
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్‌లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
SS Rajamouli Dance 👌
pic.twitter.com/hkdfxPWq1Q— Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024