మిసెస్‌ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్‌ ప్రియాంక తారే..! | Priyanka Tare Representing Telangana At The National Mrs India pageant | Sakshi
Sakshi News home page

మిసెస్‌ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్‌ ప్రియాంక తారే..!

Published Tue, Mar 18 2025 10:31 AM | Last Updated on Tue, Mar 18 2025 11:12 AM

Priyanka Tare Representing Telangana At The National Mrs India pageant

జాతీయ స్థాయిలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జాతీయ మిసెస్‌ ఇండియా పోటీల్లో ప్రియాంక తారే తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ నుంచి వచ్చి నగరంలో స్థిరపడిన ఆమె మిసెస్‌ ఇండియా తెలంగాణ క్వీన్‌ 2025 అనే ప్రతిష్టాత్మక బిరుదుతో పాటు మిసెస్‌ ప్యాషనేట్‌ అవార్డు గెలుచుకుంది. 

ఈ నేపథ్యంలో జాతీయ వేదికపై మిసెస్‌ ఇండియా పోటీలో తెలంగాణ సౌందర్యాభిలాషను ప్రదర్శించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక తారే అద్భుత ప్రతిభావంతురాలు. ఎంఎన్‌సీసీలో హెచ్‌ఆర్‌, సీఎస్‌ఆర్‌గా పలు ఈవెంట్‌లు నిర్వహిస్తోంది. ఆమె క్రీడలు, పాటలు, నృత్యం వంటి వాటిలో మంచి ప్రతిభావంతురాలు . 

ప్రియాంక రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు కూడా. ఆమె తన డ్రీమ్‌ని నెరవేర్చుకోవడమే గాక ఇతరులను కూడా ఆ మార్గంలో వెళ్లేలా ప్రోత్సహిస్తోంది. అంతేగాదు వివిధ రకాల ఎన్‌జీవోలతో కలిసి నిరుపేద బాలికలు/పిల్లల సంక్షేమం, మహిళ సాధికారత వంటి సామాజిక కార్యక్రమాల కోసం తన వంతుగా సేవలందిస్తోంది. 

(చదవండి: 'విందోదయం': బ్రేక్‌ ఫాస్ట్‌లకు కేరాఫ్‌ ఈ టిఫిన్‌ సెంటర్లు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement