వింటర్‌ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్‌.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్‌ | Fashion: Winter Wear Sarees Which Looks Classy And Comfort | Sakshi
Sakshi News home page

వింటర్‌ సీజన్‌కి ప్రత్యేకంగా స్టైలింగ్‌.. వివాహ వేడుకల్లో అట్రాక్షన్‌

Published Fri, Dec 1 2023 10:38 AM | Last Updated on Fri, Dec 1 2023 11:16 AM

Fashion: Winter Wear Sarees Which Looks Classy And Comfort - Sakshi

వివాహ వేడుకలలో కట్టే చీరలే దివ్యంగా వెలిగిపోతుంటాయి. ఇక వాటికి అదనంగా మరో స్టయిల్‌ను కూడా జోడిస్తే.. ఆ వెలుగులు రెట్టింపు అవుతాయి. పట్టు, వెల్వెట్, ఎంబ్రాయిడరీ దుపట్టా చీర మీదకు ధరించినా, డ్రేపింగ్‌లో జత చేసినా ఆ స్టైల్‌ హుందాగా కనిపిస్తుంది. ఈ వింటర్‌ సీజన్‌కి ప్రత్యేకంగా ఉండటమే కాదు చలి నుంచి రక్షణను కూడా ఇస్తుంది. ఎవర్‌గ్రీన్‌గా ఉండే శారీ కట్టుకి మహారాణి కళను లె చ్చే దుపట్టా స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. 

కాంట్రాస్ట్‌ 
శారీ కలర్, దుపట్టా కలరా పూర్తి కాంట్రాస్ట్‌ ఉన్నది ఎంచుకోవాలి. దీనివల్ల రెండూ భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. 

శాలువా స్టైల్‌
చీర మీదకు దుపట్టాను శాలువా మాదిరి కప్పుకున్నా ఈ సీజన్‌కి వెచ్చగా, బ్రైట్‌గా ఉంటుంది. అయితే, దుపట్టా గ్రాండ్‌గా ఉన్నది ఎంచుకోవాలి. ఇందుకు పట్టు, బ్రొకేడ్, ఎంబ్రాయిడరీ దుపట్టాలను చీరలను ఎంపికను బట్టి తీసుకోవాలి. 

డ్రేపింగ్‌ దుపట్టా
చీరకట్టులో భాగంగా దుపట్టాను జత చేర్చి కట్టడం ఒక స్టైల్‌. ఈ కట్టును నిపుణుల ఆధ్యర్యంలో సెట్‌ చేయించుకోవాలి. ఈ కట్టుకు కూడా కాంట్రాస్ట్‌ కలర్స్‌ ఉండేలా చూసుకోవాలి.  

రంగు ఒకటే... డిజైన్‌ వేరు
సేమ్‌ కలర్‌ శారీ దుపట్టాను ఎంచుకున్నా ఎంబ్రాయిడరీ డిజైన్‌లో కాంబినేషన్స్‌ చూసుకోవాలి. చీర డిజైన్‌ హెవీగా ఉంటే, దుపట్టా డిజైన్‌ బ్రైట్‌గా ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలి. పట్టు శారీ మీదకు డిజైనర్‌ దుపట్టాను ఎంచుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement