వేములవాడ (కరీంనగర్): కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామంలో కట్టా కిషన్(55), రమ(50) అనే ఇద్దరు దంపతులు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలతోనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.