![Shobana Chadrakumar Pillai is an Indian film actress and Bharatnatyam dancer](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/F9-2nd-shobhana-pg.jpg.webp?itok=_5w_y4RY)
మూడేళ్ల వయసులోనే నర్తకిగా మారి, నాట్యమయూరిగా ఎదిగింది. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం, వన్నె తగ్గని అందం, చిన్న పిల్లలాంటి చలాకితనం ఇవన్నీ ఒక్కచోటే ఉంటే, కనిపించే రూపమే నటి, ప్రముఖ నర్తకి శోభన . ఇటీవల ప్రభుత్వం ఆమెకు ‘పద్మభూషణ్’ ప్రకటించింది.
ఆమె విశేషాలు మీ కోసం..
⇒ శోభన సొంత ఊరు తిరువనంతపురం. ‘ట్రావెన్‌కోర్ సిస్టర్స్’గా నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి గాంచిన లలిత, పద్మిని, రాగిణిలకు
మేనకోడలు.
⇒ ‘మంగళ నాయగి’ సినిమాతో ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న నాలుగేళ్లకే, ‘ఏప్రిల్ 18’ అనే మలయాళ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించింది.
⇒ ‘మణిచిత్రతారు’ అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించి, ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ‘మిత్ర్, మై ఫ్రెండ్’ అనే ఇంగ్లిష్ చిత్రంలో నటనకు మరోసారి జాతీయ పురస్కారాన్ని సాధించింది.
⇒ చిన్నప్పటి నుంచి నాట్యమంటే ఎంతో ఇష్టం. 1994లో ‘కళార్పణ’ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను ఏర్పాటు చేసి, భరత నాట్యంలో శిక్షణ ఇస్తోంది. కళారంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా 2006లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని ప్రకటించింది.
⇒ శోభనకు నాట్యం చేసేటప్పుడు ఎవరైనా ఫోన్‌లో రికార్డ్ చేస్తే చాలా కోపం. ఒకసారి ప్రదర్శన మధ్యలో ఫోన్‌లో రికార్డు చేస్తున్న ఒక ప్రేక్షకుడిని వారించింది.
⇒ శోభనకు థాయ్, చైనీస్ వంటకాలు బాగా ఇష్టం. మలేసియాకు వెళితే, అక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఆస్వాదిస్తుంది. చీజ్ ఆమ్లెట్ అంటే ఆమెకు చెప్పలేనంత ఇష్టం.
పెళ్లి మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు, జీవితంలో చాలా విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. నేను ఒంటరిగా చాలా సంతోషంగా ఉన్నా. ఎప్పటికైనా ఒక సినిమా డైరెక్ట్ చేయాలని ఉంది. నా దుస్తులను నేనే డిజైన్ చేసుకుంటాను. ఒంటికి నప్పని దుస్తులను నేనెప్పుడూ ధరించను. బహుశా, నా దుస్తులే నా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయనుకుంటా. – శోభన
Comments
Please login to add a commentAdd a comment