వేసవికి నప్పే.. వింటేజ్‌ స్టైల్‌ ఇదే..! | Types And Method Of Dressing In Summer Season | Sakshi
Sakshi News home page

వేసవికి నప్పే.. వింటేజ్‌ స్టైల్‌ ఇదే..!

Published Fri, Apr 19 2024 8:20 AM | Last Updated on Fri, Apr 19 2024 8:20 AM

Types And Method Of Dressing In Summer Season - Sakshi

పెరిగే ఉష్ణోగ్రతలకు తట్టుకునేలా ఉండాలి. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ ఎంపిక క్యాజువల్‌ అనిపించాలి. పాతకాలపు కాంతులు కట్టిపడేస్తున్నట్టే ఉండాలి. వెస్ట్రన్‌ టచ్‌తో ఆకట్టుకునేలా ఉండాలి. కాలానికి తగినట్టు, కలర్‌ఫుల్‌గా కనిపించాలి. తమవైన నైపుణ్యాలను జోడించే ఫ్యాషన్‌ ఔత్సాహికులు వింటేజ్‌ స్టైల్‌ని మెరిపిస్తున్నారు.

మట్టి రంగులు..
సాధారణంగా లేత రంగులను ఈ సీజన్‌కి ఎంచుకుంటాం. అయితే, వెస్ట్రన్‌ వింటేజ్‌ స్టైల్‌కి ముదురు గోధుమ, ఎరుపు, నారింజ ఈ సీజన్‌లో మొదటి వరసలో ఉంటాయి. ఈ రంగులు వెస్ట్రన్‌ వస్త్రధారణకు సహజ సౌందర్యాన్ని జోడించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ రంగులు ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని వెల్లడిస్తాయి. క్యాజువల్‌ వేర్‌కి సొగసును అందిస్తాయి.

లేసులు, అల్లికలు..
ఈ సీజన్‌లో మరో ఆకర్షణగా కనిపించేది డెనిమ్‌ ఎలిమెంట్స్, లేసులు, అల్లికల అంచులు గల డ్రెస్సులు వెస్ట్రన్‌ ఫ్యాషన్‌లో మనకు ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇవి, డ్రెస్సులకు ఉల్లాసభరితమైన అలంకరణను జోడిస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే ప్లెయిన్‌ స్వెడ్‌ టాప్‌ లేదా జాకెట్స్, అంచులతో డిజైన్‌ చేసినవి ఈ సీజన్‌ స్టైల్‌కి బాగా నప్పుతాయి. ఇవి మోడ్రన్‌ టచ్, వింటేజ్‌ స్టైల్‌తో ఆకట్టుకుంటాయి.

  • డెనిమ్‌తో జత చేసే ప్రింటెడ్‌ ఫ్యాబ్రిక్‌ స్కర్టులు, బ్లేజర్లతో మ్యాక్సీ డ్రెస్సులు ధరిస్తే ఆధునికపు హంగులతో మెరిసి΄ోతారు.
  • స్టెట్సన్‌ టోపీలు, కౌబాయ్‌ బూట్లు డ్రెస్సులకు వెస్ట్రన్‌ లుక్‌ని ఇట్టే తీసుకువస్తాయి. పూసల దండలు, ఇతర ఫ్యాషన్‌ జ్యువెలరీ, సన్నని హ్యాండల్‌ గల బ్యాగ్‌తో పూర్తిగా వింటేజ్‌ లుక్‌తో అట్రాక్ట్‌ చేస్తారు.

ఇవి చదవండి: Srishti Dabas: పగలు ఉద్యోగం... రాత్రి చదువు.. ఇప్పుడు ఐ.ఏ.ఎస్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement