రంగుల్లో పింక్‌తో, కాస్ట్యూమ్స్‌లో స్కర్ట్‌తో మగవాళ్లకు స్టయిలింగ్ చేసి.. ఫ్యాషన్‌కి ముఖ్యంగా డ్రెసింగ్‌కి, కలర్స్‌కి జెండర్ లేదు.. కంఫర్టే ముఖ్యం అంటూ దేశంలో మెన్ ఫ్యాషన్ గ్రామర్‌ని, గ్లామర్‌ని మార్చేసిన స్టయిలిస్ట్.. నితాశా గౌరవ్! రణ్‌వీర్ సింగ్ పర్సనల్ స్టయిలిస్ట్!
‘న్యూస్ పేపర్స్, అన్నిరకాల మ్యాగజీన్స్, బుక్స్, ఆర్ట్, ట్రావెల్, నేచర్, మ్యూజిక్.. ఇవన్నీ నాకు ఇన్‌స్పిరేషనే! స్టయిల్ అండ్ ఫ్యాషన్‌కి మినిమలిజం, మాగ్జిమలిజం రెండూ అవసరమే! ఈ రంగంలో రాణించాలంటే ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పనిని ప్రేమించాలి’ అని చెబుతుంది నితాశా గౌరవ్.
నితాశా.. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్, న్యూయార్క్‌లోని ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫ్యాషన్‌కి సంబంధించిన ఫార్మల్ ఎడ్యుకేషన్‌ని పూర్తిచేసింది. ఇండియాకు తిరిగి రాగానే ఫెమినా ఇండియాలో ఉద్యోగంతో ఫ్యాషన్ కెరీర్‌ని మొదలుపెట్టింది. ఫెమినాలో నాలుగేళ్ల కొలువు తర్వాత నిఫ్ట్, ఫ్యాషన్ కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్‌లో చేరింది. అందులో కొన్నాళ్లు చేశాక.. ఇండిపెండెంట్‌గా ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడే కొన్ని ఫ్యాషన్ షోస్‌కి, షూట్స్‌లో మోడల్స్‌కి స్టయిలింగ్ చేసే చాన్స్ రావడంతో ఆ పనిలో పడిపోయింది.
అలాంటి ఒకానొక సందర్భంలో ఫిల్మ్‌ఫేర్ షూట్‌కి బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కి స్టయిలింగ్ చేసే అవకాశం దొరికింది. ఆ క్రమంలో నితాశా ఆలోచనలు, పని విధానం రణ్‌వీర్‌కి నచ్చాయి. ముఖ్యంగా ఫెమినైన్ అనుకునే కలర్స్, డ్రెసెస్‌తో ఆమె తనకు స్టయిలింగ్ చేస్తున్న తీరు మరీ నచ్చింది. దాంతో. తర్వాత కూడా చాలా ఈవెంట్స్‌కీ వాళ్ల అసోసియేషన్ కొనసాగింది. అలా రణ్‌వీర్‌కి ఆమె ఇచ్చిన కొత్త లుక్.. టాక్ ఆఫ్ ద కంట్రీ అవడంతో సెకండ్ థాట్ లేకుండా నితాశాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నాడు రణ్‌వీర్. అది ఆమె ఊహించనిది. మనసులో సంతోషం కుదిపేస్తున్న బాధ్యత ఆమెను స్టడీగా నిలబెట్టింది.
రణ్‌వీర్‌కి పర్సనల్ స్టయిలిస్ట్ అంటే ఆమె క్రియేటివిటీకీ అతనికున్నంత దూకుడు, ఎనర్జీ ఉండాలి! ‘యెస్..’ అనుకుంటూ ఆ జాబ్‌ని చాలెంజింగ్‌గా తీసుకుంది. నిలబెట్టుకుంది. స్టయిలిస్ట్‌గా తనను ఎంచుకోవడంలో రణవీర్ తీసుకున్న నిర్ణయానికి అతన్ని గర్వపడేలా చేసిందే తప్ప‘ఇట్ హ్యాపెన్స్’ అని సర్దుకుపోయేలా చేయలేదు. గల్లీ బాయ్, బేఫిక్రే లాంటి సినిమాలే అందుకు దృష్టాంతాలు. ఆమె అనుష్కాకూ పనిచేసింది స్టయిలిస్ట్‌గా ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమాలో!
ఫ్యాషన్ రూల్ బుక్‌ని అన్‌ఫాలో కావడమే ఆమె ప్రత్యేకత. డిఫరెంట్ స్టయిల్స్‌ని మిక్స్ అండ్ మ్యాచ్ చేయడంలో దిట్ట ఆమె! ఆ స్పెషాలిటీ, ఆ ఫ్యూజన్‌కి ధనుష్, అర్జున్ కపూర్, షాహిద్ కపూర్, అభయ్ డియోల్‌లూ ముచ్చటపడి.. వాళ్లూ ఆమెను పర్సనల్ స్టయిలిస్ట్‌గా అపాయింట్ చేసుకున్నారు.
ఇవి చదవండి: ‘పంచాయతీ’ రిజర్వేషన్లు మారుతాయి
Comments
Please login to add a commentAdd a comment