సీత.. డిఫరెంట్‌ | bellamkonda si srinivas seetha first look release | Sakshi
Sakshi News home page

సీత.. డిఫరెంట్‌

Published Sun, Jan 27 2019 2:44 AM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

bellamkonda si srinivas seetha first look release - Sakshi

సాయి శ్రీనివాస్, కాజల్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రానికి ‘సీత’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ నిర్మాతలు. శనివారం ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘‘డిఫరెంట్‌ స్టోరీతో దర్శకులు తేజ చక్కగా తెరకెక్కిస్తున్నారు. హీరో సాయి శ్రీనివాస్‌ ఇలాంటి జోనర్‌లో తొలిసారి నటిస్తున్నారు. హీరోయిన్‌ కాజల్‌ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. సోనూ సూద్, మన్నారా చోప్రా కీలక పాత్రలు చేస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. త్వరలో సినిమాను గురించిన మరిన్ని విశేషాలను ప్రేక్షకులకు తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాలో కాజల్‌ క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయని తెలిసింది. కిషోర్‌ గరికపాటి ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement