‘సీత’ ఎప్పుడొస్తుందో! | No Update From Bellamkonda Sai Srinivaas Next Film Seetha | Sakshi
Sakshi News home page

‘సీత’ ఎప్పుడొస్తుందో!

Published Wed, Apr 24 2019 3:58 PM | Last Updated on Wed, Apr 24 2019 3:59 PM

No Update Bellamkonda Sai Srinivaas Next Film Seetha - Sakshi

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సీత. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న సాయి శ్రీనివాస్‌, ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. కెరీర్‌ స్టార్టింగ్‌ నుంచి భారీ చిత్రాలు చేస్తూ వస్తున్న ఈ యువ కథానాయకుడు కమర్షియల్ సక్సెస్‌లు మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇటీవల కవచం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బెల్లంకొండ తరువాత తేజ దర్శకత్వంలో సీత సినిమాను ప్రారంభించాడు.

గత ఏడాది జూలైలోనే తేజ దర్శకత్వంలో సినిమాను ప్రారంభించాడు సాయి శ్రీనివాస్‌. ఈ సినిమా సెట్స్‌ మీద ఉండగానే కవచం సినిమాను తెరకెక్కించి రిలీజ్ కూడా చేశారు. అయితే ఆ సినిమా ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది. దీంతో సీత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 25న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా మే నెలాఖరుకు వాయిదా పడిందన్న టాక్‌ వినిపిస్తోంది. మే 1 నుంచి వరుస రిలీజ్‌లు ఉండటంతో మే 24 న సీత సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ డేట్‌కి అయిన వస్తుందో లేదో చూడాలి. సాయి శ్రీనివాస్‌కు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రూపొందుతోంది. అనూప్‌ రుబెన్స్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement