మై వార్డ్‌రోబ్
‘‘జాబ్, స్కూల్‌కి వెళ్లే ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో టైమ్ అసలు సరిపోదు. అయితే మనకోసం మనం కొంచెం టైమ్ అయినా ఉండేలా చూసుకోవాలి అనుకుంటాను. నలుగురిలోకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి, అదే విధంగా నా బడ్జెట్ ప్రకారం డ్రెస్సింగ్ ఉండేలా ఎంపిక చేసుకుంటాను.
వేడుకలకు, ప్రత్యేక రోజుల్లో రెడీ అవడానికి ప్రతీ ఒక్కరూ తమదైన ప్టైటల్‌ని డ్రెస్సింగ్‌లో చూపుతుంటారు. హైదరాబాద్ ఎల్.బినగర్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చందనామారం తన డ్రెస్సింగ్ గురించీ, వార్డ్రోబ్ విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు.
హుందాగా...
ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు డిగ్నిఫైడ్‌గానూ, కంఫర్ట్‌గానూ ఉండేలా చూసుకుంటాను. అందుకు కుర్తీలు, జీన్స్ ఉంటాయి. వీటిలోనే మిక్స్ అండ్ మ్యాచ్‌కి ట్రై చేస్తుంటాను.
డిజైనర్ శారీస్..
రిసెప్షన్ వంటి వేడుకలకు డిజైనర్ శారీస్‌ను ఎంచుకుంటాను. జనరల్‌గా మార్కెట్‌లో వస్తున్న ట్రెండ్స్‌ను కూడా ఫాలో అవుతుంటాను. వీటిలో నాకు ఎలాంటి ఔట్‌ఫిట్ అయితే బాగుంటుందో చెక్ చేస్తుంటాను. స్టిచింగ్‌కు సంబంధించినప్పుడు ఇన్‌స్టా పేజీలు కూడా చూస్తుంటాను. అలాంటి డిజైన్స్ చేయమని బొటిక్స్‌లో చెబుతుంటాను. శారీకి తగినట్టు బ్లౌజ్ సెట్ చే యడానికి డిజైనర్ హెల్ప్ తీసుకుంటాను.
తక్కువ బడ్జెట్‌లో బెటర్‌లుక్..
పెళ్లి, ఇంట్లో పండగలు వంటి సందర్భాలలో మనదైన సంప్రదాయ కట్టునే ఇష్టపడతాను. దీనికోసం ఎక్కడైనా శారీస్ కలెక్షన్ గురించి కూడా తెలుసుకుంటాను. కొన్నిచోట్ల నచ్చినా బడ్జెట్ మించి ఉంటే తీసుకోను. అయితే, అవే మోడల్స్‌లో మరో చోట ఒకటికి బదులు రెండు చీరలు వచ్చేలా ఎంపిక చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటాను. తక్కువ బడ్జెట్‌లో మంచి డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటాను. సాధారణంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చీరలు, డ్రెస్సులు వేసుకుంటే నలుగురిలో వెళ్లినప్పుడు మన అప్పిరియన్స్ బాగుంటుంది అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్‌లో బెటర్‌గా కనిపించేలా ΄్లాన్ చేసుకోవడం మంచిది’’ అని వివరిస్తున్నారు ఈ ఉద్యోగిని.
నోట్: మీరూ మీ వార్డ్‌రోబ్ లేదా మీ అమ్మాయి వార్డ్‌రోబ్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో తీసుకుంటున్న విశేషాల గురించి ఫొటోలతో సహా ‘సాక్షి’ ΄ాఠకులతో పంచుకోవచ్చు. బాగున్న వాటిని మై వార్డ్‌రోబ్ శీర్షికన ప్రచురిస్తాం. మా చిరునామా: మై వార్డ్‌రోబ్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ –34. sakshifamily3@gmail.com
Comments
Please login to add a commentAdd a comment