Bharatnatyam
-
ఆకట్టుకున్న వల్లభనేని వంశీ కుమార్తె భరతనాట్య ప్రదర్శన
-
వారెవ్వా! ఏం హైబ్రిడ్ భరతనాట్యం.. ఏం స్టెప్పులు.. నెట్టింట్లో హల్చల్
కళలకు పుట్టినిల్లుగా భావించే భారతదేశంలో ఎన్నో విభిన్న నృత్యాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై లక్షలాది కళాకారులు నృత్య ప్రదర్శనలిస్తూ భారత్ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా పాటకు తగ్గట్లు స్టెప్పులేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక కొత్తరకమైన డ్యాన్స్‌లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా భరత నాట్యం, హిప్ హాప్ రెండు కలిపి రూపొందించిన ఓ కొత్త రకం డ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఓ అంగ్లో ఇండియన్ సరికొత్తగా ఆలోచించి భరత నాట్యం, హిప్ హాప్కు కొత్తదనాన్ని జోడించి వినూత్న డ్యాన్స్‌ను ప్రాణం పోశారు. ఇందులో ముగ్గురు మహిళలు సంప్రదాయ చీరకట్టులో, మల్లెపూలు పెట్టుకొని అమెరికన్ రాపర్ లిల్ వేన్ ఉప్రోయర్ పాటకు ఇండో- వెస్ట్రన్ స్టెప్పులు వేస్తూ అలరించారు. హైబ్రిడ్ భారతనాట్యం అని పేరు పెట్టిన ఈ డ్యాన్స్ వీడియోలు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటున్నాయి. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 పారిస్‌లో నివసిస్తున్న శ్రీలంకన్ ఉష జై అనే మహిళ కొరియోగ్రాఫర్ తన స్నేహితురాళ్లతో కలిసి ఈ రకమైన డ్యాన్స్ క్రియేట్ చేశారు. దీనికి హైబ్రిడ్ భరత నాట్యం పేరు పెట్టారు. ఆ వీడియోలను ఎపిసోడ్‌లా వారీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా 20 సెకన్ల ఈ వీడియో షేర్ చేశారు. నిజానికి హిప్ హాప్, భరతనాట్యం రెండు భిన్నమైన నృత్యాలు వీటిని మేళవించి రూపొందించిన ఈ సృజనాత్మక డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో సాంస్కృతిక సరిహద్దులు దాటి పయనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే 7 లక్షలమంది వీక్షించారు. ఈ అందమైన వీడియోను మీరూచూడండి Welcome to paradise 🌴 pic.twitter.com/5aKpcTN9nz — Usha Jey (@Usha_Jey) December 12, 2020 -
హాలీవుడ్ సాంగ్‌కు భరతనాట్యం జోడిస్తే..
బెంగళూరు: ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ గా మారింది. అనూహ్యంగా ఆ వీడియోను చూసిన వారి సంఖ్య పెరగడంతో దానిని రూపొందించిన వారు పట్టరాని ఆనందం వ్యక్తం చేస్తుండగా ఇంకొందరు మాత్రం వారిని తప్పుబడుతున్నారు. ఇంతకీ ఏమిటా వీడియో అంటే.. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే హాలీవుడ్ చిత్రం లో ప్రముఖ సింగర్ ఎలీ గౌల్డింగ్ పాడిన 'లవ్ మి లైక్ యూ డూ' అనే సూపర్ హిట్ సాంగ్ ఉంది. ఈ పాటను తమ భరతనాట్యంతో మిక్స్ చేస్తూ అబ్బురపరిచేలా బెంగళూరుకు చెందిన ప్రియా వరుణేశ్ కుమార్, ప్రమితా ముఖర్జీ, సంధ్యా మురళీ ధరన్ అనే యువతులు డ్యాన్స్ చేశారు. వీరికి పియా డ్యాన్స్ కంపెనీ ఉంది. వీరు అలా డ్యాన్స్ చేస్తుండగా అక్కడి గేటెడ్ కమ్యూనిటీ వీడియో తీసి ఆన్ లైన్లో నవంబర్ 2015లో పోస్ట్ చేశారు. అయితే, రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో ఇటీవలె రెండులక్షలమంది వీక్షకులను సంపాదించుకుంది. దీనిని చూసిన చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా భరత నాట్య ప్రియులు మాత్రం ఒక సంప్రదాయబద్ధమైన నాట్య కళను ఇలా ఇష్టమొచ్చినట్లు ఏవేవో పాటలకు మిక్స్ చేసి ప్రదర్శించడం మంచిపద్ధతి కాదంటూ పెదవి విరుస్తున్నారు. కాగా, ఈ డ్యాన్స్ చేసిన వాళ్లలో ప్రియా స్పందిస్తూ తమ వీడియోకు ఇంతమొత్తంలో స్పందన వచ్చినందుకు పట్టరాని ఆనందంగా ఉందని చెప్పింది. త్వరలో మరో ఇంగ్లిష్ సాంగ్ కు కూడా ఇలాగే డ్యాన్స్ మిక్స్ చేసి మరో వీడియో అప్ లోడ్ చేయనున్నారట. -
ఫేస్బుక్లో కవలల డ్యాన్స్ సంచలనం..!
ఇద్దరు కవలపిల్లల వీడియో ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది. భారత్ కు చెందిన ఆ ట్విన్స్.. చికాగోలోని ఇలినాయిస్ లో ఉంటున్నా సంప్రదాయ భరతనాట్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు గానూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొరియోగ్రాఫర్లు పూనమ్, ప్రియాంకా సహజంగా భరతనాట్య కళాకారిణులు. ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా సంప్రదాయ భరతనాట్యాన్ని రోజువారీ వ్యాయామాలతో మేళవించి స్వయంగా ప్రదర్శించారు. అదే వీడియోను సరదాగా ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. వాళ్ల ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. అందుకే వారు పోస్ట్ చేసిన వీడియో రెండు మూడు రోజుల్లోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది. వేలకొద్దీ షేర్లు, కామెంట్లతో ఫేస్బుక్లో హల్ చల్ చేస్తోంది. తమ ప్రయోగానికి ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదని ఆ అక్కాచెల్లెళ్లు ఆశ్చర్యపోతున్నారు. తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.