రిహార్సల్ లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులు
సన్నాహక సంరంభం
Published Wed, Aug 10 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
అనంతపురం సెంట్రల్ :
అనంతపురంలోని పీటీసీలో జరిగే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే బృందాలు చేస్తున్న సన్నాహక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారి టి.అంజయ్య సమక్షంలో నగరంలోని జీసస్‌నగర్‌లోని పేస్ స్కూల్ విద్యార్థుల జెండా పాట, కేజీబీవీ పెద్దవడుగూరు విద్యార్థులు ‘ఎగరాలోయి ఎగరాలోయి’ పాట, ఎల్‌ఆర్‌జీ స్కూల్ విద్యార్థులు, కేఎస్‌ఆర్ గర్‌్ల్స హైస్కూల్ విద్యార్థుల ప్రదర్శనలు అలరించాయి.
ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ, ఎస్పీ
పీటీసీలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ ప్రభాకర్‌రావు, ఎస్పీ రాజశేఖర్‌బాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12లోగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసేలా నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు.
నిఘా పటిష్టం
జిల్లాలో రాష్ట్రస్థాయి స్వాంతంత్య్ర వేడుకలు జరుగుతున్న దృష్ట్యా శాంతిభద్రతలపై పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పీటీసీలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం చుట్టూ పరిసర ప్రాంతాల్లోని ప్రతి ఇంటినీ క్షుణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ మల్లికార్జునవర్మ, ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎస్‌ఐలు విశ్వనాథ్‌చౌదరి, రంగడు, కాంత్రికుమార్‌లు మూడు బృందాలుగా విడిపోయి ఇంటింటికీ నోటీసులు అందజేశారు.
వారం రోజుల పాటు సున్నిత ప్రాంతాలలో తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ఈ వారం రోజుల వ్యవధిలో కొత్తగా ఎవరైనా వచ్చినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆదేశిస్తున్నారు. నగరంలోకి ప్రవేశించిన వారు ఎక్కడో చోట సీసీ కెమెరాల్లో బందీ అయ్యేలా దాదాపు 150 కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
Advertisement
Advertisement