new designs
-
నిన్న.. నేడు.. రేపటి స్టైల్
ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్‌తో సినీ స్టార్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్‌ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్‌ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైన్స్ తెలుసుకుంటూ.. కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్‌ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్‌తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ. సెల్ఫ్ డిజైనర్‌ని.. వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్‌తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్‌ని టైలర్‌కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని వివరిస్తారు శివాని. -
వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్‌గా ‘తిరుపతి’.. డిజైన్లు విడుదల రైల్వే శాఖ మంత్రి
సాక్షి, తిరుపతి: తిరుపతి రైల్వేస్టేషన్‌కు త్వరలో మహర్దశ పట్టనుంది. కాంట్రాక్టులన్ని పూర్తి చేశామని, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. ఆయన డిజైన్లు కూడా విడుదల చేశారు. దేశంలోనే ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్లుగా తొలిదశలో అభివృద్ధి చేస్తున్న 14 రైల్వే స్టేషన్లలో తిరుపతి ఒకటి. చదవండి: టీటీడీ కీలక నిర్ణయం.. కచ్చితంగా ఆ రూల్స్ పాటించాల్సిందే.. ఈ 14 రైల్వే స్టేషన్లను 5 వేల కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా రూపాంతరం చెందనుంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం దేశవ్యాప్తంగా భక్తులు అధికంగా రైల్వే ద్వారానే వస్తుంటారు. వేలాది భక్తులతో తిరుపతి రైల్వే స్టేషన్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు రావడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. -
Summer Collection: ఇండియన్ కలంకారీ
చీర మొదటిసారి కట్టుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిలు సోషల్ మీడియాలో తమ లుక్స్ అప్డేట్ చేసుకోవాలనుకునే మగువలు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వేడుకలకు హాజరయ్యే అతివలు ఇలా కలంకారీ శారీ, క్రాప్‌టాప్ ధరించి కొత్తగా మెరిసిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి పెన్‌కలంకారీ కళకు ప్రసిద్ధి. కాటన్ చీరల మీద వేసే కలంకారీ డిజైన్‌లో పూర్తిగా సేంద్రీయ రంగులు వాడుతుంటారు. ఏ కాలమైనా మేనికి హాయినివ్వడంతో పాటు, ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించడం కలంకారీ ప్రత్యేకత. ఈ స్పెషల్ శారీకీ ఇంకొన్ని స్టైలిష్ హంగులు అద్దితే మోస్ట్ బ్యూటిఫుల్ అనకుండా ఉండలేరు. మిడీస్, స్కర్ట్స్ మీదకు వాడే క్రాప్‌టాప్స్.. షర్ట్ స్టైల్ లాంగ్ బ్లౌజులను ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా, బొద్దుగా ఉన్నవారు కూడా ఈ స్టైల్‌ని ఎంచక్కా ఫాలో అవ్వచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ స్టైల్ కాబట్టి బంగారు ఆభరణాలకన్నా ఫంకీ జ్యువెలరీ మరింత వన్నె తీసుకొస్తుంది. టెర్రకోట, జర్మన్ సిల్వర్, ఫ్యాబ్రిక్.. ముఖ్యంగా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది. మేకప్‌తో పెద్దగా పనిలేదు. హెవీగా మేకోవర్ అంతకన్నా అవసరం లేదు. సింపుల్ అండ్ స్టైలిష్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. ఈ వేసవి వేడుకలను మరింత హాయిగా ఎంజాయ్ చేయచ్చు. హేమంత్ సిరీ ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్ మరిన్ని డిజైన్లు.. Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్కేర్.. Fashion: చేనేతలతో సీజన్ వేర్ చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది? -
మహిళలే టార్గెట్ : కొత్త డిజైన్స్ అంటూ టోకరా
సాక్షి, గచ్చిబౌలి: చిరు వ్యాపారాలు చేసే మహిళలకు ఫైనాన్స్ ఇస్తానని... కొత్త డిజైన్లలో నగలు చేయిస్తానని మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్న ఓ ఘరానా మోసగాడిని నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో గురువారం డీసీపీ వెంటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... • విశాఖపట్నం జిల్లా కేశవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి చిట్టిబాబు అలియాస్ చిట్టి అలియాస్ అప్పారావు పదో తరగతి చదివి కెమికల్ ఫ్యాక్టరీలో కొద్ది రోజులు పని చేశాడు. • గ్రామాల్లోని మధ్య వయసు గల మహిళలకు మాయమాటలు చెప్పి బంగారు నగలతో ఉడాయించడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా, 21 ఆగస్టు 2020న బెయిల్‌పై బయటకు వచ్చాడు. • తర్వాత బాధితులు తన ఇంటికి వచ్చి గొడవ చేయడంతో హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో ఉంటున్నాడు. • నార్సింగి పీఎస్ పరిధిలోని కాళీ మందిర్ సమీపంలో కల్లు విక్రయించే ఓ మహిళ ఒంటిపై ఉన్న నగలపై కన్నేసిన ఇతగాడు ఫైనాన్స్ ఇస్తానని చెప్పాడు. తన ఒంటిపై ఉన్న రోల్డ్ గోల్డ్ నగలను చూపించి ఇదే డిజైన్‌తో నగలు చేయిస్తానని నమ్మబలికాడు. • ఆమె నుంచి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని ఉడాయించాడు. • మరుసటి రోజు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో బాధితురాలు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. • ఇదే తరహాలో మంచిరేవులలో పూలు అమ్ముకొనే ఓ మహిళను బురిడీ కొట్టించి 2 తులాల ఆభరణాలతో ఉడాయించాడు. • రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పీఎస్‌ల పరిధిల్లోనూ ముగ్గురు మహిళలను మోసగించాడు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసుల నమోదు చేసిన నార్సింగ్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 10.4 తులాల ఆభరణాలు, సెల్ ఫోన్, గ్లామర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. 14 కేసుల్లో నిందితుడు: తెలంగాణాలోని నార్సింగిలో 2, రాజేంద్రనగర్‌లో 2, లంగర్‌హౌస్‌లో ఒక కేసులో మేడిశెట్టి చిట్టిబాబు నిందితుడుగా కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోలీసుస్టేషన్లలో 9 కేసులు ఉన్నాయి. నిందితునిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. కేసును ఛేదించిన సీసీఎస్, నార్సింగి పోలీసులలకు రివార్డు అందజేశారు. విలేకరుల సమావేశంలో ఎస్టీఎప్ ఏసీపీ శ్యాంబాబు, మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, సీసీఎస్ సీఐ వాసు, నార్సిగి సీఐ గంగాధర్, డీఐ బాలరాజు పాల్గొన్నారు. -
'తలుక్' మనిపించిన మోడల్స్..
-
డిజైన్స్ కొత్త.. ఫ్యాషన్ సూత్ర..
-
దీపావళికి పట్టు జార్జెట్టు
ఇది మెరిసే పండగ.మగువలూ మెరిసే పండగ. వాకిలిలో దీపాలు వెలుగుతాయి. వాకిలి లోపల గృహిణి కళ కళకళలాడుతుంది. ఈ దీపావళికి కొత్త డిజైన్ని ట్రై చేయండి. జార్జెట్ చీరకు పట్టు అంచును జతచేయండి. ఆ కట్టుతో ఆకట్టుకోండి. అందరికీ సూటబుల్ బెనారస్ పట్టు మంచి కాంతిమంతమైన రంగులతో, డిజైన్‌తో ఇట్టే ఆకట్టుకుంటుంది. పండగలకు, పెళ్లిళ్లకు బెనారస్ పట్టు చీరలను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అలాగే జార్జెట్ చీరలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ రెంటినీ ఇష్టపడేలా కాంబినేషన్ చీరను డిజైన్ చేశాం. సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకు కొత్త కళ తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ జార్జెట్ బెనారస్ పట్టుల కాంబినేషన్. టీనేజర్ల దగ్గర నుంచి అన్ని వయసుల వారూ వీటిని కట్టుకోవచ్చు. వేడుకలలో బ్రైట్‌గా వెలిగిపోవచ్చు. ►హెవీగా కాకుండా బెనారస్‌ను అంచు, బుటీలుగా తీసుకున్నారు. ►పాతకాలం అంటే నలభై యాభై ఏళ్ల క్రితం అమ్మలకు ఇలాంటి బ్రైట్ డిజైన్ ఉన్నకలర్ కాంబినేషన్ చీరలు ఉండేవి. ఆ డిజైన్ వచ్చేలా వీటిని డిజైన్ చేశారు. ►ఈ చీరలకు ఎలాంటి బ్లౌజ్ వేసినా బాగా నప్పుతుంది. అంటే చీర రంగులోనే ఉండే సెల్ఫ్ బ్లౌజ్ అయినా, ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ►ఈ చీరలన్నింటికీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ బ్లౌజ్‌లను వాడారు. ►కేశాలంకరణ, ఆభరణాలు సింపుల్‌గా ఉన్నా కాస్త హెవీగా ఉన్నా ఈ చీరలకు నప్పుతుంది. -
టవర్ డిజైన్‌కే నెటిజన్ల ఓటు
-
స్పాట్లైట్
ఎల్జీ జీ2 ప్రోస్: కొత్త డిజైన్, ఐ ఫోన్ 5, శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 4, హెచ్‌టీసీల స్థాయి కాన్స్: పవర్, పెర్ఫార్మెన్స్ అన్నింటిలోనూ బెటర్ మాత్రమే. బెస్ట్ కాలేదు. బోటమ్ లైన్: గుడ్ ఫోన్, కొన్ని బలాలున్నాయి, బలహీనతలు కూడా. కిండ్లే ఫైర్ హెచ్‌డీఎక్స్ టాబ్లెట్ ప్రోస్: ఆండ్రాయిడ్ ఎస్, లైట్ వెయిట్, షార్ప్ డిస్ప్లే కాన్స్: ఇతర టాబ్లెట్లతో పోల్చినప్పుడు కొంత వెనుకబడి ఉంది. బోటమ్ లైన్: ఐప్యాడ్ మినీ, నెక్సస్7 లతో పోలిక ఉంది. పోరాడుతుంది. గూగుల్‌సెర్చ్ గజినీలను చేస్తోంది! సెర్చింజన్ దిగ్గజం గూగుల్ నెటిజన్లను మతిమరపు రాయుళ్లుగా చేస్తోంది... అంటున్నారు అధ్యయనకర్తలు. ఇంటర్నెట్ను బాగా వినియోగించే రెండువేల మంది యువతీ యువకులపై చేసిన పరిశోధన ఫలితంగా ఈ విషయం తేలిందట. వీరు ఏ విషయాన్ని నిర్ధారణ చేసుకోవడానికైనా గూగుల్ ఆశ్రయించడం వల్ల క్రమంగా గజినీలు అవుతున్నారని అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు. గూగుల్ అందుబాటులో ఉండటంతో ఏదీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు అనే భావనకు వస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ట్విన్ టవర్స్‌పై తీవ్రవాద దాడులు ఎప్పుడు జరిగాయి, బెర్లిన్ వాల్ ఎప్పుడు కూలింది.. వంటి చారిత్రక ఘటనలను కూడా చాలామంది యువతీ యువకులు మరచిపోయారని, అవసరమైనప్పుడు గూగుల్‌ను సంప్రదిస్తున్నారని, ఫలితంగా వారిని మతిమరపు ఆవహిస్తోందని అధ్యయనకర్తలు విశ్లేషించారు. డెల్ నుంచి కొత్త టాబ్లెట్లు వెన్యూ 7 వెన్యూ 8 : వెన్యూ - 7 (ఏడు అంగుళాలు) వెన్యూ - 8 (ఎనిమిది అంగుళాలు) టాబ్లెట్లు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై పనిచేస్తాయి. హై డెఫినిషన్ క్వాలిటీతో ఎల్సీడీ స్క్రీన్‌తో ఉంటుంది. వెన్యూ - 7 ధర రూ.9500. వెన్యూ - 8 ధర రూ.11,500. వెన్యూ - 8 ప్రో, వెన్యూ - 11 ప్రో: విండోస్ - 8.1 ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో పనిచేస్తాయి. డే-లాంగ్ బ్యాటరీ లైఫ్ ఈ టాబ్లెట్ల ప్రత్యేకత. వీటి ధరలు వరసగా రూ.19,000, రూ.32,000