Netizens Trolls On Deepika Padukone Dressing Sense In Gehraiyaan Movie Promotions - Sakshi
Sakshi News home page

Deepika Padukone: రణ్​వీర్​ సింగ్​ డ్రెస్​ వేసుకొచ్చావా.. దీపికాపై ట్రోలింగ్​

Published Thu, Jan 27 2022 4:37 PM | Last Updated on Thu, Jan 27 2022 5:09 PM

Deepika Padukone Trolled On Her Dress - Sakshi

Deepika Padukone Trolled On Her Dress: సోషల్​ మీడియాలో సెలబ్రిటీలు చేసే పనులు, చేష్టలు, డ్రెస్సింగ్​ విధానాల వల్ల ప్రశంసల జల్లులు కురిస్తే ఒక్కోసారి అభాసుపాలవుతారు. నెటిజన్ల ట్రోలింగ్​ బారిన పడిన అనేక మంది సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా బీటౌన్​ డింపుల్​ సుందరి, రణ్​వీర్​ సింగ్​ భార్య దీపికా పదుకొణె ట్రోలింగ్​కు గురైంది. ఇటీవల శకున్ బాత్ర తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా 'గెహ్రైయాన్'​ చిత్రంలో అలీషాగా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్​లో బిజీగా ఉంది దీపికా. అయితే ఇటీవల జరిగిన ప్రమోషన్​లో దీపికా డ్రెస్సింగ్ స్టైల్​పై సోషల్​ మీడియాలో ట్రోలింగ్ చేశారు. 

దీపికా పదుకొణె జీబ్రా ప్రింట్ బ్లేజర్​ను ధరించి ఈ సినిమా మిగతా టీమ్​ అయిన అనన్య పాండే, సిద్ధాంత్​ చతుర్వేది, డైరెక్టర్ శకున్​ బాత్రాతో కనువిందు చేసింది. దీపికా ఆ వేర్​లో అందంగా కనిపించినప్పటికీ నెటిజన్లు ట్రోల్​ చేశారు. 'రణ్​వీర్ డ్రెస్ వేసుకున్న దీపికా' అని ఒకరు కామెంట్​ చేయగా మరొకరు 'దీపికాకు కొత్త స్టైలిస్ట్​, మేకప్​ ఆర్టిస్ట్​ కావాలి' అని సూచించారు. ఇంకొకకరైతే 'నేను నిజంగా దీపిక, రణ్​వీర్​ సింగ్​ల డిజైనర్​ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను. దీపికా ఒకప్పుడు చాలా అందంగా స్టైలిష్​గా ఉండేది. కానీ ఇప్పుడు..' అంటూ కామెంట్ పెట్టారు. దీపికా అభిమానులైతే లవ్ సింబల్స్​తో తమ ప్రేమను తెలియజేస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement