![Director Teja Next Movie With Tamil Hero Vishal - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/29/Teja.jpg.webp?itok=e0d5UM8q)
నేనే రాజు నేనే మంత్రి సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చిన దర్శకుడు తేజ, ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘సీత’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తరువాత మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌కు రెడీ అవుతున్నాడు. తేజ తన తదుపరి చిత్రంగా ఓ తమిళ స్టార్ హీరోతో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నాడట.
కోలీవుడ్ లో సినిమాలతో పాటు సినీ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న నటుడు విశాల్. కోలీవుడ్‌లో హాట్ ఫేవరెట్ గా మారిన ఈ తెలుగబ్బాయి చాలా కాలంగా స్ట్రయిట్ తెలుగు సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తేజ డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం టెంపర్ రీమేక్‌గా తెరకెక్కుతున్న అయోగ్య షూటింగ్‌లో బిజీగా ఉన్న విశాల్, అక్టోబర్ నుంచి తేజ సినిమాకు డేట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది.
Comments
Please login to add a commentAdd a comment