లక్నో/అహ్మదాబాద్/న్యూఢిల్లీ: రామాయణంలోని సీతాదేవి కృత్రిమ పద్ధతుల్లో జన్మించిన బిడ్డ (టెస్ట్ ట్యూబ్ బేబీ) అని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, దినేశ్ శర్మ (బీజేపీ) వ్యాఖ్యానించారు. నోటిని అదుపులో పెట్టుకోవాలని దినేశ్‌ను బీజేపీ వర్గాలు హెచ్చరించాయి. గురువారం రాత్రి ఓ సభలో ఆయన మాట్లాడుతూ ‘లంక నుంచి రాముడు పుష్పక విమానంలో తిరిగొచ్చాడని మనకందరికీ తెలుసు. రామాయణ కాలంలోనే విమానాలు ఉన్నాయని దీని ద్వారా నిరూపితమవుతోంది. సీతాదేవి తల్లి గర్భం నుంచి జన్మించలేదు. జనకుడు పొలం దున్నుతుండగా భూమిలో ఓ పాత్ర నుంచి సీతాదేవి ఉద్భవించింది. అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం ఆ రోజుల్లో ఉంది’ అని దినేశ్ అన్నారు. నీచ రాజకీయాల కోసం సీతాదేవిని బాధితురాలిగా మార్చొద్దని బీజేపీని కాంగ్రెస్ కోరింది.
సీతను ఎత్తుకెళ్లింది రాముడే!
సీతను శ్రీరాముడు ఎత్తుకెళ్లాడట..! గుజరాత్ పాఠ్యపుస్తకంలో ఇది ప్రచురితమైంది. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన విద్యాశాఖ సిబ్బంది సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కాళిదాసు రచించిన ‘రఘువంశం’లోని ఓ ఘట్టం 12వ తరగతిలో పాఠ్యాంశంగా ఉంది. గుజరాతీలో సరిగ్గానే ఉన్నప్పటికీ ఇంగ్లిష్ మీడియం పుస్తకాల్లో మాత్రం.. ‘సీతను రాముడు ఎత్తుకుపోయిన ఆ ఘటనను లక్ష్మణుడు రాముడికి వర్ణించి చెప్పిన తీరు హృదయానికి హత్తుకునేలా ఉంటుంది..’అని ఉంది. ఈ తప్పు ఇంగ్లిష్‌లోకి అనువాద సమయంలో జరిగింది.
సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ
Published Sat, Jun 2 2018 5:00 AM | Last Updated on Sat, Jun 2 2018 5:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment