కళలకు పుట్టినిల్లుగా భావించే భారతదేశంలో ఎన్నో విభిన్న నృత్యాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై లక్షలాది కళాకారులు నృత్య ప్రదర్శనలిస్తూ భారత్ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా పాటకు తగ్గట్లు స్టెప్పులేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక కొత్తరకమైన డ్యాన్స్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
తాజాగా భరత నాట్యం, హిప్ హాప్ రెండు కలిపి రూపొందించిన ఓ కొత్త రకం డ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ అంగ్లో ఇండియన్ సరికొత్తగా ఆలోచించి భరత నాట్యం, హిప్ హాప్‌కు కొత్తదనాన్ని జోడించి వినూత్న డ్యాన్స్‌ను ప్రాణం పోశారు. ఇందులో ముగ్గురు మహిళలు సంప్రదాయ చీరకట్టులో, మల్లెపూలు పెట్టుకొని అమెరికన్ రాపర్ లిల్ వేన్ ఉప్రోయర్ పాటకు ఇండో- వెస్ట్రన్ స్టెప్పులు వేస్తూ అలరించారు. హైబ్రిడ్ భారతనాట్యం అని పేరు పెట్టిన ఈ డ్యాన్స్ వీడియోలు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటున్నాయి.
What the f- though ?
— Usha Jey (@Usha_Jey) May 22, 2022
Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4
పారిస్‌లో నివసిస్తున్న శ్రీలంకన్ ఉష జై అనే మహిళ కొరియోగ్రాఫర్ తన స్నేహితురాళ్లతో కలిసి ఈ రకమైన డ్యాన్స్ క్రియేట్ చేశారు. దీనికి హైబ్రిడ్ భరత నాట్యం పేరు పెట్టారు. ఆ వీడియోలను ఎపిసోడ్‌లా వారీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా 20 సెకన్ల ఈ వీడియో షేర్ చేశారు. నిజానికి హిప్ హాప్, భరతనాట్యం రెండు భిన్నమైన నృత్యాలు వీటిని మేళవించి రూపొందించిన ఈ సృజనాత్మక డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో సాంస్కృతిక సరిహద్దులు దాటి పయనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే 7 లక్షలమంది వీక్షించారు. ఈ అందమైన వీడియోను మీరూచూడండి
Welcome to paradise 🌴 pic.twitter.com/5aKpcTN9nz
— Usha Jey (@Usha_Jey) December 12, 2020
Comments
Please login to add a commentAdd a comment