ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్‌తో సినీ స్టార్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్‌ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్‌ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు.
డిజైన్స్ తెలుసుకుంటూ..
కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్‌ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్‌లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్‌లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్‌తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ.
సెల్ఫ్ డిజైనర్‌ని..
వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్‌తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్‌ని టైలర్‌కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని
వివరిస్తారు శివాని.
Comments
Please login to add a commentAdd a comment