
ముంబైలో ఫ్యాషన్ టూర్–2025
డిజైనర్ తరుణ్ తహిలియాని దుస్తుల్లో రాయల్‌లుక్‌లో మెరిసిన టైగర్ ష్రాఫ్,మానుషి చిల్లర్
ముంబైలో ఫ్యాషన్ టూర్–2025 సందర్భంగా టైగర్ ష్రాఫ్ . మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారుముంబైలో జరిగిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ లో బాలీవుడ్ తారలు టైగర్ ష్రాఫ్ ,మానుషి చిల్లర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో ర్యాంప్ వ్యాక్ చేశారు.
శనివారం రాత్రి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ముంబైలో అద్భుతంగా జరిగింది. తరుణ్ తహిలియాని కోచర్ మాస్టర్ క్లాస్ లో టైగర్ ష్రాఫ్ మానుషి చిల్లర్ అద్భుతంగా కనిపించారు టైగర్ ఎంబ్రాయిడరీ సూట్‌లో, మనుషి పాస్టెల్ లెహంగాలో ఆకట్టుకున్నారు. ట్రెడిషనల్ హ్యాండ్‌మేడ్, సమకాలీన ఫ్యాషన్ ట్రెండ్ పరిపూర్ణ సమ్మేళనంతో రూపొందించిన దుస్తుల్లో మోడల్స్ హైలైట్‌గా నిలిచారు. ముఖ్యంగా టైగర్, మానుషి ఇద్దరూ ఆత్మవిశ్వాసం, అధునాతనతకు ప్రతి రూపాలుగా ఫ్యాషన్ ఔత్సాహికులను ఆశ్చర్యపరిచారు. ఈ ఫ్యాషన్‌టూర్‌కి సంబంధించిన వీడియోను తరుణ్ తహిలియానీ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి: సిక్స్ ప్యాక్ పెళ్లికూతురు, ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది!
టైగర్ ష్రాఫ్ డీప్ ప్లంజింగ్ సిల్క్ షర్ట్, ఫిట్టెడ్ బ్లాక్ ప్యాంటుతో కూడిన బ్లాక్ ఎంబ్రాయిడరీ సూట్‌లో మెరిశాడు. ముఖ్యంగా అతని పొడవైన, నల్ల జాకెట్, సంక్లిష్టమైన అలంకరణలు,బోల్డ్ కళ్ళజోడు ,లేయర్డ్ బంగారు ఆభరణాలతో మెరిసిపోతూ రాజ వైభవాన్ని తెచ్చిపెట్టింది.మరోవైపు, మనుషి చిల్లార్ మృదువైన పాస్టెల్-రంగు లెహంగాలో ఆధునిక మహారాణిలా కనిపించింది. విలాసవంతంగా ఎంబ్రాయిడరీ చేయబడిన స్కర్ట్ అద్భుతంగా కనిపించింది. హెరిటేజ్ పోల్కి, పచ్చ ఆభరణాలతో విశేషంగా నిలిచాయి. చోకర్ ,మాంగ్ టిక్కాతో సహా, సొగసైన బన్ ఆమె రూపానికి రాయల్ లుక్ తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment