శాస్త్రీయ నృత్యానికి అమితమైన ఆరాధకురాలు రామా వైద్యనాథన్. ఢిల్లీ వాసి అయిన ఈ నృత్యకారిణి భారతీయ శాస్త్రీయ కళా ప్రపంచంలో ట్రెండ్‌సెటర్‌గా నిలిచిన కళాకారులలో ఒకరు. రామా వైద్యనాథన్ గురువు సరోజ్ వైద్యనాథన్. ‘నా నుదుటిరాతలోనే నాట్యం రాసి ఉంది..’ అంటారు ఈ నృత్యకారిణి. యామినీ కృష్ణమూర్తి వేదికపైన నృత్యాన్ని ప్రదర్శిస్తుంటే తల్లి పొట్టలో ఉన్నప్పుడే అమితంగా స్పందించేదానినట అని గర్వంగా చెబుతారు ఈ నృత్యకారిణి. ఈ మాటలతో నాట్యంపై ఉండే మక్కువను మన కళ్లకు కడతారు.
రామా వైద్యనాథన్ తల్లికి నృత్యం అంటే ఎంతో మక్కువగా ఉండేది. బాల్యంలో వేసే రామా తొలి అడుగులే నృత్యపు అడుగులుగా మారాయి. తల్లే తన తొలి గురువుగా నృత్య అడుగులను ప్రారంభించింది. అలా ఆమె తన మొదటి మాటలను ఉచ్చరించకముందే గురువు ఎంపిక జరిగింది. తల్లి మార్గదర్శకత్వంలో రామా భరత నాట్య ప్రయాణాన్ని ్ర΄ారంభించింది. అలా డ్యాన్స్ స్టూడియో ఆమెకు రెండవ ఇల్లుగా మారింది. తన నైపుణ్యంతో తల్లి రామాను అద్భుతమైన నర్తకిగా తీర్చిదిద్దింది.
ఎదిరిస్తూ నిలుస్తూ..
పశ్చిమ ఢిల్లీలో నివసిస్తూ, డ్యాన్స్ క్లాసుల కోసం సెంట్రల్ ఢిల్లీలోని చాణక్యపురికి చేరుకోవడం అంటే సంక్లిష్టమైన ప్రయాణాన్ని కొనసాగించడమే. ఆ రోజుల్లో వాహన సదుపియం లేకపోవడంతో రామ, ఆమె తల్లి ప్రతి రోజూ సవాల్‌ను ఎదుర్కొనేవారు. ఇంటి నుంచి నృత్య అకాడమీకి చేరుకోవడానికి రోజూ రెండు మూడు బస్సులు, రిక్షాలు మారుతూ ప్రయాణించేవారు.
యువ నర్తకిగా రామా ప్రదర్శనలు సంప్రదాయం, ఆవిష్కరణల సామరస్య సమ్మేళనానికి నిదర్శనగా మారాయి. సామాజిక కుల అడ్డంకులను తొలగించిన నృత్యకారిణిగా కూడా రామా తన విశిష్టతను ప్రదర్శించింది. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నృత్యం, కులం అడ్డంకులుగా నిలిచాయి.
నర్తకితో తన కుమారుడి వివాహం కుల హద్దులు దాటిందని అత్తగారు, ఆమె బంధుగణం అడ్డంకిగా నిలిచింది. ఆమె దృష్టిలో నృత్యం దైవిక భాష. కళాకారులందరిదీ ఒకే ’కులం’గా ఐక్యపరిచింది. సామాజిక అడ్డంకులను ఎదిరించడంలోనే కాదు, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు ఇస్తూ భారతీయ ప్రముఖ నృత్యకారిణిగా నిలిచింది.
--రామా వైద్యనాథన్
Comments
Please login to add a commentAdd a comment