ఫేస్‌బుక్‌లో కవలల డ్యాన్స్ సంచలనం..! | Indian-origin twins combine Bharatnatyam and Popping in new dance fusion | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో కవలల డ్యాన్స్ సంచలనం..!

Published Thu, Feb 4 2016 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

ఫేస్‌బుక్‌లో కవలల డ్యాన్స్ సంచలనం..!

ఫేస్‌బుక్‌లో కవలల డ్యాన్స్ సంచలనం..!

ఇద్దరు కవలపిల్లల వీడియో  ఇంటర్నెట్ లో సంచలనం రేపుతోంది.  భారత్ కు చెందిన ఆ ట్విన్స్.. చికాగోలోని ఇలినాయిస్ లో ఉంటున్నా  సంప్రదాయ భరతనాట్యంలో తమ ప్రతిభను చాటుతున్నారు.  డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు గానూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 

కొరియోగ్రాఫర్లు పూనమ్, ప్రియాంకా సహజంగా భరతనాట్య కళాకారిణులు. ఏదైనా కొత్త ప్రయోగం చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా సంప్రదాయ భరతనాట్యాన్ని రోజువారీ వ్యాయామాలతో మేళవించి స్వయంగా ప్రదర్శించారు. అదే వీడియోను సరదాగా ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు.

వాళ్ల ప్రదర్శన అందర్నీ కట్టిపడేసింది. అందుకే వారు పోస్ట్ చేసిన వీడియో రెండు మూడు రోజుల్లోనే ఎంతో పాపులారిటీ సంపాదించింది. వేలకొద్దీ షేర్లు, కామెంట్లతో ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తోంది.  తమ ప్రయోగానికి ఇంతటి గుర్తింపు వస్తుందని ఊహించలేదని ఆ అక్కాచెల్లెళ్లు ఆశ్చర్యపోతున్నారు. తమను ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement