
చెట్టునూ పుట్టనూ వదల్లేదు
సీతాపతి
భర్త సిసలైన ప్రేమ భార్య ఎడబాటు సమయంలోనే తెలుస్తుంది. రాముడికి సీత పట్ల ఉన్న ప్రేమ ఆమె సమక్షంలో ఉండగా తెలియలేదు. ఆమె అదృశ్యమైనప్పుడే తెలిసొచ్చింది. దుష్టరాక్షసుడు ఆమెను తీసుకుని వెళ్లిపోతే తల్లడిల్లిపోయాడు రాముడు. సామాన్య మానవుడిలా దుఃఖిస్తూ, ఆమె వివరాలు చెబుతూ, పశుపక్ష్యాదులను, చెట్టును పుట్టను కూడా జాడ తెలిస్తే చెప్పమని బతిమాలాడు.
ఆచూకి తెలిశాక అగాధాలతో నిండిన సముద్రంపై ఆఘమేఘాల మీద సేతువు నిర్మించాడు. లంకకు చేరాడు. భీకర సంగ్రామంలో విజయుడిగా నిలిచి తన సీతను తాను సొంతం చేసుకున్నాడు. భార్య క్షేమం కోసం పరాక్రమం చూపినవాడే నిజమైన భర్త. అతడే రాముడు. అందుకే దేవుడు.