dressing styles
-
ఆర్గానిక్ అ'డ్రెస్'!
సాక్షి, సిటీబ్యూరో: తినే తిండిలో మాత్రమే కాదు మనం ధరించే దుస్తుల్లోనూ రసాయనాల వినియోగం మితిమీరుతోంది. స్వచ్ఛంగా మెరిసిపోయే తెల్లని కాటన్ వస్త్రం తయారీలో కూడా ఆ రంగు కోసం కెమికల్స్ వాడతారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఆహారం తరహాలోనే ఆహార్యంపై కూడా పెరుగుతున్న శ్రద్ధ.. నగరవాసుల్లో ఆర్గానిక్ దుస్తుల పట్ల ఆసక్తికి కారణమవుతోంది.తిరిగే ప్రదేశం సహజమైన ప్రకృతి అందాలతో ఉండాలి తినే తిండి కూడా సహజమైనదే అయి ఉండాలి.. ధరించే దుస్తులు కూడా సహజసిద్ధమైన రీతిలో రూపొందించినవి కావాలి. లేకపోతే అనారోగ్యాలు ఎటు నుంచి దాడిచేస్తాయో తెలీదు.. ఈ స్పహ ఆధునికుల్లో పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని బ్రాండెడ్ దుస్తులు మార్కెట్లో కనిపిస్తుండగా.. ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగాæ డిజైనర్లు కూడా ఆర్గానిక్ దుస్తులకు అడ్రస్‌గా మారుతున్నారు. అలాంటివారిలో సిటీ డిజైనర్ సంతోష్ ఒకరు. గతంలో పూణె ఫ్యాషన్ వీక్‌లో వీటిని ప్రదర్శించారాయన.కాస్ట్ లీ కాదు.. ధనవంతులు మాత్రమే సస్టెయినబుల్ ఫ్యాషన్ ను కొనుగోలు చేయగలరని అభిప్రాయం ఏర్పడింది. అయితే తెలివిగా షాపింగ్ చేయాలనుకునే ఎవరికైనా ఈ తరహా దుస్తులు అందుబాటులోనే ఉంటాయని అంటున్నారు డిజైనర్లు. ‘అందరూ అనుకున్నట్టు ఆర్గానిక్ ఫ్యాషన్ దుస్తులు మరీ ఖరీదైనవి ఏమీ కాదు. ఉత్పత్తి వ్యయం కూడా మీటర్‌కి రూ.వెయ్యిలోపే అవుతుంది. అయితే వీటి వాడకంపై ఫ్యాషన్ ప్రియుల్లో మరింత అవగాహన పెరగాల్సి ఉంది’ అంటూ చెప్పారు నగరానికి చెందిన డిజైనర్ నయన్. సేంద్రియ పద్ధతిలో తయారు.. ఆధునిక వినియోగదారులు పర్యావరణ అనుకూల డిజైన్ ట్రెండ్లను అనుసరిస్తుండటంతో హానికరమైన రసాయనాలు, పురుగు మందులు లేకుండా ఉంటాయి సేంద్రియ పద్ధతిలో తయారైన వ్రస్తాలకు డిమాండ్ విస్తరిస్తోంది. ఉత్పత్తిదారులు సరళమైన, తటస్థ–రంగు దుస్తులు రూపొందిస్తున్నారు. వీటిలో తెలుపు, నలుపు క్రీం రంగులు కీలకమైనవి. కార్క్, వెదురు, జనపనార, ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ కాటన్ లినెన్ సస్టెయినబుల్ ఫ్యాషన్ ఉత్పత్తిలో కీలకమైన ముడి పదార్థాలుగా మారాయి. సేంద్రియ పద్ధతిలో పత్తి లేదా జనపనార వంటి పర్యావరణ అనుకూల పదార్థాలతో రూపొందించిన జీన్స్ దుస్తులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. శీతాకాలంలో వెచ్చదనాన్ని అందించే స్వెటర్ల కోసం, ఉన్ని లేదా అల్పాకాతో తయారు చేసినవి అందుబాటులోకి వచ్చాయి.వ్యర్థాల రీసైక్లింగ్.. ఫ్యాషన్ పరిశ్రమలో వ్యర్థాలను తగ్గించడానికి అప్‌సైక్లింగ్ రీసైక్లింగ్ పద్ధతులు అనుసరిస్తున్నారు. డిజైనర్లు కొత్త ప్రత్యేకమైన దుస్తుల వెరైటీల సృష్టి కోసం పాత వ్రస్తాలు, స్క్రాప్లు, దుస్తుల తయారీలో వాడగా మిగిలిపోయిన వాటిని సృజనాత్మకంగా పునర్నిరి్మస్తున్నారు. ఇది వ్రస్తాల జీవితచక్రాన్ని పొడిగించడంలో, వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే స్లో ఫ్యాషన్ మూవ్మెంట్.. స్లో ఫ్యాషన్ అనే భావన పెరిగింది. వినియోగదారులు తమ ఫ్యాషన్ ఎంపికల విషయంలో కంటికి ఇంపుగా ఉండే దుస్తుల కన్నా ఒంటికి మేలు చేసేవే మిన్న అనే భావనకు వస్తున్నారు. ఎక్కువ కాలం ధరించగలిగే శాశ్వతమైన, మన్నికైన దుస్తులను ఎంచుకుంటున్నారు. మరో వైపు ఇది సంప్రదాయ హస్తకళ స్థానిక కళాకారులకు ఇది ఊతమిస్తోంది. సంప్రదాయ నేయడం, అద్దకం, ఎంబ్రాయిడరీ పద్ధతులను సంరక్షించడానికి ప్రోత్సహించడానికి బ్రాండ్లు కళాకారులతో కలిసి పనిచేస్తున్నాయి. ఇది సంప్రదాయ కళలను పునరుజ్జీవింపజేయడమే కాకుండా హస్తకళాకారుల పురోభివృద్ధి అవకాశాలను కూడా పెంచుతోంది."రసాయన రహితంగా పూర్తి ఆర్గానిక్ దుస్తుల తయారీ అనేది ఇప్పటికీ కొంత సాహసంతో కూడిన ప్రయోగమే అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా ఆర్గానిక్ ఫ్యాబ్రిక్, డైతో తయారు చేసినవి తక్కువ షేడ్స్‌లో మాత్రమే లభ్యమవుతాయి. దేశంలో ఇప్పటికే కొన్ని బ్రాండ్స్ నాచురల్ డైస్‌తో చేసిన దుస్తులు విక్రయిస్తున్నప్పటికీ.. అవి కూడా పూర్తిగా 100శాతం ఆర్గానిక్ అని చెప్పలేం. ఆర్గానిక్ దుస్తులకు కాటన్, లినెన్, పట్టు.. ఫ్యాబ్రిక్స్ మాత్రమే నప్పుతాయి. అలాగే ఈ దుస్తుల తయారీకి మిగిలిన వాటి తయారీతో పోలిస్తే పట్టే సమయం కూడా బాగా ఎక్కువ. ‘నేను రూపొందించిన ఆర్గానిక్ దుస్తుల తయారీలో ఫ్యాబ్రిక్ మొత్తం చేనేతలనే వినియోగించాను. సిద్ధిపేటలోని ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ సునంద ఈ ఫ్యాబ్రిక్స్ తయారీ చేయించారు. అదేవిధంగా ఉల్లిపాయ, పసుపు వంటి దినుసులతో పాటు చెట్ల ఆకులు, కాండం, వేర్లు.. వీటిని ఉపయోగించి ఆకుపచ్చ, విభిన్న రకాల బ్లూషేడ్స్, ఎల్లో, బ్రిక్ షేడ్స్‌తో కలర్స్ సృష్టించాం. కొంచెం డల్ ఫినిష్ ఉండే ఫ్యాబ్రిక్‌కి అత్యాధునిక డిజైనింగ్ వర్క్ జత చేసి ఆకట్టుకునేలా డ్రెసెస్ క్రియేట్ చేశాం. మొత్తం 20 డ్రెస్సెస్ క్రియేట్ చేస్తే.. 16 రకాల డిజైన్లను ఈ షోలో ప్రజెంట్ చేశాను’ అంటూ చెప్పారు సిటీ డిజైనర్ సంతోష్."నేచురల్ డై తయారీ యూనిట్ స్థాపించి..సింథటిక్ వంటి వ్రస్తాలు ఎంచుకుంటే అది పర్యావరణానికి హానికరమని, మన ఆరోగ్యానికి కూడా చేటు చేస్తుందనే స్పృహ నగరవాసుల్లో ఇప్పుడిప్పుడే వస్తోంది. అలాగే దుస్తుల తయారీలో వాడే కొన్ని మెటీరియల్స్ ఆక్సిజన్ నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. అంతేగాకుండా కెమికల్ డైలను నివారించాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల ఆకులు తదితర సహజోత్పత్తుల ద్వారా తయారైన రంగుల వినియోగం పెంచాలి. నేచురల్ డైతో తయారైన.. పూర్తి సహజసిద్ధమైన ఫ్యాబ్రిక్‌ను అందించేందుకు సిటీ శివార్లలో మా సొంత డైయింగ్ యూనిట్‌ను ప్రారంభించాం. – మమత తుళ్లూరి, డిజైనర్ఇవి చదవండి: ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్! -
Annu Patel: అన్నూస్ క్రియేషన్!
అన్నూ పటేల్.. ఫ్యాషన్ ఇండస్ట్రీలో స్పెషల్ స్టయిల్ ఆమెది! ఆ స్పెషాలిటీకి బాలీవుడ్ ఫిదా అయింది! అటు ఫ్యాషన్‌లో.. ఇటు స్టార్స్ స్టయిలింగ్‌లో సీనియర్స్‌తో ఇన్స్పైర్ అవుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్న ఆమె గురించి నాలుగు మాటలు ..అన్నూ పటేల్ స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. ఫ్యాషన్‌గా ఉండటం, రకరకాల కలర్ కాంబినేషన్స్‌లో బట్టలు కుట్టించుకోవడమంటే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆసక్తి. కనుకే, ఫిజియోథెరపీలో చేరిన కొన్నాళ్లకే అది తన కప్ ఆఫ్ టీ కాదన్న విషయాన్ని గ్రహించింది. ఫ్యాషన్ మీదే మనసు పారేసుకుంది. ఆలస్యం చేయక, వడోదరలోని ఐఎన్ఐఎఫ్డీ (ఇంటర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్)లో చేరింది. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్‌లోనే ఆమె ఫ్యాషన్ ఐడియాస్కి ముచ్చటపడిన ఇన్స్టిట్యూట్ ఆమెకు ‘ద మోస్ట్ ఇన్నోవేటివ్ కలెక్షన్’ అవార్డ్నిచ్చింది. సెకండియర్‌లో ఉన్నప్పుడు ‘అన్నూస్ క్రియేషన్’ లేబుల్‌ను స్టార్ట్ చేసింది.ఆ చిన్న పట్టణంలో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ అయితే ఉంది కానీ.. డిజైనర్ వేర్కి డిమాండ్ ఎక్కడ? అందుకే మొదట్లో తను డిజైన్ చేసిన దుస్తులను ఇంటింటికీ వెళ్లి అమ్మి, డిజైనర్ వేర్ పట్ల మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి మోజు కలిగేలా చేసింది. ఆ ప్రయత్నం.. ఆమె చదువైపోయేలోపు ఫ్యాషన్ మార్కెట్లో ‘అన్నూ క్రియేషన్’కి స్పేస్‌ని క్రియేట్ చేసింది. దాన్ని స్థిరపరచు కోవాలంటే తన లేబుల్‌కు ఒక స్పెషాలిటీ ఉండాలని ఆలోచించింది అన్నూ. ఈ దేశంలో పెళ్లికిచ్చే ప్రాధాన్యం స్ఫురణకు వచ్చింది.బ్రైడల్ వేర్ డిజైన్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటే తన మార్కెట్ ఎక్కడికీ పోదని తెలుసుకుంది. తన ఐడియాను అర్థం చేసుకునే టీమ్‌ని ఎంచుకుని డిజైనింగ్ మొదలుపెట్టింది. తొలుత సామాన్యులకే బ్రైడల్ వేర్ ఇచ్చింది. అవి అసామాన్యుల మనసునూ దోచాయి. దాంతో అన్నూ క్రియేషన్ సెలబ్రిటీల స్థాయికి చేరింది. బ్రైడల్ వేర్ చేస్తున్నప్పుడే అన్నూకి ఫ్యాషన్ మార్కెట్లో ఎత్నిక్ వేర్కీ స్పేస్ కనపడింది. ముందు తనకు, తన టీమ్‌కి క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్ చేసి, వాటిని ధరించి.. ఫొటో షూట్ చేయించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయసాగింది. అవీ సెలబ్రిటీల దృష్టిలో పడి అన్నూ బ్రాండ్‌కి క్యూ కట్టసాగారు.ఆ డిమాండ్‌ను చూసి ‘ఎఫ్ అండ్ ఎఫ్ (ఫ్రిల్ అండ్ ఫ్లేర్)’ పేరుతో క్యాజువల్ ఎత్నిక్ వేర్ డిజైన్‌ను స్టార్ట్ చేసింది. ‘ఎఫ్ అండ్ ఎఫ్’ అంటే కుర్తీలు, ఇండో– వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌కి పర్ఫెక్ట్ బ్రాండ్ అనే ఫేమ్‌ని సంపాదించింది. తనే కొత్త అవుట్‌ఫిట్‌ని డిజైన్ చేసినా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అన్నూ అలవాటు. అలా ఆమె డిజైన్స్ అన్నిటినీ ఫాలో అయిన కొందరు బాలీవుడ్ సెలబ్స్.. తమకు స్టయిలింగ్ చేయమని ఆమెను కోరారు. తొలుత అప్రోచ్ అయింది మలైకా అరోరా! ఆ తర్వాత కృతి ఖర్బందా, సోఫీ చౌధరీ, తారా సుతారియా, మౌనీ రాయ్, జాన్వీ కపూర్, హెజల్ కీచ్ వంటి వాళ్లంతా అన్నూ పటేల్ స్టయిలింగ్ క్లయింట్ల లిస్ట్‌లో చేరిపోయారు. ‘సామాన్యులకు డిజైన్ చేస్తున్నా, సెలబ్రిటీలకు స్టయిలింగ్ చేస్తున్నా.. ఆయా స్థాయిల్లో అంతే ఎఫర్ట్స్ పెడతాను, అంతే కమిట్మెంట్తో ఉంటాను. నా డిజైనర్ వేర్ని.. నా స్టయిలింగ్‌ని కోరుకుంటున్న వాళ్ల సంతోషమే నాకు ముఖ్యం. అది నాకు కోటి అవార్డులతో సమానం!’ అంటుంది అన్నూ పటేల్.ఇవి చదవండి: Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా! -
పెట్.. బ్యూటీ సెట్!
సాక్షి, సిటీబ్యూరో: మనం బాగుంటే చాలదు.. మనవి అన్న ప్రతిదీ బాగుండాలి. మనం ఎక్కి తిరిగే కారు నుంచి మన వెనుకే తిరిగే శునకం, పెంపుడు జంతువు దాకా..అన్నీ బాగుండాలి. గ్లామర్ మేనియా నానాటికీ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో పెద్దలూ, పిల్లలూ దాటి చివరకు పెట్స్ వరకూ వచ్చేసింది. మై పెట్ ఈజ్ బ్యూటీఫుల్ అంటూ సగర్వంగా చెప్పుకోవాలనే ఆరాటం పెరుగుతుండడంతో పెట్స్‌కు అందాలను అద్దే పార్లర్లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీని కోసం నగరంలో మొబైల్ పార్లర్లు, గ్రూమింగ్ సేవలను అందించే పార్లర్స్, బ్యూటీ సెలూన్స్ ఇలా ఒక్కటేమిటి.. మనుషులకు ఎన్ని రకాల సౌందర్య సాధనాలు ఉన్నాయో.. అవన్నీ పెంపుడు జంతువులకూ అందుతున్నాయి..స్నానం నుంచి.. హెయిర్ డై వరకూ..ఈ పెట్స్ పార్లర్ల సేవల జాబితాలో ఔషధ స్నానం, జుట్టు కత్తిరించడం, నెయిల్ క్లిప్పింగ్, చెవి శుభ్రపరచడం, హెయిర్ క్లీనింగ్, డై.. వంటివి ఉన్నాయి. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తున్నామని పార్లర్ల నిర్వాహకులు అంటున్నారు. పెంపుడు జంతువులకు, మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు ఒక గంట పడుతుందనీ పొడవాటి బొచ్చు కలిగిన శునకాలు, లేదా హస్కీలు వంటి వాటికి 90 నిమిషాల వరకూ పడుతుందని గ్రూమర్లు చెబుతున్నారు. తమ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారు మూడు నెలల పాటు శిక్షణ పొందుతారని జస్ట్ గ్రూమ్ నిర్వాహకులు అంటున్నారు.శునకాలు చూపే ఆప్యాయత ఎలా ఉంటుందో వాటి యజమానులకు మాత్రమే అర్థం అవుతుంది. అవి అలవాటైన మనుషులతో అల్లుకుపోతుంటాయి. కాబట్టి పెట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే వాటిని పరిశుభ్రంగా ఉంచడం వాటికి మాత్రమే కాదు వాటి యజమా నులకు కూడా అత్యవసరం. రోజు వారీ స్నానం చేయించడం, నులిపురుగుల నిర్మూలన, జుట్టు కత్తిరించడం, పళ్లను పాలిష్ చేయడం, గోళ్లను కత్తిరించడం ఇలాంటివెన్నో చేయడం అవసరం. అయితే పెట్‌ను ఇంటికి తెచ్చుకున్నంత సులభం కాదు వాటికి ఈ సేవలన్నీ చేయడం.. ఇందుకు సమయంతో పాటు అనుభవం, నైపుణ్యం కూడా కావాలి. సరిగ్గా చేయలేకపోతే, అలర్జీలు ఇన్ఫెక్షన్లతో ఇంటిల్లిపాదికీ సమస్యలు తప్పవు.గ్రూమింగ్ దారి.. ఆర్గానిక్ మరి..నగరంలో ఇలాంటి పెట్ యజమానుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రకాల సేవలను అందించే వ్యక్తులు, సంస్థలు వచ్చాయి. వీటి మధ్య పోటీ తత్వం కూడా పెరిగింది. పెట్స్‌కు మసాజ్ చేయడం, బబుల్ బాత్ తదితర సదుపాయాలు మనుషుల స్పా మాదిరిగానే రొటీన్ భౌ¿ౌలకు కూడా విస్తరించాయి. వీటికి తూడో మరిన్ని వెరైటీలు కూడా జతయ్యాయి.అదిరే డ్రెస్సింగ్ స్టైల్.. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకనబెట్టుకుపోవడం నామోషీ అనే పరిస్థితి ఇప్పుడు లేదు. అది పిల్లి అయినా కుక్కపిల్లయినా.. సరే దర్జాగా తమ పెట్ని కూడా వేడుకల్లో భాగం చేస్తున్నారు. పైగా అదే తమ స్టేటస్ సింబల్‌గానే భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫంక్షన్ లేదా ఫొటోషూట్‌కు తీసుకెళ్లాల్సి ఉంటే, తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం వంటివి కూడా పెట్ స్టైలిస్ట్స్ చేస్తున్నారు. అలాగే పిల్లులను పెంచుకునేవారికి వీరు సేవలు అందిస్తున్నారు.వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే..శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం అన్ని వేళలా సాధ్యం కాక చర్మవ్యాధులు వంటివి రావచ్చు. గ్రూమింగ్ లేకపోయినా ఆరోగ్య సమస్యలే. అందుకే నా పెట్‌కి నెలకోసారి స్పాలో స్నానం, మూడు నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. నెలవారీగా రూ.3వేలు ఖర్చు అవుతుంది. అయితే వ్యాధులు వస్తే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్తరలివచ్చి.. తళుకులద్దగ..గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని నగరంలో కొన్ని సంస్థలు తమ ఆవరణలో అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెట్స్‌ని గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు వందకు పైగా మొబైల్ వ్యాన్లు ఈ పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నాయి. తమకు ఏడు వ్యాన్ల దాకా ఉన్నాయని, నగరవ్యాప్తంగా పెట్స్‌కు మొబైల్ స్పా సేవల్ని అందిస్తున్నాయని పెట్ గల్లీ సిబ్బంది సాక్షికి వివరించారు. జూబ్లీహిల్స్‌లోని పెట్ స్పాలో ప్రొఫెషనల్ గ్రూమర్ అయిన డి.సౌమ్య మాట్లాడుతూ, ‘ఇంతకుముందు, పెంపుడు జంతువును అలంకరించేందుకు ఇళ్లను సందర్శించేవాళ్లం. అయితే ఇళ్ల దగ్గరకు వెళ్లడం, అక్కడ సరైన ప్రైవసీ లేకపోవడం సహా అనేక రకాల ఇతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోగ్రూమింగ్ వ్యాన్ ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారింది’ అని చెప్పారు.నగరానికి చెందిన ప్రొఫెషనల్ పెట్ కేర్ సంస్థ పెట్ఫోక్కు చెందిన నిపుణులైన గ్రూమర్ల బృందం ఇప్పుడు పెంపుడు జంతువులకు ఇంటి దగ్గరే వారి వస్త్రధారణ సేవలను సైతం అందజేస్తుంది, అత్యాధునిక సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన వ్యాన్లను ఈ సంస్థ ఉపయోగిస్తోంది. యూజర్ ఫ్రెండ్లీ ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా, వెబ్ యాప్ మొబైల్ యాప్‌గా కూడా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.మెకానికల్ ఇంజనీర్ బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన చైత్ర సాయి దాసరి ప్రారంభించిన డోర్‌స్టెప్ సర్వీస్ జస్ట్ గ్రూమ్. ‘పెంపుడు జంతువులకు రిలాక్సేషన్ ఇచ్చి విశ్రాంతి తీసుకునేలా చేసే గ్రూమింగ్ సరీ్వస్ అవసరం. వీటికి వస్త్రధారణ కేవలం సౌందర్య సాధనం కాదు. ఇది పెంపుడు జంతువు మానసిక ఆరోగ్యానికి దారి కూడా. సరైన విధంగా లేని స్నానం చర్మ వ్యాధులు కలిగించి అవి వస్త్రధారణకు భయపడేలా చేస్తుంది’ అంటున్నారు చైత్ర. తమ జస్ట్ గ్రూమ్ ప్రస్తుతం జంటనగరాల వ్యాప్తంగా సంచరిస్తున్న తమ వ్యాన్స్ ద్వారా ప్రతిరోజూ కనీసం 50 పెట్స్‌కు సేవలు అందిస్తున్నారు. సొంత బిడ్డల్లాగే.. పెట్స్ కూడా..పెట్స్‌ను పెంచుకుంటున్న నగరవాసులు వాటిని సొంత పిల్లల్లాగే భావిస్తున్నారు. వాటి ఆరోగ్య సంరక్షణతో పాటు వాటికి అవసరమైన అన్ని రకాల అలంకరణలూ చేస్తున్నారు. తమతో పాటు వాటిని టూర్లు, షికార్లు, ఈవెంట్స్‌కు తీసుకువెళుతున్నారు. వీటన్నింటి వల్లే పెట్ గ్రూమింగ్ అత్యంత ప్రధానమైన అంశంగా మారింది. పెట్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేఫ్‌ను నిత్యం సందర్శిస్తుంటారంటే.. పెట్స్ పట్ల యజమానుల ప్రేమను అర్థం చేసుకోవచ్చు. – రుచిర, పెట్ కేఫ్ నిర్వాహకులుఇవి చదవండి: Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..! -
Fashion: మై వార్డ్రోబ్: క్రియేటివ్‌గా.. హుందాగా..!
మైండ్, బాడీ ఫిట్‌గా ఉంటే డ్రెస్సింగ్ కూడా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తుంది. ‘జిమ్‌లో వర్కవుట్స్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే, మన వార్డ్రోబ్ మైండ్ ఎక్సర్సైజ్’ అంటున్నారు హైదరాబాద్ వాసి ఫిట్నెస్ ట్రైనర్ అనుప్రసాద్. జిమ్వేర్తో పాటు రెగ్యులర్, పార్టీవేర్ విషయంలో తీసుకునే స్పెషల్ కేర్ గురించి అనుప్రసాద్ మాటల్లో...‘‘ఉదయం ఏ డ్రెస్ వేసుకోవాలనేది ప్రతిరోజూ ఆలోచించేలా చేస్తుంది. అందుకే, క్యాజువల్ వేర్‌గా కొన్ని, సందర్భానుసారంగా వార్డ్రోబ్ను సెట్ చేసుకుంటాను. సాధారణంగా తక్కువ డబ్బులతో డ్రెస్ ఎంపిక చేసుకొని, రిచ్‌గా ఉండేలా కనిపించడానికి ప్లాన్ చేస్తుంటాను. ఇండోవెస్ట్రన్ డ్రెస్‌తోనూ హుందాతనాన్ని, మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్టైల్‌గా కనిపించవచ్చు. పెయింటింగ్స్ వేస్తుంటాను కాబట్టి కలర్ కాంబినేషన్స్ విషయంలో అవగాహన ఉంది. చాలా వరకు మ్యాచింగ్ గురించి ఆలోచన చేయను. శారీస్ మీదకు కాంట్రాస్ట్, క్రాప్‌టాప్స్, ష్రగ్స్ కూడా సెట్ చేస్తాను. కాటన్స్కి ఎక్కువ ్రపాధాన్యత ఇస్తాను. బెస్ట్ డ్రెస్డ్ అవార్డ్..మిసెస్ ఇండియా తెలంగాణ బెస్ట్ డ్రెస్డ్ ఈవెంట్ (2019)కి క్రియేటివ్‌గా ఆలోచించాలనుకున్నాను. శారీ, బ్లౌజ్‌కి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ, బోనాలు.. మొదలైనవాటితో నేనే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేశాను. ఆ శారీనే కట్టుకున్నాను. రెండు వేల రూపాయల్లో ఆ శారీని తయారుచేసి, ప్రదర్శించి, అవార్డు దక్కించుకున్నాను.పూసలు గుచ్చి..లంగా ఓణీ, పట్టు చీరలు సంప్రదాయ వేడుకల సందర్భాలలో కట్టుకుంటాను. దీంట్లోనే ప్రత్యేకంగా కనిపించాలంటే బ్లౌజ్ సింగిల్ హ్యాండ్‌కి పూసల హారాలు లేయర్లు గుచ్చి, నాట్ చేస్తాను. దాదాపు నెలకు మూడు, నాలుగు ఈవెంట్లకు హాజరవుతుంటాను. అందుకు కొత్తదనం, నిండుదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.జిమ్ టీ షర్ట్స్..శారీస్‌కు సాధారణ బ్లౌజులే కాదు జిమ్‌కు వేసుకునే టీ షర్ట్స్ కూడా వాడతాను. బ్లాక్ క్రాప్‌టాప్ కాటన్ శారీకి వాడతాను. మంచి కలర్ కాంబినేషన్స్ ఉండేలా, సింపుల్ లుక్‌ని క్రియేట్ చేస్తాను. జిమ్‌లో మన కదలికలకు తగ్గినట్టు ఫ్లెక్సిబుల్ డ్రెస్ ఉండాలి. క్వాలిటీ కూడా చూడాలి. క్యాజువల్ వేర్‌గా జీన్స్, టీషర్ట్స్ మాత్రమే కాదు లాంగ్ స్కర్ట్స్ కూడా ఉపయోగిస్తాను.టై అండ్ డై చేస్తాను..వైట్ కాటన్ మెటీరియల్ తెప్పించుకొని, టై అండ్ డై టెక్నిక్‌తో కొత్త డిజైన్స్ సృష్టిస్తుంటాను. ఒక శారీకైతే వేరుశనగ గింజలను ముడివేసి, పెయింట్ చేశాను. త్రీడీ పెయింటింగ్స్ చేస్తుంటాను. ఏ వేస్ట్ మెటీరియల్ ఉన్నా దానిని అందంగా క్రియేట్ చేస్తాను. ఇండిపెండెంట్స్ డే వంటి అకేషన్స్‌కి ఎంచుకున్న శారీకి క్రాప్‌టాప్‌తో మ్యాచ్ చేశాను.జ్యువెలరీ తయారీ..తక్కువ ధరలో జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుంది. కొంచెం సమయం కేటాయిస్తే చాలు అలాంటి ఫ్యాషన్ జ్యువెలరీని మనమే ఇంకా తక్కువ ధరలో తయారుచేసుకోవచ్చు. బెల్ట్‌తో మరో స్టైలిష్ లుక్ వచ్చేలా చూసుకుంటాను. అలా.. క్లే జ్యువెలరీ, థ్రెడ్ జ్యువెలరీ నేనే తయారు చేసుకుంటాను’’ అని వివరించారు ఈ ఫిట్నెస్ ట్రైనర్.ఇవి చదవండి: 'శ్రుతి' తప్పిన ప్రకృతి.. కనురెప్పనూ కాటేసింది! -
Kadali: మై వార్డ్రోబ్.. కలర్ఫుల్గా.. కడలి అలలా!
‘కొత్త డ్రెస్ వేసుకుంటే ఆ రోజంతా హుషారుగా అనిపిస్తుంటుంది. అందుకే ఉదయం లేస్తూనే ఆ రోజు వేసుకోదగిన డ్రెస్ గురించి ప్లానింగ్ చేసుకుంటాను’ అంటోంది రచయిత్రి, సాంగ్ రైటర్ కడలి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి సాహిత్యం, సినిమాల్లో కృషి చేస్తున్న కడలి పాఠకులకు పరిచితమే. ‘రైటర్ అంటే కాటన్స్ మాత్రమే వేసుకోవాలనేం ఉండదు. కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులు ఏవైనా వేసుకోవచ్చు. అందుకే నా వార్డ్‌రోబ్‌లో అన్నీ మోడ్రన్, కలర్‌ఫుల్ డ్రెస్సులు ఉంటాయి’ అంటోంది కడలి.‘‘మన వార్డ్రోబ్ మనకు ఒక అద్దం లాంటిది. ఈ విషయం చెప్పడానికి నేను రాసిన ఒక కథను పరిచయం చేయాలి. ఆ కథలో ఒక యంగ్ అమ్మాయి హీరోయిన్ అవ్వాలనుకుంటుంది. కానీ చుట్టూ రకరకాల మాటలతో డిప్రెస్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. రైలు పట్టాల దగ్గరకు వెళ్లి అక్కడ జరిగిన ఒక సంఘటనతో ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అద్దంలో తన ముఖం చూసుకొని అందంగా తయారవ్వాలనుకుని కళ్లకు కాటుక పెట్టుకుంటుంది. తర్వాత జీవితంపై ఆశతో స్వీయప్రేరణతో తనను మెరుగు చేసుకుంటుంది ఆ కథలో. అంటే మనం ఎలా ఉండాలో మన చుట్టూ ఉన్నవారు డిసైడ్ చేయరు. మనకు మనమే నిర్ణయించుకోవాలి.నాకు నేను ప్రేరణగా!నేను షార్ట్స్ కూడా వేసుకుంటాను. బట్టలను బట్టి ఒక అమ్మాయి వ్యక్తిత్వాన్ని ఎలా జడ్జ్ చేస్తారో ఇప్పటికీ అర్ధం కాదు. అందుకే కొన్ని సభలకు టీ షర్ట్స్, జీన్స్ వేసుకెళతాను. ఈ అమ్మాయా రైటర్ రా?! అని ఆశ్చర్యపోయేవారున్నారు. ఏది సౌకర్యంగా ఉంటుందో అది వేసుకున్నంత మాత్రాన వ్యక్తిత్వానికి మార్కులు వేయకూడదు. ఎవరైనా అలా అన్నా నేను పట్టించుకోను. మీటింగ్ సందర్భాలలో కుర్తీస్ వేసుకుంటాను. రెడీ అవ్వాలి అనిపిస్తే మాత్రం ఏ మాత్రం రాజీ పడను. కాన్ఫిడెంట్‌గా ఉండాలి..నా మనసుకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను కాబట్టి కాన్ఫిడెంట్‌గా కూడా ఉంటాను. నా స్నేహితుల జాబితాలో ఫ్యాషన్ డిజైనర్లు ఉన్నారు. వారి డిజైన్స్ నాతో ట్రై చేస్తుంటారు. వాటిలో నచ్చినవి తీసుకుంటాను.అమ్మ చీరలను కొత్తగా!అమ్మ కట్టుకునే చీరలు చూసి నాకూ అలా చీరలు కట్టుకోవాలనిపిస్తుంది. మా అమ్మకు మూడు బీరువాల చీరలున్నాయి. రెగ్యులర్ చీరలు తప్ప వాటిని కట్టుకోదు. దీంతో అమ్మ చీరలను నేను కట్టుకుంటుంటాను. ‘అంచు చీరలు నీవేం కట్టుకుంటావు, పెద్దదానిలా’ అంటుంది. కానీ, బ్లౌజ్ డిజైన్‌తో స్టైలిష్ లుక్ తీసుకువస్తాను. దీంతో అమ్మ కూడా ఆశ్చర్యపోతూ ‘చాలా బాగుంది’ అని కితాబు ఇచ్చేస్తుంది. పండగలు, కుటుంబ ఫంక్షన్లు, వేడుకలకు సందర్భానికి తగినట్టు లంగాఓణీలు, పట్టుచీరలు అన్నీ ప్రయత్నిస్తాను.భిన్నంగా ఉండాలని..రచయిత్రి అనగానే ముతక చీరలు, కళ్లద్దాలు ఉండాలని చాలా మంది అనుకునేవారు. కానీ, నా వార్డ్రోబ్ మాత్రం వాటన్నింటికన్నా భిన్నం. రచయిత్రులు అంటే ఇలాగే ఉండాలి అనే ఆలోచనల్లోనుంచి ఒక మార్పు తీసుకురావాలని బుక్ లాంచింగ్ వంటి కార్యక్రమాలకు జీన్స్, టాప్స్ ట్రై చేస్తుంటాను. ప్రతీ రోజూ కొత్తగా ఉండాలనుకుంటాను. ఏ డ్రెస్ వేసుకొని రెడీ అవుతామో ఆ రోజు ఆ డ్రెస్ ప్రభావం మన మీద ఉంటుంది.ఫ్యాషన్ షోలు..దేశ, విదేశాల్లోనూ ఫ్యాషన్ షోలు నడుస్తుంటాయి. వాటిలో ప్రసిద్ధ డిజైనర్లు సీజన్‌ని బట్టి కలర్, డిజైన్ థీమ్‌ని పరిచయం చేస్తుంటారు. వాటి కోసం ఆన్లైన్ సెర్చింగ్‌తో పాటు, ఫ్యాషన్ మ్యాగజీన్స్ కూడా చూస్తుంటాను. ఆ కలర్ డ్రెస్ కాంబినేషన్స్ నేనూ ప్రయత్నిస్తుంటాను. ఎక్కువగా మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఇష్టపడతాను. ఆ కాంబినేషన్ డ్రెస్సులు కూడా చాలానే ఉన్నాయి నా దగ్గర’’ అంటూ వార్డ్రోబ్ విశేషాలను షేర్ చేసుకుంది. – నిర్మలారెడ్డి -
Nitasha Gaurav: న్యూ గ్రామర్ అండ్ గ్లామర్!
రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్. నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి -
Fashion: మనుసుకు నచ్చిన రంగులు.. కలర్ – కంఫర్ట్!
‘మనసుకు నచ్చిన రంగులు ఉండాలి. ట్రెండ్‌కు తగినట్టు ఉండాలి. స్పెషల్ లుక్ అనిపించాలి. అన్నింటికి మించి సౌకర్యంగా ఉండాలి’అంటూ ఎంచుకునే డ్రెస్సింగ్ విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఉంటున్న నిఖితారెడ్డి తన వార్డ్రోబ్ ముచ్చట్లను ఈ విధంగా పంచుకున్నారు.ఐదేళ్ల లోపు పిల్లలకు ఎంబ్రాయిడరీ డ్రెస్సులు ఆన్లైన్లో చాలా డిజైన్స్ వస్తున్నాయి. నా శారీ కలర్ లేదా పార్టీ థీమ్ కలర్‌ని బట్టి వాటిని ఎంపిక చేసుకుంటాను. పాప వేసుకున్న పింక్ కలర్ లెహంగా, దుపట్టా అలా ప్లాన్ చేసిందే. పట్టు డ్రెస్సులు మాత్రం మెటీరియల్ తీసుకొని, స్టిచింగ్ చేయిస్తాను.కలర్ కాంబినేషన్స్..నా ఫేవరెట్ కలర్స్ ఆరెంజ్, పింక్. దీంతో నా వార్డ్‌రోబ్‌లో ఈ కలర్ కాంబినేషన్ డ్రెస్సులు ఎక్కువ చేరుతుంటాయి. అయితే, ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటాను. చుడీదార్ ఎంపిక చేసుకున్నా ఒక చిన్న ఆరెంజ్ ఎలిమెంట్ అయినా ఉండాలి. ఇదే కాంబినేషన్లో బేబీ షవర్ సమయంలో మా ఫ్యామిలీ షూట్‌కి పట్టుచీర, కుర్తా పైజామా సెట్ ఆరెంజ్ కాంబినేషన్ ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నాం.సెలబ్రిటీ స్టయిల్..ఆరెంజ్ శారీ స్టైల్లో నటి అదితీరావు హైదరీ ఫొటో సోషల్ మీడియా లో చూశాను. నాకు బాగా నచ్చింది. ఆ విధంగా ఉండాలని ఆరెంజ్ శారీ, బ్లౌజ్ మెటీరియల్ అన్నీ సొంతంగా ఎంపిక చేసుకుని, డిజైన్ చేయించుకున్నాను. ముత్యాలు, పచ్చలు, కుందన్స్ కాంబినేషన్ జ్యువెలరీని దానికి సెట్ చేశాను.మిక్స్ అండ్ మ్యాచ్..పెళ్లి సమయంలో తీసుకున్న చీరలు, అమ్మవాళ్లు కానుకగా ఇచ్చినవి.. ప్రత్యేక సందర్భాలలో వేసుకోవడానికి బ్లౌజ్ డిజైన్స్ ద్వారా మార్పులు చేస్తుంటాను. కానీ, చాలా వరకు ఏ డ్రెస్ సెట్ ఎలా ఉంటే అలాగే వేసుకోవాలనుకుంటాను. పెద్దగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయను.థీమ్ పార్టీలు..ముందుగా కంఫర్ట్‌గా ఉండే డ్రెస్సులకే ్రపాధాన్యత ఇస్తాను. ఇప్పుడు మదర్ డాటర్ కాంబినేషన్ సెట్స్ వస్తున్నాయి. వాటిని ప్లాన్ చేస్తాను. అలాగే, పాపకు నాకు బర్త్ డే గిఫ్ట్స్ డ్రెస్సులు వస్తుంటాయి. వాటిని చిన్న మార్పులతో థీమ్డ్ పార్టీలకు ప్లాన్ చేస్తాను.ఎంబ్రాయిడరీ.. క్వాలిటీ ఫస్ట్..ఫ్లోరల్ ప్రింట్స్ స్టోర్స్‌లోనూ ఆన్‌లైన్‌లోనూ మార్కెట్లో ఎంపిక చేసుకుంటాను. కానీ, ఎంబ్రాయిడరీ అయితే కొన్ని ప్రత్యేకమైన చోట్లనే బాగుంటాయి. డిజైన్ పరంగానూ, క్వాలిటీ పరంగానూ బాగున్నవి అయితేనే ఎంబ్రాయిడరీ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను.ఫ్లోరల్స్..దగ్గరి బంధువుల పెళ్లిలో ప్రతిదీ వేడుకగా ఉండాల్సిందే. ముఖ్యంగా సంగీత్, హల్దీ, రిసెప్షన్.. వంటి వేడుకలకు వైవిధ్యంగా ఉండాలి. హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవ్వడానికి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లోరల్ జ్యువెలరీ బాగుంటుంది. ఇందుకు ఆన్లైన్ మార్కెట్లోనూ మంచి మంచి మోడల్స్ లభిస్తున్నాయి. ఫ్లోరల్ డిజైన్స్ అలా ఎంపిక చేసుకుని తీసుకున్నవే. మా కజిన్ హల్దీ ఫంక్షన్‌కి డ్రెస్ ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వెస్ట్రన్ స్టయిల్..బ్లాక్ థీమ్డ్ డ్రెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా, కజిన్స్‌తో బర్త్డేస్కు వెళ్లాలంటే మోడర్న్‌గా ఉండేవి ప్లాన్ చేసుకుంటాను.ప్రయాణాలకు ఒక స్టయిల్..ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎగ్జిబిషన్స్ స్టాల్స్ పెడుతుంటారు. వాటిలో లాంగ్ ఆరెంజ్ ఫ్రాక్ ఎంపిక చేసుకున్నాను. ఇలాంటివి టూర్స్‌కి వెళ్లినప్పుడు వేసుకుంటాను. వాటిల్లో ఫొటోస్ కూడా బ్రైట్‌గా వస్తాయి. అలాగే, లాంగ్ ఫ్రాక్స్లోనే డిఫరెంట్ మోడల్స్ ఉండేలా చూసుకుంటాను. -
తక్కువ బడ్జెట్లో బెటర్లుక్.. హుందాగా... కంఫర్ట్‌గా!
‘‘జాబ్, స్కూల్‌కి వెళ్లే ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో టైమ్ అసలు సరిపోదు. అయితే మనకోసం మనం కొంచెం టైమ్ అయినా ఉండేలా చూసుకోవాలి అనుకుంటాను. నలుగురిలోకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి, అదే విధంగా నా బడ్జెట్ ప్రకారం డ్రెస్సింగ్ ఉండేలా ఎంపిక చేసుకుంటాను.వేడుకలకు, ప్రత్యేక రోజుల్లో రెడీ అవడానికి ప్రతీ ఒక్కరూ తమదైన ప్టైటల్ని డ్రెస్సింగ్‌లో చూపుతుంటారు. హైదరాబాద్ ఎల్.బినగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని చందనామారం తన డ్రెస్సింగ్ గురించీ, వార్డ్రోబ్ విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. హుందాగా...ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు డిగ్నిఫైడ్గానూ, కంఫర్ట్గానూ ఉండేలా చూసుకుంటాను. అందుకు కుర్తీలు, జీన్స్ ఉంటాయి. వీటిలోనే మిక్స్ అండ్ మ్యాచ్‌కి ట్రై చేస్తుంటాను.డిజైనర్ శారీస్..రిసెప్షన్ వంటి వేడుకలకు డిజైనర్ శారీస్‌ను ఎంచుకుంటాను. జనరల్‌గా మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్‌ను కూడా ఫాలో అవుతుంటాను. వీటిలో నాకు ఎలాంటి ఔట్ఫిట్ అయితే బాగుంటుందో చెక్ చేస్తుంటాను. స్టిచింగ్కు సంబంధించినప్పుడు ఇన్‌స్టా పేజీలు కూడా చూస్తుంటాను. అలాంటి డిజైన్స్ చేయమని బొటిక్స్లో చెబుతుంటాను. శారీకి తగినట్టు బ్లౌజ్ సెట్ చే యడానికి డిజైనర్ హెల్ప్ తీసుకుంటాను.తక్కువ బడ్జెట్లో బెటర్లుక్..పెళ్లి, ఇంట్లో పండగలు వంటి సందర్భాలలో మనదైన సంప్రదాయ కట్టునే ఇష్టపడతాను. దీనికోసం ఎక్కడైనా శారీస్ కలెక్షన్ గురించి కూడా తెలుసుకుంటాను. కొన్నిచోట్ల నచ్చినా బడ్జెట్ మించి ఉంటే తీసుకోను. అయితే, అవే మోడల్స్‌లో మరో చోట ఒకటికి బదులు రెండు చీరలు వచ్చేలా ఎంపిక చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటాను. తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటాను. సాధారణంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చీరలు, డ్రెస్సులు వేసుకుంటే నలుగురిలో వెళ్లినప్పుడు మన అప్పిరియన్స్ బాగుంటుంది అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్లో బెటర్‌గా కనిపించేలా ΄్లాన్ చేసుకోవడం మంచిది’’ అని వివరిస్తున్నారు ఈ ఉద్యోగిని.నోట్: మీరూ మీ వార్డ్రోబ్ లేదా మీ అమ్మాయి వార్డ్రోబ్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో తీసుకుంటున్న విశేషాల గురించి ఫొటోలతో సహా ‘సాక్షి’ ΄ాఠకులతో పంచుకోవచ్చు. బాగున్న వాటిని మై వార్డ్రోబ్ శీర్షికన ప్రచురిస్తాం. మా చిరునామా: మై వార్డ్రోబ్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ –34. sakshifamily3@gmail.com -
ఫ్రీడమ్ కలర్స్.. ఇండిపెండెన్స్ స్టైల్స్..
గతంతో పోలిస్తే విభిన్నంగా యూత్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో ఫ్యాషన్, స్టైలింగ్ కూడా ఇప్పుడు భాగమైంది. వస్త్రధారణ, యాక్సెసరీస్లలో ట్రైకలర్స్ను జతచేస్తూ స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసుల్లో, కాలేజీల్లో అని తేడా లేకుండా ప్రతిచోటా నిర్వహిస్తున్న ఇండిపెండెన్స్ డే ఈవెంట్స్ ఈ ఫ్రీడమ్ ఫ్యాషన్‌కు సరికొత్త వన్నెలు అద్దుతున్నాయి. – సాక్షి, సిటీబ్యూరోదేశ భాషల్ని వేష భాషల్లో మమేకం చేసి ప్రదర్శించే అవకాశం అందిస్తుంది ఈ రోజు. నగరం నలువైపులా నిర్వహించుకునే వేడుకల్లో భాగం అవుతూ.. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా, ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా కనిపించాలనుకునే వారి కోసం నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ హామ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన డిజైన్, స్టైల్ ఫ్యాకలీ్టలు అందిస్తున్న సూచనలు ఇవే..త్రివర్ణశోభితంగా.. మహిళలు..సంప్రదాయంగా కనిపించాలంటే.. ఒక తెల్ల చీరపైన కుంకుమ పువ్వు, ఆకుపచ్చ అంచులు లేదా త్రివర్ణ మూలాంశంతో ఉండే చీర ఎంచుకోవాలి. అలాగే సంప్రదాయ ఆభరణాలు, మ్యాచింగ్ క్లచ్‌తో పూర్తి రూపాన్ని అలంకరించవచ్చు. అదే మోడ్రన్ లుక్‌లో కనిపించాలంటే ఈ రంగులలో చిక్ సల్వార్ కమీజ్ లేదా లెహంగా చోలీని కూడా ఎంచుకోవచ్చు. దీనికి తెలుపును జత చేయచ్చు. అదేవిధంగా కుంకుమపువ్వు/ఆరేంజ్ లేదా ఆకుపచ్చ దుపట్టా కుర్తీ అత్యాధునిక ఎంపికగా అనిపిస్తుంది.భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపొచ్చు ఇలా..భారతదేశ గొప్పతనం భిన్నత్వంలోని ఏకత్వం. ఇది ప్రదర్శించడానికి డ్రెస్సింగ్ చక్కని అవకాశం. మహిళలు.. ప్రాంతీయ వస్త్రధారణ: కంజీవరం పట్టుచీర వంటి నిర్దిష్ట ప్రాంతాల సంప్రదాయ దుస్తులను ధరించవచ్చు. తమిళనాడు లేదా గుజరాత్‌కు చెందిన బంధనీ దుపట్టాతో ప్రాంతీయ వైవిధ్యాన్ని హైలైట్ చేయచ్చు. అలాగే జూకాలు, బ్యాంగిల్స్ లేదా బంగారంతో కూడిన స్టేట్మెంట్ నెక్లెస్ ఇతర అలంకరణలు వస్త్రధారణకు పరిపూర్ణతను అందిస్తాయి. పురుషుల ధోతీ–కుర్తా లేదా త్రివర్ణ రంగులలో షేర్వాణి ఎంచుకోవచ్చు.స్టైలిష్: షేర్వానీపైన నెహ్రూ జాకెట్ ధరించడం అంటే ఆడంబరపు టచ్ జోడించినట్టే. అలాగే పాష్ లుక్ కోసం దుస్తులకు సంప్రదాయ తలపాగా లేదా సొగసైన వాచ్ వంటి ఇతర అలంకారాలు జత చేయచ్చు. ఆధునికత ఉట్టిపడాలంటే సంప్రదాయ దుస్తులకు పైస్లీ, పూలు లేదా రేఖాగణిత ప్రింట్లు వంటి నమూనాలు సమకాలీన ట్విస్ట్‌ను జోడిస్తాయి.ట్రైకలర్స్లో.. మేన్లీ.. మగవాళ్లు సంప్రదాయం ఉట్టిపడేలా కనిపించడానికి తెల్లని చుడిదార్ లేదా పైజామాతోనూ, కుంకుమపువ్వు లేదా ఆకుపచ్చ రంగు కుర్తా ధరిస్తే.. ఓ వైపు సౌకర్యవంతంగా మరోవైపు గౌరవప్రదంగానూ ఉంటుంది. అదనపు టచ్ కోసం సరిపోయే స్కార్ఫ్ లేదా స్టోల్‌ను జోడించవచ్చు. మోడ్రన్ లుక్‌లో మెరవాలంటే.. తెల్లటి చొక్కా మీద కుంకుమపువ్వు లేదా ఆకుపచ్చ రంగు టైలర్డ్ బ్లేజర్ని ధరించాలి. ఇది అఫిషియల్కూ.. ఫెస్టివల్‌కూ మధ్య సరైన సమతుల్యత.మరికొన్ని సూచనలు..ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో పూలకుర్తీ లేదా కుంకుమ పువ్వుతో కూడిన ప్రింటెడ్ చీరను మహిళలు ధరించవచ్చు. లగ్జరీ టచ్ కోసం కాటన్ లేదా సిల్క్ వంటి ఫ్యాబ్రిక్లను ఎంచుకోవాలి. అలాగే సూక్ష్మమైన త్రివర్ణ నమూనా లేదా జాతి ముద్రలతో కూడిన స్కార్ఫ్ లేదా శాలువా వస్త్రధారణకు నిండుదనాన్నిస్తుంది. కుంకుమ/ఆరెంజ్, ఆకుపచ్చ రంగులలో సున్నితమైన నమూనాలు లేదా ఎంబ్రాయిడరీతో కూడిన కుర్తా, సంప్రదాయ మూలాంశాలతో ప్రింటెడ్ షర్టులు కూడా మగవాళ్లకు స్టైలిష్ ఎంపికగా ఉంటాయి. ట్రైకలర్ జోష్‌ను జోడించడానికి మూడు రంగుల పాకెట్ చతురస్రాన్ని లేదా నమూనా స్కార్్ఫను ఎంచుకోవచ్చు.ఇతర అలంకరణ..స్టేట్మెంట్ క్లచ్ లేదా త్రివర్ణ–నేపథ్య హ్యాండ్‌బ్యాగ్‌తో ఫ్రీడమ్ టచ్‌ను జోడించవచ్చు. అయితే సహజ సౌందర్యాన్ని పెంచేలా పరిమిత మేకప్ వేసుకోవాలి. – బ్రౌన్ లేదా టాన్‌లో ఉన్న సంప్రదాయ లోఫర్లు లేదా కుర్తా–పైజామాతో పురుషుల ఫ్రీడమ్ లుక్‌ని పూర్తి చేస్తాయి. ఫార్మల్ సెట్టింగులు, న్యూట్రల్ షేడ్స్‌లో పాలిష్ చేసిన డ్రెస్ షూలు కూడా అనువైనవి.– ఇతర అలంకరణలు: క్లాసిక్ వాచ్, అధునాతన బెల్ట్ లేదా సొగసైన జత సన్ గ్లాసెస్ జోడించవచ్చు.పురుషుల కోసం..– త్రివర్ణ పాచెస్ లేదా ఎంబ్రాయిడరీతో సాదా కుర్తా లేదా షర్టును కొత్తగా మార్చవచ్చు. – విలక్షణమైన, సూక్ష్మమైన త్రివర్ణ వివరాలతో జాకెట్ లేదా వెయిస్ట్కోట్ను డిజైన్ చేయవచ్చు.భారతీయ సంస్కృతికి నిదర్శనంస్వాతంత్య్ర దినోత్సవం స్వేచ్ఛ, ఏకత్వం, సాంస్కృతిక వైవిధ్యంతో నిండిన వేడుక. వస్త్రధారణ ఈ రోజు దేశభక్తి స్వాతంత్య్రంపై గౌరవాన్ని మాత్రమే కాకుండా వ్యక్తిగత శైలి, సాంస్కృతిక సంపదను కూడా ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఎంచుకున్న వస్త్రధారణ సంప్రదాయమైనా, ఆధునికమైనదైనా లేదా రెండింటినీ మిళితం చేసినదైనా సరే, దాన్ని అత్యంత అంగీకారయోగ్యంగా ధరించడమే కీలకం. స్వాతంత్య్ర థీమ్‌తో డ్రెస్సింగ్ అంటే పార్టీ కల్చర్‌కు కాదు భారతీయ సంస్కృతికి నిదర్శనం అనేది గుర్తుంచుకోవాలి.మహిళల కోసం..సాదా దుపట్టాకు మూడు రంగుల ఎంబ్రాయిడరీని జోడించవచ్చు. లేదా హెడ్బ్యాండ్లు లేదా బ్రోచెస్ వంటి వాటితో స్పెషల్ లుక్‌ను తీసుకురావచ్చు. త్రివర్ణ స్వరాలు లేదా ప్రత్యేక థీమ్డ్ చీర లేదా సల్వార్ కమీజ్‌ని డిజైన్ చేసుకోవచ్చు.ఇవి చదవండి: 18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్ కుమార్ -
మై వార్డ్రోబ్! టీనేజర్‌కు బెస్ట్ 5 ఇవే..!
‘అమ్మా!, ఈ డ్రెస్ సరిగా లేదు, ఈ డిజైన్ ఓల్డ్.. అందరిలోనూ డల్‌గా కనిపిస్తాను, అందుకే నేను ఫంక్షన్‌కు రాను’ అనే మాటలు టీనేజ్ అమ్మాయిలు ఉన్న ఇంట్లో తరచూ వినిపిస్తుంటాయి. ఎంపిక చేసిన డ్రెస్ సరిగా లేదనో, మ్యాచింగ్ కుదరలేదనో ... చెప్పే మాటలు అమ్మలకు పెద్ద సవాల్‌గా ఉంటాయి. ‘‘మరో అకేషన్‌కి బెస్ట్ది సెలక్ట్ చేద్దాం. ఇప్పటికి ఇలా రెడీ అయి పో’’ అని కూతుళ్లకు సర్దిచెబుతూ ఉంటారు అమ్మలు. ‘ఇలాంటి ఇబ్బందికర సందర్భాలు ఎదురవకుండా సందర్భానికి తగినట్టు రెడీ అవడానికి మా అమ్మాయి విషయంలో సింపుల్‌గా అనిపించే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతుంటాను’ అని చెబుతున్నారు సంయుక్తా మరపడగ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న సంయుక్త చెబుతున్న విశేషాలు.‘సాధారణంగా అమ్మాయిల డ్రెస్సింగ్ కోసం తరచూ షాపింగ్ చేస్తుంటాం. బాగున్నవీ, బాగోలేనివీ వార్డ్‌రోబ్‌లో చాలా డ్రెస్సులు వచ్చి చేరుతుంటాయి. ప్రతీసారీ కొత్తగా అనిపించేలా డ్రెస్సింగ్ ఉండేలా చూసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. ప్రతీ ఈవెంట్‌కి సందర్భానికి తగినట్టు డ్రెస్సింగ్ అవడం తప్పనిసరి కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.బెస్ట్ ఆఫ్ 5..క్యాజువల్‌గా బయటకు, రోజూ కాలేజీకి, పండగలు, గెట్ టు గెదర్స్, పెళ్ళిళ్లు.. ఇలా సందర్భాలను బట్టి మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. వాటిలో బెస్ట్ 5 అనేవి ఎంపిక చేసుకోవాలి. 1. సాధారణంగా బయటకు వెళ్లినప్పడు ఫంకీ స్టైల్ ఉంటే బాగుంటుంది. అందుకు మోడర్న్ వేర్ని ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనే స్ట్రీట్ స్టైల్ మిక్స్ అండ్ మ్యాచ్ డ్రెసింగ్ అయితే బాగుంటుంది. 2. పండగలకు, ఎంగేజ్మెంట్స్కి సంప్రదాయ లుక్‌లో కనిపించాలి. ఇందుకు ఫ్యాన్సీ టచ్ ను మిక్సప్ చేయచ్చు. ఇండోవెస్ట్రన్ డ్రెస్సింగ్ కూడా ఈ సందర్భాలలో బాగుంటుంది.3. కాలేజీలో ప్రత్యేకమైన ఈవెంట్స్ ఉన్నా ఫంకీ లుక్‌తో ఉండే ప్లెయిన్ ఫ్యాబ్రిక్స్ బాగుంటాయి. వీటిలోనే ముదురు, లేత రంగుల కాంబినేషన్స్ ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో డార్క్ కలర్ టాప్స్, లైట్ షేడ్స్ స్కర్ట్స్‌ని వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవచ్చు. పూర్తి వెస్ట్రన్ స్టైల్స్ కూడా కాలేజీ ఈవెంట్స్‌కు బాగుంటాయి. 4. వివాహ వేడుకలకు బెనారస్, పైథానీ, ఇకత్, పట్టుతో తయారైన ఏ ఫ్యాబ్రిక్‌తో అయినా లెహంగా, శారీ, చుడీదార్ డిజైన్స్.. ఎంపిక చేసుకోవచ్చు. వీటిలోనూ జాకెట్స్, టాప్స్.. వెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేయించుకోవచ్చు. 5. ఒక్కో ఈవెంట్‌కు ఒక్కో స్టైల్లో కనిపించేలా కనీసం 5 నుంచి 6 డ్రెస్‌లు సిద్ధంగా ఉంటే వాటినే మిక్స్ అండ్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు. లెహంగా ప్లెయిన్ ఉంటే డార్క్ బ్లౌజ్ క్రాప్ టాప్స్, వెస్ట్రన్ టాప్స్‌తో మిక్సప్ చేయచ్చు."మా అమ్మాయి వార్డ్‌రోబ్‌లో ఇలా సందర్భానికి తగినట్టు డ్రెస్సులు ఉండేలా చూసుకోవడం వల్ల ఎంత పెద్ద అకేషన్ వచ్చినా పెద్దగా ఇబ్బందిగా అనిపించదు. దీనివల్ల టైమ్ ఆదా అవుతుంది. అనవసర షాపింగ్కూడా తగ్గుతుంది.’’ – నిర్మలారెడ్డి"ఆభరణాల ఎంపిక కాలేజీ ఈవెంట్స్‌కి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ముదురు రంగు డ్రెస్సుల మీదకు ముత్యాలు లేదా పెండెంట్ ఉండే సన్నని చెయిన్ ధరిస్తే చాలు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ అయితే ఇయర్ రింగ్స్‌తో మేనేజ్ చేయచ్చు. పూర్తి సంప్రదాయ లుక్ అయితే సందర్భాన్ని బట్టి టెంపుల్ జ్యువెలరీని ఎంపిక చేసుకుంటే చాలు." – సంయుక్త మరపడగఇవి చదవండి: Aarti Kumar Rao: ప్రయాణ దారులలో.. ప్రకృతి గీతాలతో.. -
Fashion: స్కర్టే.. సూపర్ స్టయిల్!
అమ్మాయిల సంప్రదాయ అలంకరణలో స్కర్ట్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకేతరహా ఫ్యాబ్రిక్‌తో స్కర్ట్ సాదాసీదాగా కనిపించేది. దీనికి అదనపు హంగుగా కుచ్చులు జత చేసి, ఒకవైపు నుంచి మరోవైపుకు సెట్ చేస్తే.. వచ్చిన స్టైల్ డ్రేప్డ్ స్కర్ట్. షార్ట్ కుర్తీ, ట్యునిక్, ఖఫ్తాన్ వంటి టాప్స్ ఎంపిక ఏదైనా డ్రేప్డ్ స్కర్ట్‌కి జత చేస్తే ఆ స్టైల్ అదుర్సే మరి.ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌గా ఆకట్టుకునే డ్రేప్డ్ స్కర్ట్ వెస్ట్రన్ స్టైల్లోనూ యంగ్‌స్టర్స్‌ని ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్లు, ఎంబ్రాయిడరీ వర్క్‌తో మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంటుంది.డ్రేప్డ్ స్కర్ట్ అంచులు ఎగుడు దిగుడుగా ఉండటమే దీని ప్రత్యేకత. అందుకే ఎక్కువ భాగం ఈ స్కర్ట్‌కి ఎంబ్రాయిడరీ వంటి హంగులు అవసరం లేదు. టాప్‌గా ఎంచుకునే కుర్తీ, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్, ఖఫ్తాన్, ట్యునిక్స్ని ఎంబ్రాయిడరీ లేదా ఫ్లోర ల్ వర్క్‌తో రిచ్లుక్ని తీసుకురావచ్చు.ప్లెయిన్ శాటిన్, సిల్క్ మెటీరియల్‌తో విరివిగా కనిపించే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఇండోవెస్ట్రన్ లుక్‌ని సొంతం చేస్తుంది. అందుకే ఈ స్టైల్ యూత్‌ని అట్రాక్ట్ చేస్తుంది.టాప్ టు బాటమ్ ఒకే రంగులో ప్లెయిన్‌గా ఉండే డ్రేప్డ్ స్కర్ట్ సెట్స్ ఫ్యామిలీ గెట్ టు గెదర్ వేడుకలకు ప్రత్యేకంగా నిలిస్తే, పట్టు, ఫ్లోరల్, జరీ వర్క్‌తో డిజైన్ చేసినవి వివాహ వేడుకలలోనూ గ్రాండ్‌గా కనిపిస్తాయి.ఇవి చదవండి: Priya Sisters: ఆదాయం కన్నా.. అభిరుచిగానే మిన్న! -
ఫ్లోరల్ డిజైన్ దుస్తుల్లో ‘చందమామ’లా సత్యభామ (ఫోటోలు)
-
వేసవికి నప్పే.. వింటేజ్ స్టైల్ ఇదే..!
పెరిగే ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా ఉండాలి. మిక్స్ అండ్ మ్యాచ్ ఎంపిక క్యాజువల్ అనిపించాలి. పాతకాలపు కాంతులు కట్టిపడేస్తున్నట్టే ఉండాలి. వెస్ట్రన్ టచ్‌తో ఆకట్టుకునేలా ఉండాలి. కాలానికి తగినట్టు, కలర్ఫుల్గా కనిపించాలి. తమవైన నైపుణ్యాలను జోడించే ఫ్యాషన్ ఔత్సాహికులు వింటేజ్ స్టైల్‌ని మెరిపిస్తున్నారు. మట్టి రంగులు.. సాధారణంగా లేత రంగులను ఈ సీజన్‌కి ఎంచుకుంటాం. అయితే, వెస్ట్రన్ వింటేజ్ స్టైల్‌కి ముదురు గోధుమ, ఎరుపు, నారింజ ఈ సీజన్లో మొదటి వరసలో ఉంటాయి. ఈ రంగులు వెస్ట్రన్ వస్త్రధారణకు సహజ సౌందర్యాన్ని జోడించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రంగులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాయి. క్యాజువల్ వేర్కి సొగసును అందిస్తాయి. లేసులు, అల్లికలు.. ఈ సీజన్లో మరో ఆకర్షణగా కనిపించేది డెనిమ్ ఎలిమెంట్స్, లేసులు, అల్లికల అంచులు గల డ్రెస్సులు వెస్ట్రన్ ఫ్యాషన్‌లో మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇవి, డ్రెస్సులకు ఉల్లాసభరితమైన అలంకరణను జోడిస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ప్లెయిన్ స్వెడ్ టాప్ లేదా జాకెట్స్, అంచులతో డిజైన్ చేసినవి ఈ సీజన్ స్టైల్‌కి బాగా నప్పుతాయి. ఇవి మోడ్రన్ టచ్, వింటేజ్ స్టైల్‌తో ఆకట్టుకుంటాయి. డెనిమ్‌తో జత చేసే ప్రింటెడ్ ఫ్యాబ్రిక్ స్కర్టులు, బ్లేజర్లతో మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఆధునికపు హంగులతో మెరిసి΄ోతారు. స్టెట్సన్ టోపీలు, కౌబాయ్ బూట్లు డ్రెస్సులకు వెస్ట్రన్ లుక్‌ని ఇట్టే తీసుకువస్తాయి. పూసల దండలు, ఇతర ఫ్యాషన్ జ్యువెలరీ, సన్నని హ్యాండల్ గల బ్యాగ్‌తో పూర్తిగా వింటేజ్ లుక్‌తో అట్రాక్ట్ చేస్తారు. ఇవి చదవండి: Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్. -
హెల్త్: 'మెగా షేప్ మసాజర్' తో.. ఫిట్నెస్ సెంటర్స్‌కి చెక్!
ఏ డ్రెస్ వేసుకున్నా.. అతికినట్టు సరిపోవాలంటే బాడీ సరైన షేప్‌లో ఉండాలి. అందుకే స్లిమ్ అండ్ ఫిట్ షేప్ కోసం నానాతంటాలు పడేది! ఆ కష్టాన్నించి గట్టెక్కించేదే ఈ మసాజర్. ఇది చక్కటి శరీరాకృతిని అందిస్తుంది. దీన్ని సాధారణ సమయాల్లోనే కాదు.. స్నానం చేస్తున్నప్పుడూ వాడుకోవచ్చు. సాధారణంగా మెషిన్స్‌కి వాటర్ తగిలితే పనిచేయవు. కానీ ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందిన మెషిన్ కాబట్టి.. వాటర్‌ప్రూఫ్‌గా పనిచేస్తుంది. దాంతో స్నానం చేస్తూ కూడా దీన్ని చాలా సులభంగా ఉపయోగించుకోవచ్చు. మొదట ఏదైనా ఆయిల్ లేదా స్కిన్ టైటెనింగ్ క్రీమ్‌ని అప్లై చేసుకుని.. ఈ మసాజర్‌తో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మొత్తం 8 రోలర్లు, 13 ప్రోట్రూషన్ లతో కూడిన ఈ బ్యూటీ మసాజర్.. ఒత్తిడిని దూరం చేస్తుంది. డివైస్‌కి అమర్చుకునే రోలర్స్.. నాలుగు నాలుగు చొప్పున రెండు పార్ట్స్‌గా అమర్చి ఉంటాయి. అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు. మసాజ్ సమయంలో స్పీడ్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కొవ్వును తగ్గిస్తూ యవ్వనంగా మారుస్తుంది. ఈ డివైస్‌తో పాటు.. ఎసిటినో 5డి డిజైనింగ్ క్రీమ్ కూడా లభిస్తుంది. దీన్ని విడిగా కూడా మార్కెట్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫిట్నెస్ సెంటర్స్‌కి వెళ్లాల్సిన పని లేకుండానే.. ఈ డివైస్ మిమ్మల్ని నాజూగ్గా, స్లిమ్‌గా మారుస్తుంది. దీనికి 3 గంటల పాటు చార్జింగ్ పెడితే.. సుమారు 30 గంటల పాటు పని చేస్తుంది. కాళ్లు, చేతులు, నడుము, మెడ, పొట్ట భాగాల్లో పేరుకున్న కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని మెత్తటి క్లాత్ లేదా టిష్యూ సాయంతో క్లీన్ చేసుకోవచ్చు. వినియోగించడం.. ఇతర ప్రదేశాలకు తీసుకుని వెళ్లడం అంతా సులభమే. దీని ధర 207 డాలర్లు. అంటే 17,167 రూపాయలు. ఇవి చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే! -
ఫైనల్లీ.. తన క్రష్ ఎవరో బయటపెట్టిన రష్మిక!
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యానిమల్ మూవీతో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రష్మిక.. స్టార్ హీరోలకి మించిన ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. వరుస హిట్స్‌తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. అటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక రష్మిక అండే పడి చచ్చే అభిమానులు ఎంతో మంది ఉంటారు. మరి రష్మిక క్రష్ ఎవరో తెలుసా? ఈమధ్యే తన క్రష్‌ని బయటపెట్టింది రష్మిక. సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారు అంటూ రీసెంట్‌గానే చెప్పుకొచ్చింది. ఇక యానిమల్ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించింది ఈ బ్యూటీ. సాంప్రదాయంగా కనిపిస్తూనే ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేయడంలో తగ్గేదేలే అంటుంది రష్మిక. ఇక తన దుస్తుల్లో స్ట్టన్నింగ్గా కంటే కంఫర్ట్‌గా ఉండటాన్నే ఇష్టపడతాను. అందుకే కంఫర్ట్‌గా ఉండే ఔట్ఫిట్సే నా ఫ్యాషన్ స్టయిల్ అంటూ రివీల్ చేసింది. తాజాగా ప్రమోషన్స్‌లో గులాబీ రంగు చీరలో తళుక్కుమంది ఈ బ్యూటీ. ప్రముఖ డిజైనర్ అర్పితా మెహతా డిజైన్ చేసిన ఈ చీర ధర అక్షరాలు రూ. 1,90,000లుగా ఉంది. -
అందరిలో ఒకరిగా ఉండటానికే చీర కట్టు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఓ వార్తా సంస్థతో తన పర్సనల్, పొలిటికల్ లైఫ్‌కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు ప్రతిసారి చీరనే ఎందుకు ధరిస్తారన్న ప్రశ్నకు కవిత క్లారిటీ ఇచ్చారు. ‘పొలిటీషియన్‌గా ఉన్న నేను ఒక పద్ధతి ప్రకారం దుస్తులు ధరించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు నన్ను తమలో ఒకరిగా భావించాలంటే వారిలాగే నేనూ ఉండాల్సి ఉంటుంది. అప్పుడే వారు నన్ను కలవడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. డిఫరెంట్ స్టైల్లో నా డ్రెస్సింగ్ ఉంటే వారు నా వద్దకు ఎందుకు వస్తారు’ అని కవిత సమాధానమిచ్చారు. ఇక లిక్కర్ స్కామ్‌లో విచారణ గురించి అడగ్గా ‘మాది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. దర్యాప్తు సంస్థలు నాకు సమన్లు పంపించినపుడు మా ఇంట్లో వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ఒక కుటుంబ సభ్యురాలు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు వారికి చాలా కష్టంగా ఉంటుంది’ అని కవిత చెప్పారు. కేరళ సీఎం పినరయి విజయన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తనకు ఇష్టమైన పొలిటీషియన్లని వారి నుంచి నేర్చుకొని రాజకీయ నేతగా ఇంకా ఎదగడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇదీ చదవండి..అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం -
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్‌ని ఇప్పుడు యూత్ ఫాలో అవుతోంది. ఫోక్ సాంగ్స్‌ని ఆనందించినట్టే ఫోక్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వద్దు, ట్రెండ్‌సెట్టర్‌గా ఉండాలి అనే ట్యాగ్‌తో కొంత వెస్ట్రన్ టచ్‌ని జత చేసి మరీ మెరిసిపోతున్నారు. ఈ గణపతి నవరాత్రులకు మనదైన కళతో వెలిగి పోవాలనుకునేవారికి ఈ స్టైల్ సరైన ఎంపిక అవుతుంది. ధోతీ ప్యాంట్స్‌లో ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఇవి అబ్బాయిల కోసమే అనేది పాత మాట. ప్రాచీన జానపద మూలాంశాలతో మనదైన సంప్రదాయ కళతో రూపొందింది ఈ స్టైల్. టులిప్ ప్యాంట్‌గా టర్న్ అయిన ఈ స్టైల్ ఈ నవరాత్రి వేడుకలలో హైలైట్ కానుంది. హెవీ ఎంబ్రాయిడరీ, పొట్లీ, షెల్ లేస్ ఉన్న ఫ్లెయిరీ కేడియా టాప్ నవరాత్రి ఉత్సవంలో రాక్ అండ్ రోల్ చేయడానికి పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఇవి విదేశాలలోనూ చాలా ప్రాచుర్యం పొందాయి. చందేరీ, మధుబని, బ్లాక్ ప్రింట్లతో కలిపి ఈ ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు. షర్ట్ అండ్ స్కర్ట్ ప్రింటెడ్ స్కర్ట్ లేదా పలాజో స్కర్ట్, కాలర్ నెక్ షర్ట్ సౌకర్యంగానూ ఉంటుంది. విలేజ్ స్టైల్‌కి వెస్ట్రన్ టచ్ ఇచ్చినా సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రైబల్ జ్యువెలరీ ధరిస్తే చాలు న్యూ లుక్‌తో మెరిసిపోతారు. చెక్స్ శారీస్.. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనదైన సంస్కృతిని ప్రతిబింబించేది చీరకట్టు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, పండగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రం చీర ధరించడం ఇప్పటికీ చూస్తుంటాం. అయితే.. వింటేజ్, విలేజ్‌తో పాటు ఫోక్ స్టైల్ కూడా కట్టులో తీసుకురావాలంటే మాత్రం చెక్స్ కాటన్ శారీ, సిల్వర్ జ్యువెలరీ మంచి ఎంపిక అవుతుంది. మనవైన హ్యాండ్లూమ్స్ ఇక్కత్, బ్లాక్ ప్రింట్ అనార్కలీ, అంగరఖా, లాంగ్ గౌన్లు విలేజ్ స్టైల్లో ఆకట్టుకుంటాయి. ఘాగ్రా లేదా ఏదైనా పట్టు లెహంగా వంటివి ధరించినప్పుడు పటోలా దుపట్టాలు వేసుకుంటే విలేజ్ స్టైల్‌కి దగ్గరగా ఉన్నట్టే కాదు ప్రత్యేకంగానూ కనిపిస్తారు. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్ -
ఫ్యాషన్ టాక్: వానలో తడవకుండా స్టయిల్‌గా కనిపించాలా? పాంచోస్ బెస్ట్
చిటపట చినుకులను ఆనందించాలి. తడవకుండా మెరిసిపోవాలి. కొత్తగా ఉండాలి. స్టయిల్‌గా కనిపించాలి. మబ్బు పట్టిన సమయమైనా ముసురు పట్టిన రోజులైనా డ్రెస్‌కు అడ్రెస్‌గా ఉంటూ టెన్షన్ ఫ్రీగా గడిపేయాలనుకునేవారికి డిజైనర్ వాటర్ ప్రూఫ్ పాంచోస్ రెడీ టూ వేర్ గా ఆకట్టుకుంటున్నాయి. వానల్లో తడవకుండా ఉండటానికి గొడుగు లేదా లాంగ్ జాకెట్స్ మనకు వెంటనే గుర్తుకువస్తాయి. అంతకు మించి వానకాలంలో స్టయిల్‌గా కనిపించాలనుకుంటే ఇంకేమీ లేవా అనుకునేవారికి వాటర్ ప్రూఫ్ పాంచోస్ మేమున్నామని గుర్తు చేస్తున్నాయి. సహజంగా వేసవి కాలాన్ని సౌకర్యంగా మురిపించిన సిల్క్ అండ్ కాటన్ పాంచోస్ ఇప్పుడు వానకాలాన్ని వాటర్‌ప్రూఫ్‌తో ముస్తాబు చేసుకొని వచ్చాయి. పోల్కా డాట్స్, త్రీడీ ప్రింట్స్, లైన్స్, ఫ్లోరల్స్, యానిమల్ ప్రింట్స్‌తో ఆకట్టుకునే ఈ పాంచోస్ ఒక్కోరోజును ఒక్కో రంగుతో ఎంపిక చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ అందుబాటులో ఉన్న ఈ పాంచోని డ్రెస్ కలర్‌ని బట్టి కూడా సెలక్ట్ చేసుకోవచ్చు. -
దుస్తులపై అసభ్య వ్యాఖ్యలు.. బీజేపీ నాయకురాలిపై ఉర్ఫి జావేద్ ఫిర్యాదు
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి బిగ్‌బాస్ ఓటీటీ ఫేం, బుల్లితెర నటి ఉర్ఫి జావేద్ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్‌తో వార్తల్లో నిలవడం ఉర్ఫికి అలవాటు.బాదే భయ్యా కీ దుల్హనియా’సీరియల్‌తో బుల్లితెరపై అడుగుపెట్టిన ఉర్ఫి.. ‘దుర్గా’, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్ ఓటీటీ’లో పాల్గొన్న మంచి పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా ఢిఫరెంట్ డ్రెస్‌లతో అందరినీ అట్రాక్ట్ చేస్తుంటుంది 25 ఏళ్ల ఈ భామ. తాజాగా ఉర్ఫి జావేద్.. బీజేపీ మహిళా నేత చిత్ర కిషోర్ వాఘ్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. తను ధరించే దుస్తులపై వాఘే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. పబ్లిక్ డొమైన్లో ఉన్న నటిపై బెదిరింపులకు పాల్పడినందుకు వాఘ్‌పై ఫిర్యాదు నమోదైందని ఉర్ఫి తరపు న్యాయవాది నితిన్ సత్పుటే తెలిపారు. ప్రజల్లో గుర్తింంపు పొందిన మోడల్/నటికి హాని కలిగించేలా బీజేపీ నేత చిత్ర కిషోర్ వాఘ్‌పై ఐపీసీ సెక్షన్ U/s 153(A)(B), 504, 506, 506(ii) కింద ఫిర్యాదు చేశాను. మహిళా కమిషన్ చైర్ పర్సన్ రుపలీ చకంకర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తాను. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే చిత్ర వాఘే వ్యాఖ్యల అతనంరం నటి ప్రాణాలకు ముప్పు ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని కోరాను’ అని జావేద్ తరపు న్యాయవాది నితిన్ సత్పుటే అన్నారు. भाषा नको तर कृती हवी.. सार्वजनिक ठिकाणी उघडंनागडं फिरणं हि आपल्या महाराष्ट्राची संस्कृती आहे का ? मुंबईतल्या भर रस्त्यात उर्फीच्या या शरीरप्रदर्शनाचं जे अतिशय बिभत्स आहे @Maha_MahilaAyog समर्थन करतंय का ? आणि हो …कायदा कायद्याचं काम करणारंच महिला आयोग काही करणार की नाही ? pic.twitter.com/O0KSb9A5r7 — Chitra Kishor Wagh (@ChitraKWagh) January 4, 2023 కాగా జనవరి 4న బీజేపీ నేత కిషోర్ వాఘే ఉర్ఫి జావేద్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె డ్రెస్సింగ్‌పై మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా? అని ప్రశ్నించారు. వీధుల్లో బహిరంగంగా అర్ధనగ్నంగా మహిళలు నడుస్తున్నారని ఈ విషయాన్ని మహిళా కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు.. ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈ నిరసన ఉర్ఫిజావేద్పై కాదని అలా అర్ధనగ్నంగా బహిరంగ ప్రదేశాల్లో నడవడంపై మాత్రమే అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో వీడియో విడుదల చేశారు. ఈ ట్వీట్లపై స్పందించిన ఉర్ఫి జావేద్ తన న్యాయవాది ద్వారా మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. -
ఆఫీస్‌కి రావాలంటే అవి తప్పనిసరి.. ఎయిర్ ఇండియా కొత్త రూల్స్
టాటా గ్రూప్.. ఈ సంస్థకు ఉన్న పేరు ప్రఖ్యాతలు, మార్కెట్లో వాటికున్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక వ్యాపారంలో అడుగుపెడితే తమ సంస్థ మార్క్ పని తీరుతో లాభాల బాట పట్టించడం టాటా గ్రూప్ ప్రత్యేకత. ఇటీవల భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ఈ సంస్థ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సంస్థను కూడా మిగిలిన సంస్థల మాదిరి లాభాలవైపు నడిపేందుకే వ్యూహాలు రచిస్తోంది టాటా గ్రూప్. ఈ క్రమంలోనే యాజమాన్యంలో ఎయిర్ ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా విమానాల్లో పనిచేసే క్యాబిన్ క్రూ, సిబ్బంది అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఉండేలా వారి ఆహార్యంలో మార్పులు తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే పురుషులు, మహిళా సిబ్బంది వస్త్రధారణకు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. అందులో కొన్నింటిని తెలుసుకుందాం.. పురుషుల కోసం ►హెయిర్ జెల్ వాడకం తప్పనిసరి. ► బట్టతల లేదా జుట్టు ఎక్కువగా ఊడిపోయిన వారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ఇక ప్రతి రోజూ షేవ్ చేసుకుంటూ ఉండాలి. ►తెల్లవెంట్రకలు ఉన్నవారు సహజ సిద్దంగా ఉండేలా వారి జుట్టుకు రంగు వేసుకోవాలి. ఫ్యాషన్ రంగులు, హెన్నా వంటివి వేసుకోకూడదు. మహిళల కోసం ►ముత్యాల చెవిపోగులు ధరించకూడదు. ఫ్లైట్ అటెండెంట్లు డిజైన్ లేకుండా బంగారం లేదా డైమండ్ ఆకారపు చెవిపోగులు మాత్రమే ధరించాలి. ►రింగ్స్ వెడల్పు 1 cm కంటే ఎక్కువగా ఉండకూడు. అది కూడా చేతికి ఒకటి మాత్రమే. ►అమ్మాయిలు కూడా జుట్టు నెరిసిపోతే సహజ షేడ్స్ లేదా కంపెనీ హెయిర్ కలర్ షేడ్ కార్డ్‌లో ఉండే రంగు వేసుకోవాలి. చదవండి: షాకింగ్: గూగుల్ పే, పోన్‌పేలాంటి యాప్స్‌లో ఇక ఆ లావాదేవీలకు చెక్? -
రణ్వీర్ సింగ్ డ్రెస్ వేసుకొచ్చావా.. దీపికాపై ట్రోలింగ్
Deepika Padukone Trolled On Her Dress: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే పనులు, చేష్టలు, డ్రెస్సింగ్ విధానాల వల్ల ప్రశంసల జల్లులు కురిస్తే ఒక్కోసారి అభాసుపాలవుతారు. నెటిజన్ల ట్రోలింగ్ బారిన పడిన అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా బీటౌన్ డింపుల్ సుందరి, రణ్వీర్ సింగ్ భార్య దీపికా పదుకొణె ట్రోలింగ్‌కు గురైంది. ఇటీవల శకున్ బాత్ర తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా 'గెహ్రైయాన్' చిత్రంలో అలీషాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో బిజీగా ఉంది దీపికా. అయితే ఇటీవల జరిగిన ప్రమోషన్లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. దీపికా పదుకొణె జీబ్రా ప్రింట్ బ్లేజర్‌ను ధరించి ఈ సినిమా మిగతా టీమ్ అయిన అనన్య పాండే, సిద్ధాంత్ చతుర్వేది, డైరెక్టర్ శకున్ బాత్రాతో కనువిందు చేసింది. దీపికా ఆ వేర్లో అందంగా కనిపించినప్పటికీ నెటిజన్లు ట్రోల్ చేశారు. 'రణ్వీర్ డ్రెస్ వేసుకున్న దీపికా' అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు 'దీపికాకు కొత్త స్టైలిస్ట్, మేకప్ ఆర్టిస్ట్ కావాలి' అని సూచించారు. ఇంకొకకరైతే 'నేను నిజంగా దీపిక, రణ్వీర్ సింగ్‌ల డిజైనర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. దీపికా ఒకప్పుడు చాలా అందంగా స్టైలిష్‌గా ఉండేది. కానీ ఇప్పుడు..' అంటూ కామెంట్ పెట్టారు. దీపికా అభిమానులైతే లవ్ సింబల్స్‌తో తమ ప్రేమను తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Tanzania: ‘ఏంటో ఈ వింత’.. మహిళా ఎంపీ దుస్తులపై విమర్శలు
డోడోమా: సాధారణంగా పార్లమెంట్ సమావేశాల్లో పదే పదే ఆటంకం కలిగిస్తూ, గందరగోళం సృష్టిస్తే కొన్ని సమయాల్లో ఎంపీలు సభ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే తాజాగా టాంజానియీ దేశ పార్లమెంట్లో చోటు చేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. ‘నువ్వేంటో నీ వింత బట్టలు ఏంటో? సభను గౌరవించి తక్షణమే భయటకు వెళ్లిపో’ అంటూ ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఓ మహిళ ఎంపీని సభ నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ విషయం పార్లమెంట్లో చర్చనీయ అంశంగా మారింది. టాంజానియాలో ఓ మహిళా ఎంపీ నలుపు రంగు ప్యాంటు, పసుపు రంగు టాప్ ధరించి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. దీంతో ఆమె ధరించిన దుస్తులపై వివాదం తలెత్తింది. బిగుతైన దుస్తులు ధరించినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని ఇతర ఎంపీలు డిమాండ్ చేశారు. మంచి దుస్తులు ధరించి సభలోకి రావాలని స్పీకర్ ఆమెకు తెలిపారు. ఈ విషయంపై స్పీకర్ సిచ్వాలే మాట్లాడుతూ.. ‘మా సోదరీమణులు కొందరు వింత బట్టలు ధరిస్తున్నారు. సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు. దేశంలో ఉన్నతమైన పార్లమెంట్ సభ, సాంప్రదయాల్ని అందరూ తప్పకుండా గౌరవించాలి. ముఖ్యంగా దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అటువంటి వాళ్లపై సభ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. స్పీకర్ వ్యవహారశైలి పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి మహిళల వస్త్రధారణ గురించి ఇలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. చదవండి: నల్లగా ఉంది ఈమె ఫ్యాషన్ బ్లాగరా అన్నారు -
ఫ్యాషన్ 2021: సౌకర్యమే స్టైల్
కరోనా కారణంగా దాదాపు పది నెలలు ఇంటి పట్టునే ఉన్నవారు కాస్తా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న వేడుకలకి హాజరవడానికి సిద్ధపడుతున్నారు. 2020లో పండగలు, పార్టీలు, వేడుకలు, వైవిధ్యాలు.. అన్నీ ఇంట్లోనే. కంఫర్ట్ కోసం క్యాజువల్స్కే పరిమితం అయినా ఇక నుంచి గతం నేర్పిన పాఠాలతో కొత్తదనం నింపుకోక తప్పదు. 2021లో దుస్తుల ఎంపిక ప్రత్యేకంగా ఉంటుందనే ఆలోచనతో డిజైనర్లు సైతం ఆ దిశగా ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఫ్యాషన్ పోకడల్లోనూ మార్పులు సంతరించుకోనున్నాయి. ఎంపికలు ప్రత్యేకంగా ఉండనున్నాయి. స్వీయ సంరక్షణ పేరిట తీసుకునే జాగ్రత్తల్లో మొదటి ఎంపిక ధరించే దుస్తులదే కాబట్టి మోర్ కేర్.. కంఫర్ట్ స్టైల్ ఈ సంవత్సరమంతా ట్రెండ్‌లో ఉండనుంది. మహమ్మారి సమయంలోనూ రాబోయే ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రముఖ డిజైనర్లైన తరుణ్ తహిలియాని, సబ్యసాచి, రోహిత్‌బాల్ వంటివారే కాకుండా వర్ధమాన డిజైనర్లు సైతం చేనేతలకు, హస్తకళలకు ప్రాముఖ్యమివ్వడం విశేషం. దేశవాళీ ఫ్యాబ్రిక్కే మొదటి స్థానం ఆభరణాల ఊసు లేకుండా ప్రింట్లున్న చేనేత దుస్తులు ఏ సీజన్‌కైనా నప్పుతాయన్నది డిజైనర్ల అభిప్రాయం. ఈ విధంగా చూస్తే దేశవాళీ కాటన్‌తో తయారైన ఫ్యాబ్రిక్ ఎంపిక పట్ల ఈ ఏడాది మరింత ఆసక్తి పెరగనుంది. ఒంటికి హాయిని, చెమటను పీల్చుకోదగినవి ఎంపికలో ముందండబోతున్నాయి. కాంతిమంతమైన రంగులు ఎంచుకున్నప్పటికి సౌకర్యానికి ప్రాధాన్యమిచ్చేలా వదులుగా ఉండే దుస్తులకే ఓటు వేయనున్నారు. లేత రంగులకే ప్రాధాన్యం.. ఇంటికే పరిమితమైన ప్రాణం బయటకు వచ్చినా కొన్నాళ్లపాటు ఇంకా సౌకర్యాన్నే కోరుకుంటుంది. అందుకే ఈ ఏడాది లేత రంగుల దుస్తులకే ప్రాధాన్యత పెరగనుంది. కంటికి, ఒంటికి హాయినిచ్చే రంగు దుస్తులు ట్రెండ్ కాబోతున్నాయి. అంతేకాదు, జెండర్ ప్రమాణాలను స్పష్టంగా చూపే గులాబీ, బ్లూ, పచ్చ, లావెండర్ రంగులు మరింత వెలుగులోకి రానున్నాయి. దుస్తుల్లో బేబీ పింక్ కలర్ ఈ దశాబ్దంలోనే ముందంజలో ఉంది. ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలు సైతం బేబీ పింక్‌లో డ్రెస్సులు, ఇతర ఉపకరణాలను రూపొందించాయి. ఇక ముందు ఇదే రంగు ముందంజలో ఉండబోతోంది. మళ్లీ మళ్లీ వాడదగిన వాటికే ఓటు గత సంవత్సరం ఫ్యాషన్ పోకడలను అప్పుడప్పుడే వదలలేం. అలాగని ఫ్యాషన్‌కి తగ్గట్టుగా మారకుండా ఉండలేం. అందుకే, సౌకర్యంతోపాటు వాడిన డ్రెస్సులను తిరిగి వాడుకునేలా చిన్న చిన్న మార్పులు చేసుకోదగిన దుస్తుల ఎంపిక ఈ ఏడాది ఉంటుంది. ఇప్పటికే వాడని దుస్తులను కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ధరించవచ్చు. పండగలు, పెళ్లి వేడుకలనూ ఈ మిక్స్ అండ్ మ్యాచ్‌తోనే గ్రాండ్‌గా రూపుకట్టనున్నారు. ఖర్చును కట్టడి చేయడానికి మిక్స్ అండ్ మ్యాచ్ ఒక ట్రెండ్‌గా మారనుంది. దీంట్లో భాగంగానే రెట్రో ట్రెండ్ ఉంటుంది. జిమ్ వేర్ టు క్యాజువల్ వేర్ ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తినడం, వ్యాయామశాలలకు వెళ్లడం వంటివి అత్యవసరం అయ్యాయి. దీంతో ఫ్యాషన్ వర్కౌట్ డ్రెస్సులకు డిమాండ్ పెరిగింది. వీటిలో గ్రాఫిక్ నమూనాలు, నాణ్యత గల డ్రెస్సుల ఎంపికవైపు జనం ఆసక్తి చూపుతున్నారు. వ్యాయామం కోసమే కాకుండా క్యాజువల్ వేర్‌గానూ విభిన్నంగా ఉపయోగించే దుస్తులు కూడా ఈ సంవత్సరం ట్రెండ్‌లో ఉండబోతున్నాయి. డిజైనర్ మాస్కులు డ్రెస్‌కి తగిన మాస్క్ అనేది జాబితాలో మరింత గ్రాండ్‌గా చేరిపోనుంది. కాటన్ డ్రెస్ వేసినప్పటికి, ముక్కును, నోటిని కవర్ చేసే మాస్క్ కొత్త కొత్త రూపాల్లో, డిజైనర్ టచ్‌తో వెలిగిపోనున్నాయి. ఎక్కడకు వెళ్లాలన్నా ముందు మాస్క్ తప్పనిసరి కాబట్టి వీటిమీద డిజైనర్లు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. డెనిమ్స్ ఫిట్ టు కంఫర్ట్ జీన్స్ గురించి ఆలోచన రాగానే చాలా మందిలో స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్ అనేవే మెదులుతాయి. ఇక నుంచి డెనిమ్‌లోనూ కొంత వదులుగా ఉండేవి, సాగేవి, సౌకర్యానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేవాటి సంఖ్య పెరగనుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఖాదీ ఫ్యాబ్రిక్‌కు మంచి డిమాండ్ ఉంది. ఈ విధంగా మన దేశీయ చేనేతలతో రూపొందించిన దుస్తుల మీద మందంగా ఉండే డెనిమ్ లేదా ఖాకీ కలర్ జాకెట్స్ ఇండోవెస్ట్రన్ స్టైల్‌తో ఆకట్టుకోనుంది. – నిర్మలారెడ్డి -
న్యూస్ పేపర్‌ను చుట్టుకున్న హీరోయిన్!
లాక్డౌన్ పుణ్యమా అని చాలామంది తమ క్రియేటివిటికి పనిచెబుతున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలు కూడా రకారకాల ఆలోచనలతో ముందుకు వస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ కూడా తన క్రియేటివ్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇటీవలె పిల్లో ఛాలెంజ్ ట్రెండ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేసిన పాయల్..లేటెస్ట్గా పేపర్ డ్రెస్‌కు తెరతీసింది. హాస్య బ్రహ్మ జంధ్యాల రూపొందించిన ఎవర్గ్రీన్ క్లాసిక్ సినిమా `అహ నా పెళ్లంట`. డబ్బులు ఆదా చేయడం కోసం ఆ సినిమాలో హీరో రాజేంద్రప్రసాద్ న్యూస్ పేపర్‌ను మడిచి లుంగీలాగ కట్టుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ పాయల్ కూడా ఆ ఫ్యాషన్‌ను ఫాలో అయింది. న్యూప్పేపర్స్నే డ్రెస్‌గా చుట్టుకొని ఫోటోలు పోస్ట్ చేసింది. కొందరు పాయల్ క్రియేటివిని పొగుడుతుంటే మరొకొందరు మాత్రం పాయల్ డ్రెస్సింగ్‌పై మీమ్స్ చేస్తూ, తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆర్ ఎక్స్100 సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ..మొదటి సినిమాతోనే హిట్టు కొట్టింది. ఇటీవలె పిల్లో డ్రెస్, ఇప్పడు పేపర్ డ్రెస్..మరి నెక్స్ట్ ఎలాంటి క్రియేటివ్ డ్రెస్‌తో ముందుకొస్తుందో చూడాలి.! -
విద్యార్థినిలకు డ్రెస్ కోడ్.. కాలేజీ తీరుపై ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని సెయింట్ ఫ్రాన్సిస్ వుమెన్స్ కాలేజీ విద్యార్థినుల వస్త్రాధారణపై నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. మోకాళ్ల కింది వరకు ఉన్న కుర్తీ ధరించి వస్తేనే కాలేజీలోకి అనుమతిస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. నిబంధన పాటించని విద్యార్థినులను ప్రిన్సిపల్ వెనక్కి పంపిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. అయితే, ఈ నిర్ణయంపై విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం పాటుపడుతామని గొప్పలు చెప్పుకునే ఇదే కాలేజీలో ఇలాంటి నియమాలు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా శనివారం ఆందోళన చేపట్టారు. సోమవారం కూడా ఆందోళన తీవ్రతరం చేస్తామని వెల్లడించారు. ఇక సెయింట్ ఫ్రాన్సిస్ పూర్వ విద్యార్థి ఒకరు కాలేజీ యాజమాన్యం తీరుపై ఫేస్బుక్ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంవత్సరం మధ్యలో అనవసర నిబంధనలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పొడవాటి కుర్తీ వేసుకుని కాలేజ్‌కి వస్తేనే మంచి పెళ్లి సంబంధాలు వస్తాయని గతంలో యాజమాన్యం చెప్పిందని ఆరోపించారు. మహిళా సెక్యురిటీ సిబ్బందిని నియమించుకుని మరీ.. కుర్తీలు మోకాళ్ల కింది వరకు ఉన్నాయా అని తనిఖీ చేయిస్తున్నారని వాపోయారు. డ్రెస్ నిబంధనలు పాటించడం లేదని తరగతులకు అనుమతించకపోవడం దారుణమన్నారు.