చీర మొదటిసారి కట్టుకోవడానికి ప్రయత్నించే అమ్మాయిలు
సోషల్ మీడియాలో తమ లుక్స్ అప్‌డేట్ చేసుకోవాలనుకునే మగువలు
కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వేడుకలకు హాజరయ్యే అతివలు
ఇలా కలంకారీ శారీ, క్రాప్‌టాప్ ధరించి కొత్తగా మెరిసిపోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని కాళహస్తి పెన్‌కలంకారీ కళకు ప్రసిద్ధి. కాటన్ చీరల మీద వేసే కలంకారీ డిజైన్‌లో పూర్తిగా సేంద్రీయ రంగులు వాడుతుంటారు. ఏ కాలమైనా మేనికి హాయినివ్వడంతో పాటు, ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించడం కలంకారీ ప్రత్యేకత. ఈ స్పెషల్ శారీకీ ఇంకొన్ని స్టైలిష్ హంగులు అద్దితే మోస్ట్ బ్యూటిఫుల్ అనకుండా ఉండలేరు.
- మిడీస్, స్కర్ట్స్ మీదకు వాడే క్రాప్‌టాప్స్.. షర్ట్ స్టైల్ లాంగ్ బ్లౌజులను ఈ స్టైల్‌కి ఎంచుకోవచ్చు.
- వయసుతో నిమిత్తం లేకుండా, బొద్దుగా ఉన్నవారు కూడా ఈ స్టైల్‌ని ఎంచక్కా ఫాలో అవ్వచ్చు.
- ఇది ఇండోవెస్ట్రన్ స్టైల్ కాబట్టి బంగారు ఆభరణాలకన్నా ఫంకీ జ్యువెలరీ మరింత వన్నె తీసుకొస్తుంది. టెర్రకోట, జర్మన్ సిల్వర్, ఫ్యాబ్రిక్.. ముఖ్యంగా హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుంది.
- మేకప్‌తో పెద్దగా పనిలేదు. హెవీగా మేకోవర్ అంతకన్నా అవసరం లేదు.
- సింపుల్ అండ్ స్టైలిష్ అనిపించే ఈ తరహా డ్రెస్సింగ్‌ను మీరూ ఫాలో అవ్వచ్చు. ఈ వేసవి వేడుకలను మరింత హాయిగా ఎంజాయ్ చేయచ్చు.
హేమంత్ సిరీ
ఫ్యాషన్ డిజైనర్
హైదరాబాద్
మరిన్ని డిజైన్లు..
Women Party Wear Dresses: పార్టీవేర్.. సీజన్‌కేర్..
Comments
Please login to add a commentAdd a comment