
ఏపీలో శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ దుయ్యబట్టారు.
సాక్షి, అమరావతి: ఏపీలో శవ రాజకీయాలు చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుందరరామ శర్మ దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘శవ రాజకీయాలు చేయడమే చంద్రబాబుకి తెలుసు. చంద్రబాబు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదు. ఏ రోజైనా చంద్రబాబు బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు.
‘‘కోర్టులను కూడా మేనేజ్ చేయొచ్చంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు. న్యాయ వ్యవస్థ గురించి ఇంత చులకనగా మాట్లాడతారా?. న్యాయ వ్యవస్థకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ఎన్టీఆర్ చివరి రోజుల్లో మీ గురించి చెప్పిన మాటలకు సమాధానం చెప్పే దమ్ముందా ’’ అంటూ చంద్రబాబుపై సుందరరామ శర్మ మండిపడ్డారు. లోకేష్ చేసేది పాదయాత్ర కాదు అదొక బూతుయాత్ర. లోకేష్ బూతులు నేర్చుకున్నాడు కానీ... తెలుగు నేర్చుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు.
చదవండి: చంద్రబాబు ఓ పిరికిపంద: పేర్ని నాని