Dressing care
-
మై వార్డ్రోబ్! టీనేజర్‌కు బెస్ట్ 5 ఇవే..!
‘అమ్మా!, ఈ డ్రెస్ సరిగా లేదు, ఈ డిజైన్ ఓల్డ్.. అందరిలోనూ డల్‌గా కనిపిస్తాను, అందుకే నేను ఫంక్షన్‌కు రాను’ అనే మాటలు టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎంపిక చేసిన డ్రెస్ సరిగా లేదనో, మ్యాచింగ్ కుదరలేదనో ... చెప్పే మాటలు అమ్మలకు పెద్ద సవాల్‌గా ఉంటాయి. ‘‘మరో అకేషన్‌కి బెస్ట్ది సెలక్ట్ చేద్దాం. ఇప్పటికి ఇలా రెడీ అయి పో’’ అని కూతుళ్లకు సర్దిచెబుతూ ఉంటారు అమ్మలు. ‘ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదురవకుండా సందర్భానికి తగినట్టు రెడీ అవడానికి మా అమ్మాయి విషయంలో సింపుల్‌గా అనిపించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను’ అని చెబుతున్నారు సంయుక్తా మరపడగ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న సంయుక్త చెబుతున్న విశేషాలు.‘సాధారణంగా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం తరచూ షాపింగ్ చేస్తుంటాం. బాగున్నవీ, బాగోలేనివీ వార్డ్‌రోబ్‌లో చాలా డ్రెస్సులు వచ్చి చేరుతుంటాయి. ప్రతీసారీ కొత్తగా అనిపించేలా డ్రెస్సింగ్ ఉండేలా చూసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రతీ ఈవెంట్‌కి సందర్భానికి తగినట్టు డ్రెస్సింగ్ అవడం తప్పనిసరి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.బెస్ట్ ఆఫ్ 5..క్యాజువల్‌గా బయటకు, రోజూ కాలేజీకి, పండగలు, గెట్ టు గెదర్స్, పెళ్ళిళ్లు.. ఇలా సందర్భాలను బట్టి మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. వాటిలో బెస్ట్ 5 అనేవి ఎంపిక చేసుకోవాలి. 1. సాధారణంగా బయటకు వెళ్లినప్పడు ఫంకీ స్టైల్ ఉంటే బాగుంటుంది. అందుకు మోడర్న్ వేర్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనే స్ట్రీట్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెసింగ్ అయితే బాగుంటుంది. 2. పండగలకు, ఎంగేజ్మెంట్స్కి సంప్రదాయ లుక్‌లో కనిపించాలి. ఇందుకు ఫ్యాన్సీ టచ్ ను మిక్సప్ చేయచ్చు. ఇండోవెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా ఈ సందర్భాలలో బాగుంటుంది.3. కాలేజీలో ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉన్నా ఫంకీ లుక్‌తో ఉండే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. వీటిలోనే ముదురు, లేత రంగుల కాంబినేషన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డార్క్ కలర్ టాప్స్, లైట్ షేడ్స్ స్కర్ట్స్‌ని వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవచ్చు. పూర్తి వెస్ట్రన్ స్టైల్స్ కూడా కాలేజీ ఈవెంట్స్‌కు బాగుంటాయి. 4. వివాహ వేడుకలకు బెనారస్, పైథానీ, ఇకత్, పట్టుతో తయారైన ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా లెహంగా, శారీ, చుడీదార్ డిజైన్స్.. ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనూ జాకెట్స్, టాప్స్.. వెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేయించుకోవచ్చు. 5. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టైల్లో కనిపించేలా కనీసం 5 నుంచి 6 డ్రెస్‌లు సిద్ధంగా ఉంటే వాటినే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లెహంగా ప్లెయిన్ ఉంటే డార్క్ బ్లౌజ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్‌తో మిక్సప్ చేయచ్చు."మా అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఇలా సందర్భానికి తగినట్టు డ్రెస్సులు ఉండేలా చూసుకోవడం వల్ల ఎంత పెద్ద అకేషన్ వచ్చినా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. దీనివల్ల టైమ్ ఆదా అవుతుంది. అనవసర షాపింగ్కూడా తగ్గుతుంది.’’ – నిర్మలారెడ్డి"ఆభరణాల ఎంపిక కాలేజీ ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ముదురు రంగు డ్రెస్సుల మీదకు ముత్యాలు లేదా పెండెంట్ ఉండే సన్నని చెయిన్ ధరిస్తే చాలు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ అయితే ఇయర్ రింగ్స్‌తో మేనేజ్ చేయచ్చు. పూర్తి సంప్రదాయ లుక్ అయితే సందర్భాన్ని బట్టి టెంపుల్ జ్యువెలరీని ఎంపిక చేసుకుంటే చాలు." – సంయుక్త మరపడగఇవి చదవండి: Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో.. -
బాక్టిరియాతో డ్రెస్సింగ్.. గాయలను త్వరగా తగ్గిస్తుంది!
మన శరీరంలో ఎప్పుడైనా దెబ్బలు తగిలితే బ్యాండేజీ వేసుకుంటాం. ఇక గాయం మానడానికి చాలా రోజులే పడుతుంది. ఈ క్రమంలో బాక్టీరియా చేరకుండా వైద్యుల సూచనతో డ్రెస్సింగ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఓ కొత్తరకమైన డ్రెస్సింగ్‌ను శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ఇది ఏకంగా గాయాన్ని మాయం చేస్తుందట. దీర్ఘకాలిక గాయాలకు చికిత్స చేస్తున్నప్పుడు వాటికి బాక్టీరియా దరిచేరకుండా నిత్యం డ్రెస్సింగ్ చేయడం మనకు తెలిసిందే. అయితే ప్రతిసారి డ్రెస్సింగ్ చేస్తున్నప్పుడు పేషెంట్స్‌కి నొప్పి కలగడం సహజమే. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్తరకం డ్రెస్సింగ్ గాయాలను త్వరగా మానేలా చేస్తుందట. గాయపడిన ప్రాంతంలో నొప్పి కలిగించే బయోఫిల్మ్‌లను నాశనం చేసేలా MIT, స్విట్జర్లాండ్‌కు చెందిన డాక్టర్. కున్ రెన్ నేతృత్వంలోని సైంటిస్టులు బయో-కె+ అనే అక్వాసెల్ను కనుగొన్నారు. ఇందులో మూడు రకాల లాక్టోబాసిల్లి ప్రోబయోటిక్ అనే బాక్టిరియా ఉంటుందట. ఇది బయోఫిల్మ్ pH స్థాయిపై దాడిచేసి దానిని నాశనం చేస్తుందట. ఈ కొత్తరకమైన డ్రెస్సింగ్ టెక్నాలజీతో 99.999% వ్యాధికారకాలను చంపేసి గాయం తాలూకూ నొప్పిని తగ్గించిందని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఇందులోని ప్రోబయోటిక్ బ్యాక్టీరియా..గాయాన్ని త్వరగా మానేలా చేయడమే కాకుండా కొత్త చర్మం రావడానికి సహాయపడిందని సైంటిస్టులు తెలిపారు. -
చబ్బీ చార్మ్
చిక్కిన అందానికి ఏ డ్రెస్ వేసినా చక్కగానే ఉంటుంది. కాని కాస్త బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మలకే డ్రెస్సింగ్ కేర్ తప్పని సరి. దాచాలంటే దాగని శరీరాకృతిని కాస్ట్యూమ్స్‌తో కవర్ చేసుకోవాలనుకుంటారు. అందుకే అన్ని కోణాల్లో ఆలోచించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటారు. మనసుకు నచ్చిన డిజైన్ కనిపించిన మన కు నప్పదని కాదనుకుంటారు. ఇలాంటి వారి కోసం ఫ్యాషన్ ప్రపంచంలో సరికొత్త డిజైన్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత లైఫ్‌స్టైల్.. అమ్మాయిలను వద్దన్నా బొద్దుగా మార్చేస్తోంది. దీంతో పెళ్లికో.. పేరంటానికో.. వెళ్లాలంటే ఎలాంటి దుస్తులు ధరించాలో తెలియక గజగామినిలు తికమకపడుతున్నారు. బొద్దుగా కాకుండా.. ముద్దుగా చూపించే ఆహార్యాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి అతివల కోసమే ఫ్యాషన్ డిజైనర్లు సరికొత్త ఫార్ములాలను పరిచయం చేస్తున్నారు. అంతేకాదు.. బొద్దుగుమ్మలు ఎలాంటి కాస్ట్యూమ్స్ ధరించాలో.. ఏ ఏ రంగులు సూటవుతాయో.. ఇలా సూచిస్తున్నారు. ఫికర్ మత్.. మేని ఛాయ బంగారంలా మెరిసిపోతున్న చబ్బీ బేబీలు ముదురు రంగులు వేస్తే బెటర్. లైట్ కలర్స్ అయితే మీ లావుతనాన్ని హైలైట్ చేస్తాయి. కాళ్లు కాస్త లావుగా ఉంటే డార్క్ కలర్ బాటమ్ వేసి లైట్ కలర్ టాప్ వేసుకుంటే సరి. అయితే టాప్స్ మాత్రం నడుం కింది భాగం వరకూ ఉండేలా చూసుకుంటే మంచిది. చేతులు చబ్బీగా ఉంటే మాగ్జిమమ్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ లేదా ఫుల్ హ్యాండ్స్ ప్రిఫర్ చేయాలి. మరో విషయం వేసుకునే డ్రెస్‌పైన గాని, కట్టుకునే చీరపైన కాని పెద్దపెద్ద పూలు, పెద్ద డిజైన్ ఉంటే అవి మిమ్మల్ని హైలైట్ చేస్తాయి. చిన్న చిన్న పూలు, చుక్కలు ఉండేవి వేసుకుంటే అవి హైలైట్ అయ్యి మీ ఆకారాన్ని దాచేస్తాయి. ఫ్యాషన్ మస్త్.. అడ్డగీతల టాప్‌లు, షర్ట్లు, ప్యాంట్లు వేసుకుంటే ఉన్నదానికంటే ఇంకాస్త ఎక్కువ లావుగా కనిపిస్తారు. నిలువు గీతల కాస్ట్యూమ్స్ కాస్త సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. ఫ్యాషన్ లుక్ కోరుకునే ‘మంద’గత్తెలు హిప్స్ కింది వరకూ కవర్ చేసే పొడువాటి షర్ట్, మ్యాచింగ్‌గా క్వాలిటీ స్కిన్నీ లెగ్గిన్ వేసుకుంటే అదిరేటి లుక్ వస్తుంది. టాప్, షర్ట్‌లకు సైడ్ కటింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఈ కాస్ట్యూమ్స్ ఏ మాత్రం ట్రాన్స్పరెంట్గా లేకుండా చూసుకోవాలి సుమీ. ఈ డ్రెసింగ్‌కు మార్కెట్లో దొరికే షగ్స్ ్రలేదా పలుచటి ఓవర్ జాకెట్ వేసుకుంటే స్టైలిష్ లుక్ సొంతం చేసుకోవచ్చు. చీరకట్టయితే మోచేతుల వరకూ జాకెట్ ఉంటే ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. సాధ్యమైనంత వరకూ స్లీవ్‌లెస్‌లు, మెగా స్లీవ్స్ అవాయిడ్ చేయండి. డ్రెసింగ్తోనే సరిపెట్టకుండా.. కాస్త బిగ్‌సైజ్ ఇయర్ టాప్స్, హ్యాండ్ బ్యాగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మరీ మంచిది. అన్నింటికన్నా కాన్ఫిడెంట్ ఉండటం ముఖ్యం. - శిరీష చల్లపల్లి