
మగవాళ్లకు కుదిరినట్లుగా మహిళలకు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడం సాధ్యం కాదనేది చాలామంది వర్కింగ్ మహిళల వాదన. ఎందుకంటే, పొద్దున లేచినప్పటి నుంచి పిల్లలు, కుటుంబ బాధ్యతలే సరిపోతాయి. ఇంకెక్కడ టైం ఉంటుంది తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి..?. అలాంటి బిజీ వర్కింగ్ విమెన్స్ ఫిట్‌నెస్ కోచ్ అకన్నీ సలాకో సింపుల్ టిప్స్ ఫాలోఅయ్యి, ఈజీగా బరువు తగ్గండి. మరి ఇంకెందుకు ఆలస్యం హెల్ప్ అయ్యే ఆ చిట్కాలేంటో చూసేద్దామా..!.
అత్యంత బిజీగా ఉండే మహిళలు తమ ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేలా ప్లాన్ చేసుకోవాలో వెయిట్ లాస్ కోచ్ డాక్టర్ అకన్నీ సలాకో ఇన్‌స్టా వేదికగా వీడియోలో వెల్లడించారు. పనులు వేగవంతంగా చేయాలన్న ధ్యాసలో ఆకలి ఆటోమేటిగ్గా ఎక్కువ అవుతుంది. దాంతో తెలియకుండానే స్వీట్స్, జంక్‌ఫుడ్స్ స్పీడ్‌గా లాగించేస్తుంటారని చెబుతున్నాడు అకన్నీ.
అందుకే వ్యాయమాలు చేయడం కష్టం అనుకున్న మహిళలు వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ దరిచేరనీయకూడదు. సౌకర్యమంతమైన ఆరోగ్యదాయకమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వమని సూచించారు. పోనీ ఇది కష్టం అనుకుంటే ఓ రెండు రోజులు స్వీట్లు ముట్టనని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అవ్వండిచాలు అంటున్నారు అకన్నీ.
దీంతోపాటు ఏదోలా చిన్నపాటి వ్యాయామాలు చేసుకునేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ ఉద్యోగం, పిల్లలు కుటుంబం తోపాటు ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయం గుర్తించండి. ముందు మీరు బాగుంటేనే కదా ఈ పనులన్నీ సవ్యంగా పూర్తి చేయగలరు. కాబట్టి ఎలాగైన చిన్న చిన్న వ్యాయామాలు చేద్దాం. పోనీ అలా కాదు నో ఛాన్స్ అంటే.. వారంలో రెండు లేదా మూడు రోజులు కనీసం 30 నిమిషాలు వ్యాయామాలకి కేటాయించండి చాలు. అప్పుడు ఆటోమేటిగ్గా నెమ్మదిగా మనంతట మనమే రోజులు పెంచుకునే ఛాన్స్ ఉంటుందని అన్నారు.
భోజనం విషయంలో సమయాపాలన పాటించండి. పోషకాలతో కూడిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండని చెబుతున్నారు. మధ్యాహ్నం 1 గంటకి మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్. అలాగే సాయంత్రం 6 గంటకి, మంచి ప్రోటీన్, రెండు నుంచి మూడు కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్‌లతో పూర్తి చేయండి. స్నాక్స్ జోలికిపోవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇలా ప్రోటీన్, కూరగాయలు, తక్కువ గ్లైసెమిక్ కార్బ్ వంటి సమతుల్య భోజనానికి ప్రాధాన్యత ఇస్తే ఆకలి నియంత్రణలో ఉంటుంది, అలాగే బరువు పెరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు ఫిట్‌నెస్ కోచ్ అకన్నీ.
అలాగే ఇది పోషకాహారం, ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యత ఇచ్చే సమసర్థవంతమైన డైట్‌ప్లాన్ అని అన్నారు ఫిట్‌నెస్ నిపుడు అకన్నీ.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: పిల్లలుంటే బ్రెయిన్ ఆరోగ్యంగా ఉంటుందా..? అధ్యయనంలో అవాక్కయ్యే విషయాలు..)
Comments
Please login to add a commentAdd a comment