Indo Western
-
నవరాత్రుల్లో ఇండో వెస్ట్రన్ మెరుపుల్లో మగువలు కళ (ఫోటోలు)
-
ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో సందడి చేసిన మోడల్స్! (ఫొటోలు)
-
బ్లాక్ ఎంబ్రాయిడరీ వెస్ట్రన్ లుక్‌లో మృణాల్..ధర తెలిస్తే షాకవ్వుతారు!
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో మంచి మార్కులు కొట్టేసి అభిమానుల మనుసు దోచుకుంది. సీతగా నటించి మృణాల్ తెలుగు ప్రేక్షకులు మన అమ్మాయే అని ఫీలయ్యేలా చేసింది. చక్కటి అభినయం, నటనతో ఇట్టే అలరించింది. అంత చక్కటి మృణాల్ తన గ్లామర్‌ని ఇనుమడింప చేసే కొన్ని ఫ్యాషన్ బ్రాండ్లు ఉన్నాయి. ఎప్పటి కప్పుడూ మంచి స్ట్రైయిలిష్ లుక్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిపోగొట్టే మృణాల్ ఈసారి ఇండో-వెస్ట్రన్ లుక్‌లో మిస్మరైజ్ చేసింది. వావ్! వాటే ఏ స్టన్నింగ్ లుక్ అనేలా కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది మృణాల్ అందం. ఎప్పుడూ సంప్రదాయ చీర లేదా ప్యాంట్ సూట్ వంటి దుస్తులతో సందడి చేసే మృణాల్ ఈసారి బ్యాక్ ఎంబ్రాయిడర్ త్రీ పీసెస్ డ్రస్ ధరించింది. ఆ డ్రస్‌పై సీక్విన్స్ ఎంబ్రాయిడరీ మృణాల్‌కి మంచి లుక్ ఇచ్చింది. దానికి తగ్గట్లు తనిష్క్ మల్హోత్రా బ్రాండ్ గోల్డెన్ చెవిపోగులను, బ్రాస్లెట్ని ధరించింది. ఇక కాళ్లకు బెల్లీషూస్ ధరించడంతో మరింత స్టయిలిష్‌గా కనిపించింది. ఇక ఆమె ధరించిన బ్లాక్ వెస్టర్న్ డ్రస్ ప్రఖ్యాత బ్రాండ్ మిశ్రుకు చెందింది దీని ధర ఏకంగా రూ. 88,000/-. ఇందులో ఏముంది అంత ధర అని ఆశ్చర్యపోతున్నారా?. ఈ బ్రాండ్ ప్రముఖ సెలబ్రెటీల ఫ్యాషన్‌కి పెట్టింది పేరు. అందువల్లే దీని ధరలు అంత లగ్జరీగా ఉంటాయి. అలాగే మృణాల్ ఎక్కువగా ఫాన్సీ షరారా సెట్లు, అనార్కలీ వంటి డ్రస్‌లను ఇష్టపడతాని చెబుతోంది. ఇక మృణాల్ విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలి స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) (చదవండి: వర్కౌట్లతో సమంత..ఉదయానికి మించిన బెస్ట్ టైమ్ లేదు!) -
నిన్న.. నేడు.. రేపటి స్టైల్
ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్‌తో సినీ స్టార్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్‌ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్‌ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైన్స్ తెలుసుకుంటూ.. కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్‌ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్‌తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ. సెల్ఫ్ డిజైనర్‌ని.. వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్‌తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్‌ని టైలర్‌కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని వివరిస్తారు శివాని. -
హ్యండ్ల్యూమ్స్తో.. ఆకట్టుకునేలా ఇండోవెస్ట్రన్ స్టైల్స్!
యువ ఆలోచనల్లో పర్యావరణం కళగా రూపుదిద్దుకుంటోంది. ఫ్యాషన్ వేర్లో ప్రత్యేకతతో పాటు నేచర్ పట్ల బాధ్యతనూ తెలుసుకుంటుంది. మనవైన చేనేతలు పెద్దవాళ్లకే సూట్ అవుతాయన్న ఆలోచన నుంచి మోడర్న్ టర్న్ తీసుకుంటోంది. హ్యాండ్లూమ్స్‌తో ఇండోవెస్ట్రన్ స్టైల్స్ ఆకట్టుకునేలా డిజైన్ చేయిస్తోంది హైదరాబాద్ వాసి, నటి, మోడల్ నిత్యాశెట్టి. హ్యాండ్లూమ్స్‌తో తన జర్నీఎప్పుడూ ప్రత్యేకమే అని చెబుతోంది నిత్య. ప్రొఫెషనల్స్ కాదు...ఈ డ్రెస్సులు ధరించడానికి మోడల్స్ ఎవరూ ప్రొఫెషనల్స్ కాదు. సాఫ్ట్వేర్, వెయిట్రెస్, ఇంటీరియర్ డిజైనర్, డెంటిస్ట్.. ఇలా ఇతర రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నవారు నేను చేసే డ్రెస్సులకు మోడల్స్‌గా చేస్తున్నారు. ఏ రంగంలో ఉన్నవారైనా వీటి ద్వారా దుస్తులు మన క్యారెక్టర్ని చూపాలన్నదే మెయిన్. మేకప్ వంటి హంగులేవీ లేకుండా నేచరల్‌గా మా డిజైన్స్‌ని ప్రెజెంట్ చేయాలయనుకున్నాను. దీనివల్ల అందరికీ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇటీవల నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజున నిర్వహించిన ఫ్యాషన్ షోలో మా డిజైన్స్‌ని కూడా ప్రదర్శించి, మాదైన ప్రత్యేకతను చూపాం. హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్స్‌లో స్టాల్స్ పెట్టి, మా వర్క్‌ని మరింత మందికి చేరువయ్యేలా చూస్తున్నాను. బ్రెజిల్లో జరగబోయే కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి పది యూనిట్స్ వెళుతున్నాయి. అందులో మా ఇతిహాస కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్నిస్తుంది’’ అని వివరిస్తున్నారు నిత్య. ‘‘హ్యాండ్లూమ్స్ అంటే నేటితరం చీరలు, కుర్తా పైజామా వరకే అనుకుంటారు. కానీ, యువత ధరించేందుకు వీలుగా రెగ్యులర్ వేర్‌గా, ఫ్యాషన్ వేర్‌గా హ్యాండ్లూమ్స్ను తీసుకు రావాలనుకున్నాను. ఇందుకు.. పోచంపల్లి, పుట్టపాక, పెడన, ఒరిస్సా, భువనేశ్వర్ హ్యాండ్లూమ్స్ వారిని కలిశాను. వీటిలో నుంచి చందేరీ, ఇక్కత్, చికంకారి, శిబోరి, బాందినీ, టై అండ్ డై .. వంటివి డ్రెస్ డిజైన్స్‌లో ప్రధానంగా తీసుకున్నాను. హ్యాండ్లూమ్స్‌తో బ్లేజర్లు, ఖఫ్తాన్స్, ప్లాజో, లాంగ్ అండ్ షార్ట్ ఫ్రాక్స్, షర్ట్స్.. నేటి యువతకు మెచ్చేలా మెన్ అండ్ ఉమెన్‌కి క్యాజువల్ అండ్ ఆఫీస్వేర్ ‘ఇతిహాస’ పేరుతో రూపొందిస్తున్నాం. ఈ ఇండో–వెస్ట్రన్ స్టైల్స్‌తో నేటితరానికి మన హ్యాండ్లూమ్స్ని దగ్గర చేయాలని, చేనేతకారులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలన్నదే నా ఆలోచన. (చదవండి: విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!) -
వారెవ్వా! ఏం హైబ్రిడ్ భరతనాట్యం.. ఏం స్టెప్పులు.. నెట్టింట్లో హల్చల్
కళలకు పుట్టినిల్లుగా భావించే భారతదేశంలో ఎన్నో విభిన్న నృత్యాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై లక్షలాది కళాకారులు నృత్య ప్రదర్శనలిస్తూ భారత్ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది డ్యాన్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. క్లాసికల్, వెస్ట్రన్ అనే తేడా లేకుండా పాటకు తగ్గట్లు స్టెప్పులేసేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనేక కొత్తరకమైన డ్యాన్స్‌లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా భరత నాట్యం, హిప్ హాప్ రెండు కలిపి రూపొందించిన ఓ కొత్త రకం డ్యాన్స్ నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఓ అంగ్లో ఇండియన్ సరికొత్తగా ఆలోచించి భరత నాట్యం, హిప్ హాప్కు కొత్తదనాన్ని జోడించి వినూత్న డ్యాన్స్‌ను ప్రాణం పోశారు. ఇందులో ముగ్గురు మహిళలు సంప్రదాయ చీరకట్టులో, మల్లెపూలు పెట్టుకొని అమెరికన్ రాపర్ లిల్ వేన్ ఉప్రోయర్ పాటకు ఇండో- వెస్ట్రన్ స్టెప్పులు వేస్తూ అలరించారు. హైబ్రిడ్ భారతనాట్యం అని పేరు పెట్టిన ఈ డ్యాన్స్ వీడియోలు నెటిజన్ల హృదయాలు గెలుచుకుంటున్నాయి. What the f- though ? Where the love go ? 🧨@LilTunechi @THEREALSWIZZZ pic.twitter.com/H7kTfQXMO4 — Usha Jey (@Usha_Jey) May 22, 2022 పారిస్‌లో నివసిస్తున్న శ్రీలంకన్ ఉష జై అనే మహిళ కొరియోగ్రాఫర్ తన స్నేహితురాళ్లతో కలిసి ఈ రకమైన డ్యాన్స్ క్రియేట్ చేశారు. దీనికి హైబ్రిడ్ భరత నాట్యం పేరు పెట్టారు. ఆ వీడియోలను ఎపిసోడ్‌లా వారీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ పాపులర్ అయ్యారు. తాజాగా 20 సెకన్ల ఈ వీడియో షేర్ చేశారు. నిజానికి హిప్ హాప్, భరతనాట్యం రెండు భిన్నమైన నృత్యాలు వీటిని మేళవించి రూపొందించిన ఈ సృజనాత్మక డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ అద్భుతమైన వీడియో సాంస్కృతిక సరిహద్దులు దాటి పయనిస్తోందని కామెంట్ చేస్తున్నారు. దీనిని ఇప్పటికే 7 లక్షలమంది వీక్షించారు. ఈ అందమైన వీడియోను మీరూచూడండి Welcome to paradise 🌴 pic.twitter.com/5aKpcTN9nz — Usha Jey (@Usha_Jey) December 12, 2020 -
బెస్ట్ ఈస్ట్‌వెస్ట్
ఇండో వెస్టర్న్ చమక్కులివి. ఈస్ట్ వెస్ట్ల బెస్ట్ కలబోత ఇది! ఫారిన్ కట్ ఇండియన్ కట్టు ఇది! ది బెస్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్!! ► అనార్కలీ, లెహంగా కలసి లాంగ్ స్లీవ్స్ గౌన్‌గా రూపుకట్టిందీ డ్రెస్. దీనికి ఎంబ్రాయిడరీ డిజైన్ జత చేరడంతో రూపు మన సంప్రదాయానికి చిరునామా అయ్యింది. ► లాంగ్ గౌన్ మీద సంప్రదాయపు ఎంబ్రాయిడరీ కుట్టు పార్టీలలో హైలైట్‌గా నిలుపుతుంది. ► ఫ్లోరల్ ప్రింట్స్ లెహంగా షోల్డర్ లెస్ క్రాప్ టాప్ ధరిస్తే ఈ తూరుపును ఆ పశ్చిమాన్ని కలిపినట్టుగా ఉందీ పోజ్. ► ఎరుపు రంగు మీద చేసిన ఎంబ్రాయిడరీ వర్క్ లెహంగా పూర్తి సంప్రదాయాన్ని కళ్లకు కడుతూనే స్లీవ్‌లెస్ క్రాప్‌టాప్‌తో వెస్ట్రన్ లుక్ స్టైలిష్‌గా అదరగొడుతోంది. ► లెహంగాకు టాప్ బ్లౌజ్ విత్ చున్నీగా గౌన్ స్టైల్ ఇవ్వడంతో ఇండోవెస్ట్రన్కి కొత్త భాష్యం చెబుతోంది. ► స్లీవ్‌లెస్ డిజైనర్ మ్యాక్సీ గౌన్ ఇది. లెగ్గింగ్ విత్ లాంగ్ టాప్ అనిపించేలా మతులు పోగొడుతుంది.