పెళ్లి..‘పరీక్ష’! | Bride appears in exam on marriage day | Sakshi
Sakshi News home page

పెళ్లి..‘పరీక్ష’!

Published Fri, Mar 17 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

పెళ్లి..‘పరీక్ష’!

పెళ్లి..‘పరీక్ష’!

సరిగ్గా పెళ్లి ముహూ ర్తానికే పరీక్ష ఉండడం.. వరుడి సహా యంతో వధువు పరీక్షకు హాజరై వచ్చాకే పెళ్లి చేసుకున్న ఘటన చొప్ప దండి మండలం ఆర్నకొండలో గురు వారం జరిగింది.

కరీంనగర్ జిల్లా : సరిగ్గా పెళ్లి ముహూ ర్తానికే పరీక్ష ఉండడం.. వరుడి సహా యంతో వధువు పరీక్షకు హాజరై వచ్చాకే పెళ్లి చేసుకున్న ఘటన చొప్ప దండి మండలం ఆర్నకొండలో గురు వారం జరిగింది. గ్రామానికి చెందిన తమ్మడి లింగయ్య, రాజవ్వ దంప తుల కుమార్తె రమ(21)కు, గొల్లప ల్లి మండలం లింగాపూర్‌కు చెందిన చెన్నాల్ల గణేశ్‌(25)తో గురువారం వివాహం జరిపేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు.

 కాగా రమ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ ఫైనలియర్‌ చదువుతోంది. సరిగ్గా పెళ్లి సమయానికే గణితం పరీక్ష రాయాల్సి వచ్చింది. పరీక్ష ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఉండగా.. వివాహ సమయం ఉదయం పదిన్నరకు ఉంది. కాబోయే భర్త గణేశ్‌ సలహాతో ముందుగా పరీక్షకు హాజరైంది. కరీంనగర్‌లో పరీక్ష రాసి వచ్చి మధ్యాహ్నం పెళ్లి కూతురుగా ముస్తాబైంది. బంధువులు, కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement