‘అమ్మా!, ఈ డ్రెస్ సరిగా లేదు, ఈ డిజైన్ ఓల్డ్.. అందరిలోనూ డల్‌గా కనిపిస్తాను, అందుకే నేను ఫంక్షన్‌కు రాను’ అనే మాటలు టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎంపిక చేసిన డ్రెస్ సరిగా లేదనో, మ్యాచింగ్ కుదరలేదనో ... చెప్పే మాటలు అమ్మలకు పెద్ద సవాల్‌గా ఉంటాయి. ‘‘మరో అకేషన్‌కి బెస్ట్‌ది సెలక్ట్ చేద్దాం. ఇప్పటికి ఇలా రెడీ అయి పో’’ అని కూతుళ్లకు సర్దిచెబుతూ ఉంటారు అమ్మలు. ‘ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదురవకుండా సందర్భానికి తగినట్టు రెడీ అవడానికి మా అమ్మాయి విషయంలో సింపుల్‌గా అనిపించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను’ అని చెబుతున్నారు సంయుక్తా మరపడగ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న సంయుక్త చెబుతున్న విశేషాలు.
‘సాధారణంగా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం తరచూ షాపింగ్ చేస్తుంటాం. బాగున్నవీ, బాగోలేనివీ వార్డ్రోబ్‌లో చాలా డ్రెస్సులు వచ్చి చేరుతుంటాయి. ప్రతీసారీ కొత్తగా అనిపించేలా డ్రెస్సింగ్ ఉండేలా చూసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రతీ ఈవెంట్‌కి సందర్భానికి తగినట్టు డ్రెస్సింగ్ అవడం తప్పనిసరి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.
బెస్ట్ ఆఫ్ 5..
క్యాజువల్‌గా బయటకు, రోజూ కాలేజీకి, పండగలు, గెట్ టు గెదర్స్, పెళ్ళిళ్లు.. ఇలా సందర్భాలను బట్టి మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. వాటిలో బెస్ట్ 5 అనేవి ఎంపిక చేసుకోవాలి.
1. సాధారణంగా బయటకు వెళ్లినప్పడు ఫంకీ స్టైల్ ఉంటే బాగుంటుంది. అందుకు మోడర్న్ వేర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనే స్ట్రీట్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెసింగ్ అయితే బాగుంటుంది.
2. పండగలకు, ఎంగేజ్‌మెంట్స్‌కి సంప్రదాయ లుక్‌లో కనిపించాలి. ఇందుకు ఫ్యాన్సీ టచ్ ను మిక్సప్ చేయచ్చు. ఇండోవెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా ఈ సందర్భాలలో బాగుంటుంది.
3. కాలేజీలో ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉన్నా ఫంకీ లుక్‌తో ఉండే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. వీటిలోనే ముదురు, లేత రంగుల కాంబినేషన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డార్క్ కలర్ టాప్స్, లైట్ షేడ్స్ స్కర్ట్స్‌ని వార్డ్రోబ్‌లోకి చేర్చుకోవచ్చు. పూర్తి వెస్ట్రన్ స్టైల్స్ కూడా కాలేజీ ఈవెంట్స్‌కు బాగుంటాయి.
4. వివాహ వేడుకలకు బెనారస్, పైథానీ, ఇకత్, పట్టుతో తయారైన ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా లెహంగా, శారీ, చుడీదార్ డిజైన్స్.. ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనూ జాకెట్స్, టాప్స్.. వెస్ట్రన్ స్టైల్‌లో డిజైన్ చేయించుకోవచ్చు.
5. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టైల్‌లో కనిపించేలా కనీసం 5 నుంచి 6 డ్రెస్‌లు సిద్ధంగా ఉంటే వాటినే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లెహంగా ప్లెయిన్
ఉంటే డార్క్ బ్లౌజ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్‌తో మిక్సప్ చేయచ్చు.
"మా అమ్మాయి వార్డ్రోబ్‌లో ఇలా సందర్భానికి తగినట్టు డ్రెస్సులు ఉండేలా చూసుకోవడం వల్ల ఎంత పెద్ద అకేషన్ వచ్చినా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. దీనివల్ల టైమ్ ఆదా అవుతుంది. అనవసర షాపింగ్‌కూడా తగ్గుతుంది.’’ – నిర్మలారెడ్డి
"ఆభరణాల ఎంపిక కాలేజీ ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ముదురు రంగు డ్రెస్సుల మీదకు ముత్యాలు లేదా పెండెంట్ ఉండే సన్నని చెయిన్ ధరిస్తే చాలు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ అయితే ఇయర్ రింగ్స్‌తో మేనేజ్ చేయచ్చు. పూర్తి సంప్రదాయ లుక్ అయితే సందర్భాన్ని బట్టి టెంపుల్ జ్యువెలరీని ఎంపిక చేసుకుంటే చాలు." – సంయుక్త మరపడగ
ఇవి చదవండి: Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో..
Comments
Please login to add a commentAdd a comment