లక్నో: అయోధ్య రామునిపై కాంగ్రెస్ నేత, కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్య గురించి మాట్లాడే క్రమంలో ' ఒక డేరాలో ఉంచిన రెండు బొమ్మలు' అని వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణంతో బీజేపీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. కేఎన్ రాజన్న వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం రేగుతోంది.
" బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో నేను అక్కడికి వెళ్లాను. అక్కడ రెండు బొమ్మలు ఉంచారు. డేరా వేసి దానిని రాముడు అని పిలిచారు. దేశంలో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రామ మందిరాలు ఉన్నాయి." అని ఆయన అన్నారు.
"రామమందిరానికి వెళ్ళినప్పుడు ఒక అనుభూతి ఉంటుంది. అయోధ్యలో నాకు ఏమీ అనిపించలేదు. అది టూరింగ్ టాకీస్‌లో బొమ్మల వలె ఉంది." అని మంత్రి వివాదాస్పదంగా మాట్లాడారు.
వివాదాస్పద వ్యాఖ్యలపై దుమారం రేగిన అనంతరం కేఎన్ రాజన్న స్పందించారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. 'డేరాలో బొమ్మలు ఉంచారు కాబట్టి మీ అందరితో అలా చెప్పాను. ఇప్పుడు అక్కడ ఏముందో చూడలేదు. ఒకసారి వెళ్లి చూసి అక్కడ ఏముందో చెబుతాను' అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశారు.
కేఎన్ రాజన్న వ్యాఖ్యలపై విశ్వహిందూ పరిషత్ (VHP) అధ్యక్షుడు అలోక్ కుమార్ మండిపడ్డారు. అయోధ్య రామమందిరంలో రాముని ప్రాణప్రతిష్ట.. కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు నిరాశా, నిస్పృహల కారణంగానే వస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు తమ అహంకారం కారణంగానే రామమందిరాన్ని సందర్శించేందుకు నిరాకరించారని దుయ్యబట్టారు. "రాముని కార్యక్రమానికి ప్రధానిని ఆహ్వానించారు. ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తరలివస్తే ఇది అందరి కార్యక్రమం అవుతుంది." అని అలోక్ కుమార్ అన్నారు.
ఇదీ చదవండి: Ayodhya: నాలుగేళ్లలో పదింతల అభివృద్ధి!
Comments
Please login to add a commentAdd a comment