అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్‌కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.
ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్‌లోనూ యంగ్‌స్టర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్‌తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.
డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్‌కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్‌గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్‌ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్‌తో రిచ్‌లుక్‌ని తీసుకురావచ్చు.
ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్‌తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్‌ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది.
టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్‌గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్‌తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్‌గా కనిపిస్తాయి.
ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న!
Comments
Please login to add a commentAdd a comment