తే అందానికి వయసుకు సంబంధం ఉండదనిపిస్తోంది. తన అవయవ సంపదను తెలియచేయడానికే సీత ఈ ఫొటోలను సామాజిక మాద్యమాలకు విడుదల చేశారా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Seetha PS (@seethaps67) -
కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడుతున్నారు. దయాకర్‌రెడ్డి గురువారం ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతకాలం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నా ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొంతకాలంగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. (క్లిక్: అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా) ఈ క్రమంలో దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. (క్లిక్: అన్ని పార్టీల్లోనూ అదే సీన్ అలక.. అసంతృప్తి) -
శాంతి కపోతం.. డీఎస్పీ సీతారెడ్డికి ఐరాస శాంతి పతకం
తెలంగాణ పోలీసు విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా (డీఎస్పీ) విధులు నిర్వర్తిస్తున్న పెద్దారెడ్డి సీతారెడ్డి రాష్ట్రం తరఫున ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేస్తున్నారు. ఈ ఏడాది దక్షిణ భారత దేశం నుంచి ఎంపికైన వారిలో సీతారెడ్డి మాత్రమే ఏకైక మహిళ. ఈమెకు ఐక్యరాజ్య సమితి (యూఎన్) శుక్రవారం (భారత కాలమాన ప్రకారం) పీస్ మెడల్, సర్టిఫికెట్ ప్రదానం చేసింది. ఉన్నత విద్యనభ్యసించి పోలీసుగా... హైదరాబాద్‌కు చెందిన సీతారెడ్డి ఉన్నత విద్యనభ్యసించారు. నగరంలోనే వివిధ యూనివర్శిటీల్లో ఎంఏ (ఇంగ్లీష్), ఎంఏ (సైకాలజీ), ఎంఈడీ, సైబర్ క్రైమ్స్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1996లో సబ్–ఇన్స్పెక్టర్గా పోలీసు విభాగంలోకి అడుగుపెట్టారు. ఇన్స్పెక్టర్, డీఎస్పీ హోదాల్లో నల్లగొండ టూ టౌన్, జీడిమెట్ల, సరూర్‌నగర్ ఉమెన్, పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్లతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాల్లో పని చేశారు. రాష్ట్ర నేర పరిశోధన విభాగంలో (సీఐడీ) డీఎస్పీ గా పని చేస్తుండగా సీతారెడ్డి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో పని చేయడానికి ఎంపికయ్యారు. రెండోసారి ఈ దళంలో పని... అంతర్గత ఘర్షణలతో అతలాకుతలం అవుతున్న సూడాన్, తైమోర్ తదితర దేశాల్లో శాంతి పరిరక్షణకు, అక్కడి పోలీసు విభాగానికి శిక్షణ ఇవ్వడానికి ఐక్యరాజ్య సమితి ఈ శాంతి పరిరక్షక దళాన్ని వినియోగిస్తోంది. వివిధ దేశాలకు చెందిన పోలీసు విభాగాల నుంచి ఏడాది సమయం పని చేయడానికి అధికారులను ఎంపిక చేస్తుంది. రాత పరీక్ష, మౌఖిక పరీక్షలతో పాటు డ్రైవింగ్, షూటింగ్ వంటి పోటీలు నిర్వహించి.. ఉత్తీర్ణులైన వారికే దళంలో పని చేసే అవకాశం ఇస్తుంది. ఈ ఏడాది భారతదేశం నుంచి మొత్తం 29 మందికి ఈ అవకాశం దక్కగా... వీరిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. దక్షిణ భారతదేశం నుంచి సీతారెడ్డికే ఈ అవకాశం దక్కింది. ఇలా ఐక్యరాజ్య సమితి దళంలోకి ఈమె ఎంపిక కావడం ఇది రెండోసారి. తెలుగు రాష్ట్రాల నుంచి రెండుసార్లు ఎంపికైన వాళ్లు ఇంకెవరూ లేరు. జూలై నుంచి జూబాలో విధులు... యూఎన్ శాంతిపరిరక్షక దళంలో పని చేయడానికి సీతారెడ్డి ఈ ఏడాది జూలై 19న సౌత్ సూడాన్ చేరుకున్నారు. అప్పటి నుంచి అక్కడి జూబా ప్రాంతంలో ఉన్న పోలీసు ట్రై నింగ్ అండ్ సెన్సిటైజేషన్ యూనిట్లో పోలీసు అడ్వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటి వరకు అకుంఠిత దీక్షతో, క్రమశిక్షణతో పని చేస్తూ ఎలాంటి ప్రతికూల రిమార్క్స్ లేని వారిని ఎంపిక చేసిన యూఎన్ శుక్రవారం పీస్ మెడల్, సర్టిఫికెట్ అందించింది. వీటిని అందుకున్న వారిలో సీతారెడ్డి కూడా ఉన్నారు. ఆమె ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ... ‘సూడాన్ పోలీసుల్లో శక్తిసామర్థ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వడం మా విధి. పూర్తి ప్రతికూల వాతావరణంలో పని చేయడం కొత్త అనుభవాలను నేర్పిస్తోంది. యూఎన్ మార్గదర్శకాల ప్రకారం వారికి నేర్పడంతో పాటు ఎన్నో కొత్త అంశాలను ఇక్కడ నేర్చుకోగలుగుతున్నా’ అని అన్నారు. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో సభ్యురాలిగా సీతారెడ్డి (ఎడమనుండి రెండవ వ్యక్తి) – శ్రీరంగం కామేష్ ,సాక్షి సిటీ బ్యూరో -
మనుషులు ఊరికే ఉండరు: హ్యాట్సాఫ్ సీతాదేవి!
కొన్ని సంఘటనలు మనుషుల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చెన్నైకి చెందిన 36 ఏళ్ల సీతాదేవిని కూడా ఒక సంఘటన ఇలాగే ప్రభావితం చేసింది. మే 1, 2021న ఆమె తన తల్లిని తీసుకుని పార్క్టౌన్లో ఉండే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. తల్లికి కరోనా వచ్చింది. ఆక్సిజన్ అందడం లేదు. ఆ సమయంలో కరోనా కేసులు చెన్నైలో ఉధృతంగా ఉన్నాయి. పేషెంట్లు చాలా మంది గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చి ఉన్నారు. సీతాదేవి ఎంత తొందర చేసినా ఆమెకు అడ్మిషన్ దక్కలేదు. కొన్ని గంటలపాటు హాస్పిటల్ బయటే శ్వాస అందక సీతాదేవి తల్లి బాధ పడింది. ఇక లాభం లేదనుకుని వేరే హాస్పిటల్‌కు తీసుకెళ్లి చేర్చింది తల్లిని సీతాదేవి. అయితే ఆ వెంటనే ఆమె చనిపోయింది. సీతాదేవికి కోపం వచ్చింది. దుఃఖం వచ్చింది. హాస్పిటల్లో తన తల్లికి ఆక్సిజన్ అంది ఉంటే ఆమె బతికేది కదా అనిపించింది. అదే సమయంలో రోజూ ఎంతోమంది హాస్పిటల్లో అడ్మిషన్ కోసం వచ్చి ఆ తతంగం పూర్తయ్యే దాకా ఆక్సిజన్ అందక అవస్థలు పడుతున్నారని ఆమెకు అర్థమైంది. వారి కోసం ఏదైనా చేయాలని వెంటనే నిశ్చయించుకుంది. ఆక్సిజన్ ఆటో సీతాదేవి చెన్నైలో కొంత కాలంగా ఒక చిన్న ఎన్.జి.ఓ నడుపుతోంది. హెచ్ఐవి పేషెంట్ల కోసం పని చేస్తుందా ఎన్.జి.ఓ. వారి కోసమని ఒక ఆటోను ఏర్పాటు చేసిందామె. ఇప్పుడు కోవిడ్ పేషెంట్ల కోసం ఒక ఆక్సిజన్ ఆటోను నడపడానికి నిర్ణయించుకుంది. వెంటనే ఒక కొత్త ఆటోకు ఆక్సిజన్ సిలిండర్ బిగించి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ బయట అయితే తల్లి ఆక్సిజన్ కోసం అవస్థ పడిందో అదే హాస్పిటల్ బయట ఆ ఆటోను నిలబెట్టసాగింది. హాస్పిటల్లో అడ్మిషన్ కోసం వచ్చిన పేషెంట్లు ఆక్సిజన్ అందక బాధపడుతుంటే ఈ ఆటో ఎక్కి ఆక్సిజన్ పెట్టుకోవచ్చు. పూర్తిగా ఉచితం. ఎంతమంది వస్తే అంతమంది ఒకరి తర్వాత ఒకరు ఇక్కడ ఆక్సిజన్ పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ఆటో హాస్పిటల్ దగ్గరే ఎప్పుడూ ఉంటుంది. ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ అయితే ఇంకో సిలిండర్ వెంటనే సిద్ధమవుతుంది. ‘నేను ఆక్సిజన్ ఆటో మొదలెట్టాక ఎంతోమంది ఆక్సిజన్ తీసుకుంటున్నారు. అచ్చు మా అమ్మలాంటి ఒకామె నా ఆటోలో కూచుని ఆక్సిజన్ పొంది బెడ్ కన్ఫర్మ్ అయ్యాక హాస్పిటల్లోకి వెళ్లింది. అంతవరకూ ప్రాణాలు కాపాడినందుకు ఆమె కళ్లల్లో కనిపించిన కృతజ్ఞత మర్చిపోలేను’ అంటుంది సీతాదేవి. మనుషులు కొందరు ఊరికే ఉంటారు. కొందరు ఊరికే ఉండలేరు. ఆ ఊరికే ఉండలేని వారి మానవత్వం వల్లే ఈ జగతి నడుస్తూ ఉంటుంది. చదవండి: రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం.. -
భర్త మరణించాడని కుంగిపోలేదు.. తానే ముందుండి..
కుటుంబానికి ఆధారమైన భర్త స్వర్గస్తుడయ్యాడని కుంగిపోలేదు. కుటుంబాన్ని ఎలా ఈడ్చాలా అని దిగులు చెందలేదు. భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుని భయాందోళనకు గురికాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పట్టణంలో పుట్టి చదువుకున్న ఓ మహిళ కుటుంబ పోషణకు వ్యవసాయాన్ని ఆధారంగా ఎంచుకుంది. సొంత భూమి లేకపోయినా కౌలుకు తీసుకుని వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయంలో ఒడిదుడుకులు చవిచూస్తూ ఆదర్శ వ్యవసాయ మహిళగా ప్రజలు, పాలకులతో ప్రశంసలు అందుకుంటోంది నవరంగపూర్ పట్టణానికి చెందిన సీత. –జయపురం నవరంగపూర్ పట్టణానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు సీహెచ్ నారాయణ రావు కుమార్తె సీత ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తూ పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు జిల్లా యంత్రాంగం ఆదర్శ మహిళగా గుర్తించి సన్మానించింది. పట్టభధ్రురాలైన ఆమెకు 22 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. ఒక కుమారుడు, కుమార్తె పుట్టిన తరువాత 18 ఏళ్ల క్రితం భర్త స్వర్గస్తుడయ్యాడు. దీంతో కుటుంబ జీవనోపాధికి నవరంగపూర్ నుంచి విశాఖపట్నానికి చింతపండు, అల్లం తీసుకువెళ్లి విక్రయిస్తుండేది. వ్యవసాయ జిల్లా అయిన నవరంగపూర్‌లో పుట్టి పెరగడంతో వ్యవసాయంపై మక్కువ ఉన్నా తగిన అవకాశం, ప్రోత్సాహం లేక వ్యాపారం చేస్తుండేది. అయితే ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తున్న వారిని చూసి ప్రభావితురాలై తాను కూడా వ్యవసాయం చేయాలని నిర్ణయించింది. ఉత్సాహం అయితే ఉంది కానీ వ్యవసాయానికి అవసరమైన పంట భూమిలేదు. ఈ క్రమంలోభూమికోసం ప్రయత్నించి చివరికి నందాహండి సమితి దహనహండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 6 ఎకరాల కొండ ప్రాంత మెట్ట భూమిని కౌలుకు తీసుకుంది. ఆ భూమిని బాగు చేసి వ్యవసాయానికి అనువుగా తయారు చేసి మొదటి సారిగా 6 ఎకరాలలో అల్లం పంట వేసింది. మొదటి సారి కావడం, వర్షాలు సహకరించక పోవడంతో దాదాపు 40 శాతం పంట కుళ్లిపోవడంతో నష్టం వచ్చింది. అయినా ఆమె వెనుకంజ వేయకుండా రుణాలు తెచ్చి మళ్లీ అల్లం పంట వేసింది. అల్లంతో పాటు పలు మిశ్రమ పంటలను పండించింది. వ్యవసాయ రంగంలో అడుగుపెట్టిన తరువాత పాత పద్ధతుల్లో సాగు చేస్తే అంతగా లాభాలు రావన్న విషయం గ్రహించి ఆధునిక పద్ధతులు తెలుసుకోవాలని ప్రయత్నించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో వ్యవసాయ వైజ్ఞానికులను కలిసి ఆధునిక పరిజ్ఞానం సంపాదించింది. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో అల్లం, ఇతర పంటలకు శ్రీకారం చుట్టింది. ఆధునిక పద్ధతిలో పండించిన అల్లం ఒక మొక్కకు కేజీన్నర నుంచి రెండు కేజీల అల్లం ఉత్పత్తి కావడం ఆమె సాధించిన విజయమనే చెప్పవచ్చు. ఇలా ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు ఆర్జిస్తూ మరో పదిమందికి ఆదర్శంగా నిలుస్తోంది. సహాయ సహకారాల్లేవు వ్యవసాయానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని రైతులకు హామీలు ఇస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. కనీసం వ్యవసాయ వైజ్ఞానిక సహాయం కూడా లేదు. అందువల్ల ఇతర రాష్ట్రాలకు వెళ్లి వైజ్ఞానిక పద్ధతులు తెలుసుకోవలసి వచ్చింది. నాలాంటి వారికి ప్రభుత్వం సహాయం అందజేస్తే మెరుగ్గా ఉంటుంది. -
గుడి తాళం తెరవక ముందే హడావుడి!
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/కృష్ణలంక(విజయవాడ తూర్పు): టీడీపీ రాజకీయ కుట్రల్లో భాగంగానే ఆలయాల్లో విగ్రహాలపై దాడులు జరుగుతున్నాయా అన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సీతారామ ఆలయం వద్ద టీడీపీ నేతలు వ్యవహరించిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. పూజారి వచ్చి గుడి తలుపులు కూడా తెరవక ముందే ఆ ఆలయంలో సీతమ్మ మట్టి విగ్రహం ధ్వంసమైందంటూ టీడీపీ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఓ నేత.. కొంత మంది ఆటో డ్రైవర్లను వెంటబెట్టుకుని వచ్చి అక్కడ హడావుడి చేశాడు. పూజారి రాకముందే.. అంటే ఉదయం 9.30 గంటలకు పూజారి రాజశేఖర్‌శర్మ తాళం తీయడానికి రాగా, అప్పటికి అరగంట ముందు నుంచే అక్కడ టీడీపీ నాయకులు గుమికూడి హడావుడి మొదలెట్టారు. టీడీపీ నేతల హడావుడి తర్వాతే ఆర్టీసీ అధికారులకు ఆ సమాచారం తెలిసింది. వెంటనే ఆర్టీసీ సిబ్బంది ఫోన్ ద్వారా ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. అంతేగాకుండా విగ్రహం ధ్వంసమైందన్న సమాచారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియాకు చేరిందని, టీడీపీ శ్రేణులిచ్చిన సమాచారాన్ని ఓ టీవీ కెమేరామేన్ ఇతర మీడియా సభ్యులుండే గ్రూపులో పోస్టు చేసినట్టు తమ పరిశీలనలో తేలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. దేవదాయ శాఖ పరిధిలో లేని ఆ చిన్న ఆలయానికి మూడు వైపులా పూర్తిగా మూసివేసి ఉంటుంది. ముందు వైపు చెక్క తలుపులు, ఇనుప గేట్ ఉంటుంది. పూజారి రోజుకోసారి నైవేద్యం పెట్టి వెళుతుంటారు. ఆలయ ప్రాంగణాన్ని ఊడ్చే మహిళ కూడా గత కొద్ది రోజులుగా రావడం లేదు. నేను వెళ్లేసరికే వారు అక్కడున్నారు: ఆలయ పూజారి ఆర్టీసీ సిబ్బంది తనకు ఉదయం 9 గంటల సమయంలో ఫోన్ చేసి విషయం చెప్పగా, తాను 9.30 గంటల సమయంలో వచ్చి గుడి తాళం తెరిచినట్టు ఆలయ పూజారి రాజశేఖర్‌శర్మ చెప్పారు. అయితే అప్పటికే అక్కడ టీడీపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు, పోలీసులున్నట్టు తెలిపారు. టీడీపీ నేతలు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతోనే తాము అక్కడకు చేరుకున్నట్టు బీజేపీ కండువాలున్న గోసంరక్షణ సంఘం ప్రతినిధులు చెప్పారు. హడావుడి చేద్దామని వెళ్లి.. అభాసుపాలు కృష్ణా జిల్లా ఉయ్యూరు శివాలయంలో కేతువు విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆదివారం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యకర్తలను పోగేసి ఆలయానికి వెళ్లారు. తీరా ఆ విగ్రహం చేతి భాగంలో రెండు నెలల కిందటే చిన్నపాటి పెచ్చులూడాయని పూజారి సత్యనారాయణశర్మ చెప్పడంతో టీడీపీ నేతల ఉత్సాహం నీరుగారిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలు ధ్రువీకరించడంతో ఎమ్మెల్సీ అక్కడ నుంచి జారుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు విజయవాడ పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న సీతారామాలయంలో ఆదివారం మట్టి విగ్రహం ఒరిగిపోవడంతో పగిలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. ఉదయం 5.50 సమయంలో తాను దండం పెట్టుకునేందుకు వెళ్లినప్పుడు విగ్రహాలు బాగానే ఉన్నాయని దుర్గాపురం సుందరయ్య కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ మోహన్ కనకదుర్గావర ప్రసాద్ పోలీసులతో చెప్పారు. ఘటనపై డీసీపీ–2 విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ గుడి గేట్‌కు తాళం వేసి ఉందని, లోపలకు వెళ్లేందుకు అవకాశం లేదని, అయినా విగ్రహం ముందుకు పడిందని, ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. -
సీత క్షమించింది..!
సాక్షి, దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రజా సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా జరుగుతున్న మేలు గురించి ఓ మహిళ వివరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏడాది వ్యవధిలో రాష్ట్రంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులు, సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటివద్దే అందుతున్న సౌకర్యాల గురించి ప్రస్తావిస్తూ పాలనలో వ్యత్యాసాన్ని కళ్లకు కట్టినట్లు వివరించింది. అయితే.. విశాఖ జిల్లా బుచ్చెయ్యపేట మండలం కొండెంపూడికి చెందిన జనసేన సానుభూతిపరులైన ఇద్దరు యువకులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టారు. రావికమతం మండలం కొత్తపేట గ్రామానికి చెందిన దంట్ల నాగసీత వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే బీటెక్ చదువుతున్న ఆ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్ద మనసుతో కేసును వాపసు తీసుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆమెను ప్రాధేయపడ్డారు. ఆ యువకులు ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయబోమని పశ్చాతాపం వ్యక్తం చేయడంతో ఆమె కేసు వాపసు తీసుకుంది. (డాక్టర్ సుధాకర్ పోలీసుల అదుపులో లేరు) -
ఆ మాటే చాలు
ఎలాంటి పాత్రలో అయినా ఇట్టే పరకాయ ప్రవేశం చేస్తారు కథానాయిక కాజల్ అగర్వాల్. ఇలా తన నటనతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ, మధ్య మధ్యలో హిందీలోనూ అలరిస్తూ కెరీర్లో 50 చిత్రాల మైలురాయిని కూడా దాటేశారు. కోలీవుడ్, టాలీవుడ్... వీటిలో ఏ ఇండస్ట్రీ మీ ఫేవరెట్ అన్న ప్రశ్నను కాజల్ ముందుంచితే... ‘‘రెండు ఇండస్ట్రీల్లో నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది. రెండింటినీ సమానంగానే చూస్తాను. కానీ నేను ఇలాంటి విషయాలకన్నా నా పాత్రల ఎంపికపై ఎక్కువ దృష్టిపెడతాను. నాకు సూట్ అయ్యే పాత్రలు చేస్తున్నానా? అవి ఆడియన్స్‌కు ఎంత నచ్చుతున్నాయి? నటిగా నేను మెరుగుపరచుకోవాల్సిన అంశాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఫలానా పాత్రలో కాజల్ బాగా నటించింది అని ఆడియన్స్ అంటే ఆ మాటే చాలు నాకు. వారి మెప్పు కోసం ఎంతైనా కష్టపడతాను’’ అని అన్నారు. తమిళంలో ‘కోమలి’, ‘ప్యారిస్ ప్యారిస్’, తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘సీత’, శర్వానంద్‌తో ఓ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశారామె. కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో హీరోయిన్గా ఎంపికైన కాజల్ తెలుగు సినిమా ‘మను చరిత్ర’కు ఓ నిర్మాత. నిర్మాణ రంగంలోకి కాజల్ ఎంట్రీ ఈ చిత్రంతోనే. -
‘సీత’ ఎప్పుడొస్తుందో!
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి శ్రీనివాస్, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ కథానాయకుడు కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ తరువాత తేజ దర్శకత్వంలో సీత సినిమాను ప్రారంభించాడు. గత ఏడాది జూలైలోనే తేజ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు సాయి శ్రీనివాస్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే కవచం సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశారు. అయితే ఆ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో సీత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నెలాఖరుకు వాయిదా పడిందన్న టాక్ వినిపిస్తోంది. మే 1 నుంచి వరుస రిలీజ్లు ఉండటంతో మే 24 న సీత సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ డేట్‌కి అయిన వస్తుందో లేదో చూడాలి. సాయి శ్రీనివాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. అనూప్ రుబెన్స్ సంగీతమందిస్తున్నారు. -
అలాంటి తప్పులు చేస్తే..!
జీవితం అంటే ఒక అందమైన అనుభవం కావాలి. అయితే అది అందరికీ అలా జరుగుతుందని చెప్పలేం. అలా జరగాలని కోరుకోవడంలో మాత్రం తప్పులేదు. అందుకు ఏం చేయాలన్న దాని గురించి నటి కాజల్ అగర్వాల్ ఏం చెబుతుందో చూద్దాం. కాజల్ ఈ స్థాయికి చేరుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చిందట. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా రాణిస్తున్న కాజల్‌అగర్వాల్ తమిళంలో కమలహాసన్‌కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఆమె నటించిన ఫ్యారిస్ ఫ్యారిస్ చిత్రం విడుదల కావలసి ఉంది. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది. ఈ సందర్భంగా కాజల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పని ఒత్తిడి తగ్గించుకోవాలని, ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని, కొందరు నటీమణులు జపిస్తుంటారని అంది. ప్రతి విషయంలోనూ తమకు నచ్చినట్టుగా ఉండాలని ఆశ పడుతుంటారని పేర్కొంది. ప్రస్తుతం తానూ అలాగే భావిస్తున్నానని అంది. మన చుట్టూ చాలా వ్యతిరేక శక్తులు ఉంటాయని, అలాంటి వాటిపై కొందరు ఆసక్తి చూపుతుండడం గమనించినట్లు చెప్పింది. ఇతరులపై వ్యతిరేకతలన్నవి వినడానికి బాగానే ఉన్నా, మన వరకూ వచ్చే సరికి వాటిని తట్టుకోవడం కష్టం అని చెప్పింది. అందుకే తాను చెడుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తప్పుడు ఆలోచనలను మనసులోకి రాకూడదని, అందుకు ఉదయం లేచినప్పటి నుంచి మంచి విషయాల గురించి చదవడం, చూడడం వంటివి చేస్తే ఆ రోజంతా బాగుంటుందని అంది. అదేవిధంగా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, అలా మాట్లాడేవారిని ప్రోత్సహించడం కూడా తప్పని పేర్కొంది. అసలు అలాంటి వారి మాటల్ని నమ్మడం ఇంకా తప్పు అని అంది. అలాంటి తప్పులు చేస్తే మన ప్రశాంతతకే భంగం కలగుతుందని, మనసు అశాంతికి గురవుతుందని కాజల్ అగర్వాల్ పేర్కొంది. -
ఓ సీత కథ
తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న సినిమా ‘సీత’. రామబ్రహ్మాం సుకంర నిర్మిస్తున్నారు. అజయ్ సుకంర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌తో పాటు సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో కాజల్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. పురాణాల్లో సీత ఫుల్ పాజిటివ్. ఆ సీతకు ఈ రీల్ సీతకు సంబంధం లేదు. ఈ రీల్ సీతలో కొత్త యాంగిల్ చూడబోతున్నామన్న మాట. ఈ సినిమాకు కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
యత్ర నార్యస్తు పూజ్యంతే
అరుంధతిని వివాహమాడాడు వశిష్ఠుడు. వివాహ కాలంలో అరుంధతి నక్షత్రం చూపుతారు. అది ఒక స్త్రీకి భారతీయ సంస్కృతి ఇచ్చిన స్థానం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు చరిస్తారు, ఎక్కడ స్త్రీలను పూజించరో అక్కడ జరిగే సత్కర్మలకు విలువ ఉండదు అంటోంది మన సంస్కృతి. త్రిమూర్తులకు మూలమైన ఆదిపరాశక్తి స్త్రీ. ప్రకృతిని స్త్రీరూపంగా చెప్పాయి వేదాలు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా పూజించమన్నారు ఋషులు. ఋగ్వేదంలోని దేవీ సూక్తం, స్త్రీని విశ్వశక్తిగా చెప్పింది. మన ఉపనిషత్తులు, శాస్త్రాలు... స్త్రీని సాధికారత కలిగిన స్వరూపంగా పేర్కొన్నాయి. ఋగ్వేదం స్త్రీ ఔన్నత్యాన్ని ప్రశంసించింది. ‘నేను మహారాణిని, సంపదను సేకరిస్తాను, ఆలోచిస్తాను, తొలి వందనం స్వీకరిస్తాను, అందువల్లే భగవంతుడు నన్ను ప్రతి ఇంట్లోను నెలకొల్పాడు. నా కారణంగానే ఇంటిల్లిపాదీ ఆహారం తీసుకుంటారు, గాలి పీలుస్తారు, వింటారు, మాట్లాడతారు’ అంటుంది స్త్రీ. దేవీ సూక్తం స్త్రీని అగ్రస్థానాన నిలబెట్టింది. బ్రహ్మమానసపుత్రిక దేవి అని, ఆమె నుంచే ప్రకృతి, పురుషుడు ఉద్భవించారని చెబుతోంది. ఉపనిషత్తులకు సంబంధించిన చర్చలలో గార్గి, మైత్రేయి వంటి వారు పాల్గొని విజయం సాధించారు. భవభూతి ఉత్తర రామచరితలో ఆత్రేయి... దక్షిణ భారత దేశం నుంచి ఉత్తర భారతానికి ప్రయాణించిందని, భారతీయ వేదాంతం చదివిందని ప్రస్తావించాడు. శంకరాచార్యునితో ఉభయభారతి జరిపిన చర్చలో వేదాల ప్రస్తావన తెస్తుంది. ఇతిహాసాలు... రామాయణంలో సీతను అత్యున్నతంగా చూపాడు వాల్మీకి. వేదకాలంలో ఏ పురుషుడూ ఎంత కోపం వచ్చినా స్త్రీని ఒక్క మాట కూడా పరుషంగా పలికేవాడు కాదని, తన సంతోషం, సౌఖ్యం, ఆనందం, సుగుణవంతుడిగా నిలబడటం కోసం భార్య మీదే ఆధారపడేవాడని తెలుస్తోంది. ఋషులు సైతం స్త్రీలు లేకుండా సంతానాన్ని సృజియించలేమని పలికారు. (ఆదిపర్వం మహాభారతం). మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో కూతురు కొడుకుతో సమానమని భీష్ముడు అంటాడు.శివపార్వతుల సంవాదంలో స్త్రీలకు ఏయే బాధ్యతలు ఉంటాయని శివుడు పార్వతిని ప్రశ్నిస్తాడు. మంచితనంతో పాటు, మృదు భాషణం, సత్ప్రవర్తన, మంచి లక్షణాలు కలిగి ఉండాలి స్త్రీలు అంటుంది పార్వతి. భారతీయ సంప్రదాయంలో భగవంతుడంటే ఒక అతీత శక్తి అని అర్థం. స్త్రీ రూపం కాని, పురుష రూపం కాని భగవంతునికి లేదు. పంచభూతాలలో నీరు, భూమి ఈ రెండింటినీ స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాత అని వారిని గౌరవంగా, ఆప్యాయంగా పిలుచుకున్నారు. భారతీయ సంప్రదాయం స్త్రీకి పెద్దపీట వేసి గౌరవించింది. స్త్రీలు వేదాలు చదవాలని చెప్పింది. బ్రహ్మచర్యంలో ఉన్న యువతి పట్టా పుచ్చుకుని, తనకు సరైన వరు ని ఎంచుకోవాలని అధర్వ వేదం చెబుతోంది. వరుడిని ఎంచుకునే హక్కు వధువుదే. అందుకే స్వయంవరం ప్రకటించి, వచ్చిన వారిలో నుంచి తనకు నచ్చినవారిని ఎంచుకుంటుంది వధువు. – డా. వైజయంతి పురాణపండ -
తమిళ స్టార్ హీరోతో తేజ!
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘సీత’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. తేజ తన తదుపరి చిత్రంగా ఓ తమిళ స్టార్ హీరోతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నాడట. కోలీవుడ్ లో సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటుడు విశాల్. కోలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ గా మారిన ఈ తెలుగబ్బాయి చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తేజ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం టెంపర్ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య షూటింగ్లో బిజీగా ఉన్న విశాల్, అక్టోబర్ నుంచి తేజ సినిమాకు డేట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది. -
సీత.. డిఫరెంట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘సీత’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. శనివారం ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘డిఫరెంట్ స్టోరీతో దర్శకులు తేజ చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో సాయి శ్రీనివాస్ ఇలాంటి జోనర్లో తొలిసారి నటిస్తున్నారు. హీరోయిన్ కాజల్ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలో సినిమాను గురించిన మరిన్ని విశేషాలను ప్రేక్షకులకు తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. కిషోర్ గరికపాటి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. -
క్వాలిటీ ముఖ్యం!
ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్ అగర్వాల్. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో స్పీడ్ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్ మంత్ర ఏంటి? అని కాజల్‌ని అడిగితే...‘‘నాకు సూట్ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్ ఎంత కనెక్ట్ అవుతారనే విషయం కూడా మైండ్‌లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ముఖ్యం. రోల్ మోడల్ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్ రోల్ చేస్తున్నారు కాజల్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరో. ఈ సినిమాలో కాజల్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయట. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఇండియన్ 2’ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్ ప్యారిస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
సాఫ్ట్ టైటిల్‌తో మాస్ హీరో..!
బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వరుసగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ఈ యువ కథానాయకుడు భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయకకు మంచి టాక్ వచ్చిన హిట్ లిస్ట్‌లో చేరలేకపోయింది. తరువాత చేసిన సాక్ష్యం, కవచం సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాకు రూట్ మార్చాడు ఈ యంగ్ హీరో. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు సాఫ్ట్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సీత అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను మార్చిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సంచలనం కోసమే ‘కత్తి’ మాట్లాడుతున్నారు
హైదరాబాద్ : హిందువుల పట్ల జరిగిన సంఘటనకు దేశ విదేశాల్లో ఉన్న హిందువులు అందరూ ఆవేదనకు గురయ్యారని శ్రీ పీఠం పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఆదివారం పరిపూర్ణానంద స్వామి హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. హిందూ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. రాముడు ఒక దగుల్భాజీ అని, సీత రాముని కన్నా రావణాసురుడి దగ్గర ఉంటేనే ఎక్కువ సుఖపడేదని కత్తి మహేశ్ ఆరోపణలు చేయడం చూస్తుంటే..ఆయన సంచలనం కోసమే ఇలా మాట్లాడుతున్నాడని తెలుస్తోందని అన్నారు. కత్తి వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. సీతమ్మను దూషించడం అంటే యావత్ స్త్రీ జాతిని అనడమేనన్నారు. రాజ్యాంగంలో శ్రీరాముని చిత్రపటాన్ని పెట్టడానికి కారణం..రాముడు చర్రిత కారుడు అని చెప్పడానికేనని తెలిపారు. ఇది రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాదా అని ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసమే ఇలా మాట్లాడుతున్నారని కత్తి మహేశ్‌ను ఉద్దేశించి అన్నారు. ఇది దేశద్రోహం..బడుగు బలహీన వర్గాల ముసుగులో మహేశ్ ఈవిధంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. రామనామ స్మరణ చేస్తూ అన్ని వర్గాల వారు రేపు(సోమవారం) తనతో పాదయాత్ర చేస్తారని తెలిపారు. కత్తి మహేశ్ మాటల వెనక కుట్ర ఉందని, కులాల అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. . ‘ నీకు ఎలా సమాధానం చెప్పాలో మా వాళ్ల దగ్గర ఉపాయాలు ఉన్నాయ్. పోలీసులు, ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. అదుపు తప్పి బరితెగించి వ్యాఖ్యలు చేస్తున్నారు. కత్తి మహేష్ వ్యాఖ్యలకు రెండు రాష్ట్రాల సీఎంలు సమాధానం చెప్పాలి. ప్రతి శ్రీరామ నవమికి ఇద్దరు సీఎంలు దగుల్బాజీల దగ్గరకు పట్టు వస్త్రాలు తీసుకువెళ్తున్నారో చెప్పాలి. ఎవరు ఏ మతం మీద దాడి చేసినా ప్రభుత్వం సెక్యులర్‌గా పని చేయాలి. దిగజారుడు వ్యాఖ్యలు చేసిన వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి. నీవు హిందువు కాదు, శ్రీరాముడిని దూషించిన వారు ఎవరూ హిందువులు కాదు. రేపు(సోమవారం) బషీర్ బాగ్ నుంచి యాదగిరిగుట్ట వరకు ధర్మాగ్రహా యాత్ర చేస్తాం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీరాముడికి పాలాభిషేకం చేస్తాం. సాధువులకు నిగ్రహం అవసరం అంటున్నారు. ధర్మ పరిరక్షణకు మేము సైనికులము అవుతా’ మని హెచ్చరించారు. -
సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ
లక్నో/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: రామాయణంలోని సీతాదేవి కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన బిడ్డ (టెస్ట్ ట్యూబ్ బేబీ) అని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దినేశ్ శర్మ (బీజేపీ) వ్యాఖ్యానించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని దినేశ్‌ను బీజేపీ వర్గాలు హెచ్చరించాయి. గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘లంక నుంచి రాముడు పుష్పక విమానంలో తిరిగొచ్చాడని మనకందరికీ తెలుసు. రామాయణ కాలంలోనే విమానాలు ఉన్నాయని దీని ద్వారా నిరూపితమవుతోంది. సీతాదేవి తల్లి గర్భం నుంచి జన్మించలేదు. జనకుడు పొలం దున్నుతుండగా భూమిలో ఓ పాత్ర నుంచి సీతాదేవి ఉద్భవించింది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆ రోజుల్లో ఉంది’ అని దినేశ్ అన్నారు. నీచ రాజకీయాల కోసం సీతాదేవిని బాధితురాలిగా మార్చొద్దని బీజేపీని కాంగ్రెస్ కోరింది. సీతను ఎత్తుకెళ్లింది రాముడే! సీతను శ్రీరాముడు ఎత్తుకెళ్లాడట..! గుజరాత్ పాఠ్యపుస్తకంలో ఇది ప్రచురితమైంది. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ సిబ్బంది సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కాళిదాసు రచించిన ‘రఘువంశం’లోని ఓ ఘట్టం 12వ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది. గుజరాతీలో సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియం పుస్తకాల్లో మాత్రం.. ‘సీతను రాముడు ఎత్తుకుపోయిన ఆ ఘటనను లక్ష్మణుడు రాముడికి వర్ణించి చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది..’అని ఉంది. ఈ తప్పు ఇంగ్లిష్‌లోకి అనువాద సమయంలో జరిగింది. -
భారీ గ్రాఫిక్స్ భద్రకాళి
సీనియర్ నటి సీత ముఖ్య పాత్రలో బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మించిన చిత్రం ‘భద్రకాళి’. కె.ఎం.ఆనంద్ దర్శకుడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా నిర్మాత రాంబాబు మాట్లాడుతూ–‘‘అమ్మవారిగా సీత అద్భుతంగా నటించారు. అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఈ సినిమా. ఓ భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించాం. దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య వచ్చే 25 నిమిషాల గ్రాఫిక్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఆదీష్ ఉత్రిన్ సాంగ్స్‌తో పాటు మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. జూన్ ఆఖర్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
అమ్మవారు.. భక్తుడు.. ఓ దుష్టశక్తి
సీనియర్ నటి సీత అమ్మవారి పాత్రలో నటించిన చిత్రం ‘భద్రకాళి’. ఆర్. పిక్చర్స్ పతాకంపై బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో చిక్కవరపు రాంబాబు నిర్మాణంలో కేఎమ్. ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. ఆనంద్ మాట్లాడుతూ– ‘‘అమ్మవారికి, భక్తుడికి, దుష్టశక్తికి మధ్య జరిగే కథ ఇది. తమిళనాడులో ఒక భక్తుడికి జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గ్రాఫిక్స్ హైలైట్‌గా ఉంటాయి. దర్శకుడిగా నాకు చాన్స్ ఇచ్చిన నిర్మాత రాంబాబుగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘ఆనంద్ బాగా తెరకెక్కిస్తున్నారు. సీనియర్ నటి సీత తనదైన శైలిలో నటిస్తున్నారు. ఆదీష్ ఉత్రియన్ ఈ చిత్రానికి ఐదు సూపర్‌హిట్ సాంగ్స్ ఇచ్చారు. విజయ్ తిరుమాలం కెమెరా వర్క్ సినిమాకు ప్లస్ అవుతుంది. సెకండ్ షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీటవుతుంది. త్వరలో ఆడియో విడుదల చేస్తాం’’ అన్నారు నిర్మాత. సంధ్య, మనీష్, ఢిల్లీ గణేశన్, చలపతిరావు, రఘుబాబు, తాగుబోతు రమేష్, ‘చిత్రం’ శీను తదితరులు నటిస్తున్నారు. -
నటి సీత కూతురు వివాహ వేడుక
-
కుమార్తె నిశ్చితార్థానికి సీత
తమిళసినిమా: కుమార్తె నిశ్చితార్థ వేడుకలో సీత సందడి చేశారు. నటుడు, దర్శకుడు పార్తీపన్, నటి సీత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కీర్తన, అభినయ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంత కాలం తరువాత మనస్పర్థల కారణంగా పార్తీపన్, సీత విడాకులు పొందారు. పెద్దకుమార్తె కీర్తన తండ్రి పార్తీపన్ వద్ద, చిన్న కుమార్తె అభియన తల్లి సీత వద్ద పెరుగుతున్నారు. కాగా పార్తీపన్ మరో ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఈ విషయం అటుంచితే పార్తీపన్ తన కూతురు కీర్తనకు వివాహం నిశ్చయించారు. మార్చి 8న కీర్తన పెళ్లి జరగనుంది. మరి కీర్తన పెళ్లికి ఆమె తల్లి సీత వస్తారా? అన్న ప్రశ్న కోలీవుడ్‌లో తలెత్తింది. సీత పెళ్లిలో పాల్గొంటుంది ఈ విషయంలో పార్తీపన్ క్లారిఫై చేసే విధంగా.. కీర్తన పెళ్లి వేడుకలో సీత పాల్గొంటుందని ఇటీవల మీడియాకు ఇచ్చిన భేటీలో తెలిపారు. జీవిత పయనంలో ఎలాంటి బంధానికైనా దూరం అవటం తప్పదన్నారు. అయితే తల్లి కూతుళ్ల బంధానికి అది అతీతం అని పేర్కొన్నారు. కాబట్టి కీర్తన పెళ్లి వేడుకలో ఆమె తల్లి సీత పాల్గొంటుందని చెప్పారు. తన కూతురు పెళ్లి మహిళా దినోత్సవం రోజున జరగనుందని, మహిళలకు ప్రాధాన్యత కలిగిన ఆ రోజున జరిగే కీర్తన పెళ్లి వేడుకకు ఆమె తల్లి, పెళ్లి కొడుకు అక్షయ్ తల్లి అంటూ చాలా మంది తల్లులు పాల్గొంటారని తెలిపారు. ఆదివారం జరిగిన కీర్తన వివాహ నిశ్చితార్థ వేడుకలో నటి సీత సంతోషంగా పాల్గొన్నారు. -
నమ్మితే ఉన్నాడు
కష్టం వచ్చినప్పుడు నమ్మితే? ... కోరిక కలిగినప్పుడు నమ్మితే? ఎవర్నయినా కాపాడాలి అని నమ్మితే? ... నలుగురు బాగుండాలి అని నమ్మితే? ఉన్నప్పుడు ఇవ్వాలి అని నమ్మితే?... లేనప్పుడు ఉన్నాడని నమ్మితే? నమ్మితే... దేవుడున్నాడు... అంటున్నారు నటి సీత. హావభావాలు శక్తిమంతంగా ప్రదర్శించే నటి సీత. ‘చిన్నారి స్నేహం’, ‘పోలీసు భార్య’, ‘ఆడదే ఆధారం’, ‘ముత్యమంత ముద్దు’ వంటి పెద్ద హిట్స్ ఆమె జాబితాలో ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘సింహాద్రి’, ‘బన్ని’, ‘కరెంటు తీగ’ వంటి సినిమాలలో నటించారు. ‘నేను–నా దైవం’ గురించి ఆమె సాక్షితో కొన్ని ఆలోచనలు పంచుకున్నారు. జీవితంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నట్టున్నారు? అవును. జీవితం అంటే అదే. సాఫీగా ఉండేది జీవితం కాదు. మనం ఊహించినట్టుగా ఉండేది కూడా జీవితం కాదు. జీవితం సముద్రంలాంటిది. దాని వీపు మీద మనం ప్రయాణం చేస్తుంటాం కాని అది ఏ క్షణం ఎలా మారుతుందో ఊహించలేము. పురుషుల కంటే స్త్రీలకు ఈ విషయంలో ఎక్కువ దైవ ఆలంబన అవసరమా? దైవ ఆలంబన విషయంలో స్త్రీలకు, పురుషులకు తేడా ఉండదు. కాని గమనించి చూస్తే స్త్రీలు కాసేపు దేవుని దగ్గర తమ మనసులో ఉన్నదంతా గుమ్మరించుకుని తేలిక పడతారు. కాని మగవాళ్లు దేవుణ్ణి పట్టుకుంటే అలాగే పట్టుకునే ఉండాలి. స్త్రీలకు కుటుంబం ఉంటుంది. ఇంటిని చక్కదిద్దుకోవడమే వాళ్లకు అసలైన పుణ్యకార్యం. అందుకే పురాణాల్లో సతీ అనసూయ వంటి పతివ్రతలు ఎక్కువ కనిపిస్తారు. పురుషులలో భక్త సిరియాళ, భక్త మార్కండేయ, భక్త ప్రహ్లాద వంటి వీర భక్తులు ఎక్కువ కనిపిస్తారు. మీ మీద భక్తి ప్రభావం ఎలా ఉండేది? చాలా ఎక్కువ ఉండేది. మా ఇంట్లో ప్రతి శుక్రవారం అమ్మ ప్రత్యేక పూజలు చేసేది. పూజకు ఉపయోగించే సామగ్రిని శుభ్రం చేసే పని నేనే చేసేదాన్ని. ఆరేళ్ల వయసు నుంచి అనుకుంటా నేనే దేవుడి సామాన్లన్నీ తళతళ మెరిసేలా శుభ్రం చేసి పెట్టేదాన్ని. బిడ్డకు జలుబు చేస్తుంది అని తాత వారించినా ఒప్పుకునేదాన్ని కాను. దేవుళ్ల బొమ్మలు, పటాలు కూడా శుభ్రం చేసి పూజకు సిద్ధం చేసేదాన్ని. కొంచెం పెద్ద అయ్యాక కేసరి, పొంగల్, వడ ప్రసాదాలను రుచిగా వండేదాన్ని. ప్రతి ఉదయం పూజ, ప్రసాదాల అలవాటు నా జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచేది. ఈ దేవుళ్లు హిందువుల దేవుళ్లు వీళ్లనే పూజించాలి అని అనుకునేవారా? అలా ఏం లేదు. ఏ ఇంట్లో అయినా మన సంప్రదాయాన్నే మన పెద్దవాళ్లు నేర్పిస్తారు. దాంతో పాటు పొరుగు సంప్రదాయాన్ని కూడా గౌరవించే సహనం, ప్రేమ మన సంస్కృతిలో ఉన్నాయి. మన బాల్యమంతా అలాంటి సంస్కృతిలోనే గడిచిందని మనమంతా గుర్తు చేసుకుంటే ఈ సమాజం ఎంతో బాగుండనిపిస్తుంది. చిన్నప్పుడు కాన్వెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు చర్చికి తరచూ వెళ్లేదాన్ని. క్రీస్తు ప్రార్థనలు భక్తిగా చేసేదాన్ని. చెన్నై మౌంట్‌రోడ్డులోని దర్గాకు ఇప్పుడూ తరచూ వెళుతుంటాను. పుదుప్పేటలో మా ఇంటికీ సమీపంలోని దర్గాలో తెల్లవారుజాము 5 గంటలకు ప్రార్థ్దనలు జరిపేవారు. అలారంతో పని లేకుండా ఆ టైమ్‌కి నిద్రలేచి పూజలు చేసుకునేదాన్ని. అలా ఆ దర్గా నాలో ఒక సమయపాలనను నేర్పింది. ఒంట్లో బాగోలేకపోతే ఇంట్లోవాళ్లు దర్గాకు తీసుకువెళ్లి మంత్రం వేయించేవారు, తాయెత్తులు కట్టించేవారు. జబ్బు నయం అయ్యేది. ఏ దేవుడంటే ఇష్టం ఉండేది? మా ఇష్ట దైవం వేంకటేశ్వర స్వామి. ఇంట్లో ఆయనకే ఎక్కువగా పూజలు జరిపేవారు. నా చిన్నతనంలో తరచూ తిరుమల వెళ్లేవాళ్లం. అలా వెళ్లేముందు తెలిసిన వారి ఇళ్లకు వెళ్లి ‘గోవిందా’ అంటూ ముడుపులు, విరాళాలు సేకరించి అలా సేకరించిన సొమ్మును తిరుమలలో స్వామివారి సన్నిధిలోని హుండీలో వేసేవాళ్లం. ఇందుకోసమని నేను, అన్నయ్య, తమ్ముడు కలిసి ఇంటింటికి తిరిగేవాళ్లం. వాళ్లు కాస్త సిగ్గుపడుతుంటే ‘గోవిందా....గో....విందా’ అని నేను మాత్రమే బిగ్గరగా అరిచేదాన్ని (చిన్న నవ్వు). అసలు దైవానికి ఎలా కనెక్ట్ అవ్వాలి? నేనైతే ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు ముగించుకొని పూజ చేసుకుంటాను. తరువాత 20 నిమిషాలైనా ధ్యానం చేస్తాను. శరీరం మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు మనసు కూడా శుభ్రంగా ఉంటేనే అక్కడ దేవుడు ఉంటాడు. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. అప్పుడు దేవుడు ఉన్నాడనే భావన కలుగుతుంది. దేవుడంటే ఎక్కడో కాదని, మనలోనే ఉన్నాడని, దేహమే దేవాలయం అనే భావన ఉండాలి. అప్పుడే కనెక్ట్ అవుతాం. ఇది దైవ మహిమా అని ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి ఫుడ్ అలర్జీ వచ్చి ముఖమంతా ర్యాష్ వచ్చింది. డాక్టర్ వద్దకు వెళితే మందులిచ్చి పది రోజులపాటు మేకప్ వేసుకోవద్దని చెప్పారు. నాకేమో రోజూ షూటింగ్ ఉంది. నేను వెళ్లకుండా సహ నటుల కాంబినేషన్ మిస్సయితే నిర్మాతకు నష్టం వస్తుంది. దేవుడిని ప్రార్థిస్తూనే షూటింగ్ స్పాట్‌కు వెళ్లాను. చిత్ర దర్శకులు నా వద్దకు వచ్చి ఈ క్యారెక్టర్‌కు బొత్తిగా మేకప్ అవసరం లేదని చెప్పారు. నాకైతే అప్పుడు నోటమాటరాలేదు. అద్భుతం అనిపించింది. అలాగే మరొకటి. నాకు షిరిడీ సాయిబాబా అన్నా చాలా భక్తి. షిరిడీకి వెళ్లిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌తో వచ్చేటప్పుడు నా కోసం బాబా విగ్రహం తీసుకురావాలని చెప్పాను. అయితే వాళ్లు మర్చిపోయి వచ్చారు. అదే రోజున ఒక షాప్ ఓపెనింగ్‌కు వెళుతూ బాబా విగ్రహం రాలేదే అని తలచుకుంటూ వెళ్లాను. నన్ను ముఖ్యఅతిధిగా పిలిచిన నిర్వాహకులు నా మనసులో ఎలా ఊహించుకున్నానో సరిగ్గా అలాంటి షిరిడీ బాబా విగ్రహాన్ని బహూకరించారు. ఆరోజు నా సంతోషానికి అవధులు లేవు. దేవుడిపై ఎపుడైనా కోపం వచ్చిందా? తట్టుకోలేని చేదు అనుభవం ఎదురైనపుడు క్షణంపాటు కోపం కలుగుతుంది. అయితే అంతలోనే ఆ కోపం మాయం అవుతుంది. ఏదో కారణం ఉంటేనే కానీ ఈ సంఘటన చోటు చేసుకోదు. దీని వెనుక దేవుడి మర్మం ఏదో ఉంది. అంతా మన మంచి కోసమేనని గట్టిగా అనుకుంటాను. కష్టాలు వచ్చినపుడు దేవుడా నాకెందుకీ ఆవేదనలు అంటారు. అదే కోటి రూపాయలు కలిసొస్తే దేవుడా నాకే ఎందుకిచ్చావు అని ఆలోచించరు. దైవం విషయంలో మనిషికి అలాంటి పరిణతి వస్తే ఎంతో బాగుంటుంది. దైవానికి నైవేద్యం పెట్టడం ఏంటని మీకెప్పుడైనా సందేహం కలిగిందా? దేవునికి నైవేద్యం పెట్టడం మంచిదే కాని అంతకంటే మనిషి ఆకలి తీర్చడం అవసరం. మీకు ఒక కథ చెబుతాను. కరువు పీడిస్తుండగా ఒక రైతు దేవుడికి పరీక్ష పెట్టాడు. నీవు నిజంగా ఉంటే నా అరటితోట విరగగాయాలి అన్నాట్ట. తోటకు చుక్కనీరు పోయకున్నా చక్కని పంట చేతికి రావడంతో దేవుడున్నాడని నమ్మాడు. వెంటనే గుడికి గంపలు గంపలు అరటి పళ్లను నైవేద్యానికి పంపాడు. అదే రోజు రాత్రి దేవుడు కలలోకి రాగా నేను పంపిన పండ్లు తిన్నావా అని అడిగాడు రైతు. ఒక్కటే తిన్నాను అని బదులిచ్చాడు దేవుడు. దాంతో రైతు తన పనివాళ్లు పండ్లు మొత్తం కాజేశారని తలచి వాళ్లను పిలిచి అసలేం జరిగిందని ప్రశ్నించాడు. అందరూ అరటి పండ్లను దేవునికి నైవేద్యంగా పెట్టాం అని చెప్పారు. కాని ఒక్క పనివాడు మాత్రం వాటిని తీసుకెళ్లే దారిలో ఒక యాచకుడు ఆకలితో అలమటిస్తుంటే ఒక అరటిపండు ఇచ్చినట్టు చెప్పాడు. రైతుకు జ్ఞానోదయం అయింది– ఆకలితో ఉన్న వాడికి ఇచ్చిన ఆ ఒక్కపండే దేవుడికి చేరిందని. ఇప్పుడు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నారు? నేను జీవించినంతకాలం అమ్మ నాతో ఉండాలి అని మొదటగా వేడుకుంటుంటాను. మనిషికి అషై్టశ్వర్యాలు ఉన్నా ఆరోగ్యం అనేది లేకుంటే అంతా వృథా. అందుకే నా ఫ్యామిలీనే కాదు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడు స్వామి అని ప్రార్థిస్తుంటాను. అలాగే, ప్రకృతి వైపరీత్యాలకు ప్రజలు గురికాకుండా కాపాడు స్వామి అని నమస్కరిస్తా. 2015 డిసెంబర్లో చెన్నైని వరదనీరు ముంచెత్తినపుడు ప్రజలు పడిన బాధలు చూసి ఎంతో చలించిపోయాను. అలాగే నటిగా వృత్తిపరంగా బాగా బిజీగా ఉండాలి అని కోరుకుంటాను. దైవంపై నమ్మకం అంటే ఎలా ఉండాలి ? ఈ విషయంపై ఒక చిన్న కథ చెబుతాను. ఒక పేదవాడికి దేవుడు కలలో కనపడి ఫలానా చోట తవ్వితే నీకు నిధి దొరుకుతుంది, దరిద్రం తీరుతుందని చెప్పాడు. దానిని నమ్మి అతడు భూమి తవ్వుతుండగా సైనికులు వచ్చి ఇది రాజు గారి భూమి అని చెప్పి ఆ నేరానికి రాజు ముందు నిలబెట్టగా చెట్టుకు కట్టి కొరడా దెబ్బలు కొట్టమని రాజు శిక్ష వేశాడు. శిక్షను అమలుచేస్తున్న సైనికుడికి పేదవానిపై జాలి వేసి ‘అసలు గుంట ఎందుకు తవ్వుతున్నావు?’ అని ఆడిగారు. పేదవాడు విషయం చెప్పాడు. అది విని నవ్వుకున్న సైనికుడు నాకు కూడా నిన్న రాత్రి దేవుడు కలలో కనపడి నిన్ను కట్టేసిన చెట్టులో అపార నిధి ఉంది తీసుకో అన్నాడు, అలాగని చెట్టును తొలిచానా అని వెళ్లిపోయాడు. ఆ దేవుడు సైనికుని రూపంలో మరోసారి నాకు అవకాశం ఇచ్చాడని విశ్వసించిన పేదవాడు చెట్టులోని తొర్రను వెతగ్గా నిధి దొరికింది. దరిద్రం తీరింది. దేవుడిపై నమ్మకం అంటే సైనికుడిలా ఉండ కూడదు, పేదవాడిలా ఉండాలి. – కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై