reharshals
-
స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇటీవలే జపాన్‌లో సందడి చేసి తిరిగొచ్చారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ రాజమౌళి తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీస్తుంటారు. ఫ్యామిలీతో కలిసి ఎక్కడికెళ్లినా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే ఇటీవలే ఓ పెళ్లిలో సతీమణి రమతో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 'అందమైన ప్రేమరాణి చేయి తలిగితే' అనే పాటకు అంటూ స్టెప్పులు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు దర్శకధీరుడు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. SS Rajamouli Dance 👌 pic.twitter.com/hkdfxPWq1Q — Christopher Kanagaraj (@Chrissuccess) April 11, 2024 -
26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని ఉధృతం చేసే దిశగా రైతులు అడుగు ముందుకేస్తున్నారు. 26న 3,500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీ సన్నాహకాల్లో (రిహార్సల్) భాగంగా గురువారం ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ బోర్డర్లతోపాటు హరియాణాలోని రేవసాన్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన చేపట్టారు. 26వ తేదీన హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీ దాకా పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు.కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య ఎనిమిదో దఫా చర్చలు శుక్రవారం జరగనున్నాయి. మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు తప్ప రైతుల నుంచి వచ్చే ఏ ఇతర ప్రతిపాదనైనా పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ గురువారం పునరుద్ఘాటించారు. రైతులు, ప్రభుత్వం మధ్య శుక్రవారం చర్చల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సన్నాహక సంరంభం
అనంతపురం సెంట్రల్ : అనంతపురంలోని పీటీసీలో జరిగే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే బృందాలు చేస్తున్న సన్నాహక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి టి.అంజయ్య సమక్షంలో నగరంలోని జీసస్‌నగర్‌లోని పేస్ స్కూల్ విద్యార్థుల జెండా పాట, కేజీబీవీ పెద్దవడుగూరు విద్యార్థులు ‘ఎగరాలోయి ఎగరాలోయి’ పాట, ఎల్‌ఆర్‌జీ స్కూల్ విద్యార్థులు, కేఎస్ఆర్ గర్‌్ల్స హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి. ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ, ఎస్పీ పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర్‌బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12లోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. నిఘా పటిష్టం జిల్లాలో రాష్ట్రస్థాయి స్వాంతంత్య్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా శాంతిభద్రతలపై పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్ఐలు విశ్వనాథ్‌చౌదరి, రంగడు, కాంత్రికుమార్లు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటికీ నోటీసులు అందజేశారు. వారం రోజుల పాటు సున్నిత ప్రాంతాలలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఈ వారం రోజుల వ్యవధిలో కొత్తగా ఎవరైనా వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆదేశిస్తున్నారు. నగరంలోకి ప్రవేశించిన వారు ఎక్కడో చోట సీసీ కెమెరాల్లో బందీ అయ్యేలా దాదాపు 150 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.