Rama
-
నా నుదుటి రాతలోనే నృత్యం ఉంది..!
శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్ గురువు సరోజ్ వైద్యనాథన్. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు. రామా వైద్యనాథన్ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్ స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది. ఎదిరిస్తూ నిలుస్తూ..పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్ క్లాసుల కోసం సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్‌ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు. యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి. నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది. --రామా వైద్యనాథన్(చదవండి: రుమాలీ రోటీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఇదే..!) -
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్‌లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
భారత్.. దేశం కాదు ఉపఖండం
చెన్నై: తమిళనాడుకు చెందిన అధికార డీఎంకే సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా మరో వివాదానికి ఆజ్యం పోశారు. బీజేపీ సిద్ధాంతాలైన భరతమాత, జైశ్రీరామ్‌ను తమిళనాడు ఎప్పటికీ స్వీకరించబోదని, అవి తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఇండియా ఒకే దేశం కాదని, ఇదొక ఉపఖండం మాత్రమేనని అన్నారు. ఒకే దేశం అయితే దేశమంతటా ఒకే భాష ఉండాలని చెప్పారు. మధురైలో మంగళవారం డీఎంకే కార్యక్రమంలో ఎ.రాజా ప్రసంగించారు. ‘‘రాముడికి శత్రువు ఎవరు? రాముడి గురించి, రామాయణం గురించి నాకు అంతగా తెలియదు. వాటిపై నాకు నమ్మకం లేదు. రాముడు సీతతో కలిసి అడవికి వెళ్లాడని చిన్నప్పుడు మా తమిళ టీచర్ చెప్పారు. ఒక వేటగాడిని, సుగ్రీవుడిని, విభీషణుడిని రాముడు తన సోదరులుగా స్వీకరించాడు. ఇందులో కులం, మతం ప్రసక్తి లేదని అర్థమవుతోంది. ఇండియా ఒకే దేశమని అంటున్నారు. ఒకే దేశమైతే ఒకే భాష, ఒకే సంప్రదాయం, ఒకే సంస్కృతి ఉండాలి. ఇండియాలో అలా లేదు కాబట్టి ఇదొక ఉపఖండం. ఇండియా గతంలో ఎన్నడూ ఒక దేశంగా లేదు. తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో వాటి సొంత సంస్కృతులు ఉన్నాయి. భిన్న జాతులు, భాషలు, సంస్కృతుల సమాహారమే ఇండియా. ఇక్కడ ఒక సామాజిక వర్గం ప్రజలు గొడ్డు మాంసం తింటారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తమిళనాడులో డీఎంకే ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. తమిళనాడులో డీఎంకే లేకపోతే అసలు భారతదేశమే ఉండదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే.. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశ రాజ్యాంగమే ఉండదు. రాజ్యాంగం లేకపోతే దేశం కూడా మనుగడ కోల్పోతుంది. భారతదేశం లేకపోతే తమిళనాడు రాష్ట్రం ఉండదు. దేశం నుంచి మేము విడిపోతాం. ఇలా జరగాలని భారతదేశం కోరుకొంటోందా?’’ అంటూ ఎ.రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజాను వెంటనే అరెస్టు చేయాలి డీఎంకే నేత ఎ.రాజా వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎంకే నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మానుకోవడం లేదని బీజేపీ నేత∙అమిత్ మాలవీయా విమర్శించారు. సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ అనుచితంగా మాట్లాడారని చెప్పారు. దేశాన్ని ముక్కలు చేయాలన్నదే డీఎంకే నేతల కుటిల యత్నమని మండిపడ్డారు. రాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని తిమళనాడు డీఎంకే అధికార ప్రతినిధి తిరుపతి అన్నారు. రాజా వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం ఖండించింది. మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని సూచించింది. రాజా వ్యాఖ్యలతో విభేదిస్తున్నానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చెప్పారు. -
న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం!
అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అమెరికాలో పండుగ వాతవరణం నెలకొంది. న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ ప్రాంతం రామనామ జపంతో మార్మోగింది. ప్రవాసులు భారతీయ సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. టైమ్స్ స్క్వేర్‌లోని బిల్‌బోర్డుపై రాముడి చిత్రాలను ప్రదర్శించారు. ఇక భారీ స్కీన్‌ను ఏర్పాటు చేసిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ సందర్భంగా టైమ్స్ స్క్వేర్ ప్రాంతానికి ప్రవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి, శ్రీరాముడి చిత్రాలున్న జెండాలు చేతబూని వేడుకలు చేసుకున్నారు. ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పలువురు విదేశీయులు సైతం పాల్గొనడం విశేషం. (చదవండి: మస్కట్‌లో సంక్రాంతి సంబరాలు) -
అయోధ్య రామునిపై కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: అయోధ్య రామునిపై కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య గురించి మాట్లాడే క్రమంలో ' ఒక డేరాలో ఉంచిన రెండు బొమ్మలు' అని వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. కేఎన్ రాజన్న వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. " బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో నేను అక్కడికి వెళ్లాను. అక్కడ రెండు బొమ్మలు ఉంచారు. డేరా వేసి దానిని రాముడు అని పిలిచారు. దేశంలో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రామ మందిరాలు ఉన్నాయి." అని ఆయన అన్నారు. "రామమందిరానికి వెళ్ళినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. అయోధ్యలో నాకు ఏమీ అనిపించలేదు. అది టూరింగ్ టాకీస్‌లో బొమ్మల వలె ఉంది." అని మంత్రి వివాదాస్పదంగా మాట్లాడారు. వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన అనంతరం కేఎన్ రాజన్న స్పందించారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'డేరాలో బొమ్మలు ఉంచారు కాబట్టి మీ అందరితో అలా చెప్పాను. ఇప్పుడు అక్కడ ఏముందో చూడలేదు. ఒకసారి వెళ్లి చూసి అక్కడ ఏముందో చెబుతాను' అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు. కేఎన్ రాజన్న వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) అధ్యక్షుడు అలోక్ కుమార్ మండిపడ్డారు. అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ట.. కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు నిరాశా, నిస్పృహల కారణంగానే వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ అహంకారం కారణంగానే రామమందిరాన్ని సందర్శించేందుకు నిరాకరించారని దుయ్యబట్టారు. "రాముని కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తరలివస్తే ఇది అందరి కార్యక్రమం అవుతుంది." అని అలోక్ కుమార్ అన్నారు. ఇదీ చదవండి: Ayodhya: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి! -
22న పుట్టేవారంతా సీతారాములే..!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభం కానుంది. అలాగే బాలరాముని ప్రతిష్ఠాపన మహోత్సవం కూడా జరగనుంది. దేశంలోని చాలామంది ఆరోజును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నారు. దీంతో తమకు ఆరోజు పుట్టబోయే చిన్నారులకు రాముడు లేదా సీత అనే పేరుపెట్టాలని చాలామంది తహతహలాడుతున్నారు. దేశంలోని పులువురు గర్భిణులు తాము జనవరి 22న బిడ్డకు జన్మనివ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే ఆరోజు తమకు పుట్టబోయే పిల్లలకు రాముడు లేదా సీత అనే పేరు పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. యూపీలోని మీరట్‌కు చెందిన ఒక సీనియర్ డాక్టర్ మాట్లాడుతూ పలువురు గర్భిణులు జనవరి 22న డెలివరీ చేయాలని తమ ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. అబ్బాయి పుడితే రాముడు అని అమ్మాయి పుడితే సీత అని పేరు పెడతామని వారు చెబుతున్నారన్నారు. ఇది కూడా చదవండి: వారికి శ్రీరాముడు ‘మామ’? బంధుత్వం ఎలా కలిసింది? -
రాముణ్ణి చెక్కిన చేతులు
ఎంబిఏ చేసిన అరుణ్ యోగిరాజ్ కొన్నాళ్లు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేశాడు.కాని అనువంశికంగా వస్తున్న కళ అతనిలో ఉంది.నా చేతులున్నది శిల్పాలు చెక్కడానికిగాని కీబోర్డు నొక్కడానికి కాదని ఉద్యోగం మానేశాడు.2008 నుంచి అతను చేస్తున్న సాధన ఇవాళ దేశంలోనే గొప్ప శిల్పిగా మార్చింది. అంతే కాదు ‘బాల రాముడి’ విగ్రహాన్ని చెక్కి అయోధ్య ప్రతిష్ఠాపన వరకూ తీసుకెళ్లింది.తమలో ఏ ప్రతిభ ఉందో యువతా, తమ పిల్లల్లో ఏ నైపుణ్యం ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలనడానికి ఉదాహరణ అరుణ్. జనవరి 22న అయోధ్యలో అంగరంగ వైభవంగా జరగనున్న రామమందిర ప్రారంభోత్సవంలో ఒక్కో విశేషం తెలుస్తూ వస్తోంది.ప్రాణప్రతిష్ఠ జరగనున్న విగ్రహాల్లో ‘బాల రాముడి’ విగ్రహం సమర్పించే గొప్ప అవకాశం మైసూరుకు చెందిన 40 ఏళ్ల శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు దక్కింది. కర్ణాటకకు చెందిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలియచేసి హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. అయోధ్య రామమందిరంలో ‘బాల రాముడి’ విగ్రహం ప్రతిష్ట కోసం శిల్పం తయారు చేయమని దేశంలో ముగ్గురు శిల్పులకు శ్రీ రామజన్మభూమి తీర్థ్‌క్షేత్ర ట్రస్ట్ బాధ్యత అప్పజెప్పింది. వారిలో ఒకరు అరుణ్ యోగిరాజ్. ఇతని కుటుంబం ఐదు తరాలుగా శిల్ప కళలో పేరు గడించింది. అరుణ్ తండ్రి యోగిరాజ్, తాత బసవణ్ణ శిల్పులుగా కర్ణాటకలో పేరు గడించారు. అయితే అరుణ్ ఈ కళను నేర్చుకున్నా అందరిలాగే కార్పొరేట్ ఉద్యోగం వైపు దృష్టి నిలిపాడు. కాని రక్తంలో ఉన్న శిల్పకళే మళ్లీ అతణ్ణి తనవైపు లాక్కుంది. 2008 నుంచి శిల్పాలు తయారు చేస్తున్న అరుణ్ ఇప్పటికే అనేకచోట్ల శిల్పాలు స్థాపించి తన ప్రతిభ నిరూపించుకున్నాడు. అరుణ్ తయారు చేసిన శిల్పాల్లో కేదార్‌నాథ్‌లోని ఆది శంకరాచార్య విగ్రహంతో మొదలు మైసూరులోని ఆర్.కె.లక్ష్మణ్ విగ్రహం వరకూ ఉన్నాయి. మైసూర్ రైల్వే స్టేషన్లో ‘లైఫ్ ఈజ్ ఏ జర్నీ’ పేరుతో ఒక కుటుంబం లగేజ్‌తో ఉన్న శిల్పాలు ప్రతిష్టించి అందరి దృష్టినీ ఆకర్షించాడు అరుణ్. అలా రాముడి విగ్రహం చెక్కే అవకాశం ΄÷ందే వరకూ ఎదిగాడు. 51 అంగుళాల విగ్రహం అరుణ్ చెక్కిన బాల రాముడి విగ్రహం శిరస్సు నుంచి పాదాల వరకు 51 అంగుళాల ఎత్తు ఉంటుంది. అరుణ్ భార్య విజేత వివరాలు తెలియచేస్తూ ‘అరుణ్‌కి ఈ బాధ్యత అప్పజెప్పాక శిల్ప ఆకృతి గురించి అతడు ఎంతో పరిశోధించాల్సి వచ్చింది. దానికి కారణం బాల రాముడి విగ్రహం ఇలా ఉంటుందనడానికి ఎలాంటి రిఫరెన్స్ లేక΄ోవడమే. అందుకని అరుణ్ పురాణాల అధ్యయనంతో పాటు రాముడి వేషం కట్టిన దాదాపు 2000 మంది బాలల ఫొటోలు పరిశీలించాడు’ అని తెలిపింది. ఈ విగ్రహం కోసం ట్రస్ట్ శిలను అందించింది అరుణ్‌కు. ‘మామూలు గ్రానైట్ కంటే ఈ శిల దృఢంగా ఉంది. చెక్కడం సవాలుగా మారింది. అయినప్పటికీ తనకు వచ్చిన అవకాశం ఎంత విలువైనదో గ్రహించిన అరుణ్ రేయింబవళ్లు శిల్పాన్ని చెక్కి తన బాధ్యత నిర్వర్తించాడు’ అని తెలిపింది విజేత. అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తల్లి ఆనందం కుమారుడు చెక్కిన శిల్పం రామ మందిరంలోప్రాణప్రతిష్ఠ చేసుకోనుందన్న వార్త విన్న అరుణ్ తల్లి ఆనందంతో తబ్బిబ్బవుతోంది. మరణించిన భర్తను తలచుకొని ఉద్వేగపడుతోంది. ‘అరుణ్ వాళ్ల నాన్న దగ్గరే శిల్పం చెక్కడం నేర్చుకున్నాడు. వాళ్ల నాన్న పేరు నిలబెడుతున్నాడు’ అంది. తల్లిదండ్రులు తెలుసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల బాగు కోరుతారు. అయితే అన్నీ తాము ఆదేశించినట్టుగా పిల్లలు నడుచుకోవాలన్న «ధోరణి కూడా సరి కాదు. పిల్లలు తమకు ఇష్టమైన చదువులు చదవాలనుకుంటే ఎందుకు ఆ కోరిక కోరుతున్నారో పరిశీలించాలి. కళాత్మక నైపుణ్యాలుండి ఆ వైపు శిక్షణ తీసుకుంటామంటే వాటి బాగోగుల గురించి కనీసం ఆలోచించాలి. కఠినమైన చదువులకు అందరు పిల్లలూ పనికి రారు. రాని చదువును తప్పక చదవాల్సిందేనని హాస్టళ్లల్లో వేసి బాధించి ఇవాళ చూస్తున్న కొన్ని దుర్ఘటనలకు కారణం కారాదు. ఐశ్వర్యంతో జీవించడానికి కొన్నే మార్గాలు ఉండొచ్చు. కాని ఆనందంగా జీవించడానికి లక్షమార్గాలు. పిల్లల ఆనందమయ జీవితం కోసం చిన్నారుల ఆలోచనలను కూడా వినక తప్పదు. ఇది కూడా చదవండి: రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక ఆలయాలివే.. -
నీ భర్తను చంపితే సింగరేణి ఉద్యోగం మనదే.. హాయిగా ఉండొచ్చు రమ
సాక్షి, కరీంనగర్: తన భర్తను అడ్డు తొలగిస్తే.. సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరం హాయిగా ఉండొచ్చని చెప్పి ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. అంతేకాదు.. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించింది కూడా.. రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసుస్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్‌రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి లావుడ్య మధుకర్–రమ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. రమ తనకు తెలిసిన వారికి పెళ్లి సంబంధం కుదిర్చేక్రమంలో ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది గోవర్ధన్, రమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గోవర్ధన్ తరచూ రమ ఇంటికి వస్తూ పోతున్నాడు. కొన్నిసార్లు రెండుమూడ్రోజులు ఇక్కడే ఉండేవాడు. దీంతో మధుకర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. తన వ్యవహారానికి అడ్డువస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రమ కుట్ర పన్నింది. మధుకర్‌ను చంపితే సింగరేణి ఉద్యోగం కూడా వస్తుందని, ఇద్దరమూ హాయిగా ఉండొచ్చని చెప్పింది. ఇందుకు అంగీకరించిన గోవర్ధన్.. మరో ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని మధుకర్ హత్యకు అక్టోబర్ 29న ప్లాన్ చేశాడు. అదేరోజు మధుకర్ మధ్యాహ్నం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో కలిసి గోదావరిఖని వచ్చారు. గోవర్ధన్ తన ప్రియురాలు రమకు ఫోన్‌చేశాడు. మధుకర్‌తో మాట్లాడాలని చెప్పాడు. ఈక్రమంలో పల్సర్ బైక్‌పై ఫైవింక్లయిన్ వద్ద గల ఓ వైన్‌షాపులోకి మధుకర్ వచ్చాడు. అక్కడ అందరూ కలుసుకొని మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని చెట్లపొదల్లోకి వచ్చి మద్యం తాగుతూ ఉన్నారు. గోవర్ధన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడు పట్టుకుని, తన ఇద్దరు మిత్రులతో కలిసి మధుకర్‌పై దాడిచేశారు. తీవ్రగాయాలతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని రోడ్డు పక్క ఉన్న కాలువలో పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను మృతదేహంపై పడేయాలని యత్నించినా.. అదుపుతప్పి పక్కకు పడింది. ఆ తర్వాత హత్య విషయాన్ని గోవర్ధన్ వాట్సాప్‌కాల్ ద్వారా రమకు తెలిపాడు. అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. రమ వ్యవహారశైలిపై మృతుడి తండ్రి నాన్యానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు లావుడియా(నునసవత)రమ, ధరావత్ గోవర్ధన్(నాచారం, మల్హర్ మండలం), కోట లక్ష్మణస్వామి (కొత్తపల్లి, జయశంకర్ జిల్లా), కర్నే నాగరాజు (ఖాసీంపెల్లి, జయశంకర్ జిల్లా)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే రామగుండం సీఐ, ఎస్సైలు కేసును ఛేదించడంతో ఏసీపీ అభినందించారు. ఇవి చదవండి: చిన్నారిని కుదిపేసిన కాలం! -
కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు
టీవీ నటుడు గుర్మీత్ చౌదరి దుర్గాష్టమి రోజున అసోంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్మీత్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో గుర్మీత్ కండువా కప్పుకుని, నుదుటన తిలకం ధరించడాన్ని చూడవచ్చు. గుర్మీత్ అమ్మవారి భక్తిలో మునిగిపోయినట్లు కనిపించారు. ఫోటోలు షేర్ చేసిన గుర్మీత్ చౌదరి క్యాప్షన్‌లో..‘జై మా కామాఖ్య. అందరికీ అష్టమి శుభాకాంక్షలు’ అని రాశారు. గుర్మీత్.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆలయం వెలుపల అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. కాగా ఈ ఫోటోల్లో గుర్మీత్ ఒంటరిగా కనిపిస్తున్నారు. భార్య డెబినా బెనర్జీ, కుమార్తెలు లియానా, దివిషా అతని వెంట లేరు. గుర్మీత్ టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్లో రాముడి పాత్రలో కనిపించారు. ఈ షో ద్వారా గుర్మీత్‌కు మంచి పేరు వచ్చింది. అతనిని అభిమానించేవారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం గుర్మీత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కూడా చూడండి: యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు? -
Krishna Rama Movie Actors Photos: ‘కృష్ణారామా’ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టెన్త్‌లో మార్కులు బాగా రావాలంటే.. రమారవి టాప్ సీక్రెట్
-
ఆ భూకేటాయింపు సమర్థనీయమేనా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఇవ్వడం ఎలా సమర్థనీయమో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బుద్వేల్ సర్వే నంబర్ 325/3/2లో 5 ఎకరాల భూమిని 2018 సెప్టెంబర్ 9న రాజా బహద్దూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు జీవో నంబర్ 195ను కూడా వెలువరించింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన కె.కోటేశ్వర్రావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. జీవో జారీ చేసిన సర్కార్ దాన్ని రహస్యంగా ఉంచడంవల్లే హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ప్రభుత్వం భూ కేటాయింపు జరిపిందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదించారు. -
విజయనగరంలోని రామక్షేత్రంలో శివనామస్మరణ
-
శవ రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్: సుందరరామశర్మ
సాక్షి, అమరావతి: ఏపీలో శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘శవ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ఏ రోజైనా చంద్రబాబు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. ‘‘కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. న్యాయ వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా?. న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ గురించి చెప్పిన మాటలకు సమాధానం చెప్పే దమ్ముందా ’’ అంటూ చంద్రబాబుపై సుందరరామ శర్మ మండిపడ్డారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు అదొక బూతుయాత్ర. లోకేష్ బూతులు నేర్చుకున్నాడు కానీ... తెలుగు నేర్చుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. చదవండి: చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని -
నితీష్ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్ కుమార్ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్బంధన్ నాయకుడు నితీష్ కుమార్‌ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు. అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్ కుమార్ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్ రాయ్ చిత్రంతో పాటు మహాగత్బంధన్ జిందాబాద్ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్ కిషోర్ యాదవ్ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్‌లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు. ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్ గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్ విద్యా శాఖ మంత్రి రామ్‌చరిత మానస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం. (చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు) -
డాక్టర్. కర్రి రామారెడ్డి కి " సాక్షి ఎక్సలెన్స్ అవార్డు "
-
తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు... వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. -
రామా! ఇది నిజమేనా!
హిమాలయాలలో నిదురిస్తున్న చిరంజీవి అయిన హనుమంతుడికి మెడలో ముత్యాల హారం చేతికి తగలగానే ఏదో జ్ఞప్తికి వచ్చినట్టుగా ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొన్నాడు. నేడు నా రామయ్య కల్యాణం, నా సీతారాములు ముత్యాల తలంబ్రాలు పోసుకునే రోజు, నా రాముడు సీతమ్మ మెడలోల ముడి మీద ముడి అంటూ మూడు ముళ్లు వేసే శుభదినం. ఎన్నాళ్లుగానో ఆ కల్యాణం కన్నులారా తిలకించడానికి వెళ్లాలనుకుంటున్నాను, కాని రామనామస్మరణతో మరచిపోతున్నాను. ఈ సంవత్సరం కూడా మరచిపోతాననుకున్నాను. కాని సరైన సమయానికి ఈ ముత్యాల హారం, అదే ఆ నాడు పట్టాభిషేక సమయంలో సాక్షాత్తు సీతమ్మ నాకు బహూకరించిన ఈ ముత్యాల హారం, నా చేతికి తగిలి, గుర్తుకు వచ్చింది. ఇది నా భాగ్యం. రామనామ మంత్రం జపిస్తూ అయోధ్యకు... కాదు కాదు... భద్రాద్రికి బయలుదేరతాను. ఏ శుభ ముహూర్తాన కంచర్ల గోపన్న నా రాముడికి మందిరం కట్టించాడో కాని, ఆయన రామదాసు అయ్యాడు, నాటి నుంచి ఆయనకు వైభోగంగా కల్యాణం జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరం నేను అక్కడకు వెళ్లి, కన్నులపండువుగా సీతారామకల్యాణం వీక్షిస్తాను. త్రేతాయుగంలో నా రాముడి కల్యాణం జరిగేనాటికి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు కదా. ఆ వైభోగం ఇలా చూడగలగడం నా భాగ్యమే కదా... అనుకుంటూ... ‘రామ రామ రామ...’ అని స్మరిస్తూ, భద్రాద్రి చేరుకునే సమయానికి, కల్యాణం ప్రారంభమవుతోంది. కల్యాణం కన్నులారా వీక్షించాడు. పరవశించిపోయాడు. తన్మయంలో మునిగితేలాడు. కల్యాణం పరిసమాప్తమైంది. భక్తులంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు. రామయ్య సీతమ్మతో ఏకాంత మందిరంలోకి ప్రవేశించి, ముచ్చట్లు ప్రారంభించాడు. వారి వెంటే హనుమ కూడా అంతఃపురం వరకు వచ్చి, బయట నిలబడి, దూరం నుంచి అంతా గమనిస్తున్నాడు. కొద్దిసేపటి తరవాత వారిని సమీపించి, ‘‘తండ్రీ! మీరు ఏకాంత మందిరంలో ఉన్నా కూడా, ఎవరి అనుమతి లేకుండా మీ దగ్గరకు వచ్చే చనువు నాకుంది కనుక, ఇలా వచ్చాను’ అన్నాడు. ఏమిటి హనుమ! ఇలా వచ్చావు, నేను నెరవేర్చవలసిన కార్యం ఏదైనా ఉందా?’ అని మృదుమధుర గంభీర గళంతో అడిగాడు రాముడు. ‘అటువంటిదేమీ లేదు తండ్రీ! మీ జంట చూడముచ్చటగా ఉంది. ఏనాడో త్రేతాయుగంలో శివధనుర్భంగం చేసి, సీతమ్మను చేపట్టావు. ద్వాపరం గడిచింది, కలియుంగలో కూడా కొన్ని వేల సంవత్సరాలు గడిచాయి. నేటికీ నీ కల్యాణం ఇంత వైభోగంగా జరుగుతోంది. తండ్రీ! నిన్ను వేనోళ్ల కొనియాడినా నా తనివి తీరదు...’ అంటూ పరవశించిపోతుంటే, స్థితప్రజ్ఞుడైన రాముడు నిశ్చలంగా కూర్చున్నాడు. అంతలోనే హనుమ... నీ పట్టాభిషేక సమయంలో నువ్వు సీతమ్మ చేతికి ఒక ముత్యాల హారం ఇచ్చి, ‘జానకీ! ఈ హారాన్ని నీకు ఇష్టమైన వారికి అందించు’ అన్నావు. సీతమ్మవారు... కాదు కాదు... నా కన్నతల్లి... ఆ హారాన్ని అందుకుని సింహాసనం మీద నుంచి లేచి, మెట్లు అవరోహించి, సభలో అందరి మధ్యగా అడుగులు వేస్తూ, విభీషణ, జాంబవంత సుగ్రీవ, అంగదాది వానరులను ఒక్కొక్కరినీ దాటుకుంటూ వచ్చి, నా దగ్గరకు రాగానే నిలబడిపోయింది. ఒక తల్లి తన కుమారుడిని చూసినంత ఆప్యాయంగా నా వైపు చూస్తూ, ‘మారుతీ! ఈ హారానికి నీవు మాత్రమే అర్హుడవు’ అంటూ నా చేతికి అందించింది. అక్కడున్నవారంతా హర్షధ్వానాలు చేశారు. సీతమ్మ ఎంపిక ఎంత చక్కగా ఉందో అంటూ సంబరపడ్డారు. ఆ తల్లిని వేనోళ్ల కొనియాడారు. నేను సిగ్గుతో ముడుచుకుపోతూ, ‘తల్లీ! అంతా రాముని మహిమ వల్లే జరిగిందమ్మా, ఆయన అనుజ్ఞ లేనిదే నేను ఇంత ఘనకార్యం సాధించలేకపోయేవాడిని’ అన్నాను... ఇదంతా నాటి గాథ. ‘తండ్రీ! నీ కథ జరిగిన ఇన్ని వేల సంవత్సరాల తరవాత నిన్ను కొన్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. నువ్వు నా తండ్రివి కనుక, నేను ఏది అడిగినా నువ్వు చిరునవ్వుతోనే సమాధానాలు చెబుతావని నాకు తెలుసు కనుక ధైర్యంగా అడుగుతున్నాను. అయితే ఇవి నా సందేహాలు కాదు. నీ గురించి నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటుంటే ఆ మాటలు నన్ను బాధపెడుతున్నాయి. నీ వెంటే ఉండి, నీ అడుగులో అడుగులు వేసిన నాకు, నువ్వంటే ఏమిటో తెలుసు. ఇతరులు నిన్ను శంకిస్తుంటే నా మనసుకి కష్టంగా ఉంది. అందుకే సందేహ నివృత్తి కోసం నిన్ను ప్రశ్నిస్తున్నాను. మా సీతమ్మ తల్లి రావణుని చెరలో సంవత్సర కాలం ఉండి వచ్చిన తరవాత, నువ్వు ఆమెను అనుమానించావని, అగ్ని ప్రవేశం చేయించావని అందరూ అనుకుంటున్నారు. నీ వంటివానికి అనుమానించే లక్షణం లేదు కదా తండ్రీ. అందునా నీ గాథ రచించిన వాల్మీకి అలా రాసి ఉంటాడనుకోవట్లేదు.... అంటుండగానే... మధ్యలోనే సీతమ్మ అందుకుని, హనుమా! నీ రామయ్య ఎటువంటివాడో నీకు తెలియదా. నా ప్రభువు రాముడికి అపవాదు రాకూడదనే నేనే, స్వయంగా చితి పేర్చుకుని అగ్నిప్రవేశం చేశాను. భార్యను అనుమానించేంత చిన్నబుద్ధి లేదు రామునికి. రాముడు నాకు భర్త మాత్రమే కాదు, కొన్ని కోట్లమందికి ప్రభువు. ఆయన అందరికీ ఆదర్శంగా ఉండాలే కాని, నియంతలా శాసించకూడదు. ఆయనను ఎవ్వరూ వేలెత్తి చూపకూడదు. అందుకే నాకుగా నేను చితి పేర్చుకున్నాను అని పలికింది జనకరాజ పుత్రి. రాముడు చిరునవ్వుతో, హనుమా! ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఊహలు వారివి. వారి కళ్లకు నా ప్రవర్తన అలా కనిపించి ఉందేమో, వారు అలా అనుకోవడంలో తప్పులేదేమో అన్నాడు. హనుమ మరో ప్రశ్న అడిగాడు... తండ్రీ! నువ్వు భార్యను అనుమానించావని, నిండు చూలాలని కూడా చూడకుండా, ఒక చాకలివాని మాట పట్టుకుని, అరణ్యాలపాలు చేశావని, అక్కడ కుశలవులు పుట్టారని, సీతమ్మ తల్లి భూదేవి ఒడిలో చేరిపోయిందని, ఎన్నెన్ని మాటలు అన్నారయ్యా నిన్ను... అంటూ కన్నీరుమున్నీరవుతుంటే, ‘హనుమా, మనమంతా మనుషులం. మనుషులలో అన్నిరకాల మనస్తత్వాలవారు ఉంటారు. అందరి అభిప్రాయాలను సహృదయంతో స్వీకరించాలి. ఆ విషయం కల్పితం అని వాల్మీకం చదివితే అర్థం అవుతుంది.. మా కథ రచించిన మహర్షి రామాయణ ఆరంభంలోనే... కుశలవుల చేత ఈ కథను గానం చేయించినట్లు వివరించాడు. నేనంటే భక్తి ప్రపత్తులు ఉన్న మరో కవి, నా సీత దూరమైతే ఎలా ఉంటుందో ఊహించి ఆ కథా రచన చేశాడని పండితులే స్వయంగా ఘోషిస్తున్నారు కదా ... అన్నాడు. రామా! నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వేమిటో, నీ సత్ప్రవర్తన ఏమిటో, నీ ఏకపత్నీవ్రతమేంటో అర్థమైపోయిందయ్యా. నీ సునిశిత మనస్తత్వం కూడా అర్థమైందయ్యా. ఇందుకు సంబంధించి నేను ఒక్క మాట చెప్పాలయ్యా. నువ్వు సీతమ్మను వెతుకుతూ మా కిష్కింధకు వచ్చావు. సీతమ్మ జాడ గురించి అడిగావు. నేను నగల మూటను తీసుకువచ్చి చూపించాను. నువ్వు ఒక నగను చేతిలోకి తీసుకుని కంట తడిపెట్టి, పక్కనే ఉన్న సౌమిత్రితో, ‘తమ్ముడూ! నా కళ్లకు నన్నీళ్లు అడ్డపడుతున్నాయి. నగలు నేను గుర్తించలేకపోతున్నాను. మీ వదినగారి నగలు నువ్వు గుర్తించవయ్యా... అన్నావు. అమ్మ అంటే నీకు ఎంత ప్రేమయ్యా. అంతేనా, నీ తమ్ముడు నీకు తగ్గ అనుజుడు. ఆయనకు నగలు చూపితే, ఆయన సీతమ్మ కాలి మంజీరాలు మాత్రమే గుర్తుపట్టగలిగాడు. నిత్యం ఆ తల్లి పాదాలకు నమస్కరించేవాడు నీ తమ్ముడు. ఎంత ఉత్తములయ్యా మీరు. చివరగా ఒక్క మాట తండ్రి... ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గతించినా, దాంపత్యానికి చిహ్నంగా నా తల్లి సీతమ్మను, నా తండ్రి రామయ్యను చెప్పుకుంటూనే ఉంటారు. అది నాకు ఎంతో సంతోషం రామా! నాకు ఇంతకంటె ఏం కావాలి. నాడు మీ కల్యాణం స్వయంగా చూడలే కపోయామని ఎవ్వరూ బాధపడక్కర్లేదు. నీ భక్తుడు రామదాసు చేసిన పుణ్యం కారణంగా ప్రజలంతా ఏటేటా మీ కల్యాణం చూస్తూనే ఉంటారు. ఇంక నాకు సెలవు ఇప్పించు రామా! హిమాలయాలకు వెళ్లి, నీ నామస్మరణ చేస్తూ తపస్సులోకి వెళ్లిపోతాను... అని సీతారాముల ఆశీస్సులు తీసుకుని హనుమ నిష్క్రమించాడు. సృజన రచన – డా. వైజయంతి పురాణపండ -
సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్
సాధారణంగా నింబంధనలు పాటించని వాహనాదారులను ఆపి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. ఫైన్ వేసినప్పుడు వావాహనదారుడి వివరాలను తీసుకొని రశీదు ఇస్తారు. అయితే ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన ఓ వాహనదారుడు చెప్పిన వివారాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కొల్లాం జిల్లా చాడమంగళంలో ఓ వ్యక్తిని సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ట్రాఫిక్ పోలీసుల ఆపి రూ.500 ఫైన్ వేస్తాడు. అయితే అప్పటికే తాను ఫైన్ కట్టినట్లు ఆ వాహనదారుడు చెబుతాడు. అయితే తప్పనిసరిగా మళ్లీ జరిమానా కట్టాలని పోలీసులు అనడంతో.. చేసేదేంలేక ఆ వాహనదారుడు తన అసలు పేరు కాకుండా.. తన పేరు రామా(రామన్)అని, తండ్రి పేరు దశరథ, ఊరు అయోధ్య అని చెబుతాడు. ప్రభుత్వానికి ఫైన్ల రూపంలో డబ్బు వస్తున్నప్పుడు ప్రయాణికుడు ఏం చెప్పినా తనకు అవసరం లేదన్నట్టు పోలీసు రశీదు రాసి ఇస్తాడు. దీనికి సంబంధించిన రశీదును వాహనదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇటీవల కాలంలో కేరళలో ట్రాఫిక్ పోలీసులు కారణం లేకుండా జరిమానాలు విధిస్తూ.. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్డౌన్, కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు విచ్చలవిడిగా ఫైన్ వేసిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తోంది. -
పవిత్రతా స్వరూపిణి సీత
భారతదేశంలో వివాహితుడు భార్య ప్రక్కన ఉంచుకోకుండా ఏ క్రతువు, వ్రతము చెయ్యకూడదు. భార్య భర్త ప్రక్కన ఉండాలి. సహ ధర్మచారిణి అనేది పత్నికి వాచకం. గృహస్థుడు అనుష్ఠించాల్సిన కర్మకలాపాలు వందల. సంఖ్యలో ఉన్నాయి. కానీ భార్య లేకపోతే సక్రమంగా ఏ కర్మ చెయ్యడానికి శాస్త్ర ప్రకారం అతడికి అర్హత లేదు. రాముడి భార్య బహిష్కరింపబడ్డ కారణంగా ఆమె అతని ప్రక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. " అలా ఎన్నటికీ జరగదు.నా జీవితం సీతదే." అన్నాడు రాముడు. రాజుగా అతడు ప్రజల కోరికను ప్రతిఘటించడం ఇదే మొదలు. యజ్ఞ నిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులుగా బంగారంతో ఒక సీత ప్రతిమను రూపొం దించారు. రాముడు నైమిశారాణ్యంలో అశ్వమేధ యాగం చేసాడు. ఆ యజ్ఞానికి వాల్మీకి మహర్షి శిష్య సమేతంగా వెళ్ళాడు. వాల్మీకి కుశలవులను రామాయణాన్ని గానం చేయమని ఆదేశిం చాడు. రామాయణాన్ని విన్న రాముడు వారు సీత పుత్రులే అని నిశ్చయించుకున్నాడు. సీత తన శుద్ధిని తన నిర్దోషిత్వాన్ని ఋజువు చేసే శపథం చేయాలని దూతల ద్వారా కబురు పంపాడు. వాల్మీకి వెంట సీత సభలో ప్రవేశించింది. సీత చేయబోయె శపథాన్ని వినటానికి వచ్చిన వివిధ వర్గాల ప్రజలతో ఆ సభ కిక్కిరిసిపోయింది. వాల్మీకి తన తపస్సు సాక్షిగా సీత పరిశుద్ధు రాలని ఉద్ఘోషించాడు. సీత సౌశీల్యం తనకు తెలుసని అయినా లోకాపవాదానకి వెరసి తాను సీతను పరిత్యజించినట్లు అంగీకరిం చాడురాముడు.ఈ కలవలిద్దరు తన బిడ్డలేనన్నాడు. సీత త్రికరణశుద్ధిగా తాను రాముడిని పూజించి నట్లయితే వివరమిమ్మని భూదేవిని ప్రార్థించింది మనసా కర్మణా వాచా యథా రామం సమర్చయే । తథామే మాధవీ దేవి వివరం దాతుమర్హతి ॥ అప్పుడు భూమి విచ్చుకుంది. " ఇదిగో ఋజువు " అంటూ సీత భూమి ఒడిలోచేరింది. భూదేవి సీతను సింహాసనంపై కూర్చోబెట్టుకొని రసాతలానికి వెళ్ళిపోయింది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్వీణ్ణు లయ్యారు. రాముడు శోక సముద్రంలో మునిగి పోయాడు. సీతాదేవి పాతివ్రత్యమే! పవిత్రతా సరూపమే! ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొకరి దేహాన్పి స్పృశించదు. "పాతివ్రత్యమే ఆమె పరిశుద్ధత" అని రాముడన్నాడు. సీత అనే మాట భారత దేశంలో శుభం, పరిశుద్ధం,పవిత్రమైనవాటికెల్లా పర్యాయపదం, ఆమె సకల సద్గుణాలరాశి. సీత క్షమాశీలి,సర్వదా పరిశుద్ధ వర్తనం ఉన్న అర్థాంగి అంతటి బాధను అనుభవిస్తున్నా రాముని గురించి ఒక్క పరుషమైన వాక్కు కూడా పలకలేదు. సీత ఏనాడూ హానికి ప్రతిహాని తలపెట్ట లేదు.ప్రతి స్త్రీ సీతాదేవి అవడానికి ప్రయయ్నంచుగాక! -గుమ్మా నిత్యకళ్యాణమ్మ చదవండి: నమస్కారం ఎవరికి.. ఎలా? తెలివుండాలి...తెలిసుండాలి -
ఆశ్రిత వత్సలుడు
పరదారాపహరణం చాలా పాపమని, సాక్షాత్తూ ఆదిశక్తి వంటి సీతమ్మను తెచ్చి బంధించడం లంకకు చేటని, రావణునికి అత్యంత ప్రమాదకరమని, మర్యాదగా సీతమ్మని రామునికి అప్పగించి, క్షమాపణలు వేడుకోమని ఎంతో హితబోధ చేశాడు విభీషణుడు తన అన్న అయిన రావణునికి. పోగాలం దాపురించిన రావణుడు ఆ మాటలను చెవికెక్కించుకోకపోగా తీవ్రంగా అవమానించడంతో విభీషణుడు దుష్టుడైన అన్నను వదిలి ధర్మస్వరూపుడైన రాముని శరణు వేడాలన్న ఉద్దేశ్యంతో ఎప్పుడూ తననే అనుసరించే నలుగురు అనుచరులతోపాటు లంకను వదిలి సముద్రాన్ని దాటి అవతలి తీరంలో వానర సేనతో ఉన్న శ్రీ రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆకాశంలోనే నిలచి రాముడిని శరణు వేడాడు. అప్పుడు విభీషణుని చూసిన సుగ్రీవుడు ఆ వచ్చిన వారు రాక్షసులనీ, వారిని వెంటనే ఎదుర్కోవలసిందనీ తన సేనలను ఆజ్ఞాపించాడు. సుగ్రీవుడి ఆనతిని అందుకున్న వానర సేన తనను చుట్టుముట్టబోగా, వారిని చూసి విభీషణుడు తాను లంకాధిపతి రావణుని సోదరుడిననీ, అన్నను వదిలి ధర్మమూర్తి అయిన రాముని శరణు కోరి వచ్చాననీ, తాను మిత్రుడినే తప్ప శత్రువుని కాననీ చెప్పాడు. ఆ మాటలు విని సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, మైందుడు తదితరులు అతనిని ఎంతమాత్రమూ నమ్మవద్దని, అతడికి ఆశ్రయం ఇవ్వడం ప్రమాదకరమనీ రామునికి చెప్పారు. హనుమంతుడు కూడా ఇంచుమించు అవే మాటలు చెప్పాడు. అప్పుడు రాముడు వారితో– ‘‘వానర వీరులారా! విభీషణుని గురించి మీరంతా చెప్పినవి విన్నాను. మీరు చెప్పిన మాటలు యదార్థమే కావచ్చునేమో కానీ, నాకొక వ్రతం ఉంది. అదేమంటే, నాకు శత్రువైనా, మిత్రుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి ‘శరణు’ కోరితే, వారిలో ఎటువంటి దోషాలున్నా, వారు ఎంతటి చెడ్డవారయినా సరే, నేను వారికి అభయమిచ్చి తీరుతాను. సుగుణాలు ఉన్నవానిని రక్షించడం కంటే దోషాలున్న వారిని రక్షించడంలోనే మంచితనం బయటపడుతుంది. మరొకటి, ఇక్కడున్న ధర్మసూక్ష్మమేమిటంటే, దుష్టుడైన రావణునికి ధర్మం తెలిసిన విభీషణుడు తమ్ముడు కాకూడదన్న నియమమేమీ లేదు కదా... అదేవిధంగా మన శత్రువుల వద్ద నుంచి వచ్చినంత మాత్రాన అతడు కూడా మనకు శత్రువు కానవసరం లేదు! మనకు మిత్రుడు కావచ్చు కదా! లోకంలో దాయాదులెవరూ మిత్రుల్లా కలిసి మెలిసి ఉండరు. వారిలో వారికి మనస్పర్ధలుంటాయి. అందుకే జ్ఞాతులు సాధారణంగా విడిపోతుంటారు. ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. అలాగే సీత కారణంగా రావణుడికి, విభీషణుడికి భేదాభిప్రాయాలు వచ్చి ఉంటాయి. అందుకే రావణుడు తమ్ముడిని తరిమి వేసి ఉంటాడు. మనం వచ్చిన కార్యం... అధర్మపరుడైన రావణుని ఎదిరించి, నా సీతను తీసుకు రావడం. కాబట్టి విభీషణుడికి, మనకు శత్రుత్వం ఎలా ఉంటుంది? ఒకవేళ మీరందరూ అనుమానించినట్లుగా విభీషణుడు దుష్టుడైనా కానీ మనకు వచ్చిన భయమేమీ లేదు. అతడు నాకు గానీ, మీలో ఎవరికైనా కానీ ఎటువంటి అపకారమూ చేయలేడు. నేను తలచుకుంటే ఈ భూమి మీద ఉన్న రాక్షసులను, దానవులను, యక్షులను ఒంటిచేత్తో ఎదుర్కోగలను. అలాంటిది ఈ ఐదుగురు రాక్షసులు ఎంత? శరణన్న విభీషణుడికి అభయమిస్తున్నాను. అతనిని ఇప్పుడే లంకకు రాజుగా ప్రకటిస్తున్నాను’’ అన్నాడు. రాముడికి ఉన్న ధర్మనిరతి, సంయమనం, ఆలోచన శక్తి, కుశాగ్రబుద్ధి, కొండంత ఆత్మవిశ్వాసాన్ని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాజైనవాడు ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నప్పటికీ కేవలం అనుచరులు చెప్పిన మాటలను అసలు వినకుండా ఉండకూడదనీ, అదేవిధంగా ఆ మాటలను మాత్రమే విని, వాటిని బట్టి నిర్ణయం తీసుకోరాదనీ, తాను నిర్ణయించుకున్న విషయాన్ని ఎటువంటి తొట్రుపాటూ మరెంతటి మిడిసిపాటూ లేకుండా చక్కగా వివరించి చెప్పడం, చక్కగా ఆలోచించడం, సత్వర నిర్ణయాలు తీసుకోగలగడం, ఆ తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయడం ఎంతో మంచి చేస్తుందనీ మనం అర్థం చేసుకోవాలన్నదే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
శ్రీ సౌమ్యరామ
ఎంత కోపం వచ్చినప్పటికీ, రాముడు విచక్షణ కోల్పోయిన సందర్భాలు లేవు. తనను అరణ్యవాసం చేయమన్న కైకను ఎందరు ఎన్ని విధాల దూషించినప్పటికీ, తాను మాత్రం తూలనాడలేదు రాముడు. దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, అయోధ్యాపురవాసులు ఆఖరికి కన్నకొడుకయిన భరతుడు కూడా కైకను నిందిస్తారు. అయినా రాముడు వారందరినీ వారిస్తూ ‘‘ఇప్పటివరకూ కైక నన్ను కన్నకొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే దైవ నిర్ణయమే తప్ప వేరు కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకువంశ రాజుల సత్యనిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడే తప్ప, వాంఛకు వశుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం నా మీద ఉంది కాబట్టి తనకు పెద్దకొడుకుగా రాజ్యాధికారం ఉన్నా, అరణ్యవాసమే మిన్న’’ అని అడవులకు వెళ్లాడు. భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావడానికి తన మాతలతో, వశిష్టాది గురువులతో, పెద్ద సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు అనుమానించి, కోపోద్రిక్తుడై భరతుడి మీద యుద్ధానికి సిద్ధపడినప్పుడు, రాముడు భరతుని పట్ల కోపం తెచ్చుకోకుండా అతని నిజాయితీని సరిగ్గా అంచనా వేశాడు. అధర్మం ఎవరు చెప్పినా రామునికి కోపం వస్తుంది. ‘తండ్రి అయినా సరే, చనిపోయిన దశరథుని మాట మన్నించనక్కరలేదు’ అని జాబాలి అనే పురోహితుడు చెప్పినప్పుడు, రామునికి కోపం వచ్చింది. కానీ తొందరపడకుండా శాంతవాక్యాలతోనే జాబాలిని ఖండించాడు.ఇక సుగ్రీవుడు తనకు రాముడిచ్చిన గడువు పూర్తయినప్పటికీ, భోగాలలో మునిగి తేలుతూ, సీతాన్వేషణ ఇంకా మొదలుపెట్టక పోవడంతో రామునికి కోపం వస్తుంది. కానీ దానిని అణచుకుంటాడు. ‘‘మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్దాము, ఒక అవకాశం ఇద్దాము. అయినా వినకపోతుంటే అప్పుడు ‘వాలి వెళ్లిన దారిలోనే నిన్నూ పంపిస్తాము’ అని’’ చెప్పి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు. అదే వాలి విషయానికి వచ్చేసరికి అతడు అధర్మాన్నే అనుసరించాడు కాబట్టి హెచ్చరికలు లేకుండా శిక్షిస్తాడు. ఇక్కడ సుగ్రీవునిది కర్తవ్య నిర్వహణా లోపం, వాలిది అధర్మం. కర్తవ్య నిర్వహణలో పొరపాటు సహించవచ్చు కాని, అధర్మాన్ని మాత్రం సహించకూడదని రాముడు తన చేతల ద్వారా చెప్పాడు. పై మూడు సంఘటనలలో రాముడు ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదో, కోపం వచ్చినా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తున్నాడు. మనం శ్రీరామచంద్రమూర్తి నుండి నేర్చుకోవలసినది అదే. – డి.వి.ఆర్. -
ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో వైకుంఠ ప్రయుక్త ఏకాదశి ఉత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యా యి. అధ్యయనోత్సవాల్లో భాగంగా పరివార దేవతల ను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో వేంచేయింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మత్సా్య వతారంలో అలంకరించిన అర్చకులు బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఆళ్వార్ల మధ్య స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. అధ్యయనోత్సవాల నిర్వహణలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, ఇతర సిబ్బందికి దేవస్థానం తరఫున ఈఓ రమేశ్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. స్వామివారితో పాటు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు గావించా రు. అనంతరం వేద పండితులు చతుర్వేదాలను, దివ్య ప్రబంధాలను పఠించారు. ఆ తర్వాత మత్సా్యవతారంలో ఉన్న రామయ్యను గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలమూర్తుల వద్ద కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి వారిని వేంచేయింపజేసి కోలాటా లు, భజనలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్త జనసందోహం నడుమ గోదావరి తీరం వరకు ఊరే గింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తిరిగి కల్యాణమండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని భక్తుల సందర్శనార్థం వేంచేయింపజేశారు. మత్సా్యవతార రూపుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆలయ వేదపండితులు మత్సా్యవతర రూపం విశిష్టతను వివరించారు. పురవీధుల్లో స్వామివారు... మిథిలా ప్రాంగణంలో పూజలు అందుకున్న శ్రీసీతారామచంద్రస్వామి వారిని అక్కడ నుంచి పల్లకిపై పురవీధుల్లో తిరువీధి సేవకు తీసుకెళ్లారు. మహిళా భక్తుల కోలాటాలతో రామ నామ సంకీర్తనలు ఆలపించగా, వేద విద్యార్థులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనం తోడుగా స్వా మివారు పురవీధుల్లో ఊరేగారు. దారి పొడువునా భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేశ్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈఓ శ్రావణ్ కుమార్, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, డీఈ రవీందర్, ఈవోటు సీసీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు కూర్మావతారం... సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూ ర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ‘ దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని చిలకించగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనలతో శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మం ధర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయి’ అని పండితులు చెబుతున్నారు. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు... మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భద్రాచలానికి చెందిన శ్రీరామ సేవాతరంగణి సరోజని బృందంచే భజన సంకీర్తన, ఖమ్మానికి చెందిన ఎల్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయభారం హరికథా కాలక్షేపం ఉంటాయి. ఆ తర్వాత విజయవాడ జయరామ, సుధాకర్ వారిచే గాత్ర కచేరి, భద్రాచలానికి చెందిన అల్లం రమాదేవిచే భక్తి సంగీతం, మంగళగిరికి చెం దిన గోలి శ్రీలక్ష్మి వారిచే కూచిపూడి నృత్యం, హై దరాబాద్‌కు చెందిన సాయి దంషిక కూచిపూడి నృ త్యం, ఖమ్మం రాయప్రోలు అలేఖ్య బృందంచే కచేరి ప్రదర్శించనున్నారు. తర్వాత వనంవారి కృష్ణాపురం వనం శ్రీముఖి, రఘుమయిచే నాట్య ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్ జనత సేవా సమితి వారిచే భక్త రామదాసు నాటకం ఉంటుంది. పర్ణశాలలో పెబ్బేరుకు చెందిన హెచ్ఎం సుధాకర్‌చే శ్రీరామ పట్టాభిషేకం హరికథ ఉంటుంది. -
హితోక్తులు
వానర వీరుడైన సుగ్రీవుడికి అనుకోకుండా, కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తనకంటే చాలా బలవంతుడైన తన సోదరుడు వాలితో వైరం ఏర్పడింది. అన్న ఏ క్షణానైనా తనను మట్టుపెట్టవచ్చునన్న భయంతో వాలి అడుగు పెడితే చాలు– తల పగిలి మరణిస్తాడన్న శాపం ఉన్న ఋష్యమూక పర్వతంపై జీవనం సాగిస్తున్నాడు.అదే సమయంలో రామలక్ష్మణులు సీతను వెతుకుతూ సుగ్రీవుని కంటపడ్డారు. మహా ధనుర్ధారులైన వారిని చూసి భయపడిపోయిన సుగ్రీవుడు, వారిని గురించి తెలుసుకోమని హనుమంతుని పంపాడు. హనుమ బ్రహ్మచారి రూపంతో వారిని సమీపించి, మంచిమాటలతో వారి వివరాలు కనుక్కొని వారిని సుగ్రీవుని వద్దకు తీసికెళ్ళాడు. సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. వారి నుంచి సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెతకడానికి తాను సహాయపడగలనని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. అదే సమయంలో తనకు అన్నతో ఏర్పడిన విరోధం గురించి, తనకు అతని వల్ల కలుగుతున్న భయం గురించీ వివరించాడు. వాలిని సంహరించి సుగ్రీవునికి ప్రాణభయం లేకుండా చేస్తానని వాగ్దానం చేశాడు రాముడు. రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. వారిరువురూ ఒకే విధంగా ఉండటంతో వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరమాడాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. ఆ సమయంలో వాలి భార్య తార, ‘ఇంతక్రితమే నీ చేతిలో చావు దెబ్బలు తిని ఎలాగో ప్రాణాలు దక్కించుకుని వెళ్లిన నీ తమ్ముడు ఇంతట్లోనే మళ్లీ వచ్చి నీపై కయ్యానికి కాలు దువ్వుతున్నాడంటే, దానివెనక ఏదో మర్మం ఉండి వుంటుంది కాబట్టి ఈ సమయంలో యుద్ధం అంత మంచిది కాదు’ అని హెచ్చరిస్తుంది. వాలి ఆమె మాటలను పెడచెవిన పెట్టి, తమ్ముడి మీదికి యుద్ధానికి వెళతాడు. సమయం చూసి రామచంద్రుడు వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి రాజుగానూ, అంగదునికి యువరాజుగానూ పట్టం కట్టి, తారను తిరిగి సుగ్రీవునికి కట్టబెట్టాడు. రాజ్యాభిషేకానంతరం సుగ్రీవుడు ధర్మార్ధవిముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతూ, రామునికిచ్చిన మాటను దాదాపు మరచిపోతాడు. దాంతో లక్ష్మణుడు ఆగ్రహంతో సుగ్రీవుని సంహరించడానికి వెళ్లబోగా, తార సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తుంది. సుగ్రీవుడు తన అపరాధాన్ని మన్నించమని వేడుకుని, తన సేనాగణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని చెంతకు వెళ్ళి రాముని పాదాలపై పడ్డాడు. రాముడు అతణ్ణి క్షమించి ఆలింగనం చేసుకొన్నాడు. అనంతరం సుగ్రీవుడు క్షణం ఆలస్యం చేయకుండా సీతాన్వేషణకు పథకాన్ని సిద్ధం చేసి రాముని అభిమానాన్ని చూరగొన్నాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, చెప్పిన మాటలను వినకపోవడం వల్ల వాలికి కలిగిన చేటును, తార మాటను వినడం వల్ల సుగ్రీవునికి తప్పిన ముప్పును. చేసిన ఉపకారాన్ని మరచి ఇచ్చిన మాటను పెడచెవిన పెడితే వచ్చే అనర్థాన్నీ. – డి.వి.ఆర్.భాస్కర్ -
ఎనిమిదేళ్ల పగతో భర్తను..
గొల్లపల్లి(ధర్మపురి): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్‌లో దారుణహత్య జరిగింది. కుటుంబ కలహాలతో భార్య భర్తను సిమెంటురాయితో మోది, మారణాయుధాలతో దాడి చేసి హతమార్చింది. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఇందుకు తన పిల్లల సహకారం తీసుకున్నట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. దట్నూర్ గ్రామానికి చెందిన అలిశెట్టి రమేష్(50)కు భార్య రమ, కుమార్తెలు నాగరాణి(17), నవ్య(13), కొడుకు గవాస్కర్(15) ఉన్నారు. రమేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కొద్దిరోజులుగా కుటుంబంలో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రమేశ్ కుటుంబ సభ్యు లు అందరూ కలిసి మంగళవారం వ్యవసాయ భూమి వద్దకు వెళ్లారు. అందులో పసుపు కొమ్ములు నాటి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో వం టకోసమై కోడిగుడ్లు తీసుకురావడానికి రమేశ్ కిరాణా దుకాణానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకోగానే చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో భార్య రమ, కూతురు నాగమణి కలిసి రమేశ్‌పై దాడికి దిగారు. రమ సిమెంట్ ఇటుకతో రమేశ్ తలపై మోదింది. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో దగ్గరికి వస్తే తమనూ చంపేస్తానని రమ హెచ్చరించడంతో వెనకడుగు వేశారు. ఇంతలో కొన ఊపిరి తో కొట్టుమిట్టాడుతున్న రమేశ్‌పై మరోసారి మారణాయుధాలతో దాడి చేసింది రమ. దీంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. నిందితురాలు పరారీలో ఉందని గొల్లపల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. తండ్రి హత్యే కారణమా..? అయితే రమేశ్ హత్య వెనుక కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రమేశ్ తన మామ(భార్య రమ తండ్రి) కొండి మల్లయ్యను 2010లో గొడ్డలితో నరికి చంపాడు. అప్పటి నుంచి పగ పెంచుకున్న రమ ప్రతీకారంగానే తన భర్తను చంపినట్లు తెలుస్తోంది. -
క్షమయాతు రామః
స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు... పురుషుడు ఎలా ఉండాలో కూడా శాస్త్రం చెప్పింది... కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యంలో లేదు కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః క్షమయా తు రామః భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) కార్యేషు యోగీ పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. కరణేషు దక్షః కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. రూపేచ కృష్ణః రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే (ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోమని కాదు) ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. క్షమయా తు రామః ఓర్పులో రామునిలాగా ఉండాలి. పితృవాక్యపరిపాలకుడైన రాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. భోజ్యేషు తృప్తః భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా) భుజించాలి. సుఖదుఃఖ మిత్రం సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి. ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా ప్రశంసలు అందుకుంటాడు. -
‘సీతారామ’కు తొలి దశ అనుమతి
సాక్షి, హైదరాబాద్ : సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు తొలి దశ (స్టేజ్–1) అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పరిధిలో 1,531 హెక్టార్ల (3,827.5 ఎకరాలు) అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం మంజూరు చేసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జి.రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది. దీంతో అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు కేంద్రానికి అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం సిఫార్సు చేస్తుంది. ప్రాజెక్టులోని పైపులైన్లు, గ్రావిటీ కాల్వలు, వాటిపై నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెళ్లు నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవు తున్నాయి. 175 ఎకరాలు తగ్గింపు.. సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యత ప్రాజెక్టుగా పరిగణి స్తోంది. ఈ కాలువ నిర్మాణం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో 114 కిలోమీటర్ల మేర అటవీ భూముల నుంచి వెళ్తోంది. ఇందుకోసం 1,602 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుకు బదలాయిం చాలని సాగునీటి పారుదల శాఖ తొలుత కోరింది. దీనిపై అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శోభతో పాటు అధికారుల బృందం ఇటీవల వారంపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. 9 అటవీ డివిజన్ల పరిధిలో భూములు, ప్రాజెక్టు కాలువ అలైన్మెంట్, వన్య ప్రాణు లు సంచరించే ప్రాంతాలు, అటవీ సంపదపై ప్రభావాల్ని పరిశీలించింది. అలైన్మెంట్, టన్నెళ్ల ప్రకారం లెక్కలు వేసిన అధికారులు బదలాయించే అటవీ భూమిని 1,531 హెక్టార్లుగా నిర్ధారించారు. ఫలితంగా బదలాయించే అటవీ భూమి 71 హెక్టార్లు (175 ఎకరాలు) తగ్గింది. పనులు వేగిరం: హరీశ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో దశ అనుమ తుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎకో సెన్సి టివ్ జోన్‌లోని 275 హెక్టార్లకు (688 ఎకరాలు) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమ తి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రా ణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరగాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో గుర్తించామని, ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ అటవీ భూముల్లో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను కోరారు. -
కూర్మావతారంలో రామయ్య
సాక్షి, భద్రాచలం : భక్తుల జయజయ ధ్వానాలు.. పండితుల వేద ఘోష నడుమ భద్రాద్రిలో శ్రీ వైకుంఠ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతోన్నాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా నేడు రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సందడితో భద్రగిరి పులకించిపోతోంది. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడట. ఈ అవతారాన్ని దర్శించుకోవడం వలన శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. -
దర్భశయన రాముడు... పెళ్లి చేసే దేవుడు
ఏ ఆలయంలోనైనా దేవుళ్లని నిలబడిన భంగిమలో లేదా కూర్చున్న భంగిమలో దర్శించుకోవడం సాధారణం. కానీ, దర్భశయనంలో మాత్రం శయనించిన శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశాలలో ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో రామనాథపురం జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రం రామేశ్వరానికి సుమారు 60 కి.మీ. దూరంలో రామనా«థపురానికి 8 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి రాముడిని స్థానికంగా ‘తిరుపుల్లవి’ అంటారు. తిరుపల్ అని అనే తమిళపదానికి గడ్డితో(దర్భలతో) చేసిన శయ్య అని అర్థం. (తమిళంలో పుల్ అంటే గడ్డి అని, అనై అంటే శయ్య అని అర్థం). ఒకప్పుడు దర్భలతో నిండిన దట్టమైన అడవి ఉండేదని, దాన్ని ‘పుల్లారణ్య’ అనేవారని చెబుతారు. ఈ రాముడు కళ్యాణ జగన్నాథుడు: ప్రత్యేకించి వివాహలు కావాల్సిన వారికోసం ఇక్కడ దర్భశయనంలో కల్యాణ జగన్నాథుని ప్రతిష్టించారు. అదేవిధంగా సంతానం కోసం సంతాన వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించారు. పెళ్లి కావలసిన యువతీయువకులు దర్భశయనం వెళ్లి స్వామిని దర్శించుకొని కల్యాణ కుంకుమను తెచ్చుకుని 45 రోజులపాటు ప్రతిరోజూ నుదుట ధరిస్తే వివాహం కుదురుతుందని విశ్వాసం. -
లంక విభీషణుడిదే!
సీతాపతి రావణ సంహారం జరిగాక ఆయనకు అంత్యక్రియలు జరిపేందుకు విభీషణుడు వెనకాడాడు. దీనిని రాముడు తప్పు పట్టాడు. మరణంతో శత్రుత్వం సమసిపోయినట్లేననీ ఇప్పుడు నీ అన్న నీకెంతో నాకూ అంతే అని... దగ్గరుండి మరీ విభీషణుని చేత అంత్యక్రియలు జరిపించాడు. రావణుడు మనసు పడి కట్టించుకున్న కోటను యుద్ధం తర్వాత స్వాధీనం చేసుకోవాలని లక్ష్మణుడు భావించి అన్నతో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే. కానీ రాముడు ఏమాత్రం దురాశ పడలేదు. లంకానగరం విభీషణునికే దక్కుతుందని చెప్పి ఆయనకే పట్టం కట్టి శీలం చాటుకున్నాడు. అంతేకాదు ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ... లంకానగరం కన్నా, పుట్టి పెరిగిన అయోధ్యే నాకు మిన్న...’ అంటూ లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరించాడు. అయోధ్యానగరానికి పట్టాభిషిక్తుడైన తర్వాత ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చాడు. ఆయన పాలనలో రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉంది. అందుకే రామరాజ్యం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. -
చెట్టునూ పుట్టనూ వదల్లేదు
సీతాపతి భర్త సిసలైన ప్రేమ భార్య ఎడబాటు సమయంలోనే తెలుస్తుంది. రాముడికి సీత పట్ల ఉన్న ప్రేమ ఆమె సమక్షంలో ఉండగా తెలియలేదు. ఆమె అదృశ్యమైనప్పుడే తెలిసొచ్చింది. దుష్టరాక్షసుడు ఆమెను తీసుకుని వెళ్లిపోతే తల్లడిల్లిపోయాడు రాముడు. సామాన్య మానవుడిలా దుఃఖిస్తూ, ఆమె వివరాలు చెబుతూ, పశుపక్ష్యాదులను, చెట్టును పుట్టను కూడా జాడ తెలిస్తే చెప్పమని బతిమాలాడు. ఆచూకి తెలిశాక అగాధాలతో నిండిన సముద్రంపై ఆఘమేఘాల మీద సేతువు నిర్మించాడు. లంకకు చేరాడు. భీకర సంగ్రామంలో విజయుడిగా నిలిచి తన సీతను తాను సొంతం చేసుకున్నాడు. భార్య క్షేమం కోసం పరాక్రమం చూపినవాడే నిజమైన భర్త. అతడే రాముడు. అందుకే దేవుడు. -
లోక కల్యాణం
ఈ లోకంలో... మనిషికి మంచి గుణాలుంటే! ఈ లోకం తప్పకుండా... సుభిక్షంగా... సులక్షణంగా... ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడిని... ఎలా పూజించాలనే మీమాంస అక్కరలేదు. ఈ సకలగుణాభిరాముడి సుగుణాల్లో... కొన్నింటినైనా మనవిగా చేసుకుంటే... ఆయనకు నైవేద్యం పెట్టినట్లూ ఉంటుంది! మనకు ప్రసాదం అందినట్లూ ఉంటుంది!! అదే లోక కల్యాణం. రామ... ఆ పేరే ఎంతో ప్రియమైనది. తియ్యనైనది. సుందరమైనది. పిబరే రామరసం... రాముని భక్తిలో ఐక్యమవడానికి మించిన ధన్యత ఏముంటుంది గనక. మానవునిగా పుట్టి దేవునిగా ఎదిగినవాడు రాముడు. బలహీన పడే సందర్భాలలో బలహీన పడక, తల వొగ్గాల్సిన సమయాలలో తల వొగ్గక, మాట తప్పాల్సిన సంకటాలలో కూడా మడమ తిప్పక... అదిగో నేను సంపూర్ణమై నిలిచాను... నా దారిలో నడవండి... ఈ దారిలో కష్టాలు ఎదురు కావచ్చు కాని విజయం మాత్రం తథ్యం... అని నిరూపించినవాడు పరంధాముడు. కుమారుడంటే ఇలా ఉండాలి... భర్త అంటే భార్య కోసం ఇలా పరితపించాలి... సోదరుడంటే తన సోదరుల మీద ఇంత ఆపేక్ష చూపాలి, స్నేహితుడంటే తన స్నేహితుడి కష్టాలలో అండగా ఇలా ఉండాలి... ఆహా... రాముడి చరితలో ప్రతి సామాన్యుడు వెతుక్కోవాల్సిన ఘట్టాలు ఎన్నో ఎన్నెన్నో... అందుకే ధర్మవర్తనకు, ప్రవర్తనకు ప్రతిరూపం ఆ శ్రీరామచంద్రుడు. ఆయన కల్యాణ వేడుక పుడమి పరవశించే పర్వదినం. ఆ రాముడు ఎందుకు అవతారమూర్తి అయ్యాడో ఈ శ్రీరామనవమిన చేస్తున్న భక్తిపూర్వక సందర్శనమిది. గొప్ప కుమారుడు అయోధ్యానగరం అంటే ఒక మూలన బంగారం... ఆ మూలన వెండి... ఎటు చూసినా ఐశ్వర్యం... అది రాముడి రాజ్యం. రామరాజ్యం. ఆ రాజ్యానికి ప్రభువు రాముడు. రాజయ్యాక, అవక ముందు కూడా తనను తాను దశరథ తనయుడనే చెప్పుకున్నాడు తప్ప రాజునని ఏనాడూ చెప్పుకోలేదు. అంతటి వినమ్రుడు రాముడు. చిన్ననాటి నుంచే ఆయనకు ఈ వినమ్రత ఉంది. విశ్వామిత్రుడు వచ్చి, యాగరక్షణ కోసం పంపమని అడిగినప్పుడు, తండ్రి ఆజ్ఞపై తమ్ముడు లక్ష్మణునితో కలసి విశ్వామిత్రుని వెంట నడిచాడు రాముడు. సీతాస్వయంవరానికి తీసుకెళ్లినప్పుడు లేశమాత్రంగా శివధనుర్భంగం చేసి సీతను గెలుచుకున్నా విశ్వామిత్రుడి ద్వారా తలిదండ్రులకు సమాచారాన్ని తెలియజేశాకే సీతను వివాహం చేసుకున్నాడు. తండ్రి మాట కోసం పూచికపుల్లతో సమానంగా రాజ్యాన్ని త్యజించినవాడు మానవుడవుతాడా మహనీయుడవుతాడుగానీ! గొప్ప స్థితప్రజ్ఞుడు కన్నతల్లి కౌసల్యను ఎంతగా ప్రేమించాడో పిన తల్లులు సుమిత్రను, కైకను కూడా అంతగా ప్రేమించినవాడు రాముడు. మరికొద్దిసేపటిలో యువరాజుగా పట్టాభిషిక్తుడు కావలసిన వాడు కైక వరం వల్లే సామాన్యుడిగా మిగిలాడు. కైకను నిందించినా కైకను ఎదిరించినా కైకకు తండ్రి ఇచ్చిన వరాలను తోసిపుచ్చినా, అతడి రాజ్యం అతడికి దక్కి ఉండేది. కాని కైక దుర్బలత్వాన్ని, రాజ్యం పట్ల, కుమారుడు భరతుడి పట్ల ఆమెకున్న లాలసను రాముడు అర్థం చేసుకున్నాడు. అందుకే కైకను పన్నెత్తి ఒక్కమాట అనలేదు. అపకారికి అపకారం చేయడం దానవ లక్షణమైతే, ఉపకారం చేయడం రాముడి లక్ష్యం. గొప్ప భర్త రాముడు ఏకపత్నీవత్రుడు. పురాణాలలో పతివ్రతలుగా అనేకమంది కనిపిస్తారు. కాని ఏకపత్నీవ్రతం వల్ల పూజలు అందుకున్న ఒకే ఒక పురుషుడు రాముడు. సీత సమక్షంలో లేని రాముడు అసంపూర్ణుడు. సీతారాములు అనేది జంటగా కనిపించే ఒకే మాట. రాముడూ సీతా వేరు వేరు కాదు. మనసా వాచా కలగలిసిపోయిన ఏకరూపం. ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా సీతమ్మను తప్ప మరొకరి వంక కన్నెత్తి కూడా చూడలేదాయన. వనవాసానికి వెళ్లవలసి వచ్చినప్పుడు సుకుమారి అయిన సీతమ్మ తనతో అడవులకు వస్తే కష్టపడవలసి వస్తుందని వారించాడు. తనను అడవులకు రావద్దన్నందుకు ఎన్నో విధాలుగా సీతమ్మ నిష్టూరపడితే తప్ప ఆమె తనతో రావడానికి అంగీకరించలేదు. ఇంతి కష్టం తన కష్టం చేసుకునేవాడే పురుషుడు. మర్యాదరాముడు. గొప్ప శ్రేయోభిలాషి... శ్రీరాముడు అందరి బంధువు. ఆయనను చూడాలని, ఒక్కసారి దర్శించాలని కోరుకోని వారెవరు? శబరి శ్రీరాముణ్ణి ఆరాధించింది. ఆయన దర్శనం కోసం పరితపించిస్తోందని తెలిసి, ఆమెను మించిన స్థాయి లేదని, ఆమె వద్దకెళ్లి, ఆమె ఎంగిలిని మహాప్రసాదంలా స్వీకరించాడు. ఇక అడవుల్లో జడ పదార్థం వలే రాయిలా మారి ఉన్న అహల్య రాముడి ఓదార్పు వల్లే తిరిగి మామూలు మనిషయ్యింది. రాముడు శ్రేయోభిలాషి. ఎదుటివారి శ్రేయస్సు కోరే వాడే శ్రీరాముడు. గొప్ప స్నేహితుడు మన స్నేహంలో గొప్పతనం ఉంటేనే మనకు గొప్ప స్నేహితులుంటారు. శ్రీరాముడి గొప్పతనం సుగ్రీవుడితో స్నేహంలోనే తెలిసి వచ్చింది. ఇద్దరూ కష్టకాలంలోనే స్నేహితులయ్యారు. ఇద్దరూ రాజ్యాన్ని విడిచి, అడవులలో ఉంటున్నారు. రాముడు సుగ్రీవుడికి ధైర్యాన్ని ఇచ్చాడు. అతడి వల్ల ఆసరాను పొందాడు. అందుకే సుగ్రీవుడు ‘నువ్వు స్నేహితుడుగా లభించడం నా అదృష్టం. ఇలాంటి వ్యక్తి స్నేహితుడుగా ఉంటే ప్రపంచంలో దేన్నైనా సాధించవచ్చు. నీతో స్నేహం కలవడం నాకు దైవమిచ్చిన వరం అనుకుంటాను’ అంటాడు. పడవ నడిపేవాడైన గుహునితో కూడా రామునికి అంతే స్నేహం. రాముడిలాంటి స్నేహితుడు ఉంటే చేతిలో రామబాణం ఉన్నట్టే. గొప్ప సహోదరుడు అనుక్షణం నీడలా తనను అనుసరించే లక్ష్మణుడంటే శ్రీరాముడికి ఎంతో ప్రేమ. ఆ అన్నదమ్ముల మధ్య మౌఖిక సంభాషణ తక్కువ. వారి ఆత్మలే మాట్లాడుకునేవి. ఒకరి సమక్షమే మరొకరికి ఆనందం. అటువంటి లక్ష్మణుడికి ప్రాణం మీదకు వచ్చినప్పుడు రాముడు తల్లడిల్లిపోయాడు. ఇంద్రజిత్తు తన అస్త్రాలతో లక్ష్మణుడిని మూర్ఛిల్లజేసినప్పుడు హనుమంతుడు వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకు వచ్చి లక్ష్మణుని బతికించాక ‘నా బహిఃప్రాణాన్ని తిరిగి నాకు తెచ్చిచ్చినందుకు నీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను హనుమా’ అంటూ పట్టరాని ఆనందంతో హనుమను కౌగిలించుకుంటాడు. లక్ష్మణుడే రాముడికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ. తమ్ముడి పర్యవేక్షణకు అంత విలువ ఇచ్చి రాముడు ఆదర్శనీయుడైనాడు. గొప్ప ధర్మపరాయణుడు తండ్రి కైకకిచ్చిన మాటకోసమే రాముడు వనవాసం వెళ్లవలసి వచ్చిందని తెలిసి భరతుడు మండిపడ్డాడు. వెంటనే కొంతమంది అనుచరులతో కలసి రాముడిని అన్వేషిస్తూ ఆయన ఉన్న చిత్రకూట పర్వతానికి వెళ్లి, ‘అన్నయ్యా! నిన్ను వనవాసానికి పంపించిన నాన్నగారు ఇక లేరు కదా, నీవు వచ్చి రాజ్యాన్ని ఏలుకో’ అంటూ అర్థిస్తాడు. రాముడు అంగీకరించడు. తండ్రికి ఇచ్చిన మాటను వెనక్కు తీసుకోడు. దాంతో నిస్సహాయుడై రాముడి పాదుకలను నెత్తి మీద పెట్టుకుని వెళ్లి ఆ పాదుకలకే పట్టం కట్టి, పరిపాలన చేస్తాడు భరతుడు. అ–సామాన్యుడు రావణుడు మాయావి, అమిత బలవంతుడు, అపారమైన బలగం గలవాడు. తానేమో సామాన్య మానవుడు. కోతిమూక, తమ్ముడు తప్ప తనకు ఏ బలమూ, బలగమూ లేదు. అయినా సరే, రాముడు ఏమాత్రం అధైర్యపడలేదు. వారి సాయంతోనే సేతువు నిర్మించాడు. వారినే వెంటబెట్టుకుని, లంకా న గరానికి వెళ్లి, వారినే సైన్యంగా చేసుకుని యుద్ధానికి సిద్ధపడ్డాడు. మధ్యమధ్యలో రావణుని మాయోపాయాలకూ, కుతంత్రాలకూ కుంగిపోలేదు. గొప్ప యుద్ధతంత్రాన్ని రచించి రావణుని సేనను, సోదరులను, పుత్రులను, ఇతర బలగాన్నంతటినీ క్రమక్రమంగా మట్టుపెడుతూ, రావణుని ధైర్యాన్ని నీరుకార్చి, చివరకు అంతటి బలశాలినీ నేలకూల్చాడు. గొప్ప శిష్యుడు కులగురువైన వశిష్ఠుని మాటను శ్రీరాముడు ఏనాడూ మీరలేదు. ఆయన చెప్పిన శాస్త్రాలను, శస్త్రాస్త్రాలనూ ఆపోశన పట్టాడు. మధ్యలో వచ్చిన విశ్వామిత్రుడినీ గురువుగానే భావించాడు. ఆయన వద్ద యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నాడు. ఆయన తీసుకువెడితేనే సీతా స్వయంవరానికి వెళ్లాడు. శివధనుర్భంగానంతరం ఆయన అనుమతితోనే తల్లిదండ్రులనూ, ఇతర సోదరులనూ, పరివారాన్నీ వశిష్టునీ మిథిలానగరానికి రప్పించాడు. ఆదినుంచి అభిప్రాయ భేదాలతో రగిలిపోతున్న ఇరువురు గురువులనూ ఒక్కతాటిమీద నడిపించాడు. గొప్ప యజమాని చేసిన సాయాన్ని మరువని కృతజ్ఞతాభిరాముడు శ్రీరాముడు. అందుకే సీతమ్మ జాడ కనిపెట్టిన హనుమంతుని బిడ్డలా చూసుకున్నాడు. ఎవరికీ ఇవ్వనంతటి చనువును ఇచ్చాడు. కొన్ని సార్లయితే సీతమ్మకు సైతం దక్కని చొరవ ఆంజనేయునికి దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. గొప్ప యజమానికే గొప్ప భక్తుడు దొరుకుతాడు. రాముడు గొప్ప యజమాని. హనుమంతుడు గొప్ప స్వామి భక్తుడు. ఈ జంట ప్రజల గుండెల్లో చెరగని జోడి. – డి.వి.ఆర్. భాస్కర్ -
‘రామాయణీ’యంగా
-
పెళ్లి..‘పరీక్ష’!
కరీంనగర్ జిల్లా : సరిగ్గా పెళ్లి ముహూ ర్తానికే పరీక్ష ఉండడం.. వరుడి సహా యంతో వధువు పరీక్షకు హాజరై వచ్చాకే పెళ్లి చేసుకున్న ఘటన చొప్ప దండి మండలం ఆర్నకొండలో గురు వారం జరిగింది. గ్రామానికి చెందిన తమ్మడి లింగయ్య, రాజవ్వ దంప తుల కుమార్తె రమ(21)కు, గొల్లప ల్లి మండలం లింగాపూర్‌కు చెందిన చెన్నాల్ల గణేశ్(25)తో గురువారం వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు. కాగా రమ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతోంది. సరిగ్గా పెళ్లి సమయానికే గణితం పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండగా.. వివాహ సమయం ఉదయం పదిన్నరకు ఉంది. కాబోయే భర్త గణేశ్ సలహాతో ముందుగా పరీక్షకు హాజరైంది. కరీంనగర్లో పరీక్ష రాసి వచ్చి మధ్యాహ్నం పెళ్లి కూతురుగా ముస్తాబైంది. బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు. -
రంగు పొర
చూపుకు రంగుంటుంది. నలుపు.. తెలుపు.. ఎరుపు.. నీలం. చూపుకు రంగేంటి?! తెలుపంటే... పవిత్రం. నలుపంటే... మలినం. ఎరుపంటే... విప్లవం. నీలం అంటే... ఆకాశమంత. మగవాడి చూపులో కూడా ఇన్ని రంగులు ఉంటాయి! రంగులను బట్టి కూడా మగవాడి చూపు ఉంటుంది!! ఆ రంగుల్లో కొన్ని... ‘పొర’ల్లా పరుచుకుంటాయి. ఆ పొరలు విడిపోవాలి. నోరు మంచిదైతే... ఊరు మంచిదవుతుంది. కన్ను మంచిదైతే... కాపురం బాగుంటుంది. తొలిరాత్రి ముగిసింది.. ‘రజనీ! ప్లీజ్ ఆ చీర మార్చుకొని హాయిగా నైటీ వేసుకోవచ్చు కదా!’ అప్పటికి అయిదోసారి బతిమాలుతున్నాడు నవీన్. ‘అరే.. నేను చీరలో ఉండడం వల్ల నీకేంటి ఇబ్బంది? ఎందుకంత ఫీలవుతున్నావ్ నవీన్?’ భర్త ప్రవర్తన వింత అనిపించడంతో ఆశ్చర్యంగా అడిగింది రజని. ‘నాకేం ఇబ్బంది. ఆ తెల్ల చీరతో నువ్వే ఇబ్బంది పడ్తున్నావేమో.. నైట్‌వేర్‌లో అయితే ఫ్రీగా ఉంటావ్ కదా అని అంతే..’ అన్నాడు భుజాలెగరేస్తూ! తన మాట కాదని నొప్పించడమెందుకని ‘సరేలే.. మార్చుకుంటా’ అంటూ వాష్‌రూమ్‌కి వెళ్లి నైటీ వేసుకొని వచ్చింది రజని. రజని ఇలా గదిలోకి రాగానే నవీన్ అలా వాష్‌రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నాడు. నవ్వుకుంది ఆమె. అయిదు నిమిషాల తర్వాత బయటకు వచ్చాడు పాలిపోయిన మొహంతో. తేడా గమనించింది. ‘స్టమక్ అప్సెట్ ఏమో’ అనుకొని ఊరుకుంది. తన చిన్నప్పటి కబుర్లేవో చెబుతూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రజని చెప్పింది యాంత్రికంగా విన్నాడే కాని అతని మనసు మనసులో లేదు. నిద్రపోయిన భార్య మొహాన్ని తదేకంగా చూస్తున్నాడు. ‘ఎంత అమాయకంగా కనపడుతోంది.. నన్ను మోసం చేస్తోందా? తాను నిజంగానే మోసపోయాడా? అందుకే ఫస్ట్‌నైట్ అంత స్మూత్‌గా జరిగిపోయిందా? గాడ్.. అయితే బ్యాచ్లర్స్ పార్టీ రోజు తన ఫ్రెండ్స్ చెప్పిన మాటలు నిజమేనా? నిజమే..’ నవీన్‌కి తలలో బాంబు పేలినట్టయింది. విపరీతమైన తలనొప్పి మొదలైంది. ఎలా అడగాలి? ఏమని మొదలుపెట్టాలి? ఈ ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు.. రజని చాలా క్యాజువల్‌గా... హ్యాపీగా కనపడుతోంది. రొమాంటిక్ జోక్స్ వేస్తూ ఉడికిస్తోంది. ‘ఏమీ తెలీనట్టు ఎంతలా నటిస్తోంది? రెండోరాత్రికే ఈ కవ్వింపు జోక్స్ఏంటో.. ఆ ఎక్స్‌పీరియెన్స్ అంతకు ముందు లేకపోతే ఇలాంటి మాటలు ఎలా వస్తాయ్? జాణ.. ’ కసిగా అనుకున్నాడు నవీన్ మనసులో.అనుమానం అతణ్ణి మనిషిలా ఉండనివ్వట్లేదు. ఉచ్చనీచాలు మరిచేలా చేస్తోంది. చేసింది. ఆ రాత్రే ఆమెకు టార్చర్ మొదలుపెట్టింది అతని మైండ్‌లో తిష్ఠ వేసి. ‘ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా?’ అద్భుతంగా నటించాడు. ‘మా మేనత్త పెట్టిన చీర. రెండో రాత్రి కట్టుకోమని చెప్పింది’ సిగ్గుపడుతూ. ‘నేనొకటి అడగనా?’ అన్నాడు. ‘ఊ.. అడుగు’ గారంగా అన్నది. ‘కో ఎడ్యుకేషన్ కాలేజ్‌లో చదివావ్ కదా..’ ఆగాడు. ‘అవును..పీజీ కూడా కో-ఎడ్డే. క్లాస్మేట్స్ అందరం కలిసి గోవా టూర్ కూడా వెళ్లామని చెప్పాను కదా. ఫోటోలు కూడా చూశారు కదా. వండర్ఫుల్డేస్.. భలే ఎంజాయ్ చేసేవాళ్లం.’ ఒక్క క్షణం ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లింది రజని. ‘అదే.... ఆ టైమ్‌లో ఎవరైనా బాయ్‌ఫ్రెండ్ ఉ...న్నా..’ రజని కళ్లల్లోకి చూస్తూ ఆగాడు. చాలా మామూలుగా.. హాయిగా నవ్వింది రజని. ‘మా క్లాస్‌లో ఉన్న అబ్బాయిలంతా నాకు బాయ్‌ఫ్రెండ్సే..’ నవ్వుతూనే అనేసి బాల్కనీలోకి వెళ్లిపోయింది. తనకు కావాల్సిన సమాధానం కాదు అది. కొంపదీసి తన మనసులో ఉన్నది అర్థమైందా ఏంటీ ఆమెకు. అర్థంకానీ.. అసలు విషయం బయటపడుతుంది అనుకున్నాడు. బాల్కనీలో ఉన్న రజని కళ్లల్లో సన్నటి నీటి పొర. ఆ సంఘర్షణ, అనుమానాలతో నాలుగు రోజులకే హానీమూన్ ట్రిప్ ముగించుకొని ముభావంగా ఇంటికి బయలుదేరింది ఆ జంట. మూడు నెలలు గడిచాయి... ఇంట్లో వాతావరణాన్ని, తమ మధ్య కమ్యూనికేషన్‌ను నార్మల్‌గా ఉంచడానికి చాలా ప్రయత్నిస్తోంది రజని. కానీ కుదరనివ్వట్లేదు నవీన్. ఆమె ప్రతి కదలికను అనుమానంగానే చూస్తున్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి రాగానే వేడి వేడి టీ ఇవ్వబోతుంటే మొహం తిప్పుకొని వెళ్లిపోతాడు. లేదంటే ఆమె వ్యక్తిగతానికి సంబంధించి ఆరా తీస్తాడు. ఈ వేధింపులు రోజురోజుకి ఎక్కువవుతున్నాయే కానీ తగ్గడం లేదు. అవి ఎంతలా శ్రుతిమించాయంటే కాలేజ్ డేస్‌లో ఆమె ప్రవర్తన గురించి ఎంక్వయిరీ చేసేంతనగా. ఆమె ఫ్రెండ్స్‌కే ఫోన్ చేసి ఆమె క్యారెక్టర్ గురించి కూపీ లాగుతున్నాడు. అయినా సహిస్తోంది. పెళ్లికి ముందు తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరనీ... తనకెవరితో ఎలాంటి ఫిజికల్ రిలేషన్స్ లేవనీ ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. బతిమాలుతోంది. సంసారాన్ని నరకం చేయొద్దని ప్రాథేయపడింది. చివరకు అతని అనుమానం పోవడానికి ఏం చేయమన్నా చేస్తానంది. ‘అయితే గైనకాలజిస్ట్ దగ్గరకి వెళ్దాం.. రా’ అన్నాడు స్థిరంగా. ఆ మాటకు షాక్ అయింది రజని. కోపం, అసహ్యం, బాధ, తన మీద తనకు జాలి.. కలిగాయి. గుండె పగిలేంత దుఃఖం పొంగుకొస్తున్నా తమాయించుకొని ‘వెళదాం పద’ అంది. అయితే... పరీక్ష చేయడానికి డాక్టర్ ససేమిరా అంది. పైగా నవీన్‌ను చెడామడా తిట్టింది. అమ్మాయికి పెళ్లికి ముందు సెక్సువల్ రిలేషన్ లేదు అనడానికి మొదటి రాత్రి రక్తస్రావం కావడం ఏ రకంగా ప్రామాణికం అని నిలదీసింది. చదువుకున్న వాడివి నీ సంస్కారం ఇదేనా? అంటూ గడ్డిపెట్టింది. హైమన్ (కన్నెపొర) ఎంత సున్నితంగా ఉంటుందో? ఏయే సందర్భాల్లో చిరిగిపోయే అవకాశాలుంటాయో వివరించింది. భార్యాభర్తల దాంపత్యానికి నమ్మకం పునాది.. అనుబంధానికి అండర్స్టాండింగ్ ఉండాలి అంటూ క్లాస్ తీసుకొని పంపించింది. ఇంటికొచ్చాక... గదిలోకి వెళ్లిపోయి.. సూట్‌కేస్‌తో బయటకు వచ్చింది రజని. హతాశుడయ్యాడు నవీన్. ‘ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావ్ రజనీ?’ ఈసారి నవీన్ షాక్ అయ్యాడు. ‘నీ అనుమానంతో నేనింకా అవమానపడదల్చుకోలేదు. నీకు తెలియని ఇంకో విషయం... స్కూల్ డేస్ నుంచి కూడా నేను సైక్లింగ్ చాంపియన్ని’అంటూ బయటకు నడిచింది రజని. నేపథ్యం రజని, నవీన్... ఇద్దరూ చదువుకున్న వాళ్లే. ఆమె ఎంబీఏ. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్దలు కుదిర్చిన పెళ్లి. చక్కటి ఈడూజోడు.. అన్ని విధాలా తగిన సంబంధం అని రెండు కుటుంబాల వాళ్లూ అనుకొని ఘనంగా పెళ్లిచేశారు. పెళ్లికి ముందు బ్యాచ్లర్స్ పార్టీలో తన భార్య గురించి, తన అత్తగారింటి వైభోగం గురించి చెబుతూ నవీన్ మురిసిపోతుంటే అసూయపడ్డ అతని స్నేహితుడొకడు.. ‘ఒరేయ్.. అంత సోషల్మూవింగ్ ఉన్న అమ్మాయి పెళ్లికి ముందే అన్ని చేసుంటుంది జాగ్రత్తరోయ్’ అని కూశాడు. ‘ఎలా తెలుస్తుందిరా’ అని అడిగాడు అమాయకంగా. వాడు చెప్పాడు. అందుకే ఫస్ట్‌నైట్ అయ్యాక వాష్‌రూమ్‌లోకి వెళ్లి చీర చూశాడు నవీన్. రజని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు. జీవనసహచరిని దూరం చేసుకున్నాడు. అదో పెద్ద మూఢనమ్మకం! మన సమాజంలో ఇప్పటికీ ఉన్న మూఢనమ్మకం... మొదటి రాత్రి తెల్లచీర ధరించాలని, మరునాడు దాన్ని పరీక్షించాలని, మరక ఉంటే ఆమె వర్జిన్ అనీ, లేకుంటే కాదని! నేటికీ చాలామంది మగవాళ్ల మెదళ్లను తొలుస్తున్న పురుగు ఇది. ప్రతిదానికీ సైన్స్ రీజన్ చెప్తున్నా అర్థం కావట్లేదు.. చేసుకోవట్లేదు. నవీన్ ఇందుకు అతీతుడేం కాదు. నవీన్ చేసిన పని మెంటల్ క్రూయల్టీ. హిందూ వివాహచట్టం ప్రకారం భార్య శీలాన్ని శంకించడం, ఆమె శీలవతి కాదని ప్రచారం చేయడం, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి పరీక్షలు చేయించడం వంటివన్నీ మెంటల్ క్రూయల్టీ కిందకు వస్తాయి. అలాంటి వ్యక్తి నుంచి విడాకులు తీసుకోవచ్చు. ఐపీసీ 498ఏ కింద కేస్ కూడా నమోదు చేయవచ్చు.- ఇ.పార్వతి, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ - సరస్వతి రమ -
ఆ పులికి స్పెషల్ క్లాసులు ఎందుకో తెలుసా?
అది తమిళ పులి.. పేరు రామ. ఉండేది చెన్నై వండలూరు జూపార్క్. కానీ దానిని ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్ జూపార్కుకు తరలించారు. కానీ, పుట్టకతో తమిళం మాత్రమే తెలిసిన ఈ పులికి ఒక్కసారిగా ఉత్తరాదికి వెళ్లడంతో కొత్తగా భాషతో చిక్కొచ్చిపడింది. స్థానిక హిందీ అర్థం కాక .. ఆ హిందీలో ఆదేశాలిస్తే గ్రాండించి గుర్రున చూస్తున్న ఆ పులి తాజాగా స్పెషల్ క్లాసులు పెట్టి మరీ హిందీని నేర్పిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. అయితే, 2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది. ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. ఇక దీంతో వేగలేమని భావించిన జూపార్కు సిబ్బంది.. చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో వండలూరు జూపార్క్‌కు చెందిన శిక్షకుడు సెల్లయ్య ప్రత్యేకంగా ఉదయ్‌పూర్‌కు పంపించారు. ఇది చిన్నపిల్లగా ఉన్ననాటి నుంచి దాని పెంపకం బాధ్యతను సెల్లయ్యనే చూశారు. ‘వా’ (ఇటురా), ‘పో’ (అటు వెళ్లు) వంటి తమిళ మాటలకు అది అలవాటుపడేలా చేశారు. ప్రస్తుతం ఉదయపూర్‌లో ఉన్న సెల్లయ్య అక్కడి సిబ్బంది సహకారంతో రామకు ‘ఆవో.. జావో’ వంటి మాటల్ని నేర్పించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట తమిళంలో ఆదేశాలిస్తూనే.. ఆ తర్వాత హిందీ ఆదేశాలను దానికి ఒంటబట్టిస్తున్నారు. -
'రామ'కు హిందీలో చెప్తే.. అంతే సంగతులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: హిందీ ఉత్తరాది భాష. దక్షిణాదిలో ఉన్న చాలామందికి హిందీ రాదు. ఎవరైనా హిందీలో అదే పనిగా మాట్లాడితే.. రానివారికి చిరాకు వేస్తోంది. మరీ తమిళ భాషకు అలవాటు పడిన ఓ పులికి అదే పనిగా హిందీలో ఆదేశాలిస్తే అది ఊరుకుంటుందా?.. ఇంతకు ఆ కథ ఏమిటంటే.. రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లోని సజ్జన్ఘర్ జూపార్కులో 'ధామిని' అనే ఆడ తెల్లపులి ఉంది. అది ఈ మధ్య ఈడుకొచ్చింది. దానికి సరైన మగ జోడీ కోసం దేశంలోని అన్ని జూపార్కులను అన్వేషించిన అధికారులు.. చివరకు చెన్నై వండలూరు జూపార్కులో ఉన్న 'రామ' అనే మగపులిని గుర్తించారు. జంతుమార్పిడి విధానం కింద ఉదయ్‌పూర్ జూ అధికారులు తెల్ల మగపులిని స్వీకరించి ఇందుకు బదులుగా రెండు నక్కలను వండలూరు జూపార్కుకు అందించారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఇటీవలే ముగిశాయి. 2011లో వండలూరు జూలో జన్మించిన 'రామ' పులి తమిళం మాత్రమే అర్థం చేసుకుంటుంది. ‘ఇంగెవా...అంగెపో’ (ఇక్కడికి రా...అక్కడికి పో) అనే తమిళ మాటలే దానికి తెలుసు. అలాంటి 'పులిరాజ'కు ఒక్కసారిగా ‘యహా ఆవో... వహా జావో’ అంటూ హిందీలో ఆదేశాలు ఇస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు మండుకొస్తుంది. అందుకే సజ్జన్గార్ జూపార్కు సిబ్బంది హిందీలోనూ, స్థానిక భాషలోనూ ఆదేశాలిస్తే వారిని 'రామ' గుర్రున చూస్తోంది. వారి గుండెలదిరేలా గాండ్రిస్తోంది. తమిళ తెల్లపులితో వేగడం ఇక తమవల్ల కాదని, తమిళం తెలిసిన సిబ్బందిని తమకు కేటాయించామని జూపార్కు సూపరింటెండెంట్ మోహన్‌రాజ్ ఇటీవల చెన్నై వండలూరు జూపార్కు అధికారులకు ఉత్తరం రాశారు. -
రామ రామ..!
సీతమ్మ వారి మంగళ సూత్రాలు మాయం లక్ష్మణ స్వామి బంగారు లాకెట్ ఎక్కడుందో! ఆభరణాల మాయంపై విచారణకు ఈఓ ఆదేశం వైదిక సిబ్బందితో అత్యవసర సమావేశం నేటి సాయంత్రం వరకు గడువు కోరిన అర్చకులు భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సీతమ్మవారి మంగళసూత్రాలు మాయమయ్యాయి. లక్ష్మణస్వామి మెడలో ధరింపజేసే బంగారు లాకెట్ కూడా కనిపించటం లేదు. గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన రెండు బంగారు గొలుసులు ఎక్కుడున్నాయనే దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. నిత్య కల్యాణంలో అలంకరించేందుకు భక్తులు సమర్పించిన మంగళసూత్రాలు, బంగారు లాకెట్ మాయమైనట్లుగా దేవస్థానం ఈఓ రమేష్‌బాబు ధ్రువీకరించారు. రామాలయంలో ఇటీవలి పరిణామాలు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు సైతం దీనిపై కన్నెర్రజేస్తున్నారు. నగలు ఏమైనట్టు? దేవస్థానంలో పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత ఈ నెల 19 నుంచి స్వామివారి నిత్యకల్యాణాలు పునః ప్రారంభయ్యాయి. కల్యాణోత్సవంలో స్వామివారికి ఆభరణాలను అలంకరించే సమయంలో కొన్ని నగలు మాయమైనట్లు గుర్తించిన అర్చకులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కానీ విషయం బయటకు పొక్కిందనే విషయాన్ని గ్రహించిన అర్చకులు ముందు జాగ్రత్తగా ఈఓ రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇన్చార్జి ఈఓ కావటంతో ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. ఆదివారం హుటాహుటిన భద్రాచలం చేరుకున్నారు. జరిగిన పరిణామాలపై అర్చకులు, ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బందితో చర్చించారు. గర్భగుడిలో బంగారు ఆభరణాలు భద్రపరిచే బీరువా, బాక్సులను పరిశీలించారు. అర్చకుల ఆధ్వర్యంలో ఉన్న ఆభరణాల లెక్క తేల్చాలని ఆదేశించటంతో ఆదివారం మధ్యాహ్నం ఆలయ తలుపులు మూసిన తరువాత వాటి లెక్కింపు ప్రారంభించారు. ఈ ప్రక్రియ సోమవారం కూడా కొనసాగనుంది. తీవ్ర చర్చనీయాంశమైన ఆభరణాల మాయంపై పోలీసులతో పాటు నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి. వైదిక సిబ్బందితో అత్యవసర సమావేశం గర్భగుడిలోని బీరువాలో భద్రంగా ఉండాల్సిన రెండు బంగారు ఆభరణాలు కనిపించకపోవటంపై ఈఓ రమేష్‌బాబు తీవ్రంగానే స్పందించారు. భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావటంతో వైదిక సిబ్బందితో తన చాంబర్లో అత్యవసర సమావేశమయ్యారు. మిగతా సిబ్బందినెవర్నీ లోపలకి రానివ్వకుండా, చివరకు మీyì యా ఫొటోలు తీసుకునేందుకు కూడా నిరాకరించి, సుమారు గంటపాటు సుదీర్ఘంగా దీనిపై వైదిక సిబ్బందితో చర్చించారు. అవును...ఆభరణాలు కనిపించటం లేదు: ఈఓ రెండు బంగారు ఆభరణాలు కనిపిం^è టం లేదని ఈఓ రమేష్‌బాబు విలేకరులతో అన్నారు. నిత్య పూజలు, శ్రీరామనవమి, ఇతర ఉత్సవాల్లో స్వామివారికి అలంకరించే బంగారు ఆభరణాలన్నీ కలిసిపోయాయి.. కాబట్టి లెక్కింపు కొంత ఇబ్బందిగా ఉందని అర్చకులు చెప్పారని, సోమవారం సాయంత్రం వరకు దీనిపై గడువు కోరినట్లుగా తెలిపారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా తాను కూడా స్వయంగా ఆభరణాలను పరిశీలించి, దీనిపై సమగ్ర నివేదిక ఉన్నతాధికారులకు అందజేస్తానన్నారు. ఆభరణాలను భద్రపరచటంలో అర్చకుల నిర్లక్ష్యం ఉన్నట్లుగా తేటతెల్లమవుతోందన్నారు. ఎందుకిలా..! శ్రీసీతారాముల వారి మూర్తుల ఆభరణాలకు ఎంతో విశిష్టత ఉంది. లోకానికి ఆదర్శమూర్తులైన శ్రీసీతారాముల వారికి ధరింప జేసిన వస్తువులకు భక్తుల నుంచి మంచి ఆదరణ ఉంటుంది. వాటిని పొందేందుకు కొంతమంది ఎంత డబ్బులైనా వెచ్చిస్తారు. భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని భద్రాద్రి దేవస్థానంలోనిlకొంతమంది అర్చకులు సొమ్ము చేసుకునే క్రమంలోనే బంగారు ఆభరణాలు మాయమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఉత్సవమూర్తులపై ఉన్న ఆభరణాలను మాయం చేయటం, వాటిని లక్షలాది రూపాయలకు అమ్ముకోవటం, ఒక వేళ ఈ విషయం బయటకు పోక్కితే అదే ఆకృతిలో ఉన్న ఆభరణాన్ని తయారు చేయించి యథాస్థానంలో పెడుతున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. గతంలో ఇలాగే రెండుసార్లు ఉత్సవమూర్తుల ఆభరణాలు మాయమయ్యాయని, ఈ విషయం బయటకు పొక్కనీయకుండా బాధ్యులైన అర్చకులతోనే వాటిని తయారు చేయించి యథాస్థానంలో ఉంచారనే ప్రచారం ఉంది. రాములోరి బంగారం భద్రమేనా..? భద్రాద్రి ఆలయానికి భక్తులు సమర్పించిన కానుకలతో పాటు రామదాసు కాలం నాటి ఆభరణాలను కలుపుకొని మొత్తం 50 కేజీల వరకు బంగారు నిల్వలున్నాయి. 750 కేజీల వెండి ఉంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రామాలయంలో బంగారం భద్రమేనా? అనే సందేహం నెలకొంది. ఉత్సవమూర్తులను అమెరికాకు అమ్మకానికి పెట్టడం.. విదేశాల్లో రాములోరి కల్యాణం పేరుతో కొందరు అర్చకులు తమ ఇళ్లలోని విగ్రహాలను తీసుకెళ్లి సొమ్ము చేసుకోవడం.. ఉత్సవమూర్తులకు బంగారు కవచం ధరింపజేసే సమయంలో బంగారం కనిపించకపోవడం.. ఆలయ ప్రతిష్టను దిగజార్చుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది అర్చకుల వ్యవహాశైలితోనే ఇలా జరుగుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. -
కమనీయం..నిత్య కల్యాణం
రాములోరికి విశేష పూజలు భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. భక్తజనం తిలకించి పులకించింది. ఆదివారం కావడం, అంత్య పుష్కరాలు జరుగుతుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే బారులు తీరడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. అర్చకులు అంతరాలయంలో రాములోరికి స్వర్ణ పుష్పార్చన చేశారు. సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేసి, పవిత్ర గోదావరి తీర్థ జలాలతో మూలవరులకు అభిషేకం చేశారు. 108 స్వర్ణ పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్యకల్యాణ మూర్తులను ఆలయ ప్రాకార మండపానికి చేర్చి, వేద మంత్రోచ్ఛరణల నడుమ వైభవోపేతంగా నిత్యకల్యాణం చేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న 80 జంటలకు, భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
రామయ్యకు బంగారు తులసీ అర్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం ఘనంగా బంగారు తులసీ అర్చన నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో మూలవరులకు 108 స్వర్ణ తులసీ దళాలతో అషో్టత్తర శతనామార్చన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపానికి తోడ్కొని వచ్చి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం అర్చకులు వైభవంగా స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రామయ్యకు బంగారు తులసీ అర్చన
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి శనివారం ఘనంగా బంగారు తులసీ అర్చన నిర్వహించారు. ఉదయం స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తీసుకుని వచ్చి భద్రుని గుడిలో అభిషేకం నిర్వహించారు. అనంతరం అంతరాలయంలో మూలవరులకు 108 స్వర్ణ తులసీ దళాలతో అషో్టత్తర శతనామార్చన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపానికి తోడ్కొని వచ్చి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు వివరించారు. వేద పండితులు వేద ప్రవచనాలు చేశారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం అర్చకులు వైభవంగా స్వామి వారికి నిత్యకల్యాణం నిర్వహించారు. అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మధ్యాహ్నభోజనం ట్రస్టులకిస్తే చూస్తూ ఊరుకోం
స్వచ్ఛంద సంస్థలకు అప్పగిస్తే సహించేదిలేదు మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ పరిగి: మధ్యాహ్న భోజనం వడ్డించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు, ట్రాస్టులకు అప్పగించాలనే ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమ అన్నారు. శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో పరిగిలో జీపుజాత నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మధ్యాహ్నం ఏజెన్సీల నోట్లో మట్టికొడుతూ పాఠశాలలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించే బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. ఫైలెట్ ప్రాజుక్టు కింద జిల్లాను ఎంచుకుని త్వరలో స్వచ్ఛంద సంస్థల చేత నిర్వహించే ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో కార్మికులు ఏజెన్సీలను నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటం లేదని కాగ్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకువెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజనం ఏజెన్సీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నిర్మల, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి వెంకటయ్య, నాయకులు యాదగిరి, మంగమ్మ, నర్సమ్మ, సత్యమ్మ పాల్గొన్నారు. -
ఆరెస్సెస్ రాముడు
అక్షర తూణీరం భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే. కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని అందర్నీ నియంత్రిస్తుంటే, చాలామంది గతిలేక దేవుణ్ణి నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు. ఆరెస్సెస్ డ్రెస్‌ని రాములోరి అడ్రస్‌గా మార్చారని విన్నాక, మనిషి ఎంతకైనా తెగిస్తాడని మరోసారి రుజువైంది. ఆరెస్సెస్ ఒఖ్ఖ రాముణ్ణే దేవుడిగా కొలు స్తుంది. రాముడు అవతార పురుషుడు. రామకథకి ఆయన ఎలాంటి విశేషాలూ లేని వట్టి మానవుడై ఉండాలి. లేకపోతే వచ్చిన పని నేరవేరదు. అందుకని నీతినియమాలున్న సంపూర్ణ మానవుడిగా రాముడు నమోదయాడు. ఎటొచ్చీ వాలి వెన్నుపోటు, రామ బాణాన్ని పక్షికి గురిపెట్టడం లాంటి లొసుగులు అతి కొద్దిగా ఉన్నాయి. సీతని అగ్నిప్రవేశం చేయించడం లాంటి ఓవర్ యాక్షన్లూ లేకపోలేదు. ‘మరి మనిషంటే అంతేమరి! తప్పొప్పులు పడుతూ పడుగూ పేకాగా నేసిన వస్త్రం మనిషి’ అంటూ పెద్దలు సమర్థించి క్లీన్ చిట్ ఇచ్చారు. చాలా మంది ప్రపంచ మేధా వులు శంభూక వధ జాబాలి వృత్తాంతం స్టడీ చేసి రాముణ్ణి చీల్చి చెండాడే ప్రయ త్నం చేశారు. ప్రజా రాజ్యంలో మెజారిటీ వాదమే సత్యమై నిత్యమై నిలుస్తుంది. ‘లోపములున్నను రాముడు దేవుడు’ అని ముక్తకంఠంతో అరిచి కొలిచారు. రేపు వినాయక ఉత్సవాలు వస్తాయ్. విఘ్నరాజుని నానా రకాలుగా అలం కరించి వినోదిస్తారు. ఆయన్ని క్రికెట్ ప్లేయర్‌గా, కంప్యూటర్ ఇంజనీర్‌గా సెల్ఫీలు తీసుకుంటున్న భంగిమలో చూస్తూనే ఉన్నాం. ఆలోచనే వస్తే– ఓ కొత్త రూపం రానే వస్తుంది. వినాయకుడి విషయంలో ఎవరూ తప్పు పట్టరు. అదే శివుడి జోలికో, విష్ణువు జోలికో వెళితే మాత్రం సహించరు. త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుణ్ణి పెద్దగా స్మరించరు. ‘నాలుగు తలలతో విరాజిల్లే బ్రహ్మ మన సిటీ ట్రాఫిక్ నియంత్రణకి అద్భుతంగా వినియోగపడతారండీ’ అని ఓ ఆధునికుడు చమ త్కరించాడు. కలియుగంలో భూమ్మీద ఆయనకు స్థానం లేదని చెప్పాడు. మనిషి దేవాంతకుడు. దేవుణ్ణి కూడా రెండు చేతులు, రెండు కాళ్లతో అచ్చం తన కొలతలతోనే తయారు చేసి ఆ బొమ్మలకే ప్రాచుర్యం తెచ్చాడు. గుళ్లో పెట్టి, పూజలు పునస్కారాలు డిజైన్ చేశాడు. టెంకాయలు, కర్పూరం, అగరుబత్తీలకు కోట్లాది రూపాయల మార్కెట్ తెచ్చాడు. తనకు లాగే పెళ్లిళ్లు, పేరంటాలు, పవళింపు సేవలు సమస్తం దేవుళ్లకి మప్పాడు. భక్తి ఆసరా కూడా డెమోక్రసీ లాంటిదే. కొందరు దేవుణ్ణి ఆసరా చేసుకుని మిగతా అందర్నీ నియంత్రిస్తూ, నిమంత్రిస్తూ ఉంటారు. చాలామంది గతిలేక దేవుణ్ణి మితంగానో, అమితంగానో నమ్మి జీవితం వెళ్లదీస్తుంటారు. త్రిమూర్తులు ఒకచోట కూడి, విశ్వసృష్టిపై చర్చాగోష్టి పెట్టుకున్నారు. ‘బ్రహ్మదేవా! తమరి తెలివి తెల్లారినట్లే ఉంది. మానవుడికి అంత తెలివా’ అని శివుడు వాపోయాడు. ఔనన్నట్లు విష్ణుమూర్తి తల పంకించాడు. చిరునవ్వుతో, ‘నేను ఏదైనను జీర్ణించుకోగలను. దురద మందు వ్యాపార ప్రకటనకి రామ బాణం వాడితే ఏమన్నాను? సంజీవని పర్వతం తెస్తున్న హనుమ ట్రాన్స్పోర్ట్ కంపెనీకి గుర్తు అయితే కాదన్నానా? భాజపా వారు రామనామాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో వాడితే ఉదాసీనంగా ఉండిపోలేదా? ఏరుదాటాక తెప్ప తగలేసి చలికాచుకోమన్నారు కదా. రాబోయే రోజుల్లో ముఖ్యనేత దుస్తులతో రామ విగ్రహాలను అలంకరించి, రామరాజ్యాన్ని జనం కళ్లముందు చూపినా ఆశ్చర్యంపోను. అయినా, వగపేటికి చల్ల చిందినన్’ అంటూ విష్ణుమూర్తి ముగించాడు. - శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
బాలిక వివాహాన్ని ఆపిన అధికారులు
కొద్దిసేపట్లో జరగబోయే బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం అంబ్లాపూర్ గ్రామానికి చెందిన గోస్కుల కొమురయ్య, రమ దంపతుల కుమార్తె(15) ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. ఆమెకు తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన కోట కుమార్ అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకోసం వరుని కుటుంబం, బంధువులు అంబ్లాపూర్కు తరలివచ్చారు. అయితే, బాలికకు వివాహం జరగనుందనే సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు గ్రామానికి చేరుకున్నారు. రెండు కుటుంబాల వారిని గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు పిలిపించారు. బాలికకు మైనారిటీ తీరిన తర్వాత అంటే మరో మూడేళ్ల తర్వాత మాత్రమే ఆమెను పెళ్లి చేసుకుంటాననే హామీ పత్రాన్ని వరునితో రాయించి, వారిని వెనక్కి పంపేశారు. -
రామ..రామ...ఇదేమి కర్మ..
మాన్యాలు ఉన్నా అప్పుల కుప్పలు 78 ఎకరాలున్నా జీతాలకూ డబ్బుల్లేవు నిర్వహణకు అప్పులు పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు ఆనాడు రామదాసు భక్తుల నుంచి విరాళాలు సేకరించి భద్రాద్రి రాముడికి గుడి కట్టి భక్తరామదాసుగా కీర్తినార్జించారు. అపర భద్రాద్రిగా పేరుగాంచిన మోటూరు రాముడికి ఆస్తులున్నా ఆలయ నిర్వహణకు అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. కోట్ల ఆస్తులున్నా సిబ్బందికి కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొనడంపై ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడివాడ రూరల్: మండలంలోని మోటారు గోదాపురంలోని శ్రీసీతారామస్వామి అపర భద్రాద్రిగా ఖ్యాతినార్జించింది. శ్రీరామనవమి వేడుకలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి తరలివస్తారు. జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. ఆలయానికి 78.20 ఎకరాల భూమి శ్రీరంగం నల్లాన్ చక్రవర్తుల వంశానికి చెందిన తిరుమాలచార్యులు, శ్రీనివాసాచార్యులకు కలలో స్వామి కనిపించి గన్నవరం గ్రామ భూగర్భంలో ఉన్నానని సెలవిచ్చారు. స్వామి చెప్పిన విధంగా అక్కడ తవ్వించగా సీతారాముల విగ్రహాలు లభించాయి. వాటిని తీసుకువచ్చి మోటూరులో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. ఆ వంశస్తులు స్వామివారి దూప, దీప, నైవేద్యాల కోసం కొంత భూమికి కూడా ఆలయానికి రాసి ఇచ్చారు. ప్రస్తుతం దేవస్థానం ఆధ్వర్యంలో మోటూరు, దొండపాడు, పెదపాలపర్రు, కుదరవల్లి, విస్సాకోడేరు, కొత్తూరు, పెంజెండ్ర, గుంటాకోడూరు, అమినాబాద్, పశినేదాల, అన్నంగి గ్రామాల్లో 78.20 ఎకరాల భూమి ఉంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఉన్నా స్వామి సేవలు, ఉత్సవాలు, ఆలయ నిర్వహణ కష్టంగా మారిందని ఆలయ ధర్మకర్తలు ఆరోపిస్తున్నారు. నిర్వహణకు అష్టకష్టాలు ఈ ఏడాది సాగునీరు లేకపోవడంతో దేవస్థానానికి చెందిన 35 ఎకరాలు సాగు చేయకుండా వదిలేశారు. సాగు చేసిన భూముల రైతులు కూడా కౌలు చెల్లించలేదు. గుంటాకోడూరులో చుట్టూ చేపల చెరువులు ఉండడంతో 5.19 ఎకరాలు భూమి రెండు దశాబ్దాలుగా సాగు చేపట్టలేదు. వీటిని చేపల చెరువుగా మార్చేందుకు కొంతకాలం ప్రయత్నించి వదిలేశారు. దీంతో ఆలయ భూములకు అరకొర ఆదాయం మాత్రమే వస్తుండడంతో ఆలయ నిర్వహణ భారంగా మారింది. అర్చకులకు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఆలయ ఈవో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విజయవాడ దుర్గగుడి నుంచి ఒక లక్ష రూపాయలు అప్పుగా ఇవ్వడంతో కొంతమేర సిబ్బందికి జీతాలు చెల్లించారు. ఇంకా కొన్ని నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయ నిర్వహణ పెనుభారంగా మారనుంది. ఆలయ భూముల్లో పది ఎకరాలు అమ్మి వచ్చిన సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దానిపై వడ్డీతో ఆలయ నిర్వహణ చేయవచ్చని అధికారులు ఆలోచించారు. ఇందుకు గ్రామస్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆలయాన్ని పెద్ద దేవాలయాలకు దత్తత ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆలయ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని ఆలయ ధర్మకర్తలు, భక్తులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా సత్సంప్రదాయ పరిరక్షణ సభ వ్యవస్థాపకుడు, శాశ్వత అధ్యక్షుడు డాక్టర్ న.చ.రఘునాథాచార్యస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆలయ సమస్యపై వినతిపత్రం అందజేశారు. ప్రస్తుత ఆదాయం రూ.తొమ్మిది లక్షలు ప్రస్తుతం ఎకరాకు 12 నుంచి 14 బస్తాలు కౌలు ఇస్తున్నారు. ఈ భూములపై ఆదాయం సుమారు రూ.తొమ్మిది లక్షలు వస్తుంది. ఇందులో రూ.ఐదు లక్షలతో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. మిగిలిన సొమ్ము ఆలయ నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలకు వినియోగిస్తున్నాం. - ఎస్.కె. కిషోర్, ఆలయ ఈవో -
ప్రేమజంట ఆత్మహత్య
ఆత్మకూరు: వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం కోగిల్వాయి గ్రామంలో గురువారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నన్నబోయిన రమ(18), జంగిలి గణేశ్(20) అనే యువతీయువకులు గ్రామశివారులో ఉన్న ఓ వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. యువతీయువకుల కులాల వేరుకావడంతో పెద్దలు వీళ్ల పెళ్లికి ఒప్పుకోలేదు. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే కారణంతోనే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. స్థానికులు గుర్తించి పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారమందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. -
వెన్నెట్లో కళ్యాణం...
రాముడు పాదం మెట్టిన తావు ఒంటిమిట్ట. సీతమ్మకు దప్పిక తీర్చిన తీర్థం ఒంటిమిట్ట. వైఎస్ఆర్ కడపజిల్లాలో ఉన్న ఈ ఆలయం అందుకే తెలుగువారి అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటిగా పేరు పొందింది. రాష్ట్ర విభజన తర్వాత శ్రీరామ నవమికి ప్రభుత్వ లాంఛనాల హోదా లభించింది. శ్రీ సీతారామ కళ్యాణాన్ని శ్రీరామ నవమి నాడు పగలు దేశమంతటా రామభక్తులు నిర్వహిస్తారు. కానీ కేవలం ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రమే రాత్రి పూట నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈనెల శ్రీరామనవమి నుంచి ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు. 24వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలలో కళ్యాణోత్సవానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. రామ‘చంద్రుడు’ ఈ క్షేత్రపురాణం ఇలా ఉంది. శ్రీరాముని జన్మఘట్టాన్ని చూసే భాగ్యానికి నోచుకోలేకపోయానని, కనీసం మంగళకరమైన కళ్యాణమైనా చూసే అదృష్టం కల్పించమని చంద్రుడు బ్రహ్మదేవుడిని కోరాడట. ఆయన సమ్మతించి చంద్రుని కోసమే స్వామి కళ్యాణాన్ని ఏదో ఒకచోట రాత్రిపూట జరిగేలా చూస్తానని మాట ఇచ్చాడట. ఆ చోటు ఒంటిమిట్ట అయ్యిందని ఒక కథనం. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీ సీతారామ కళ్యాణం ఉత్తర ఫల్గుణినక్షత్రంలో జరిగింది. విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుల్లో ఒకరైన బుక్కరాయలు ఒంటిమిట్ట క్షేత్రంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించదలచి నప్పుడు ఈ నక్షత్రానికే సీతారామ కళ్యాణాన్ని నిర్వహించాలని తలపెట్టగా నాడు ఆ లగ్నం రాత్రి పూట రావడంతో ఆనాటి నుంచి ఒంటిమిట్టలో స్వామి కళ్యాణాన్ని రాత్రిపూటే నిర్వహించడం సంప్రదాయంగా మారింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. బుక్కరాయలు చంద్రవంశీయులు. తన వంశ మూల పురుషుడైన చంద్రునికి ప్రీతి కలిగించినట్లు కూడా ఉంటుందని రాత్రి లగ్నంలోనే స్వామి కళ్యాణం జరిపించేవాడు. అప్పటి నుంచి ఒంటిమిట్ట క్షేత్రంలో మాత్రం స్వామి కళ్యాణాన్ని రాత్రి పూటే నిర్వహిస్తున్నారు. ఒంటడు, మిట్టడు కడపజిల్లా గెజిటీర్, కైఫీయత్తుల ప్రకారం క్రీ.శ. 1336 ప్రాంతంలో విజయనగర సామ్రాజ్యంలో ఉదయగిరి ఓ చిన్న రాష్ట్రంగా ఉండేది. దాని పాలకుడు కంపరాయులు ఓమారు ఒంటిమిట్ట ప్రాంతాన్ని పరిశీలించగా ఒంటడు, మిట్టడు అనే బోయ వీరులు ఆ ప్రాంత రక్షకులుగా ఉండటం చూశాడు. రాజు, ఆయన పరివారానికి దాహం వేయడంతో ఒంటడు అక్కడి ఓ నీటి బుగ్గను చూపి వారి దాహార్తిని తీర్చాడు. శ్రీ సీతారాములు ఈ ప్రాంతంలో పర్యటించినపుడు సీతమ్మకు దాహం వేయగా రాముడు బాణాన్ని భూమిలోకి సంధించాడని, ఆ ప్రాంతంలో నీటి ఊట ఏర్పడి చిన్న కొలనుగా మారిందని తెలిపాడు (ప్రస్తుతం రామతీర్థంగా ఆ కొలను వాడుకలో ఉంది). దగ్గరలోని గుట్టపైని శిథిలావస్థలో ఉన్న గుడిని దర్శించిన కంపరాయలు కొత్త విగ్రహాలను ఏర్పాటు చేసి ఆలయాన్ని నిర్మిస్తానని మాట ఇచ్చాడు. ఆ బాధ్యతను బోయ పాలకులైన ఒంటడు, మిట్టడుకే అప్పగించి అవసరమైన వనరులు ఏర్పాటు చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 1355-56 ప్రాంతంలో విజయనగర పాలకుడైన బుక్కరాయలు కాశీ యాత్ర చేసి తిరుగు ప్రయాణంలో గోదావరి నది ఒడ్డున ఇసుకపల్లె ప్రాంతం నుంచి ప్రత్యేకంగా తెచ్చిన ఏకశిలపై రూపొందించిన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడి విగ్రహాలను ఒంటిమిట్టలో ప్రతిష్ఠించాడు. ఆ స్వామికి రఘునాయకులని పేరు పెట్టుకుని ఆరాధించారు. కాగా కోదండ రామాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు ఏకశిలపై ఉండడంతో ఒంటిమిట్టకు ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. పోతన భాగవతం భక్తపోతన పెద్దలు తెలంగాణ ప్రాంతం నుంచి ఆయన బాల్యంలో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారని ఒక పరిశీలన. ఆయన మహా భాగవతం రాసింది ఒంటిమిట్ట శ్రీరాముని సన్నిధిలోనే అని తెలుస్తోంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా భాగవత కావ్యాన్ని ఆయన రాజులకుగాక శ్రీరామచంద్రునికే అంకితమిచ్చాడు. ఈ ఆలయం అపురూప శిల్పకళా సంపదకు నిలయంగా ఉంది. రంగ మండపంలో 32 స్తంభాలు, 16 యాళి స్తంభాలు అద్భుతంగా ఉండి కనువిందు చేస్తున్నాయి. ఆంజనేయుడు లేని రామాలయంగా కూడా ఈ క్షేత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆలయం నిర్మించిన నాటికి శ్రీరామునికి హనుమంతుడు పరిచయం కాలేదని, అందుకే స్వామి సన్నిధిలో ఆయన లేడని చెబుతారు. రాజగోపురం ఎదురుగా సంజీవరాయుడి పేరిట హనుమంతుని ఆలయాన్ని బుక్కరాయుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. వాసుదాసు భక్తి భద్రాచలానికి రామదాసు ఎంతో, ఒంటిమిట్టకు వాసుదాసు అంతటి వాడు. ఆయన అసలు పేరు వావిలికొలను సుబ్బారావు. 1863లో జమ్మలమడుగులో జన్మించిన ఆయన ఎన్నో భక్తికావ్యాలు రచించారు. ఆయనకు స్వప్నంలో ఓ వ్యక్తి కనిపించి ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధ్దికి కృషి చేయాలని కోరినట్లు తోచింది. నాటి నుంచి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడే ఆయనకు ఆరాధ్యదైవమయ్యారు. తన ఆస్తిపాస్తులన్నీ ఆ రాముడికే సమర్పించారు. అంతేగాక కౌపీనం (గోచి) పెట్టుకుని టెంకాయ చిప్ప చేతబట్టి ఊరూరా భిక్షమెత్తి ఆ మొత్తాలను సైతం రాముడికే భక్తి పూర్వకంగా సమర్పించాడు. జీవితాంతం ఒంటిమిట్ట రామయ్య సేవలోనే తరించాడు. మత సామరస్యం ఒంటిమిట్ట ఆలయానికి మత సామరస్యం రీత్యా కూడా విశిష్టత ఉంది. 1790లో ఈ ప్రాంతం కర్ణాటక నవాబు టిప్పు సుల్తాన్ అధీనంలోకి రాగా, ఒంటిమిట్ట పాలన స్థానిక ప్రముఖుడు ఇమాంబేగ్ చేతుల్లోకి వచ్చింది. ఓమారు తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు ఇమాం బేగ్ ముందుకొచ్చి రాజగోపురం ఎదురుగా మెట్లకు దక్షిణం వైపున బావి తవ్వించాడు. రామకార్యానికి ఆ జలాన్ని ఉపయోగించడంతోపాటు గ్రామ ప్రజలకు కూడా ఆ బావి ఎంతో ఆదరువుగా ఉండేది. ఇమాంబేగ్ ఔదార్యానికి, మత సామరస్యతకి, మానవత్వానికి సాక్ష్యంగా ఈ బావిని నేటికీ చూడవచ్చు. - మోపూరి బాలకృష్ణారెడ్డి, సాక్షి ప్రతినిధి, కడప ఇక్కడికి ఇలా సులువు కడప నుంచి ఒంటిమిట్ట 25కిలోమీటర్లు దూరంలో ఉంది. కడప-రాజంపేట మార్గంలో ఉన్న ఈ క్షేత్రానికి విస్తృతంగా బస్సులున్నాయి. విమానాల్లో వచ్చే భక్తులు అటు రేణిగుంట, ఇటు కడప విమానాశ్రయాల ద్వారా చేరుకోవచ్చు. శుక్ర, శని, ఆది, సోమవారాలల్లో హైదరాబాద్ నుంచి కడపకు విమాన సౌకర్యం ఉంది. రేణిగుంట నుంచి వచ్చే భక్తులు ఒంటిమిట్టకు 110 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎటు చూసినా కడప నుంచి ఒంటిమిట్ట చేరుకోవడమే సునాయాసం. -
మూర్తీభవించిన ధర్మతేజం
శ్రీరాముడు పశుప్రాయమైన స్థాయి నుంచి పరిపక్వత చెందిన మాననీయ స్థాయికి మనిషిని తీర్చిదిద్దిన మహోన్నత గ్రంథం రామాయణం. కేవలం భారతదేశం మాత్రమే కాదు.. యావత్ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మంత్రరాజం రామనామం. రామచంద్రమూర్తి పాటించిన ధర్మమార్గమే మనకు సదా శ్రీరామరక్ష. వేల సంవత్సరాల తర్వాత కూడా రామచంద్రమూర్తి కథ మనం ఎందుకు చెప్పుకోవాలన్న ప్రశ్నకు రామాయణమనే పేరులోనే సమాధానం దొరుకుతుంది. రామ+ఆయనం = రామాయణం. అంటే ఇది రాముని మార్గం. జీవితంలోని ప్రతి అడుగులోనే కాదు.. శరీరంలోని ప్రతి అణువులోను ధర్మపరాయణత్వాన్ని నింపుకున్నవాడు కావటం వల్లనే రామచంద్రమూర్తి మార్గం మనకు శిరోధార్యమైంది. విశ్వామిత్రుని యాగరక్షణ కోసం సోదరుడు లక్ష్మణుడితో కలసి బయలుదేరిన రామచంద్రమూర్తి, ఆ యాత్రలో మొత్తం ముగ్గురు స్త్రీలను కలుసుకుంటాడు. వారే తాటక, అహల్య, సీతాదేవి. తాటక తమోగుణానికి సంకేతం. అందుకే గురూపదేశం ప్రకారం ఆమెను సంహరించాడు. అహల్య రజోగుణానికి సంకేతం. చురుకుదనం, క్రియాశీలత ఆమెను తప్పుదోవ పట్టించాయి. ఇటువంటి వ్యక్తుల విషయంలో సహనం అవసరం. అందుకే రామయ్య రాతిని నాతిని చేసి, సంస్కరించాడు. చివరగా కలుసుకున్న (గెలుచుకున్న) స్త్రీమూర్తి సీతాదేవి. ఆమె సత్త్వగుణానికి ప్రతీక. వెదకి చూచినా లోపం కనిపించదామెలో. అందుకే స్వయంవరంలో పందెం గెలిచి మరీ ఆమెను (సీతమ్మ మనసు) గెలుచుకున్నాడు. ఈ మూడు ఇతివృత్తాల్లో రామచంద్రుడు లోకానికి ఉత్తమ సందేశాన్ని అందించాడు. ఏ వ్యక్తి అయినా ఈ మూడు గుణాల (సత్త్వ, రజ, తమో గుణాలు) విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మనిషీ తనలోని తమో గుణాన్ని నశింపజేసుకోవాలి. రజోగుణాన్ని సంస్కరించుకుని, సత్కార్యాలపట్ల దృష్టిని కేంద్రీకరించాలి. సత్త్వగుణాన్ని వృద్ధి చేసుకుంటూ, సాధన ద్వారా క్రమంగా గుణాతీత స్థితికి చేరుకుని, చివరగా మోక్షం పొందాలి. ఇదీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవటానికి రామచంద్రమూర్తి ఇచ్చిన ఆచరణాత్మక సందేశం. మాయలేడిపై ఏర్పడిన మోహం కారణంగా రావణుని చేతికి చిక్కిన సీతమ్మను వెతుక్కుంటూ శ్రీరాముడు అరణ్యంలోని నదులు, కొండలు, గుట్టలు, పశుపక్ష్యాదులు.. ఒకటేమిటి చరాచర జీవరాశనంతటినీ సీతమ్మను చూశారా అని అడుగుతాడు. రామయ్య దీనస్థితిని చూసిన లేళ్లు యథాశక్తి ప్రయత్నించి, సైగలతో సీతమ్మను రావణుడు అపహరించి, దక్షిణ దిశగా తీసుకెళ్లాడని చెబుతాయి. మంచిమార్గంలో పయనించేవాడికి పశుపక్ష్యాదులు కూడా సహాయం చేస్తాయట. దుర్మార్గుడిని సొంత సోదరుడు కూడా పరిత్యజిస్తాడట. విభీషణుడు రావణుడిని విడిచిపెట్టడటమే ఇందుకు ఉదాహరణ. ధర్మం ఎందుకు పాటించాలో, ధర్మాన్ని పాటిస్తే ఎలాంటి రక్షణ మనకు దొరుకుతుందో ఈ వృత్తాంతం ద్వారా రామచంద్రమూర్తి లోకానికి చాటిచెప్పాడు. రావణాసుర సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, అన్నగారి పార్థివ దేహాన్ని తమకి అప్పగించమని, అలాచేస్తే వంశాచారం ప్రకారం ఉత్తరక్రియలు నిర్వహించుకుంటామని అనుమతి అడుగుతాడు. అందుకు రామయ్య ఇచ్చిన సమాధానం ఒక్కటిచాలు మన జీవితాల్ని మార్చుకోవటానికి. ‘‘ఓ విభీషణా! శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవటం వల్ల యుద్ధం చేయవలసివచ్చిందే కానీ ఇంతటి ప్రాణనష్టం చేయటం నాకు ఇష్టం లేదు. మీ అన్నగారి పార్థివ దేహాన్ని తీసుకెళ్లి, శాస్త్ర, ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు నిర్వర్తించు. ఇకనుంచి ఈయన నీకు మాత్రమే కాదు, నాకూ అన్నగారే’’ అంటాడు. అదీ రామయ్య ధర్మవర్తన. రామరావణ యుద్ధం ముగిసింది. విభీషణుడు లంకాధిపతి అయ్యాడు. తనకు ఇంతటి ఘనత తెచ్చిన రామయ్యను వానరులతో సహా లంకలో ఉండి, పది రోజులు తన ఆతిథ్యాన్ని స్వీకరించమని విభీషణుడు ప్రార్థిస్తాడు. అందుకు రామయ్య ఇలా అంటాడు. అపి స్వర్ణమయీ లంకా న మే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥‘‘లక్ష్మణా! ఎంతటి స్వర్ణమయంగా ఉన్నా లంక, అందులోని భోగాలపై నాకు దృష్టి లేదు. మాతృమూర్తి, మాతృభూమి ఈ రెండిటికీ మిన్న ఈ లోకంలో ఏదీ లేదు. పధ్నాలుగేళ్లుగా వీటికి దూరంగా ఉన్న నా మనసు వెంటనే ఈ క్షణమే వాటిని చూడాలని ఆరాటపడుతోంది’’ అన్నాడు. ఇదీ రామయ్య దేశభక్తి. మాతృభక్తి. రామరాజ్యంలో దొంగతనాలు లేవు. అకాల మృత్యువు లేదు. దరిద్రం లేదు. వంచకులు లేరు. ఇంకా... ‘‘రామమేవాను పశ్యన్తో నాభ్యహింసః పరస్పరమ్’’ - శ్రీరాముని నిత్యం తలచుకుంటూ, రామనామం జపిస్తూ ఒకరినొకరు హింసించుకోవటం మానేశారట అయోధ్యావాసులు. నేటి సమాజానికి ఆచరణీయమైన మాట ఇది. ఇన్ని సుగుణాల పోగు కనుకనే రామయ్య యావజ్జాతికీ ఆరాధ్యుడయ్యాడు. రామకథ నాగరకులతో పాటు జానపదుల జీవితాల్లో ఊపిరిగా మారింది. ‘రాముని మేలు కొలుపు’, ‘లక్ష్మణ దేవర నవ్వు’, ‘ఊర్మిళాదేవి నిద్ర’ వంటి జానపద గేయ సాహిత్యానికి రామకథే ప్రాణగీతిక. రాములోరు, సీతమ్మతల్లి, హనుమ.. అంటూ రామచంద్రుని కుటుంబాన్ని తమ చుట్టాలుగా భావిస్తారు జానపదులు. అన్నమయ్య, త్యాగయ్య, గోపయ్య వంటి వాగ్గేయకారుల సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అఖండమైన రామభక్తి సామ్రాజ్యంలో తనివితీరా సంచరించి, తనువులో, మనసులో... అణువణువులో రామయ్యను దర్శించి, చివరి ఊపిరి వరకు రామకథ పాడి, ఆ తర్వాత రామునిలోనే ఐక్యమయ్యారు. -కప్పగంతు లక్ష్మీనారాయణ -
వేస్ట్ ఫెలోస్
బాధ్యత అవసరం కంటే ఎక్కువ పెట్టుకోవడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ వడ్డించడం వేస్ట్ కాదా! అవసరం కంటే ఎక్కువ తినడం వేస్ట్ కాదా! ఆ తర్వాత అజీర్తికనీ, షుగర్ అనీ, సకల జబ్బులకు సర్వం ధారపోయడం వేస్ట్ కాదా! రైతు కష్టాన్ని గౌరవించకపోవడం వేస్ట్ కాదా! పేదవాడి కడుపుకొట్టడం వేస్ట్ కాదా! పంచుకోవాల్సింది పారేయడం వేస్ట్ కాదా! పిల్లలకు వేస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలిచేవాళ్లు వేస్ట్‌ఫెలోస్ కాదా! కాదా!? అన్నం పరబ్రహ్మ స్వరూపం. బ్రహ్మ అంటే సృష్టి. సృష్టి అంటే శక్తి. ఆహారాన్ని వృథా చేస్తున్నామంటే శక్తిని, మన ఉత్పాదకతను వృథా చేస్తున్నామనే అర్థం. ఈ పాఠం రతన్‌టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజానికి జర్మనీకి వెళితే కాని అర్థం కాలేదు. చాలా ఏళ్ల కిందట రతన్ టాటా ఏదో పని మీద జర్మనీ వెళ్లారు. అప్పటి వరకు ఆయన జర్మనీ చాలా ధనిక దేశమని, అక్కడి ప్రజలంతా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని అనుకుంటూ ఉండేవారు. ఒకరోజు ఆయన స్నేహితుడితో కలిసి హేమ్బర్గ్కి వెళ్లాడు. లంచ్ టైమ్ అయింది. ‘ఆకలి దంచేస్తోంది. ముందు ఏదైనా రెస్టారెంట్‌కి వెళదాం.. తర్వాతే ఇంకో పని’ అన్నాడు స్నేహితుడితో. ఆ స్నేహితుడు అక్కడికి దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. మూలన ఒక యువజంట, ఇంకో చోట యాభైఏళ్లు పైబడిన ఓ మహిళల గుంపు మినహా రెస్టారెంట్ అంతా ఖాళీగానే ఉంది. ‘ఇదేం హోటల్‌రా బాబూ.. అంతా ఖాళీగా ఉంది.. మంచి ఫుడ్ ఉంటుందా?’ సందేహం వెలిబుచ్చుతూ లోపలంతా పరికించి చూడసాగాడు. మూలన కుర్చున్న యువజంట ముందు ఓ రెండు కూరలతో మాత్రమే భోజనం ఉంది. ‘ఇంత సాధారణ భోజనంతో రొమాంటిక్ లంచా? గర్ల్‌ఫ్రెండ్‌కి మంచి లంచ్ కూడా ఆర్డర్ చేయని ఆ పిసినారి బాయ్‌ఫ్రెండ్‌ని ఆ పిల్ల ఎంతోకాలం భరించదు’ అనుకుంటూ నవ్వుకున్నారు రతన్‌టాటా. యాభై పైబడిన ఆడాళ్ల బృందమేమో ఆర్డర్ చేసుకొన్న డిష్‌ను కొసరి కొసరి వడ్డించుకుంటున్నారు. ప్లేట్లలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ మిగల్చకుండా తినేస్తున్నారు. వాళ్లను చూసి అంత కక్కుర్తి ఏమిటా అనుకున్నారాయన. ఇప్పుడు ఆర్డర్ చేయడం వీళ్ల వంతైంది. ఉన్నది ఇద్దరే అయినా చాలా రకరాల వెరైటీలను ఆర్డర్ చేశారు రతన్‌టాటా. తినగలిగినంత తిని మిగిలినది ప్లేట్లలో వదిలేశారు. అది చూసి పక్కనే ఉన్న బృందంలోని మహిళ... ‘మిస్టర్.. భోజనాన్ని అలా వదిలేశారెందుకు?’ అంటూ కోప్పడింది. ఆ మాటకు రతన్‌టాటా స్నేహితుడికి చిర్రెత్తింది. ‘మా డబ్బు.. మా భోజనం.. మా ఇష్టం. తింటాం.. వదిలేస్తాం.. మీకెందుకు?’ అంతే కోపంగా సమాధానమిచ్చాడు. ఆ జవాబుకి కనుబొమలు ముడివేసిన ఆ మహిళ వెంటనే రిసెప్షన్‌లోకి వెళ్లి ఎవరికో ఫోన్ చేసి వచ్చింది. కొద్ది క్షణాల్లోనే అక్కడి సోషల్ సెక్యురిటీ యూనిఫామ్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రత్యక్షమయ్యారు. ఈ మిత్రుల టేబుల్ దగ్గరకు వచ్చి ‘ప్లేట్లలో వదిలేసిన ఆహారానికి యాభై యూరోలు ఫైన్ కట్టండి’ అంటూ ఓ రిసీట్ ఇచ్చారు. తెల్లబోయారిద్దరూ. ‘అదేంటి? ఈ ఫుడ్ మేం డబ్బుకట్టి ఆర్డర్ చేసిందే’ అన్నాడు రతన్‌టాటా స్నేహితుడు. ‘డబ్బు మీదే కాని వనరులు మీవి కావు. మీవి కాని రీసోసెర్సెస్ను వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. దానికే ఈ ఫైన్’ అని వాళ్ల దగ్గర యాభై యూరోలు తీసుకొని వెళ్లిపోయారు. అప్పటిదాకా ఆ ధనిక దేశమ్మీద రతన్‌టాటాకు ఉన్న అపోహలు తొలగిపోయాయి. అంత సంపద ఉన్న దేశమే ప్రకృతి సంపదను ఎంతో జాగ్రత్తగా వాడుకుంటుంటే అతి తక్కువ వనరులన్న మన దేశం ఎంతెంత ఆహారాన్ని వృథా చేస్తోంది ...అని చింత పడ్డారు. అప్పటినుంచి ఒక్క ఆహారపు గింజను కూడా వృథా చేయనని ఒట్టేసుకోవడమే కాదు, చిత్తశుద్ధితో ఆచరించడమూ మొదలెట్టారట. మన ఇళ్లల్లో.. ఇలాంటి సంఘటనలు మన ఇళ్లల్లో, మన హోటళ్లల్లో కనిపించవు. కానీ తిన్నంత తిని వదిలేసినంత వదిలేసే అలవాట్లు మాత్రం పుష్కలంగా ఉంటాయి. ఇద్దరున్న ఇంట్లో నలుగురి వంట; నలుగురు ఉన్న ఇంట్లో ఆరుగురి వంట; ఇక పదిమంది ఉన్న ఇంట్లో పదిహేను మంది వంట చెత్తకుండీల్లోకి చేరుతుంది. అదే చెత్తకుండీ పక్కన అన్నమో రామచంద్రా అంటూ డొక్కలు అతుక్కుపోయిన అన్నార్తులూ కనిపిస్తుంటారు. ఒక ఇంట్లో అతివృష్టి... ఒకడి ఒంట్లో అనావృష్టి. అయినా ఆహారం విలువ తెలియదు. దానికి ఉదాహరణ మన దగ్గర జరిగే అట్టహాసపు ఆర్భాటపు పెళ్లిళ్లు, పెరంటాళ్లే! ఈ వేడుకల్లో టన్నుల కొద్దీ ఆహారం వృథాపాలవుతోంది. ఇలా వృథా చేస్తున్న ఏ ఒక్కరికైనా దేశంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు గుర్తొస్తున్నాయా? చెత్తలో కలుపుతున్న ఈ ఆహారధాన్యాలను పండించడానికి రైతు తన సర్వస్వం ధారపోస్తున్నాడు. తాను నమ్ముకున్న నేల కోసం ఇంటినీ, భార్య ఒంటి మీది నగలను తాకట్టు పెట్టి పంటకు పెట్టుబడి తెస్తున్నాడు. అయినా అనుకున్న రాబడి రాక అప్పులు మిగిలి తన ప్రాణాల్నే తీసుకుంటున్నాడు. అతని కుటుంబం ఈ గింజలే కరువై రోడ్డున పడుతోంది. మన ఒక్క ఇంట్లో ఒక ముద్దే కదా వృథా అవుతోంది అనుకుంటాం... అలా కొన్ని వందల ఇళ్లల్లో వందల ముద్దలు వృథా అయి కొన్ని వందల మంది నోటి దగ్గరి ముద్దలను లాక్కున్న వాళ్లమవుతున్నాం. అంటే అన్ని వందలమంది అన్నార్తులను సృష్టించిన నేరస్తులమవుతున్నాం. ఎంతోమంది రైతులను ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నాం. వాళ్ల కుటుంబాలను రోడ్డున పడేసిన పాపాన్ని మూటగట్టుకుంటున్నాం. బహుశా ఇలాంటి బాధను అనుభవించే కావచ్చు.. లేదా రతన్‌టాటాకు ఎదురైన అనుభవాన్ని తెలుసుకొని కావచ్చు.. దుబాయ్‌లో.. బర్‌దుబాయ్‌లోని అల్ కరామా ప్రాంతంలో అజంతా అనే హోటల్ ఉంది. ఆ హోటల్ యజమాని తన దగ్గరకి వచ్చే కస్టమర్స్‌కి 20 ధిరహామ్లకు కావల్సినంత భోజనం పెడ్తాడు. మళ్లీ మళ్లీ పెట్టించుకుంటూ కడుపునిండా తినొచ్చు. కానీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలకూడదు. మిగిలిందో, 13 ధిరహామ్స్ ఫైన్ కట్టి వెళ్లాలి. అంటే కావల్సినదానికల్లా ఎక్కువ పెట్టుకొని వదిలేస్తే భోజనం ఖరీదు 20 ధిర్హామ్స్తో పాటు అదనంగా 13 ధిర్‌హామ్స్ మొత్తం ముప్పైమూడు ధిర్‌హామ్స్ చెల్లించి వెళ్లాలి. ఒక్క ధిర్హామ్ విలువ 20 రూపాయలు. 33 ధిర్‌హామ్స్ ఇండియన్ కరెన్సీలో 660 రూపాయలు. ఎందుకీ ప్రాక్టీస్ అంటే ‘పాతికేళ్ల కిందట ఒకసారి నా హోటల్‌కి ఓ నలుగురు యువకులు వచ్చి నచ్చినవాటిని నచ్చినంత ఆర్డర్ చేశారు. కనీసం అందులో పావు భాగమైనా తినకుండా పారేసి వెళ్లిపోయారు. అప్పట్లో నేను రోజుకి యాభై మందికి మీల్స్ సర్వ్ చేసేవాడిని. ఈ నలుగురు వచ్చి వెళ్లాక వారిలో ఏడుగురికి భోజనం పెట్టలేకపోయాను. అంటే ఈ నలుగురు ఏడుగురి భోజనాన్ని వృథా చేసి వెళ్లారు. పాపం ఆ ఏడుగురూ లేబర్స్. నా రెగ్యులర్ కస్టమర్స్. ఆకలితో వెనుదిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో అల్కరామాలో ఉన్న ఏకైక ఇండియన్ రెస్టారెంట్ ఇదే. వాళ్లకు ఆ పూటకు తిండే దొరకలేదు. నీకు పట్టినంత నువ్ తిను.. కాని ఇతరులు తినాల్సినదాన్ని నువ్వు వృథా చేసే హక్కు నీకు లేదు అని చెప్పడానికే ఈ రూల్ పెట్టాను ’ అని చెప్పాడు. ఇదీ కథ.. కథలాంటి నిజం. ఆహారాన్ని వృథా చేయడం ఎంత నేరమో చెప్పే గొప్ప అనుభవం. నోటి దగ్గరకు ముద్ద వెళ్లినప్పుడల్లా ప్రతి ఒక్కరికీ గుర్తుకు రావాల్సిన పాఠం. - సరస్వతి రమ -
ఆ బొమ్మ నాది కాదు... ఆయనదే
విద్య - విలువలు ‘‘నేనిది చేసి తీరుతా’’ అని సంకల్పం చేయడం తప్పుకాదు. ‘‘కానీ ఇది నేను చేస్తా. నేనెందుకు చేయలేను’’ అని అనుకున్నాననుకోండి. కానీ నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వేరొకడున్నాడన్నమాటకు అర్థం లేదు. నేను అనుకున్నవన్నీ జరగకుండా ఆపగలిగినవాడు ఒకడున్నాడనే స్పృహ అవసరం. అందుకే రేపటి రోజున అయోధ్యకు రాజుగా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలనుకున్న దశరథ మహారాజు అలా చెయ్యగలిగాడా! రాత్రికి రాత్రి చేయలేకపోయాడు. లక్ష్మణస్వామి వచ్చి ‘‘రాజ్యం ఇవ్వకుండా ఉండడానికి నాన్నగారెవరు? అన్నయ్యా, అనుజ్ఞ ఇయ్యి, దశరథుణ్ణి చంపేస్తా’’ అన్నాడు. దానికి రాముడేమన్నాడో తెలుసా ‘‘నాన్నగారు నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నా, ఈవేళ కూడా ఆయనకు ఇవ్వాలని ఉన్నా... ఇవ్వకుండా ఎలా ఆగిపోయింది? ఆయనకు కోరికలేక కాదుగా. నాన్నగారికి ఇవ్వాలని ఉన్నా, నాకు పుచ్చుకోవాలని ఉన్నా ఆయన ఇవ్వలేక, నేను పుచ్చుకోలేక ఎవ్వరం కాదనలేని ఒకానొక స్థితిని కల్పించినవాడు మన మాంసనేత్రాలకు కనబడనివాడు ఒకడున్నాడు. దానికి నాన్నగారినెందుకురా నిందిస్తావ్! ఆ దైవాన్ని అనుసరించు’’ అన్నాడు. సుందరకాండలో సీతమ్మ అద్భుతమైన మాట ఒకటంటుంది. హనుమ వెళ్లి అంత కష్టంలో ఉన్న సీతమ్మకు రాముని క్షేమవార్త చెప్పాడు. అదే పరిస్థితిలో కనుక మనం ఎవరమైనా ఉంటే ఏమంటాం... ‘‘ఇక్కడినుంచి నేను బయటపడే రోజు ఉంటుందంటావా హనుమా’’ అని. కానీ ఆమె ఏమన్నదో తెలుసా... ‘‘హనుమా, నేను కనబడడం లేదన్న బెంగతో రాముడు తాను చేయవలసిన పనులు మానేసుకున్నాడా? లేకపోతే నన్ను పొందే కార్యక్రమం పెట్టుకుని దాని వ్యగ్రతలో ‘నాకు ఈశ్వరుడు ఏనాడు అనుకూలించాడు కనుక, నేనెందుకు పూజించాలి ఆయన్ని’ అనుకుని భగవంతుడిని పూజించడం మానేశాడా? ఎలా ఉన్నాడు రాముడు చెప్పు’’ అని అడిగింది. ఆమె ఎందుకలా అడిగిందంటే... కష్టాల మధ్యలో భగవంతుడి ఉదాసీనత మనకు అర్థం కాకపోవచ్చు. కానీ ఏదో ఒకనాడు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. నూరేళ్ళు బతికినవాడు ఎప్పుడో ఒకప్పుడు శుభవార్త వింటాడు. కాబట్టి ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు, దాన్ని నెరవేర్చాలనే పట్టుదల ఉండడం మంచిదే. కానీ ఆ కార్యాన్ని ఏ కారణం చేతనో నీవు చేయలేకపోతే ‘ఇది నీవు చేయవద్దు. చేస్తే ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఇక వద్దు’ అని ఆ పని చెయ్యకుండా ఆపినవాడు ఒకడున్నాడని గుర్తించినవాడిది పండిన బతుకు. అంతే తప్ప-నేను చేయాలనుకున్నా, వాడు నన్ను చేయనివ్వడం లేదనే వ్యగ్రత పెట్టుకుని పూజ మానేస్తే నీకొరిగేదేమిటి?’’ ఒక కార్యం చేయాలన్న ధైర్యం ఉండాలి. ఆటుపోటు తట్టుకోగలగాలి. కానీ ఈ పని అయి తీరాలి. కాకపోతే?? పరమేశ్వరుడి దగ్గరినుంచి కనబడిన ప్రతివాడినీ బాధ్యుడిని చేస్తాననే భావన, అందరినీ నిందించే తత్త్వం ఉండకూడదు. లక్ష్య సాధన తాను ఏ స్పష్టతతో మొదలు పెట్టాడో అదే స్పష్టతతో అంతే చిరునవ్వుతో ముందుకు తీసుకెళ్ళగలగాలి. ఇదీ ధృతి అంటే. ఇది ఎవరికి ఉందో వాడు మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. అది లేని వాడు ఏదైనా సాధించిన రోజున పొంగిపోతాడు. లేకపోతే కృంగిపోతాడు. వాడితో కార్యములు సాధింపబడవు. ఒకవేళ సాధింపబడినా ఆ పని లోకంలో నిలబడుతుందేమో గానీ, ఆ సంకల్పం చేసిన వ్యక్తి మాతం ఆదర్శవంతుడిగా నిలబడలేడు. అందుకే ధృతి కలగడం అన్నది అంత తేలికైన విషయం కాదు. అది జీర్ణమైనవాడికే చెల్లుతుంది. గుంటూరులో నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. ఆ ఇంటి పెద్దకు ఒక కుమారుడున్నాడు. వాడు తండ్రితో ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. రాత్రి నాన్నగారి కాళ్లు పడుతూండగా, ఇంట్లోవాళ్లు ఏవో సరుకులు కావాలంటే ‘‘నాన్నగారండీ, ఇప్పుడే షాపుకెళ్లి పట్టుకొచ్చేస్తా’’ అని చెప్పి బయటకు వెళ్లినవాడిని ఒక వాహనం తొక్కేస్తే చనిపోయాడు. ఈ విషయం నాకు తెలియదు. ఆ మరుసటి సంవత్సరం నేను వెళ్లి మాటల సందర్భంలో ‘‘మీ అబ్బాయి ఎలా ఉన్నాడండీ’’ అని అడిగా. ‘‘ఆ బొమ్మను ఈశ్వరుడు తీసుకున్నాడండి’’ అన్నాడు. ‘‘మీరేవంటున్నారో నాకర్థం కాలేదు’’ అన్నా. ‘‘ఆ బొమ్మతో ఆడుకోమని నాకు ఆయన కొన్నాళ్లు ఇచ్చాడండీ. ఏమైనా అది ఆయనదే కదూ. నా వస్తువు నాకు కావాలని ఆయన దానిని పట్టుకెళ్ళిపోయాడు. అంత ఆప్యాయతతో నాకు ఆ బొమ్మ ఇచ్చి, అంతే స్వతంత్రంగా నా దగ్గర నుంచి ఆయన ఆ వస్తువు తీసుకున్నందుకు, ఇన్ని మధుర స్మృతులు మిగిల్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నాడు. అది ధృతి. నరనరాన జీర్ణమయిన వేదాంతం. ఆ స్థాయికి ఎదగడం మనం నోటితో చెప్పినంత తేలిక కాదు. ఆయన నిజమైన వేదాంతి. ధృతి, సంకల్పం ఎప్పుడూ భక్తితో ముడిపడి ఉంటాయి. ‘ఈశ్వరానుగ్రహం చేత నేను చేస్తున్నాను తప్ప నా అంతట నేను చేసేది కాదు’ అన్న స్థితి. అది సంకల్ప శుద్ధి. అది లక్ష్య శుద్ధి. అందుకే లంకకు బయల్దేరే ముందు హనుమ ఏం చెబుతాడంటే... ‘‘నేను యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలను. నాకా శక్తి ఉంది. నేను ఉత్తర తీరాన నిలబడి వంగి దక్షిణ తీరాన్ని ముట్టుకోగలను. కానీ నేను ఎలా వెడతానంటే... బంగారు కోదండాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి వింటినారిని సంధించి ఆ కర్ణాంతం లాగి వదిలినప్పుడు బాణం ఎలా వెడుతుందో అలా వెడతాను. బాణం విడిచిపెడితే రాముడి శక్తి బాణంలోకి చేరి అది వెడుతుంది. అది నా శక్తి కాదు. రాముడి శక్తి’’ అంటాడు. అందుకే కేవలం ఒక లక్ష్యం పెట్టుకోవడం కాదు, అది చెదిరిపోకుండా నిలబడగలిగిన శక్తిని ఒకడివ్వాలి. వాడు ఉన్నాడు. అలా వాడు ఉన్నాడన్న నమ్మకమే భక్తి. వాడు నాకు సంకల్ప బలాన్ని ఇస్తాడని, దానియందు నిలబడగలిగిన శక్తిని ఇస్తాడని నమ్మడమే లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. అటువంటి సంకల్పం నెరవేరిననాడు అది పదికాలాల పాటూ, పదిమందికి పనికి వచ్చేదిగా ఉండడమే కాక, సాధకుడు కూడా ఆదర్శంగా చిరకాలం నిలిచిపోతాడు. -
నురగ కాసిన పత్తి
పత్తి.. ప్రతిక్షణం ఆమె వెన్నంటే ఉంది! కాపురానికి వచ్చిన నాటి నుంచీ... ‘మంచిరోజులు రాకపోతాయా’ అని... కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ ఆమె చూసింది. భర్త కళ్లల్లో అంధత్వమై పూసిన పత్తి పూలను చూసి కుమిలిపోయింది. అప్పు చేసి పత్తి వేస్తే.. పొలం ఎండు పువ్వై ఆమెను ఏడిపించింది. పని చేయలేని భర్త.. పస్తులుంటున్న పిల్లలు.. పీకల దాకా వడ్డీలు.. కలిసిరాని కాలం... కనుచూపు మేరలో కనిపించని పరిష్కారం... ఆమె పురుగుల మందు తాగింది!! అప్పుడు కాసింది పత్తి... విరగ్గాసింది. ఆమె నోట్లో నురగై కాసింది. ఆ తర్వాత కూడా... తల వెనుక దీపమై పత్తి ఆమెను వెంటాడేదే..! అదృష్టం.. అలా జరగలేదు! దురదృష్టం.. ఇప్పుడు జరుగుబాటు లేదు! ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఈ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది. ఆమె పేరు రమ. ఊరు.. శంకరపట్నం మండలం ముత్తారం గ్రామం. నూనె ఐలుమల్లు, లింగమ్మ దంపతులకు నలుగురు కూతుళ్లు. వాళ్లలో పెద్దబిడ్డ రమ. 2000 సంవత్సరంలో ఉన్నకొద్దిపాటి పొలం అమ్మేసి రమ పెళ్లి చేశారు. అట్లా పదహారేళ్లకే వివాహబంధంలో బందీ అయింది రమ. ఆమె భర్త పేరు రవి. చేపలు పట్టే కులవృత్తే వాళ్ల కుటుంబానికి జీవనాధారం. దానితో సరిపడా ఆదాయం రాకపోయినా ఉన్నంతలోనే రవి, రమా సర్దుకుపోయేవారు. కాలం గడుస్తోంది. పిల్లాడు (అంజి) పుట్టాడు. ఆదాయం మాత్రం పెరగట్లేదు. రమ ఆందోళనంతా అదే. పెరిగిన సంసారానికి సరిపడా సంపాదన లేకపోతే ఇల్లు ఎట్లా గడవాలే? పిల్లాడెట్టా పెరగాలే? వాడినెలా చదివించాలె? ఇదే రంది ఆమెకు. ఎట్లయినా చేసి భర్త సంపాదనకు చేదోవాదోడుగా మారాలి. ఈ ఆలోచనతోనే పగలురేయి గడిచిపోతున్నాయి. ఉన్నట్టుండి 2004లో.. రవి.. ఒక కంటి చూపు మందగించడం మొదలైంది. వైద్యం తీసుకుంటూ, చూపు కనిపించినంత మేరా పనిచేసుకుంటూ నెట్టుకొస్తున్నాడు. నాలుగేళ్లు గడిచాయి. 2008లో కూతురు అమూల్య పుట్టింది. ఆ సంతోషంలో ఉండగానే రవి రెండో కంటి చూపూ మందగించసాగింది. రెండు కళ్లూ కనిపించడం లేదు! వైద్యం కోసం కరీంనగర్, వరంగల్, హైదరాబాద్‌ల చుట్టూ తిరిగాడు. చూపు మాత్రం రాలేదు కానీ 40 వేల అప్పు మిగిలింది ఆ దంపతులకు. పిప్పి చేసిన పత్తి రవి పూర్తిగా చూపు కోల్పోయి, కాలకృత్యాలకూ రమ మీదే ఆధారపడే పరిస్థితి వచ్చింది. అనివార్యంగా కుటుంబ పోషణభారం ఆమె మీదే పడింది. కష్టాలన్నీ కుమ్మక్కయి ఒక్కసారిగా చుట్టుముట్టే సరికి పోరాడే దారి తెలియలేదు. పిల్లలను సర్కారు బడిలో చేర్పించి అప్పుల ఊబి నుంచి తప్పించుకోవడానికి కూలీగా మారింది. రెక్కలు ముక్కలు చేసుకోసాగింది. కానీ రోజూవారి కూలీతో అప్పులు తీరడం అటుంచి కుటుంబం గడవడమే గగనం అయింది. అప్పుడు ఆమె పోతిరెడ్డిపల్లి గ్రామ శివారులో సర్కారు ఇచ్చిన 20 గుంటల భూమిని సాగు చేయడం మొదలుపెట్టింది. తొలి రెండేళ్లు రూపాయి కూడా గిట్టుబాటు కాలేదు. ఈ ఇరవై గుంటల భూమి మీదే ఆధారపడితే లాభంలేదనుకొని మరో 20 గుంటల భూమిని కౌలుకి తీసుకుంది. లక్షన్నర అప్పు చేసి మరీ పత్తి వేసింది. ఇక్కడా నిరాశే. పత్తివిత్తనాలు నాటిన నాటినుంచి ఒక్క చినుకూ రాలక పత్తి సాగులో గునుగుపువ్వు పూసింది తప్ప పత్తిపువ్వు విప్పలేదు. కళ్లముందే ఎండి పోయింది. అప్పట్నుంచి రమ మనోవేదనకు గురవసాగింది. చుట్టుముట్టిన కష్టాలన్నీ వికటాట్టహాసం చేస్తున్నట్టనిపించింది. కలిసిరాని కాలాన్ని ఎదిరించలేననుకుంది. కళ్లు లేని భర్తను, పెరిగి పెద్దవుతున్న పిల్లలను పోషించడం భారమని తలచింది. చావొక్కటే మార్గమని భావించింది. ఈనెల 3న మధ్యాహ్నం ఇంట్లోనే భర్త ఎదుటే పురుగుల మందు తాగింది. భర్తకు కళ్లు కన్పించక పోవడంతో ఏం జరుగుతుందో తెలియలేదు. నురుగలు కక్కుతున్న రమను ఇరుగుపొరుగు చూసి హుటాహుటిన జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ దేవుడు రమ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన సర్కార్ వైద్యులు ఆమె బతడం కష్టమని తేల్చేశారు. హుజూరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. రమ, రవి దంపతుల పిల్లలిద్దరు ఆసుపత్రిలో కనిపించిన ప్రతి డాక్టర్ దగ్గరకు వెళ్లి ‘మా అమ్మను బతికించండి’ అంటూ కాళ్లావేళ్లా పడసాగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన శ్రీ విజయసాయి ఆసుపత్రి డాక్టర్ సురంజన్ ఆమె పరిస్థితిని గమనించారు. తల్లిని బతికించమని బతిమాలుకుంటున్న ఆ ఇద్దరు పిల్లలను చూసి చలించిపోయారు. అంధుడిగా రవి నిస్సహాయతకు కదిలిపోయారు. హుటాహుటిన రమను తన ఆస్పత్రికి తీసుకెళ్లి అత్యవసర వైద్యం మొదలుపెట్టారు. ఇంజక్షన్లు, మందులు, ఆపరేషన్ల కోసం పెద్దమొత్తంలోనే సొంతడబ్బు ఖర్చు చేశారు. గత రెండు వారాలుగా చికిత్స అందిస్తూనే ఉన్నారు. వారంకిందట రమకు గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం ఆమె మాట్లాడే పరిస్థితిలో లేనప్పటికీ మృత్యువును మాత్రం జయించింది. ఆరోగ్యం పర్వాలేదు.. కానీ బతుకు దెరువు? చావు గుప్పిట్లోనుంచి రమ బయటపడింది కానీ ఆమె కుటుంబం గడిచేదెట్లా? పిల్లలను పెంచేదెట్లా? అంధుడైన భర్త బాధ్యతను మోసెదెట్లా? పూరిగుడిసె తప్ప ఏ ఆధారమూ లేని తాను చేసిన అప్పులు తీర్చేదెట్లా? అంటూ మథనపడుతోంది రమ. ఏడవడానికి కన్నీళ్లు కూడా కరువైన ఆ తల్లి కళ్లల్లో ‘ఎందుకు బతికాన్రా దేవుడా’ అన్న బాధే కనిపిస్తోంది. - పసునూరు మధు, సాక్షి ప్రతినిధి, కరీంనగర్ గన్ను శ్రీనివాస్, జమ్మికుంట విలేకరి ఉపాధి చూపిస్తే బతుకుతం మా అదృష్టం బాగుంది. మా పిల్లలను, నన్ను చూసి అ భగవంతుడు పెద్దపెద్దోళ్ల సాయంతో నా భార్యను బతికించిండు. నా భార్య ప్రాణాలు కాపాడిన డాక్టర్‌కు రెండు చేతుల దండం పెడుతున్నం. రమ బతికినందుకు సంతోషంగా ఉన్నా...రేపటి నుంచి ఎట్ల బతకాలో తలుచుకుంటేనే భయమేస్తుంది. దయగల మారాజులు మమ్ముల్ని ఆదుకోవాలి. సర్కారోళ్లు ఇంటికాడ దుకాణం పెట్టుకునేందుకు సాయం చేస్తే అది నడుపుకుంటూ నన్ను నా పిల్లలను సాదుకుంటది నా భార్య. మీ అందరికి రెండు చేతులా మొక్కుతున్న. దయ చూపించాలే. - రమ భర్త రవి చదువుకోవాలని ఉంది... అన్నం లేక పస్తులుంటున్నం నాకు, చెల్లికి చదువుకోవాలని ఉంది. బడిలో పెట్టిన అన్నం తింటున్నం. బడి బందున్న రోజు పస్తే. చాలాసార్లు రాత్రి అన్నం లేక ఉపవాసాలు ఉంటున్నం. చదువుకోవడానికి పెద్దసార్ల సహాయం కోరుతున్నం. - అంజి కోలుకుంటోంది రమ కుటుంబ పరిస్థితి నన్ను కదిలించింది. దాతల సహకారంతో వైద్యాన్ని అందించా! ఇప్పుడు ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. గొంతు దగ్గర ఆపరేషన్ చేయడంతో ప్రస్తుతం మాట్లాలేక పోతుంది. ఈ రోజు (బుధవారం) మరోసారి గొంతు వద్ద చిన్న ఆపరేషన్ చేసి ట్యూబ్ వేయాలి. ఇప్పటి వరకు రూ. రెండున్నర లక్షల వరకు ఖర్చయింది. మరో రూ.50 వేల వరకుఖర్చవుతుంది. రమ కుటుంబం దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. ఆ కుటుంబాన్ని ఆదుకోకపోతే భవిష్యత్తులోనూ వారికి ఇబ్బందే. - డాక్టర్ సురంజన్ ఆ తల్లికి, ఆ కుటుంబానికి ఆర్ధికంగా చేయూత ఇవ్వాలనుకుంటే: రమ తండ్రి ఐలమల్లు మొబైల్ నెంబర్: 8008631247 -
ఇంకా నా యందు సందేహమేనా...
మలుపు తిప్పిన సన్నివేశం లవకుశ లవకుశలో ప్రతి సన్నివేశం కీలకమైనదే. కాని సీత మీద అనుమానంతో రాముడు ఆమెను అడవులకు పంపే సన్నివేశం మాత్రం విలక్షణమైనది. కథకు వెన్నెముక వంటిది. ఏం జరగబోతోందో రాముడికీ లక్ష్మణునికీ తెలుసు. కాని ఏమి అనుభవించబోతోందో సీతకు తెలియదు. మాతృసమానురాలైన సీతను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టడం లక్ష్మణునికి ఇష్టం లేదు. అలాగని అన్న ఆజ్ఞను ధిక్కరించలేడు. గుండె రాయి చేసుకొని సీత ఉన్న రథాన్ని కారడవులలోకి మళ్లించాడు. అప్పుడు సీతకు, లక్ష్మణునికి మధ్య సాగిన సన్నివేశం తరతరాలకు నిలిచిపోతుంది. సీతాదేవి: నాయనా... లక్ష్మణా! ఇదేమిటి దారి తప్పలేదు కదా? లక్ష్మణుడు: నట్టడవి పోయేవారికి దారి తెన్నూ ఏమిటి తల్లి! సీతాదేవి: అదేమిటి లక్ష్మణా! నీ మొహం కళా విహీన మై చిన్నబోయింది? ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా? లేక మీ అన్నగారి ఇష్టంలేని అరణ్యసందర్శన కోరినందుకు కోపమా? లక్ష్మణుడు: ఎంత మాట తల్లీ! పరమ పావని... మాతృసమానురాలివైన నీ మీద నాకు కోపమా తల్లి...! కుసుమ కోమలివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనసులో పొంగే పరితాపం సీత: నాకే కష్టం లేదు లక్ష్మణా! ఈ అరణ్యవాసం నాకు అలవాటైందే కదా! ఈ ప్రకృతి సౌందర్యం ఈ మనోహరారణ్యం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొకప్పుడు నా జీవితకాలమంతా ఇక్కడే గడిపేయాలన్న బుద్ధి పుడుతూ ఉంటుంది. లక్ష్మణుడు (ఏడుస్తూ): అమ్మా! సీతాదేవి: (లక్ష్మణుడిని చూస్తూ) ఆ... అదేంటి లక్ష్మణా! అకారణంగా దుఃఖిస్తున్నావు! లక్ష్మణుడు: నా పాపిష్టి జన్మకు దుఃఖం కాక సంతోషం ఎలా వస్తుందమ్మా? సీతాదేవి: నా మనసు భయాందోళితమవుతోంది! ఎవరికి ఏ ఆపద వచ్చిందో చెప్పు నాయనా! లక్ష్మణుడు: ఆపద కాదు తల్లీ... అపవాదు.. సీతాదేవి: అపవాదమా! నా పైనా? లక్ష్మణా నీవు పొరపాటుగా వినలేదు కదా! లక్ష్మణుడు: లేదు తల్లీ.. సత్యమే చెబుతున్నా! రామాజ్ఞ దాటలేని దుర్బలుడిని అగుట చేత నీ వంటి మహాసాధ్విని అడవుల పాలు జేసిన మహాపాపానికి ఒడిగట్టుకున్నాను తల్లీ! సీతాదేవి: రామాజ్ఞ! రామాజ్ఞా (ఏడుస్తూ) ... తండ్రి రామచంద్రా! ఎంతటి నిర్దయుడివి అయ్యావు, మనసు ఎలా రాయిచేసుకున్నావు, ఇంకా నాయందు సందేహమేనా! లక్ష్మణుడు: తల్లీ! రామచంద్రునకు నీ యందు సంశయము గానీ సందేహము గానీ లేదు. తాను రాజుగా ఉండి రఘువంశ కీర్తికి కళంకం రానీయకూడదని ఇలా చేయవలసి వచ్చిందమ్మా. సీతాదేవి: లక్ష్మణా! అర్ధాంగిని, గర్భవతిని నన్ను అడవి పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇనుమడిస్తుందా? అదీ గాక శ్రీరామచంద్రుడు రాజైతే నేను రాణిని కానా? నాకా బాధ్యత లేదా? నేను మాత్రం ఆయనకి అపకీర్తి రానిస్తానా లక్ష్మణా?(ఏడుస్తూ) లక్ష్మణుడు: అమ్మా! సాక్షాత్ ధర్మస్వరూపిణివి అయిన నీకు ఏం చెప్పగలను తల్లీ! సీతాదేవి: ధర్మస్వరూపులు మీ అన్నగారు, మీ తాతముత్తాతలు గానీ నా వంటి నిర్భాగ్యురాలికి ధర్మం ఎక్కడ ఉంది నాయనా? నేనెంత పాపినైనా నన్ను చేర పిలిచి, జరిగిన సంగతి చెప్పి, నన్ను ఆజ్ఞాపిస్తే అడవులకే కాదు, అగ్నిలో దూకమన్నా నేను వెనుదీస్తానా! ఇందుకేనా నన్ను అగ్నిపరీక్ష చేశారు? ఇందుకేనా అయోధ్యకు తీసుకువచ్చారు? అయ్యో ఇంకెందుకీ పాడు జన్మ! ఆ గంగలో పడి హతమారితే తీరిపోతుంది. లక్ష్మణుడు: అమ్మా నా మీద ఆన! సీతాదేవి: లక్ష్మణా! లక్ష్మణుడు: అంత సాహసం చేయకు తల్లీ, సాహసం చేయకు. సీతాదేవి: నా రామచంద్రుడిని చూసే భాగ్యం లేక పోయిన తరువాత నాకెందుకు లక్ష్మణా ఈ బ్రతుకు? లక్ష్మణుడు: నీ గర్భస్థమైన రవి వంశ వర్ధనుని కోసం తల్లి! సీతాదేవి: నేను వెలి అయితే నా శిశువు అర్హుడవుతాడా! అదీ గాక లోకులకు నా మొహం ఎలా చూపించను! నిన్నెందుకు శ్రీరాముడు త్యజించాడంటే ఏమని చెప్పుకోను! ఇంకెలా జీవించను? లక్ష్మణుడు: అమ్మా రామచంద్రుడు తన హృదయం తనే త్రుంచి వేసినట్టు అర్ధాంగివి గనుక నిన్ను దూరం చేసుకుని ఘోర బాధ అనుభవిస్తున్నాడు. తాను మాత్రం నిన్ను విడిచి ఓర్వగలడా తల్లి. సీతాదేవి: అవును లక్ష్మణా.. అవును వడలు తెలియని దుఃఖంలో ఉండబట్టలేక శ్రీరామచంద్రుడిని అనరాని మాటలన్నా. రామపాదారవింద సేవకు దూరమవడటం నా పురాకృత ప్రారబ్ధం. నేను కష్టాలకే పుట్టాను. నాకు సుఖపడే రాత ఎలా వస్తుంది? లక్ష్మణుడు: అమ్మా నీవంటి లోకోత్తర చరితను నట్టడవిలో ఎట్లా దిగవిడిచి పోగలను! కఠోరమైన రామాజ్ఞను ఎట్లా దాటగలను. నన్ను మన్నించు తల్లీ! మన్నించు. లక్ష్మణుడు: ప్రతి దినమేను కొలుగొంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన జీవనలందిచరింతు తదీయ భావ్యమే గతి యెడబాయె ఇంకెప్పుడు గాంతు పదపద్మముల్ నమశ్శతములు చేయునమ్మా కడసారి గ్రహింపుము జానకి సతి... జానకీసతి తల్లీ సెలవు (అంటూ ఆమెను విడిచి వెళ్లిపోతాడు) - శశాంక్ -
వేములవాడలో దంపతుల ఆత్మహత్య
వేములవాడ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామంలో కట్టా కిషన్(55), రమ(50) అనే ఇద్దరు దంపతులు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కల్యాణం.. కమనీయం
జానకిరాముల విశేషాలు, పెళ్లి మంత్రాలకు అర్థాలు పిల్లలకు వివరించారు ఉమ. శ్రీరామ నవమి ప్రత్యేకతను చిన్నారులు ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈతరం పిల్లలకు రాముడు, ఆయన గాథ తెలియదని, అవన్నీ ఇలా వారి చేతే చేయించి చూపడం వల్ల ప్రతిదీ అర్థం చేసుకోగలుగుతారని అన్నారు పేరెంట్ కె.రాంబాబు. ‘రాముడికి బట్టలు పెట్టాం. బాసికం కట్టాం. తెర పట్టుకుని మంత్రాలు చదివాం. తలంబ్రాలు పోశాం. పూల బంతులు ఆడాం. దేవుడి పెళ్లి మేమే చేశాం. పెళ్లయ్యాక ఉంగరాల ఆట కూడా ఆడాం. ఈ కల్యాణం మాకెంతో నచ్చింది’ అంటూ మురిసిపోతూ చెప్పారు చిన్నారులు ఆశ్రీత మణికంఠ, వంశిక, అంశృత. అలాగే... బుడతలు అయోధ్యాధిపతికి కట్నకానుకలు చెల్లించే ఘట్టాన్నీ... తమ ముద్దు ముద్దు మాటలతో మహా రక్తి కట్టించారు. ‘విగ్రహాల ఆవాహన నుంచి వివాహ మహోత్సవంలోని ప్రతి ఘట్టాన్నీ సంప్రదాయబద్దంగా పిల్లలతో చేయించాం. కంకణ ధారణ, రాముడికి స్నాతకోత్సవం, యజ్ఞోపవీత ధారణం... ఇలా ప్రతి ఘట్టాన్నీ నిర్వహిస్తూ, వాటి కారణాలను వివరించాం. పిల్లలే పేరంటాళ్లను పిలిచి ఈ తంతు చేశారు. రామాయణ శ్లోకాలు వినిపించి, వారి చేత ఉచ్ఛరిస్తూ, వాటి అర్థాలను చెప్పడం వల్ల చిన్నారులు ఇంత పెద్ద కార్యాన్ని ఎంతో ఆసక్తిగా, ఓపిగ్గా పూర్తిచేశారు’ అన్నారు ఉమా చల్లా. ఓ మధు -
ఓరుగల్లులో శ్రీరాముడి పాదముద్రలు
జిల్లాలో పలుచోట్ల సంచరించినట్లు {పచారంలో పలు గాథలు జీడికల్, వల్మిడి, ప్రోలకొండకు విశిష్టత హన్మకొండ కల్చరల్ : భారతీయ సనాతన ధర్మానికి ప్రతీక కోదండరాముడు. దశరథుడికి ఇచ్చిన మాట మేరకు రాముడు సీతాదేవి సమేతుడై, లక్ష్మణస్వామి వెంటరాగా గోదావరి నదిని దాటి దక్షిణదేశం వెళ్లాడని 14 ఏళ్లు అరణ్యవాసం చేశాడని శ్రీమద్రామాయణంలో ఉంది. శ్రీరాముడి తల్లి కౌసల్యాదేవి పుట్టినిల్లు దక్షిణకోసల. అంటే తన తల్లి పుట్టినింటి రాజ్యపుభాగాల్లో చాలా కాలం సంచరించాడన్న మాట. ప్రాచీన రహదారుల చరిత్రను పరిశీలిస్తే ఆ కాలంలో కూడా ఉత్తరభారతదేశం వారు దక్షిణదేశం వైపు పోవాలంటే కరీంనగర్ వరంగల్ సరిహద్దుల్లోని గోదావరి నదిని దాటాల్సి వచ్చేదని అర్థమవుతోంది. శ్రీరామచంద్రుడు కూడా దక్షిణభాగ భారతదేశంవైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రాంతంగుండానే వెళ్లాడనే కథ ప్రచారంలో ఉంది. జిల్లాలో రాముడి సంచారంపై వివిధ గ్రామాల్లో మౌఖికంగా చెప్పుకునే స్థానిక జానపద కథల్లో వాస్తవ, అవాస్తవాల గురించి తేల్చేందుకు కచ్చితమైన ఆధారాలు లేనప్పటికీ అనేక గాథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నారుు. వాల్మీకి ఆశ్రమమే వల్మిడి పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలోని రఘురాముడి గుట్ట మీద పూర్వం వాల్మీకి ఆశ్రమం ఉండేదట. దానికి చిహ్నంగా నేటికి వాల్మీకి గుహ కన్పిస్తుంది. గుట్టకు నైరుతి భాగంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది. అలాగే గుట్టపై రామాలయంలో పూర్వం అతిపెద్ద పంచలోహ విగ్రహాలు ఉండేవట. వాటిని దొంగలు ఎత్తుకుపోయారనే కథ ప్రచారంలో ఉంది. ఈ గుట్టపై ఎండకాలంలో కూడా నీళ్లు ఉండేలా గుండం కనిపిస్తుంది. వేలాది సంవత్సరాల క్రితం ఇక్కడ మానవులు నివసించిన ఆనవాళ్లుగా రాక్షస గుండ్ల్లు, బూడిద మట్టి, టైటా పెంకులు కన్పిస్తాయి. ఇక్కడ రామటెంకిలు దొరికాయని, రాముడు ఈ ప్రాంతం లో సంచరించాడని ప్రజలు విశ్వసిస్తారు. ఈ దేవాలయం భద్రాచలం రామాలయం కంటే పురాతనమైనదని భావిస్తారు. భద్రాచల క్షేత్రంలోని పూజారులు కూడా వల్మిడి రామాలయాన్ని ప్రత్యేకమైనదిగా గుర్తిస్తారు. ప్రోలకొండలో.. కొడకండ్ల మండలంలో ప్రోలకొండ గుట్ట ఉంది. శ్రీరాముడు వల్మిడి నుంచి బయల్దేరి జీడికల్‌కు వెళ్తూ ప్రోలకొండ గుట్టలోని సొరికెలో విశ్రాంతి తీసుకున్నాడట. ఇక్కడ గుహలో రాముడి పాదాల గుర్తులున్నాయి. పూర్వం ఇక్కడ పెద్దజాతర జరిగేదట. ఆ తర్వాత కాలంలో ఈ ప్రోలకొండగుట్ట మొదటితరం కాకతీయరాజుల నగరంగా అభివృద్ధి చెందింది. జింకను కొట్టిన చోటే జీడికల్ శ్రీరాముడు వనవాస కాలంలో మాయా లేడీని తరుముకుంటూ వచ్చాడనే కథ ప్రచారంలో ఉంది. జీడికల్ గ్రామానికి కిలోమీటరున్నర దూరంలో గుట్టపై దేవాలయం ఉంది. శ్రీరాముడు సీత కోరిక మేరకు మాయా లేడీని తరుముతూ వచ్చి పట్టుకోలేకపోతాడు. చివరికి మాయ లేడీని చంపడానికి బాణం ఎక్కుపెడుతాడు. దీంతో మాయా లేడీ భయపడిపోయి శ్రీరాముడ్ని శరణు కోరుతుంది. అదే సమయంలో నీళ్ల కోసం శ్రీరాముడు గంగాదేవిని ప్రార్థించి బోటన వేలితో భూమిని నోక్కేసరికి నీటి ఊట వస్తుంది. ఆ నీటితో శ్రీరాముడు సంధ్యావందనం చేసి దాహం కూడా తీర్చుకుంటాడు. ఆ పవిత్రమైన నీటితో తడిసిన జింక కూడా చిత్రరథుడనే గంధర్వుడిగా మారిపోతాడు. విశ్వామిత్రుడి శాపం కారణంగా తాను జింక రూపంలో ఉన్నానని చిత్రరథుడు రాముడికి తెలియజేస్తాడు. అప్పటి నుంచి ఈ నీటిలో స్నానం చేసిన వారు తమ బాధల నుంచి విముక్తులవుతారని గంధర్వుడు వరమిస్తాడు. ఇక్కడ శ్రీరామనవమి రోజు కాకుండా కార్తీక పౌర్ణమి నుంచి బహుళ ద్వాదశి వరకు ఉత్సవాలు నిర్వహించి శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం నిర్వహిస్తారు. సీతారాముడే అడిగి వెలిసిన గుడి డోర్నకల్‌లో నుంచి పది కిలో మీటర్ల పెరుమాళ్ల సంకీసను దేవుడి సంకీస అని కూడా పిలుస్తారు. పూర్వం ఇక్కడ చిన్నగోపాలస్వామి ఆలయం ఉండేది. ఈ గ్రామదొర అయిన వీరసాని అనే అతడు గోపాలస్వామిమూర్తి స్థానంలో శ్రీతిరుపతి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాలని తిరుమలలోని పని వారికి విగ్రహాన్ని తయారుచేసే పని అప్పగించాడు. ఆ విగ్రహాన్ని ప్రతిష్టించడానికి తెచ్చేసరికి అవి శ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలుగా మారిపోయూయట. దీంతో మరోసారి వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేయించి తెచ్చేసరికి ఆ విగ్రహం కూడా శ్రీశ్రీసీతారామలక్ష్మణ విగ్రహాలుగా మారిపోయూయట. ఆరోజు రాత్రి రాముడు అతడి కలలోకి వచ్చి తన విగ్రహాలను ప్రతిష్టిం చాలని అన్నారట. అలా శ్రీరాముడే తన భక్తుడి కలలో కన్పించి వెలిసిన అలయంగా ప్రసిద్ధి చెందింది. పురాతన రామాలయాలు ఎన్నో.. పెండ్యాల సమీపంలోని నష్కల్‌లో పురాతనమైన రామాలయం ఉంది. ఇక్కడ రాతితో చేయబడిన శ్రీసీతారాముల విగ్రహం వేంచేసి ఉంది. ఇక్కడ 600 ఏళ్లుగా శ్రీసీతారామా కల్యాణా న్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భం గా 11 రోజులపాటు పెద్దజాతర జరుగుతుంది. చింతనెక్కొండలో మూడు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన రామాలయం ఉంది. వరంగల్ నగరంలోని ఎల్లంబజార్ లో ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి అలయం కూడా చాలా పురాతనమైనది. ఆలయంలో ప్రాచీనశిల్ప కళాసౌందర్యం ఉంది. -
రాముడు గొప్పా? రామనామం గొప్పదా?
ఒకసారి శ్రీరాముని తల్లి, అగస్త్యుని తల్లి, ఆంజనేయుని తల్లి ఒక వివాహ వేడుకలో కలుసుకున్నారు. మాటల సందర్భంలో ఆంజనేయుని తల్లి ‘‘మహాసముద్రాన్ని అవలీలగా దాటిన నా కుమారుడు గొప్పవాడు’’ అంది. ఆ మాటలకు అగస్త్యుని తల్లికి అమితమైన కోపం వచ్చి, ‘‘ఆ.. అదేమంత గొప్ప? ఆ మహాసముద్రాన్ని మూడు పుడిసిళ్లుగా తాగివేశాడు నా కుమారుడు! కాబట్టి నా కొడుకే గొప్పవాడు’’ అంది. అలా వాళ్లిద్దరి మధ్య వాదన పెరిగి, శ్రీరాముడి తల్లిని తమ పుత్రుల్లో గొప్పవారెవరో చెప్పమన్నారు. ‘‘నేనేం చెప్పను? ఆంజనేయుడు, అగస్త్యుడు ఎల్లప్పుడూ శ్రీ రామనామగుణాలను గానం చేస్తూనే ఉంటారు. వాళ్లిద్దరిలో ఎవరు గొప్పో మా వాడినే అడిగి తెలుసుకుందాం పదండి!’’ అందామె. ముగ్గురూ శ్రీ రాముడి చెంతకు వచ్చారు. వివాదాన్ని కుమారుడికి వివరించింది శ్రీరాముని తల్లి. అప్పుడు శ్రీ రాముడు చిరునవ్వుతో, ‘‘మీరు అనుకుంటున్నట్లు ఆంజనేయుడూ గొప్పవాడు కాదు. అగస్త్యుడూ గొప్పవాడు కాదు. ఆంజనేయుడు సముద్రాన్ని దాటినా, అగస్త్యుడు సముద్రాన్ని తాగినా- రామనామ స్మరణ చేతనే వారలా చేయగలిగారు. అంతేకాదు, అందరిచేతా నేను పూజింపబడుతున్నానంటే అది ‘రామ’ నామ ప్రభావం వల్లనే అని గ్రహించండి’’ అన్నాడు నవ్వుతూ. అంటే రామునికంటే రామనామమే గొప్ప అన్నమాట! - చోడిశెట్టి శ్రీనివాసరావు -
రాముడు ఎందుకు ఆరాధ్యుడయ్యాడంటే...
సద్గురు జగ్గీ వాసుదేవ్ భారతీయులలో చాలామంది రాముణ్ణి ఆరాధిస్తారు. కానీ మీరు అతని జీవిత పరిస్థితులను, అతని జీవితం నడచిన తీరును గమనించినప్పుడు, అది అంతా విపత్తుల పరంపరగా అనిపిస్తుంది. అతను ధర్మబద్ధంగా తనది అయిన సామ్రాజ్యాన్ని కోల్పోయాడు. పైగా అడవులు పట్టిపోవలసి వచ్చింది. అంతలో అతని ధర్మపత్ని అపహరణం. అందుకోసం అతనికి ఇష్టం లేకపోయినా ఒక ఘోర సమరం చేయవలసి వచ్చింది. తన అర్ధాంగిని కాపాడి తిరిగి తెచ్చుకోగానే, చుట్టుప్రక్కల వారందరి నుండి అతి పరుషమైన వ్యాఖ్యానాలను భరించాడు. ఆ కారణంగా తన ప్రాణప్రదమైన సహధర్మచారిణిని అడవులలో వదిలిపెట్టాడు. అప్పుడామె నిండు గర్భవతి. కవలలకు జన్మనీయబోతూ ఉంది. ఆ తరువాత, తన కన్నబిడ్డలే అని తెలియని పరిస్థితిలో, వారితోనే యుద్ధం చేశాడు. చివరకు తన భార్యను కూడా కోల్పోయాడు. అతని జీవితం ఒక ఎడతెగని విపత్తు. ఇంత జరిగినా, ఎందుకు జనులు రాముణ్ణి ఆరాధిస్తారు? రాముని ప్రత్యేకత జీవితంలో అతడు ఎదుర్కొన్న పరిస్థితులలో లేదు. ఎదురైన విపత్తులలో ఎంత ఉన్నతంగా నడుచుకున్నాడనే దాని మీద అతని ఔన్నత్యం ఉన్నది. ఏనాడూ అతనిలో కోపం లేదు, ఎవరినీ నిందించటం లేదు, గగ్గోలు పెట్టడం లేదు. అతడు అన్ని సందర్భాలలోను ఉదాత్తతతో, హుందాగా నడుచుకున్నాడు. అందువల్లనే, పవిత్ర జీవనాన్నీ, ఆపై ముక్తినీ సాధించాలని తపించే వ్యక్తులు రాముని కోసం తపిస్తారు. ఎందుకంటే బాహ్య పరిస్థితులు ఏక్షణంలోనైనా విషమించగలవు అని వారు తెలుసుకున్నారు కాబట్టి. ఆ విజ్ఞతను పొందారు కాబట్టి. ఎన్నో రకాలుగా జీవిత పరిస్థితులను చక్కదిద్దుకుంటూ ఉన్నా కూడా, బాహ్య పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు విషమించే ఆస్కారం ఉంది. మీరు అన్నీ సక్రమంగానే నిర్వహించుకోవచ్చు. కానీ ఒకవేళ తుఫాను లాంటి సమస్య వస్తే మాత్రం, అది మీ ఇంటిని, మీ సమస్తాన్ని తుడిచిపెట్టేస్తుంది. నాకేమీ అలా జరగదులే అని అనుకోవడమంటే మూర్ఖంగా బతకటమే అవుతుంది. ఒకవేళ అదే జరిగినా కూడా నేను దానిని ధైర్యంగా ఎదుర్కొంటాను అని అనుకోవడం వివేకమైన జీవనమార్గం. ఈ మహత్తరమైన విజ్ఞత రామునిలో కనిపిస్తుంది. అందుకే జనులు అతనిని ఆరాధిస్తారు. మీ వద్ద ఎంత ఉంది, మీరు ఏం చేశారు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇవన్నీ ప్రశ్న లు కావు. ఏదైనా జరగనీ, మిమ్మల్ని మీరు ఎలా నిలుపుకుంటున్నారు? అదే అసలు విషయం! తన జీవితంలోని పరిస్థితులను చక్కదిద్దటానికి రాముడు ప్రయత్నించాడు. కానీ అన్నివేళలా అది వీలుకాలేదు. అనేక విషమ పరిస్థితులు అతడు అనుభవిస్తూ వచ్చాడు. పరిస్థితులు నియంత్రణను దాటిపోయాయి. కానీ ముఖ్యమైన విషయం ఒక్కటే... అతడు ఎప్పుడూ ఉదాత్తతతో, హుందాగా నడుచుకున్నాడు. ఇదే ఆధ్యాత్మికతలోని మౌలిక సారాంశం. మీ జీవితం ఒక సుందర పరిమళపుష్పంలాగా వికసించాలంటే దానికి సానుకూలమైన అంతర్గత పరిస్థితిని కల్పించుకోవాలి. అటువంటి స్థిరమైన అంతర్గత వాతావరణాన్ని మీరు ఎల్లప్పుడూ సృష్టించుకోవాలి. అందుకు రాముడు ఆదర్శం. అందుకే జనాలు ఆయనను ఆరాధిస్తారు! దీని అర్థం, మన జీవితాన్ని మనం సక్రమంగా నడుపుకోకూడదనా? కానే కాదు. మన చుట్టూ ఉన్న వ్యవహారాలను చక్కగా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే అది అందరికీ మంచిది. అలా ఒక పరిస్థితిని చక్కగా నిర్వహించినప్పటికీ కూడా, మనకది తప్పకుండా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పలేము. కాని ప్రతి పరిస్థితిలోను, మనల్ని మనం మనోజ్ఞంగా నిలబెట్టుకోగలిగినప్పుడు, మనకు తప్పకుండా అద్భుతంగా అనిపిస్తుంది. అయినా, అందరి శ్రేయస్సు పట్లా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి, మనం ఏ పరిస్థితినైనా సక్రమంగా నిర్వహించాలి. ప్రేమాశీస్సులతో... సద్గురు -
అయోధ్య రాముడు! దక్కన్ రాముడు !!
అయోధ్య రాముడు వేరు ! దక్కన్ రాముళ్లు వేరు !! సీత కాళ్లపారాణి ఆరకముందే, నూనుగు మీసాల రాముడు అంతఃపుర కారణాలతో అడవిబాట పట్టాడు. ఒక మహాయుద్ధం చేసి సీతా సమేతుడై పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో వియోగ రాముడయ్యాడు ! రామాయణంలో భద్రాద్రి ప్రత్యేకమైనది. పద్నాలుగేళ్ల వనవాసకాలంలో పదేళ్లను పది నిమిషాలుగా సీతారాములు ఇక్కడ ఆహ్లాదంగా గడిపారు. ముత్యాల బాట.. ఇతిహాస కాలానంతరం, చారిత్రక భద్రాచలం తహసీల్దార్ గోపన్న (రామదాసు)కు ఇక్కడ గుడి కట్టాలనిపించింది. కుతుబ్‌షాహీల చివరి రాజు తానీషాకు జమకట్టాల్సిన పన్నులతో ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత జైలుపాలైన రామదాసు రాములోరిపై భక్తిపూర్వకంగా నిందాస్తుతి రాశాడు. రామలక్ష్మణులు గోల్కొండకు రాక తప్పలేదు. తానీషాను ‘నిద్ర’లేపి తమ దాసుడు కట్టాల్సిన డబ్బులను అణాపైసలతో సహా చెల్లించి రసీదు సైతం పొందారు. తానీషా పశ్చాత్తప్తుడై రామదాసును విడుదల చేశాడని గాథ ! ఏటా సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు పంపుతానన్న తానీషా మాట నేటికీ అమలవుతోంది. కూచిపూడి భాగవతులకు తానీషా అగ్రహారాన్నివ్వడమూ మరొక సందర్భంలో స్మరణీయమే ! మరొక దక్కనీ రాముడికి సంబంధించిన చారిత్రక డాక్యుమెంట్లను తిప్పి చూద్దాం. అసఫ్జాహీలు-కాయస్థులు ఈ అపురూపమైన దక్కనీ చిత్రాన్ని తిలకించండి. 19వ శతాబ్దపు అజ్ఞాత చిత్రకారుడు కాగితంపై వాటర్ కలర్స్‌తో, బంగారుపూతతో చిత్రించాడు. ఇందులో ప్రస్తుత కథానాయకుడు మూడో నిజాం నవాబ్ సికిందర్ జా ఉద్యానవనంలో సుమసౌరభాన్ని ఆస్వాదిస్తూ విరాజమానుడై ఉన్నాడు. ఆయన ఎదురుగా నాలుగు సామాజిక సమూహాలకు ప్రతీకలైన నలుగురు ప్రధానులు.. ప్రభువు ఆనతిని ఆలకిస్తున్నారు. ఇంతకీ సికిందర్ జా ఎవరు ? ఔరంగజేబ్ పతనానంతరం అరాచకం తాండవించింది. కత్తి కింద ఒకటిగా మసలిన ప్రాంతీయ అస్తిత్వాలు తమ ప్రత్యేకతను చాటుకోవాలనుకున్నాయి. ఆ నేపథ్యంలో మహమ్మద్ షా (1719-48) ధోరణులు నచ్చక పాలకవర్గంలోని ప్రముఖుడు నిజాం-ఉల్-ముల్క్ దక్కన్ వచ్చేశాడు. ఏడాదిలో (1724) పాత దక్కన్‌ను ఏకం చేశాడు. ఆయన ప్రత్యేకతను దక్కనీయులు, ఢిల్లీ పాలకులు సైతం గుర్తించి ‘అసఫ్ జాహీ’ బిరుదునిచ్చి గుర్తించారు ! ఆయన వెంట ఢిల్లీ నుంచి కాయస్థులు దక్కన్ వచ్చారు. కూర్చున్న కొమ్మను నరుక్కునే ఢిల్లీ ఏలికల వైపరీత్యాలు చోటు చేసుకోకుండా ప్రజలకూ ప్రభుతకు వారధిగా వ్యవహరించారు. వివిధ పదవుల్లో, బాధ్యతల్లో రాజ ప్రముఖులుగా ఎదిగారు. ఆ క్రమంలో రాజపరివాపు జీతభత్యాలను చెల్లించే అధికారి భవానీ ప్రసాద్‌కు మూడో నిజాం ‘రాజా’ బిరుదునిచ్చారు. ఆ సందర్భంగా రామాలయం నిర్మించాలనుకున్నారు భవానీ ప్రసాద్. ప్రస్తుత నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాజేంద్రనగర్‌కు వెళ్లే దారిలో అత్తాపూర్ సమీపంలో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతిష్ఠించిన రాముడి విగ్రహం వెనుక ఒక కథ ఉంది. గద్వాల తర్వాత హైదరాబాదే.. పాత హైదరాబాద్ స్టేట్‌లోని రాయచూర్ జిల్లాలో నిజాంలకు అనుబంధంగా గద్వాల సంస్థానం ఉండేది. 1384 చ.కి.మీ విస్తీర్ణంలో గద్వాల పట్టణమూ, 214 గ్రామాల సంస్థానానికి రాజా సోమభూపాలుడు పాలకుడు. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌లో భాగమైన ఈ సంస్థానం హైదరాబాద్ స్టేట్ కంటే ముందే అస్తిత్వంలో ఉండేది. రాజా సోమభూపాలుడు తన పరివారం కోసం ఒక రామాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. రాముడి శిల్పం పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు ఒక కల వచ్చింది. ‘సమీపంలోని బావిలో ఉన్న తన విగ్రహాన్ని వెలికి తీయించి ఆలయంలో ప్రతిష్ఠించవలసినది’ అని రాముడు చెప్పాడట. అదే సమయంలో ‘రాజా’ భవానీ ప్రసాద్‌కూ సోమభూపాలుడికి రాముడు కలలో చెప్పిన వైనం కలగా వచ్చిందట. బావిలోని విగ్రహాన్ని గద్వాలాధీశుడు ప్రతిష్ఠిస్తున్న నేపథ్యంలో ముందుగా శిల్పులకు పురమాయించగా రూపొందిన రాముడి విగ్రహం తనకు బహుమతిగా ఇవ్వవలసిందిగా కోరాడట భవానీ ప్రసాద్. సోమభూపాలుడు సంతోషంగా అంగీకరించి బహూకరించాడట. ఫర్కుందా బునియాద్.. ఆలయ నిర్మాణం పూర్తయ్యాక, సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా భవానీప్రసాద్ మూడో నిజాం సికిందర్ జాను ఆహ్వానించాడు. 1812లో ఈ అపురూప దృశ్యాన్ని ఆబాలగోపాలం వీక్షించింది ! ఆలయ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న సికిందర్ జా మడులూ-మాన్యాలు ఆలయానికి రాశాడు. అర్చకులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వమన్నాడు. ఏటా రామనవమి రోజు ప్రభుత్వం తరఫున ‘యాత్ర’ నిర్వహించాలని ఆదేశాలిచ్చాడు. 1816వ సంవత్సరపు ‘దఫ్తర్-ఎ-ఇస్తిఫా’ రికార్డుల ప్రకారం అర్చకులకు రోజుకు రెండు రూపాయల గ్రాంట్ మంజూరైంది. మూడో నిజాం ఉత్తర్వుల్లో హైదరాబాద్ పేరును ‘ఫర్కుందా బునియాద్’ అని పేర్కొన్నారు. భాగ్యనగర్ అనే పేరుకు ఫర్షియా పదం ‘ఫర్కుందా బునియాద్’ సమానార్థకం కావడం విశేషం ! దక్కన్ ముస్లింలు విగ్రహ ప్రతిష్ఠాపకులు రామ్‌బాగ్ ఆలయంగా స్థానికులు వ్యవహరించే ఈ ఆలయం ప్రతిష్ఠాపనలో హిందూ-ముస్లింలు సాదరంగా పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ఠాపనను స్వయంగా ముస్లిం పాలకుడు చేశాడు. ముస్లింలంటే విగ్రహ విధ్వంసుకులనే భావనలను పూర్వపక్షం చేశారు. మనవత్వాన్ని పరిమళించే ఈ మతసామరస్యానికి బీజాలు నగరానికి పునాదులు వేసిన కులీ కుతుబ్షాలో ఉన్నాయి. ఒక కవితలో అంటాడు.. కాఫిర్లు లేరు ముస్లింలు లేరు.. అన్ని మతాలు.. ప్రేమ కుదురులోనే పుష్పిస్తాయి.. హైదరాబాద్ తెహ్జీబ్ పరిమళాలను ఆస్వాదించేంతగా కాలుష్య ప్రపంచం ‘అభివృద్ధి’ చెందాలని ఆశిద్దాం! ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి -
ఒకే ముహూర్తంలో శ్రీరామ జననం కల్యాణం వనవాసం
సందర్భం - 8న శ్రీరామ నవమి ఎంతో బాగా అర్థమైనట్లు కనిపించేది, లోతుగా ఆలోచిస్తేగానీ ఓ పట్టాన అర్థం కానిదీ శ్రీమద్రామాయణం. అందుకే ఈ రామకథకు ఎందరు ఎన్ని కాలాల్లో ఎన్నెన్ని వ్యాఖ్యానాలను చేస్తున్నా, అందరికీ అన్నన్ని కొత్తకొత్త విశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లోని ఒక కొత్త విశేషం... రాముడు రావణుని వధ కోసం చక్కగా, చిక్కగా ఓ ప్రణాళికను రచించి, అందులోని ప్రతి సంఘటనకీ ఓ కాల నిర్ణయాన్ని (ముహూర్తాన్ని) చేయడం. రాముని పుట్టుక తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు॥ మహా నియమవంతుడు, శివపూజా ధురంధరుడూ అయిన రావణుణ్ణి సంహరించేందుకు శ్రీహరంతటివానికి ఓ గట్టి ముహూర్తాన్ని నిర్ణయించుకోవలసి వచ్చింది. అందరూ తపస్సు చేస్తున్న వేళ అకస్మాత్తుగా ప్రత్యక్షమై వరాలిచ్చే శ్రీహరికి ఇంతగా ముహూర్తాన్ని నిర్ణయించుకుని జన్మించవలసిన అవసరం రావడానికి కార ణం, రావణునికి ఉన్న తపోబలమే. 12వ నెలలో (మనుష్యజాతి 10 వ నెలలో కదా పుడుతుంది), చైత్రమాసంలో (చైత్రే మధుర భాషే స్యాత్- శత్రువుక్కూడా రుచించేలా మాట్లాడగల శక్తి ఈ మాసంలో పుట్టినవారికి ఉంటుంది. అందుకే అప్పటి వరకు తిట్టిన వాలి కూడా రాముడు మాట్లాడడం ప్రారంభించినంతనే మౌనంగా ఉండి విన్నాడు. తప్పయిందని వేడుకున్నాడు), నవమి తిథిలో (నిర్భయ స్సర్వ భూతేఖ్యో నవమ్యా ముపజాయతే- శత్రువుక్కూడా భయపడకుండా మాట్లాడేతనం నవమినాడు జన్మించిన వారికి ఉంటుంది), పునర్వసు నక్షత్రంలో (ఇది ధనుస్సు ఆకారంలో 5 నక్షత్రాల కూడికతో ఉంటుంది కాబట్టి తనది ధర్మమా? కాదా? అనే అంశాన్ని తనకి తాను తన బాణ ప్రయోగం ద్వారా తెలుసుకుంటాడు ఈ జాతకుడు. అందుకే రాముడు నిత్య ధనుర్ధారి. (ధనువంటే విల్లు కాదు, ధర్మం అని అర్థం). ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా తనని తాను రామునిగా పుట్టించుకోవాలనుకున్నాడు శ్రీహరి. ఆ ప్రణాళికనే అమలు చేస్తూ అలానే జన్మించాడు కూడా! కల్యాణం, పట్టాభిషేకం ఇలాంటి ముహూర్తంలో పుడితే తప్ప ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పుట్టిన సీతమ్మ తనకి భార్య కాదు. ఆమె భార్యగా కాని పక్షంలో సీతాపహరణ ఘట్టం ఉండదు. ఆ ఘట్టమే లేని సందర్భంలో శ్రీమద్రామాయణ కథే లేదు. అంతటి ప్రణాళికతో తాను పుట్టి ఉండబట్టే 12వ నెలలో పుట్టిన తనకి, సరిగ్గా 12 సంవత్సరాల వయసులో తన వద్దకు విశ్వామిత్రుడు వచ్చి 12 మాసాల పర్యంతం రాముణ్ణి తన వెంట తిప్పుకున్నాక, 12 రోజుల వ్యవధిలో శివధనుర్భంగం, వివాహానికి తరలివెళ్లడం, వివాహం ముగించుకోవడం అనే ఈ కథంతా సవ్యంగా జరిగింది. అంతేకాదు, ఈ కథని గ్రంథస్థం చేసిన వాల్మీకి మహర్షి కూడా 2 ్ఠ 12 కోట్ల మార్లు చేసిన రామనామ జపాన్ని ముగించడం కూడా సశాస్త్రీయంగా జరిగింది. అలాగే ఆ సీతారాముల జంట సరిగ్గా 12 సంవత్సరాల పాటు కాపురం చేసిందో లేదో రాజ్యపట్టాభిషేక ఘట్టం ప్రారంభమయింది. సరిగ్గా 12 గంటల వ్యవధిలో పట్టాభిషేకం భంగమై అరణ్యాలకు వెళ్లవలసి వచ్చింది. (ఉషిత్వా ద్వాదశ సమాః). సరిగ్గా 12 నెలల కాలం పాటు అరణ్యంలో సీతారామలక్ష్మణులు తిరిగారో లేదో రావణుని వధకు అవసరమైన తపోశక్తి కోసం రాముడు మహర్షుల ఆశ్రమాలకు వెళ్లి మరీ ప్రార్థించాడు. వారంతా తపోఫలాన్ని ధారపోస్తే అప్పుడు శూర్పణఖ వచ్చింది... ఆనాటి రాముని పుట్టుకకు పెట్టిన ముహూర్త బలానికి అనుగుణంగా! అంతే, 12 గడియల కాలంలో రామునితో శూర్పణఖ విరోధాన్ని ఏర్పాటు చేసుకుంది. రావణుని వద్దకు వెళ్లింది. అలా కథని నడిపింది. ఖర దూషణ త్రి శిరాది రాక్షసులతో పాటు 14 వేల మందిని వధించే ఏర్పాటు చేసింది. అదికూడా 12 గడియల కాలంలోనే. అదొక్కటే కాదు, రామ విరోధాన్ని రావణునికి కలిగించి రామునితో యుద్ధం చేయాలనే బుద్ధిని కూడా పుట్టించింది. అతడే శ్రీహరి! రాముడు మానవుడు కాదు కాబట్టే 10 వ నెలలో కాక, 12వ నెలలో జన్మించాడు. ఈ జన్మించడం అనేది ఓ సూచన అన్నమాట... ఇతడు శ్రీహరే సుమా! అని. అందుకే వివాహం కూడా ఆ పుట్టిన తిథి నాటి 12 గంటల వేళకే ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. దీన్ని గ్రహించిన మరో దైవజ్ఞుడు అహల్యాగౌతమ పుత్రుడు శతానందుడు జనకుణ్ణి దీవిస్తూ - నీ జన్మ ధన్యం అన్నాడు. లోకంలో సాధారణులమైన మనం ఎన్నో విధాల ఏర్పాట్లను చేసుకుని సక్రమంగా అమలు చేసుకోలేకపోతుంటాం. ఇన్ని సమాచార వ్యవస్థలుండీ సక్రమ కార్యాచరణని మనం చేసుకోలేకపోతూంటే, కేవలం తపశ్శక్తిని మాత్రమే సమాచార వ్యవస్థగా చేసుకుని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు అటు రావణునితో సహా అందరూ కూడా కథని నడిపించగలిగారంటే ఆ ప్రణాళికా రచనం అత్యద్భుతం కాదూ! ఈ ముహూర్తపు గొప్పతనాన్ని గ్రహించిన భరతుడు కూడా రామునితో... 14 సంవత్సరాలు ముగిసిన మర్నాడు అయోధ్య నగరానికి నువ్వు రాని పక్షంలో ఇక్కడే ప్రాతఃకాల సూర్య సమక్షంలో అగ్నికాహుతినౌతా’నన్నాడు. (యది త్వాంతు న ద్రక్ష్యామి ప్రవేక్ష్యామి హుతాశనమ్). ఇంతటి పట్టాభిషిక్తుడైన రాముడు కూడా వైకుంఠానికి వె ళ్లాల్సి ఉంది కాబట్టే 11 వేల సంవత్సరాలే పరిపాలించి 12 వేల సంవత్సరం ప్రారంభం కాకుండానే రాజ్యాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశం చేశాడు. ద్వాదశ నామాలు (హనుమానంజనా సూను... ద్వాదశైతాని నామాని) తనవైన ఆంజనేయుడు మాత్రం రామకథా వ్యాప్తికి ఇక్కడే ఉండిపోయాడు చిరంజీవిగా. ఇంత ప్రణాళికాబద్ధమైన, అంతటి ముహూర్త గొప్పదనం కల చైత్రే శుద్ధ నవమిని వివరించాలంటే కొంత జ్యోతిషబలం కూడా ఉండాలి. - డా॥మైలవరపు శ్రీనివాసరావు -
కాసుల వేట.. బదిలీల ఆట
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. స్వామికార్యం, స్వకార్యం చక్కబెట్టుకునేందుకు అధికార పార్టీ తెరతీసింది. కీలక శాఖల్లో మొదలుపెట్టిన కుర్చీలాట వివాదాస్పదంగా మారుతోంది. సొంత లాభం ఉంటే చాలు.. నిబంధనలకు పాతరేసి బదిలీల జాతరకు నాయకులు బరితెగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఐఏఎస్ అధికారులు జిల్లాను వదిలి వెళ్లడానికి ఇష్టపడడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇటీవల జరుగుతున్న బదిలీల వెనుక జిల్లాకు చెందిన కీలక రాజకీయ నాయకులతోపాటు వారిని ప్రభావితం చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డదోవలో ఉపాధ్యాయ బదిలీల్లో అందినంత మూటగట్టుకున్నారన్న అపవాదును నెత్తినేసుకున్న అధికార పార్టీ నేతలు తాజాగా ఉన్నతాధికారుల పోస్టులపై గురిపెట్టారు. రెండు జిల్లాలకు చెందిన ముఖ్య పోస్టుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు అధికార పార్టీ నేతలే ఓ ముఖ్య ప్రజాప్రతినిధిపై దుమారం రేపుతున్నారు. మొన్న జాయింట్ కలెక్టర్, తాజాగా డీటీసీ, నగరపాలక సంస్థ కమిషనర్ కుర్చీలను ఖాళీ చేయించేందుకు బేరసారాలు నడుస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టువదలని ఉషాకుమారి.. గతంలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేసిన ఉషాకుమారిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార పార్టీ నేతలే మాకొద్దు బాబోయ్ అని గగ్గోలు పెట్టారు. నాటకీయ పరిణామాల మధ్య ఆమె శ్రీకాకుళం బదిలీ అయ్యారు. పట్టుమని పది రోజులు కాకుండానే తిరిగొచ్చి ఉడా వీసీ పోస్టు దక్కించుకున్నారు. ఇందుకోసం రాజధాని స్థాయిలో భారీగా పైరవీ సాగిందనే విమర్శలున్నాయి. ముఖ్య ప్రజాప్రతినిధి ‘హస్త’ వాసితోనే తిరిగి పోస్టు దక్కించుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జేసీ పోస్టుపై రామారావు గురి.. ఉడా వైస్ చైర్మన్ పోస్టును పోగొట్టుకున్న రామారావు తనకు అన్యాయం జరిగిందంటూ రాజధానిలో నేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఉషాకుమారిని ఢీకొట్టలేక జాయింట్ కలెక్టర్ సీటుపై దృష్టిసారించారు. ఉన్నత పదవిని చేపట్టిన కొద్దికాలానికే సీటు కోల్పోవడంపై ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు. జేసీ కుర్చీ ఇచ్చేందుకు జిల్లాకు చెందిన నేతలు భారీగానే బేరం పెట్టినట్లు తెలుస్తోంది. డీటీసీ పోస్టుపై మ్యాచ్ ఫిక్సింగ్.. జిల్లాలో అతి కీలకమైన ఉప రవాణాశాఖాధికారి పోస్టుకు రాంగ్రూట్లో బేరసారాలు సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత డీటీసీపై బదిలీ వేటు వేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్లు సమాచారం. ప్రైవేటు బస్సు ఆపరేటర్ల దందాపై డీటీసీ ఉక్కుపాదం మోపారు. ఆపరేటర్ల అక్రమ వ్యాపారం దెబ్బతినడంతో విజయవాడ పార్లమెంట్ స్థాయి టీడీపీ నేత కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధితో ఆర్థిక లావాదేవీలపై మంతనాలు సాగించినట్లు తెలుస్తోంది. డీటీసీని ఇక్కడ నుంచి సాగనంపుతామని వారం రోజులుగా ప్రచారం సాగిస్తున్నారు. తమ అడుగులకు మడుగులొత్తే అధికారికి ఇక్కడ పోస్టింగ్ ఇప్పించేందుకు ‘లక్షల్లో’ బేరాలు సాగుతున్నాయి. మూడు నెలల్లోనే బదిలీ.. మూడు నెలల క్రితం వచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్‌ను ఇక్కడ నుంచి బదిలీ చేయించేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ళు, కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ నుంచి వెళ్లిపోవాలనే యోచనలో కమిషనర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అబ్దుల్ అజీం, పండాదాస్లను ఏడాదిలోపే సాగనంపారు. ముక్కుసూటిగా వ్యవహరించిన కలెక్టర్లు రిజ్వీ, బుద్ధప్రకాష్లపై బదిలీ వేటు వేసిన వారే నేడు హరికిరణ్‌ను సాగనంపేందుకు యత్నాలుసాగిస్తున్నట్లు తెలుస్తోంది. బదిలీలకు కేరాఫ్ సీఎం పేషీ .. సీఎం పేషీ బదిలీలకు కేరాఫ్‌గా మారింది. ఇటీవలే జిల్లాలో 33 మంది ఉపాధ్యాయుల బదిలీలు జరిగాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. జిల్లాలో అక్రమ ఆదాయం దండిగా వచ్చే సబ్‌రిజిస్ట్రార్ పోస్టుల్ని సీఎం పేషీ నుంచే బది‘లీలలు’ సాగిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా జిల్లానుంచి బయటకు వెళ్లే అధికారులు కూడా సమీప జిల్లాల పోస్టింగ్‌లకోసం ముఖ్య ప్రజాప్రతినిధిపై కాసుల వర్షం కురిపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధితో పాటు రాష్ట్ర ఉద్యోగ సంఘాల ముఖ్యనేత చక్రం తిప్పుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
గుంతలోకి దిగి ముగ్గురు చిన్నారుల మృత్యువాత
నాచారం, న్యూస్‌లైన్: భారీ భవన నిర్మాణం కోసం తవ్విన పెద్ద గుంత.. అందులో పిల్లర్ల కోసం మరింత లోతైన గుంతలు.. వర్షాలకు నిండుగా చేరిన నీళ్లు.. అందులో ఈత కొట్టేందుకు దిగి ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పాఠశాలకు వెళ్లిన పిల్లలు విగతజీవులుగా మారారని తెలిసితల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. శుక్రవారం నాచారంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటన వివరాలు ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. నాచారం విలేజ్‌కు చెందిన కందికంటి పాపయ్య కుమారుడు రాముడు (13) నాచారం ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. నాచారం వీఎస్టీ కాలనీకి చెందిన మచ్చ ఐలయ్య కుమారుడు శ్రావణ్ అలియాస్ బన్ని (9) తార్నాకలోని సెయింట్ డామిక్స్ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నారు. అదే కాలనీకి చెందిన మన్నె శంకర్ కుమారుడు రాజు (10) నాచారం ఇందిరా పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. సాయి (10), నాచారం ఎర్రకుంటకు చెందిన హనుమంతు కుమారుడు బాలరాజు (11) లాలాపేట ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నారు. వీరంతా స్నేహితులు. శుక్రవారం మధ్యాహ్నం తమ తమ పాఠశాలల్లో త్రైమాసిక పరీక్షలు రాసిన అనంతరం ఒకచోట కలుసుకున్నారు. నాచారం రాఘవేంద్రనగర్‌లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం కోసం తవ్వి వదిలేసిన భారీ గుంత వద్దకు ఈత కొట్టేందుకని వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీళ్లు చేరి గుంత నిండుగా ఉంది. సాయి తప్ప మి గతా వారంతా ఒక్కొక్కరుగా నీళ్లలోకి దిగారు. పోటీపడుతూ మధ్యలోకంటూ వెళ్లారు. అక్కడ పిల్లర్ల కోసం మరింత లోతుగా తవ్విన గుంత లో రాముడు, శ్రావణ్, రాజు, బాలరాజు చిక్కుకుని మునిగిపోయారు. సాయం కోసం కేకలు వేశారు. దాంతో ఒడ్డునున్న సాయి భయంతో పారిపోయాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికుడు విజయ్ పిల్లల కేకలు విని వెంటనే గుంతలోకి దిగాడు. అప్పటికే బాలరాజు నీట మునిగి మృతి చెందాడు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న ముగ్గురితో పాటు బాలరాజు మృతదేహాన్ని విజయ్ బయటకు తెచ్చాడు. పరిస్థితి విషమంగా ఉన్న శ్రావణ్, రాముడిని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. రాజు ప్రైవేటు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, మల్కాజిగిరి ఏసీపీ రాధాకిషన్‌రావు, కార్పొరేటర్ నెమలి సురేష్ సంఘటన స్థలానికి వచ్చారు. బిల్డర్ల నిర్లక్ష్యం.. కేసు నమోదు నాచారం రాఘవేంద్రానగర్లోని పరుశరాం యాదవ్‌కు చెందిన సర్వేనంబర్ 153, 154లోని ఎకరన్నరం స్థలంలో బిల్ట ర్లు అనిల్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి బహుళ అంతస్తుల కోసం పెద్ద గుంతను తీసి వదిలేశారు. దీనికి జీహెచ్ఎంసీ అనుమతుల్లేవని సమాచారం. గుంత చుట్టూ ప్రహరీ నిర్మించకపోవడమే ప్రమాదానికి కారణమైందనే కోణంలో కేసు నమోదు చేస్తున్నట్లు నాచారం సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
టమోటా పులిహోర
ఎప్పుడూ స్టార్ట్... యాక్షన్... కట్ అంటూ సినిమాయే ప్రపంచం అని బతికేస్తే ఇక మజా ఏముంటుంది? ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో గడిపితే, అది కూడా వంటింట్లో భార్యకు సహాయం చేస్తే లభించే ఆనందమే వేరు. ఇటీవల రాజమౌళి ఆ ఆనందాన్ని ఆస్వాదించారు. రాజమౌళి మంచి దర్శకుడు మాత్రమే కాదు.. మంచి కొడుకు, భర్త, తండ్రి కూడా. వీలు కుదిరినప్పుడు కాకుండా వీలు చేసుకుని మరీ కుటుంబ సభ్యులతో గడుపుతుంటారు. ఇటీవల కొంత సమయాన్ని వంట గదిలో గడిపారు. ‘టమోటా పులిహోర’ కలపడానికి ఓ చెయ్యేశారాయన. చింతపండు, దబ్బకాయ.. ఇలా రకరకాల పులిహోరలు విన్నాం కానీ, టమోటా పులిహోర అంటే అరుదనే చెప్పాలి. ఈ పులిహోర చేయడంలో నా భార్య రమ ప్రతిభే వేరంటున్నారు రాజమౌళి. ఎంచక్కా పోపు, అన్నాన్ని రమ కలిపితే, చివరగా ఈ మిక్సింగ్‌లో ఓ చెయ్యేశారు రాజమౌళి. ఈ తతంగాన్ని ఫొటో తీసి, ట్విట్టర్లో పెట్టారాయన. షూటింగ్ స్పాట్స్‌లో మెగాఫోనో, కెమెరానో పట్టుకుని కనిపించే రాజమౌళి ఇలా... కనిపించడం తమాషాగా ఉంది కదూ! -
గురువాజ్ఞ లేదట!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రామాయణ కాలంలో వానర సేనకు సుగ్రీవుడు రాజు. ఆయన మాటే వారికి వేదవాక్కు. ఆయన అనుజ్ఞ ఇస్తే చాలు దేనికైనా సిద్ధపడతారు. అనుజ్ఞ లేనిదే ఒక్క అడుగు కూడా కదపరు. అందుకే సుగ్రీవాజ్ఞ అనే నానుడి వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు మన జిల్లాలోనూ ఒక సుగ్రీవుడు ఉన్నారు. ఆయన పాలకొండ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. లక్షమందికిపైగా ఓటర్లకు ప్రతినిధి. నాడు సుగ్రీవాజ్ఞకు వానరులు బద్ధులైతే.. నేడు మన సుగ్రీవులు వేరొకరి ఆజ్ఞకు బద్ధులు కావడం విశేషం. ఆయనే కేంద్ర మంత్రి, సుగ్రీవులవారి రాజకీయ గురువు కిశోర్‌చంద్ర దేవ్. కిశోర్ ఆజ్ఞ లేనిదే సుగ్రీవులు ఏ పనీ చేయరు.. అసలేమీ మాట్లాడరు!ఏటీ.. నమ్మకం కలగడం లేదా!.. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమాన్నే చూడండి.. ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి మంత్రులు మినహా జిల్లాలోని ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసినా సుగ్రీ వులు ఆ ఊసే ఎత్తడం లేదు. ఉద్యమం వైపే కన్నెత్తి చూడటం లేదు. కారణం.. గురువాజ్ఞ లేకపోవడమే!.. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదన్నట్లు.. ఉద్యమం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే గురువుగారు ఎలా చెబితే అలా చేస్తానంటూ దాట వేస్తున్నారు. విలేకరులు అడిగే ప్రశ్నలకు ఆయన చెప్పే సమాధానం ఒక్కటే. ‘మీకు తెలుసు కదా.. మా గురువుగారు చెప్పినట్లు చేస్తున్నా.. అంతకు మించి ఏమీ చెప్పలేనంటూనే.. నా గురించి అంతకు మించి ఏమీ రాయొద్దు అని కూడా కోరుతున్నారు. సుగ్రీవులు రాజకీయాలకు కొత్త. అరకు లోక్‌సభ సభ్యుడు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఈయనకు రాజకీయ గురువు. ఆయన ప్రోత్సాహంతోనే 2009లో ఉద్యోగానికి రాజీనామా చేసి పాలకొండ ఎస్టీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గం అరకు లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది. దీంతో కిశోర్ చెప్పినట్లు చేయడం, ఏదైనా సమస్య ఉందని ప్రజలు వస్తే మంత్రి ద్వారా పనులు చేయించడమే ఆయనకు తెలుసు. రాష్ట్ర విభజన, సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కిశోర్‌చంద్రదేవ్ సుగ్రీవులుకు గురుబోధ చేసినట్లు తెలిసింది. ‘పదవికి రాజీనామా చేయొద్దు. చేస్తే.. ఇక అధికార పార్టీ నీ గురించి పట్టించుకోదు. అప్పుడు నేను కూడా ఏమీ మాట్లాడలేను’.. అన్నదే గురుబోధ సారాంశం. ఇది సుగ్రీవులు మనసులో బాగా నాటుకుపోయింది. దాంతో రాజీనామా గురించి అసలు ఆలోచించడం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసే అవకాశం వస్తుందో రాదోనన్న అనుమానం కూడా ఉంది. అందుకే ఉన్న నాలుగు రోజులు అధికారాన్ని అంటిపెట్టుకొని ఉండాలన్న ఆలోచన ఆయనది. మంత్రి చాటు బిడ్డగా ఉన్న సుగ్రీవులును జనం కూడా పట్టించుకోవడం మానేశారు. జై సమైక్యాంధ్ర అంటూ నియోజకవర్గమంతటా ఎవరికి వారు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వీరికి నాయకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. రోజురోజుకూ ఉద్యమం ఉద్ధృతమవుతున్నా ఎమ్మెల్యే సుగ్రీవులు మాత్రం నిమ్మళంగా ఉంటున్నారు.