క్వాలిటీ ముఖ్యం! | Kajal Aggarwal Teja Seetha Negative role | Sakshi
Sakshi News home page

క్వాలిటీ ముఖ్యం!

Published Mon, Jan 7 2019 1:36 AM | Last Updated on Thu, Aug 8 2019 11:13 AM

Kajal Aggarwal Teja Seetha Negative role - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

ఇండస్ట్రీలో పదేళ్లకుపైగా ఉంటూ అగ్రకథానాయికల లిస్ట్‌లో తన పేరు తప్పిపోకుండా కష్టపడుతూనే ఉన్నారు కాజల్‌ అగర్వాల్‌. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్‌లో వరుస ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో స్పీడ్‌ పెంచారీ బ్యూటీ. మీ సక్సెస్‌ మంత్ర ఏంటి? అని కాజల్‌ని అడిగితే...‘‘నాకు సూట్‌ అయ్యే పాత్రలనే ఎంపిక చేసుకుంటాను. సినిమా సినిమాకి నా పాత్రల మధ్య వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతా. నా పాత్రకు ఆడియన్స్‌ ఎంత కనెక్ట్‌ అవుతారనే విషయం కూడా మైండ్‌లో ఉంచుకుంటా. క్వాలిటీ ఆఫ్‌ పెర్ఫార్మెన్స్‌ ముఖ్యం.

రోల్‌ మోడల్‌ అంటూ నాకు ప్రత్యేకంగా ఎవరూ లేరు. ప్రముఖ నటీనటుల నుంచి ఒక్కో డిఫరెంట్‌ క్వాలిటీని తీసుకుంటాను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సీత’ అనే సినిమాలో టైటిల్‌ రోల్‌ చేస్తున్నారు కాజల్‌.  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరో. ఈ సినిమాలో కాజల్‌ క్యారెక్టర్‌లో నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట. కమల్‌హాసన్‌–శంకర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఇండియన్‌ 2’ చిత్రంలో కాజల్‌ కథానాయికగా నటిస్తారు. తమిళంలో ఆమె నటించిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement