Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Sundar Pichai Becomes Billionaire After 10 Years As Alphabet CEO1
సుందర్‌ పిచాయ్‌ ఇక బిలియనీర్‌..

ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్స్‌ క్లబ్‌లోకి చేరారు. 1 బిలియన్ డాలర్ల నికర సంపద పరిమితిని అధిగమించి బిలియనీర్‌గా అవతరించారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో, భారత్‌కు చెందిన 53 ఏళ్ల పిచాయ్‌ నెట్‌వర్త్‌ 1.1 బిలియన్ డాలర్లకు పెరిగింది.2023 ప్రారంభం నుంచి ఆల్ఫాబెట్ స్టాక్ 120 శాతానికి పైగా పెరగడం, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్లకు పైగా పెరగడం ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణమని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఒక వ్యవస్థాపకేతర సీఈఓకు ఇది అరుదైన ఘనత. మెటాకు చెందిన మార్క్ జుకర్ బర్గ్, ఎన్‌విడియాకు చెందిన జెన్సెన్ హువాంగ్ వంటి ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లు బిలియనీర్స్‌గా ముందు వరసలో ఉన్నప్పటికీ వారు తమ కంపెనీల్లో ఈక్విటీ వాటాలను కలిగి ఉన్నారు.సీఈవోగా పదేళ్లుఆల్ఫాబెట్‌ సీఈవోగా సుందర్ పిచాయ్ ఇటీవలే పదేళ్లు పూర్తి చేసుకుని కంపెనీలో ఎక్కువ కాలం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పిచాయ్ 2004లో ఆల్ఫాబెట్ ప్రధాన అనుబంధ సంస్థ గూగుల్ లో చేరారు. క్రోమ్, ఆండ్రాయిడ్ లకు ఆయన తొలినాళ్లలో చేసిన సేవలు 2015లో సీఈఓగా ఎదగడానికి పునాది వేశాయి. తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓగా సుందర్ పిచాయ్ నియమితులయ్యారు.నిరాడంబర నేపథ్యం..సుందర్ పిచాయ్ తమిళనాడులోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి రెండు గదుల అపార్ట్ మెంట్ లో పెరిగారు. వారి కుటుంబానికి కారు ఉండేది కాదు. ఆయనకు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు తొలిసారిగా ఇంటికి టెలిఫోన్ వచ్చింది. 1993 లో సుందర్ పిచాయ్ స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి స్కాలర్‌షిప్ సాధించగా ఆయన్ను కాలిఫోర్నియా పంపించడానికి విమాన టికెట్ కోసం ఆయన తండ్రి ఏడాది మొత్తం జీతం కంటే కూడా పైగానే ఆ కుటుంబం ఖర్చుపెట్టాల్సి వచ్చింది.

Sonu Sood Helps To Tollywood actoe Fish Venkat Family After His Demise2
రియల్ హీరో అనిపించుకున్న సోనూ సూద్.. ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సాయం!

బాలీవుడ్ నటుడు సోను సూద్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. టాలీవుడ్ నటుడు ఫిష్‌ వెంకట్‌ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ విషాద సమయంలో వారికి ఆర్థికసాయం అందించారు. తనవంతు సాయంగా లక్షన్నర రూపాయలు ఫిష్ వెంకట్ కుటుంబానికి అందించారు. అంతే కాకుండా సోనూ సూద్ కూడా వ్యక్తిగతంగా ఫిష్ వెంకట్ భార్య, కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడినట్లు తెలుస్తోంది.కాగా.. ఇటీవల కిడ్నీల సమస్యతో ఆస్పత్రిలో చేరిన ఫిష్ వెంకట్‌ కోలుకోలేక మృతి చెందారు. ఫిష్ వెంకట్ పరిస్థితి గురించి తెలుసుకున్న కొందరు ఆయన వైద్యం కోసం ఆర్థికసాయం అందించారు. అయినప్పటికీ సరైన సమయంలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ జరగకపోవడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.కాగా.. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్‌ సినిమాతో ఫేమస్ ‍అయిన ఫిష్ వెంకట్ పలు టాలీవుడ్ చిత్రాల్లో మెప్పించారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్, ఖైదీ నంబర్ 150, శివం లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించారు. కమెడియన్‌గా మాత్రమే కాదు విలన్‌ పాత్రల్లోనూ అభిమానులను మెప్పించారు. ఫిష్ వెంకట్ చివరిసారిగా కాఫీ విత్ ఎ కిల్లర్‌లో కనిపించాడు.

ENG VS IND 4th Test Day 3: England In Huge Lead3
రూట్‌ రికార్డు శతకం.. భారీ ఆధిక్యంలో ఇంగ్లండ్‌

Update: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నాటి ఆట పూర్తయ్యేసరికి ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 544 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ 77, లియాం డాసన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కంటే ఇంగ్లండ్ ప్రస్తుతం 186 పరుగుల ఆధిక్యంలో ఉంది.రూట్‌ రికార్డు శతకం: మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం సాధించింది. 127 ఓవర్ల తర్వాత ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 523 పరుగులు చేసి, 165 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. రూట్‌ రికార్డు శతకం (150) సాధించి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. అతనికి స్టోక్స్‌ (66 రిటైర్డ్‌ హర్ట్‌) అండగా నిలిచాడు. క్రిస్‌ వోక్స్‌ (2), లియామ్‌ డాసన్‌ (7) క్రీజ్‌లో ఉన్నారు.ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94), ఓలీ పోప్‌ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్‌ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీయగా.. 2, అన్షుల్‌ కంబోజ్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Another Huge Scam In Hca4
హెచ్‌సీఏలో మరో భారీ స్కాం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(HCA)లో మరో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. సమ్మర్ క్యాంప్‌ల పేరుతో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్‌ రావు అండ్ కో.. రూ.4 కోట్ల రూపాయలు కాజేసినట్లు సీఐడీ గుర్తించింది. గతేడాది మే 20 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంప్‌లు నిర్వహించిన హెచ్‌సీఏ.. ప్రతీ క్యాంప్‌లో 100 మందికి చొప్పున దాదాపు 2500 మందికి పైగా క్రికెట్ కోచింగ్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చెప్పింది.ఒక్కో క్యాంప్‌పై రూ.15 లక్షలు ఖర్చు చేసినట్లు చూపి.. రూ.4 కోట్ల రూపాయలు జగన్‌మోహన్‌రావు కాజేశారు. క్యాంప్‌కి హాజరైన విద్యార్థులకు క్రికెట్ కిట్స్ ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపించారు. క్యాంప్‌లు నిర్వహించిన కేంద్రాల్లో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఒక్కో క్యాంప్‌లో లక్ష కూడా ఖర్చు చేయలేదని సీఐడీ ఆధారాలు సేకరించింది.కాగా, హెచ్‌సీఏ కేసులో ముగ్గురికి బెయిల్‌ మంజూరైంది. హచ్‌సీఏ ట్రెజరర్ శ్రీనివాస్‌రావు, శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. మరో వైపు జగన్‌మోహన్‌రావును కస్టడీ పొడిగించాలని సీఐడీ వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. మల్కాజిగిరి కోర్టులో జగన్‌మోహన్‌రావుతో పాటు సీఈవో సునీల్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సోమవారం బెయిల్ పిటిషన్‌లపై వాదనలు జరగనున్నాయి.

Indian students shift to Bangladesh And Uzbekistan5
మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!

విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్‌, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్‌ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్‌ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్‌, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్‌లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్‌ ట్రూడో హయాంలో భారత్‌-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్‌డీఎస్‌ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్‌, ఉజ్భెకిస్తాన్‌, సింగపూర్‌, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్‌ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్‌, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్‌, సింగపూర్‌, రష్యా, ఉజ్బెకిస్థాన్‌ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు.

ENG VS IND 4th Test: Joe Root Surpasses Ricky Ponting And Climbs To 2nd Place In List Of Most Test Runs Category6
పాంటింగ్‌నూ దాటేసిన రూట్‌.. మిగిలింది సచిన్‌ ఒక్కడే

మాంచెస్టర్‌ టెస్ట్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ వరుస పెట్టి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటికే చాలా రికార్డులు తన ఖాతాలో వేసుకున్న రూట్‌.. 120 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద మరో దిగ్గజ ఆటగాడి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ స్కోర్‌ వద్ద రూట్‌ సచిన్‌ తర్వాత టెస్ట్‌ల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ను అధిగమించాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్‌ ఈ ఒక్క ఇన్నింగ్స్‌తోనే రాహుల్‌ ద్రవిడ్‌, జాక్‌ కల్లిస్‌, రికీ పాంటింగ్‌ను దాటేయడం విశేషం. ఇక రూట్‌ ముందున్న ఏకైక లక్ష్యం సచిన్‌ ఆల్‌టైమ్‌ రికార్డు ఒక్కటే. ఈ రికార్డును చేరుకోవాలంటే రూట్‌ మరో 2500 పైచిలుకు పరుగులు చేయాలి. ఇది ఈజీ కాదు. అలాగని అసాధ్యం కూడా కాదు.టెస్ట్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాటర్లు..సచిన్‌ టెండూల్కర్‌- 15921జో రూట్‌- 13380*రికీ పాంటింగ్‌- 13378జాక్‌ కల్లిస్‌- 13289రాహుల్‌ ద్రవిడ్‌- 13288మ్యాచ్‌ విషయానికొస్తే.. మూడో రోజు టీ విరామం సమయానికి ఇంగ్లండ్‌ స్కోర్‌ 433/4గా ఉంది. రూట్‌ 121, స్టోక్స్‌ 36 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 75 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు జాక్‌ క్రాలే (84), బెన్‌ డకెట్‌ (94), ఓలీ పోప్‌ (71) అర్ద సెంచరీలతో సత్తా చాటగా.. హ్యారీ బ్రూక్‌ (3) ఒక్కడే నిరాశపరిచాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 2, అన్షుల్‌ కంబోజ్‌, రవీంద్ర జడేజా తలో వికెట్‌ తీశారు. అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకు ఆలౌటైంది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ 58, కేఎల్‌ రాహుల్‌ 46, సాయి సుదర్శన్‌ 61, శుభ్‌మన్‌ గిల్‌ 12, రిషబ్‌ పంత్‌ 54, రవీంద్ర జడేజా 20, శార్దూల్‌ ఠాకూర్‌ 41, వాషింగ్టన్‌ సుందర్‌ 27, అన్షుల్‌ కంబోజ్‌ 0, జస్ప్రీత్‌ బుమ్రా 5, మహ్మద్‌ సిరాజ్‌ 5 (నాటౌట్‌) పరుగులు చేశారు.ఇంగ్లండ్‌ బౌలర్లలో బెన్‌ స్టోక్స్‌ 5 వికెట్లతో చెలరేగగా.. జోఫ్రా ఆర్చర్‌ కూడా సత్తా చాటి 3 వికెట్లు తీశాడు. వోక్స్‌, డాసన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ప్రస్తుతం ఇంగ్లండ్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.

Video Viral: Plane Crashes Into Italian Highway7
హైవేపై కుప్పకూలిన విమానం.. వీడియో వైరల్‌

ఉత్తర ఇటలీలోని బ్రెస్సియాలో ఘోర ప్రమాదం జరిగింది. చిన్నపాటి విమానం హైవేపై కూలిపోవడంతో ఇద్దరు మరణించారు. మృతులను మిలన్‌కు న్యాయవాది సెర్గియో రావాగ్లియా(75), ఆయన భార్య ఆన్ మారియా డి స్టెఫానో (60)గా గుర్తించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.రావాగ్లియా హైవేపై అత్యవసర ల్యాండింగ్‌ ప్రయత్నం విఫలం కావడంతో.. వేగంగా దూసుకొచ్చిన విమానం ముందు భాగం రోడ్డును ఢీకొట్టింది. దీంతో భారీ మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా ఇద్దరు వాహనదారులు కూడా గాయపడ్డారు.. కానీ ప్రాణాలతో బయటపడ్డారు. మంటలు అదుపు చేయడానికి ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకోగా అప్పటికే ఆ విమానం మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనపై ఇటలీ నేషనల్ ఏజెన్సీ ఫర్ ఫ్లైట్ సేఫ్టీ దర్యాప్తు చేపట్టింది.🚨 PLANE CRASHED in the middle of the Highway - HORRIFIC VISUALS Brescia, Italy - A small private plane tragically crashed onto a highway The 75 year old Pilot and his partner BOTH DEADToo many Plane Crashes in the last few weeks :'( pic.twitter.com/iRewT9Zz5r— Gautam Seth (@GautamS15540834) July 25, 2025కాగా, ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో విమానం ఎక్కాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ప్రమాదాలకు పైలట్స్‌, విమానంలో సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

Bhumana Karunakar Reddy Questioning On Chandrababu Government Over Tirupati stampede8
తిరుమల తొక్కిసలాట ఘటన.. అసలు దోషులెక్కడా చంద్రబాబు

సాక్షి,తిరుపతి: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కంటి తుడుపు చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి ఎం.సత్యనారాయణ మూర్తి కమిషన్‌ ఆధ్వర్యంలో జరిగిన విచారణపై భూమన మీడియాతో మాట్లాడారు.ఆయన ఏమన్నారంటే.. ‘‘ శ్రీరంగ పట్టణం ఆదర్శంగా తీసుకుని ఆ వైష్ణవ సంప్రదాయం తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి దర్శనం అవకాశం కల్పించాము. 23 మంది పీఠాధిపతులు హర్షించారు. జనవరి 8 న జరిగిన జరిగిన తొక్కిసలాట పై కంటి తుడుపు చర్యలు కు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేసింది.సంఘటన జరిగిన తర్వత రోజు కలెక్టర్, ఎస్పీ, ఈవోలుపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన పై ఈవో ఛైర్మన్ల మధ్య అవగాహన లేదు, క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఆరోజు గోశాల డైరెక్టర్ హరినాధ రెడ్డి, డీఎస్పీ రమణ సస్పెండ్ చేశారు.చంద్రబాబు ముందే నిర్ణయించుకుని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. తమకు కావాల్సిన వారితో సాక్షులు ఇప్పించారు హరినాథ్ రెడ్డి, రమణ కుమార్‌లను బలి ఇచ్చారు. అసలు నిందితులను వదిలి వేశారు. ఆరు మంది చనిపోయి, 50 మందికి పైగా తీవ్ర గాయాలు ఐతే పాక్షికంగా నివేదిక ఇచ్చారుఆ నివేదికను దురుద్దేశ పూర్వకంగా ఇచ్చిన నివేదికగా వైఎస్సార్‌సీపీ భావిస్తోంది. విజిలెన్స్ నివేదికలు బట్టి చూస్తే.. చంద్రబాబు నియమించిన ఏ విచారణ అయిన ఒక కేస్ స్టడీగా చేశారు. ఆయన కోరుకున్నట్లుగానే విచారణ కమిషన్ ఫలితం వస్తుంది అనడానికి ఇది ఒక కేస్ స్టడీ.హరినాధ రెడ్డికు 21.12.24 నా జరిగిన సమావేశంలో సూర్య ప్రకాష్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు సమాన బాధ్యత ఇచ్చారులా అండ్ ఆర్డర్, విజిలెన్స్ వాళ్లకు క్యూ లైన్ బాధ్యతలు ఇచ్చారు. అండ్ ఆర్డర్ బాధ్యత ఎస్పీ, సీవీ అండ్‌ ఎస్వో ది కూడా బాధ్యత. వైఎస్సార్‌సీపీ పాలనలో ఏ ఒక్క చిన్న సంఘటన జరగలేదు.జనవరి 10, 11, 12 తేదీలు మాత్రమే ఎస్‌ఎస్‌డీ టోకెన్లు ఇస్తామని చెప్పారు. అధికార యంత్రాంగం ఈ ఘటనకు కారణం, దీనికి సమాధానం లేదు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాట ఘటన జరిగితే ఈవోనే బాధ్యత వహించాలని గతంలో చందన ఖాన్ ఒక నివేదిక ఇచ్చారు. కౌంటర్ల వద్ద విధుల్లో ఉన్న వారిని ఎలా చర్యలు తీసుకుంటారు? క్యూ లైన్‌లో హోల్డింగ్ పాయింట్ అనేది ఎందుకు పెట్టారు.తొక్కిసలాట జరిగిన సమయంలో పోలీసులు చోద్యం చూశారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీ బాధ్యత నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట ఘటన జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన జ్యుడిషియల్ కమీషన్ నివేదిక సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాము. మా పాలనలో వైకుంఠ ఏకాదశికు పదిలక్షలు మందికి దర్శనం చేయించాము. 23 మంది పీఠాధిపతులు స్వహస్తాలతో ఇచ్చిన సూచన ప్రకారం పదిరోజుల దర్శనం జరిగింది.పీఠాధిపతులు ఆలోచనలను పక్కన పడేస్తారా.. కేసులు పెట్టాలనే , జైలుకు తరలించాలని చూస్తున్నారు.నా గొంతు కోస్తే తప్ప నేను పోరాటం ఆగదు’’ అని స్పష్టం చేశారు.

Operation Sindoor still on shastra shaastra both key CDS Anil Chauhan9
ఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉంది: సీడీఎస్‌

న్యూఢిల్లీ: పహల్గామ్‌ ఉగ్రదాడిలో తర్వాత పాకిస్తాన్‌లో ఉగ్రస్ధావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ అనేది ఇంకా ఆన్‌లోనే ఉందని సీడీఎస్‌(చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం జూలై 25) ఢిల్లీలో జరిగిన డిఫెన్స్‌ సెమినార్‌కు హాజరైన అనిల్‌ చౌహాన్‌ మాట్లాడుతూ..ఆపరేషన్‌ సిందూర్‌ అనేది అవసరమైన సందర్భంలో మళ్లీ జూలు విదల్చడానికి ఇంకా సిద్ధంగానే ఉందన్నారు.అది నిరంతరం నేర్చుకునే ప్రక్రియఇక భారతదేశ యుద్ధ సామర్థ్యం గురించి ఆయన పలు కీలక విషయాలను చెప్పుకొచ్చారు. యుద్ధ సంసిద్ధత అనేది చాలా హైలెవెల్‌లో ఉండాలన్నారు. యుద్ధ సామర్థ్యాన్ని పెంపుదించుకోవడానికి ప్రతి గడియా, ప్రతి నిమిషం కూడా చాలా అవసరమన్నారు. అటు సస్త్ర(యుద్ధం) ఇటు శాస్త్రం(జ్ఞానం) అనేవి మిలటరీకి 24x7, 365 రోజులు చాలా కీలకమన్నారు.మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాలి..యుద్ధ రంగంలోకి దిగే సైనికుడు న్రధానంగా మూడు స్థాయిల్లో మాస్టర్‌ కావాల్సిన అసవరం ఉందన్నారు. అందులో , నిర్ధిషమైన ప్రణాళిక, వ్యూహాత్మకత, కార్యాచరణ, అనేవి యుద్ధ రంగంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. వీటిలో ప్రతీ సైనికులు ఆరితేరి ఉండాలన్నారు. ఇది ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ముందకు సాగడమే తప్ప ఇందులో షార్ట్‌ కట్స్‌ అంటూ ఏమీ ఉండవన్నారు. ప్రస్తుత రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిరంతర పురోగతి ద్వారా మనం అపూర్వమైన వేగాన్ని చూస్తున్నామని, దాన్ని అందిపుచ్చకుంటూ ముందుకు సాగితేనే యుద్ధంలో పైచేయి సాధిస్తామన్నారు. కాగా, ఏప్రిల్‌ 22వ తేదీన పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది అసువులు బాసారు. కశ్మీర్‌ పర్యాటక ప్రాంతాల్నిచూడటానికి వెళ్లిన పర్యాటకులు ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్సోయారు. ఈ క్రమంలోనేఆపరేషన్‌ సిందూర్‌ను భారత్‌ చేపట్టింది.మే 7వ తేదీన భారత్‌ చేపట్టిన ఈఆపరేషన్‌ సిందూర్‌తో పాకిస్తాన్‌ ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌ అతాలకుతలమైంది. భారత్‌ దాడుల్ని తిప్పి కొట్టలేక ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఆపరేషన్‌ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌ కాస్త దారికొచ్చింది.ఆపరేషన్‌ సింధూర్‌తో పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయిని భారత ఆర్మీ బలగాలు అక్కడ కీలక ఉగ్రస్థావరాలను చిన్నాభిన్నం చేశారు. సుమారు వందమందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం ఒకటైతే, ఉగ్రస్థావరాలు ఉన్న చోటల్లా భారత్‌ చేసిన దాడులకు పాకిస్తాన్‌ ఊపిరి తీసుకోలేకపోయింది. అలాగే పాక్‌ ఆర్మీ క్యాంపుల్ని కూడా భారత్‌ టార్గెట్‌ చేసి పైచేయి సాధించింది. భారత్‌ దాడులకు గుక్క తిప్పులేకపోయిన పాకిస్తాన్‌.. మే 10వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చింది. పాకిస్తాన్‌ మిలటరీ ఆపరేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌.. భారత్‌ ఆర్మీకి ఫోన్‌ చేసి కాల్పుల విరమణ ఒప్పందానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు.. అదే సమయంలో పాకిస్తాన్‌ మళ్లీ ఎటువంటి దుస్సాహసానికి పాల్పడ్డాఆపరేషన్‌ సిందూర్‌ ఆన్‌లోనే ఉందని గట్టి హెచ్చరికల నడుమ కాల్పుల విరమణకు అంగీకరించింది భారత్‌.

Indian Government Bans Ullu ALTT Other Apps For This Reason10
ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 యాప్‌లపై బ్యాన్‌

అశ్లీల కంటెంట్‌ను కట్టడి చేసే క్రమంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యంతర కంటెంట్‌ను ప్రొత్సహిస్తున్న ఉల్లూ, ఏఎల్‌టీటీ సహా 25 వీడియో యాప్‌లు, వెబ్‌సైట్‌ల మీద నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.పోర్నోగ్రఫిక్‌ సహా అభ్యంతకర కంటెంట్‌ను ప్రదర్శిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే.. ఆయా యాప్‌ల, వెబ్‌సైట్‌ల లింకులను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా బ్యాన్‌ చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌(ISPs)కు ఆదేశాలు జారీ చేసింది.భారత్‌లో పోర్న్‌సైట్లపై నిషేధం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాల్లో కోట్ల మంది ఆ సైట్లను వీక్షిస్తున్నారు. అయితే.. కఠిన చట్టాలు లేకపోవడంతో కొన్ని యాప్‌లు అధికారికంగానే పోర్న్‌, సాఫ్ట్‌ పోర్న్‌ను ప్రొత్సహిస్తూ వస్తున్నాయి. ఇందులో ఉల్లూ, ఏల్‌టీటీ(ఏక్తాకపూర్‌కు చెందిన బాలాజీ టెలిఫిలింస్‌కు చెందిన యాప్‌, అశ్లీలంతో పాటు సాదారణ సినిమాలూ అందిస్తోంది) తదితరాలు ప్రముఖంగా ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు డబ్బులు తీసుకుని ఇంతకాలం యూజర్లకు అశ్లీల కంటెంట్‌ విచ్చలవిడిగా అందిస్తూ వచ్చాయి.అయితే రాను రాను.. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది. ఏకంగా పోర్న్‌ కంటెంట్‌ ఇదే తరహా యాప్‌ల ద్వారా ప్రమోట్‌ అయ్యింది. ఇది హద్దులు దాటి ‘ఎక్స్‌’(ట్విటర్‌) లాంటి పాపులర్‌ ఓపెన్‌ మాధ్యమానికి కూడా చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో కేంద్రం నిషేధం విధించడం గమనార్హం. ఈ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.తాజా నిషేధిత జాబితాలో.. ఉల్లూ, ఏఎల్‌టీటీ, బిగ్‌ షాట్స్‌ యాప్‌, దేశీఫ్లెక్స్‌, బూమెక్స్‌, నవరసా లైట్‌, గులాబ్‌ యాప్‌, కంగన్‌ యాప్‌, బుల్‌ యాప్‌, జల్వా యాప్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ప్రైమ్‌, ఫెనియో, షో ఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్‌ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌ యాప్‌, మూడ్‌ఎక్స్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, ఫూగీ, మోజ్‌ఫ్లిక్స్‌, ట్రిఫ్లిక్స్‌ తదితరాలు ఉన్నాయి.ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ 2000 సెక్షన్‌ 67, 67 ఏ.. లాగే భారత న్యాయ సంహిత సెక్షన్‌ 294, మహిళలను అభ్యంతరకరంగా చూపించడం(The Indecent Representation of Women (Prohibition) Act, 1986 సెక్షన్‌ 4).. ఉల్లంఘనల కింద ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement